21-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - స్మృతిలో ఉండి కర్మలు చేసినట్లయితే అనేకమందికి మీ సాక్షాత్కారము అవుతూ ఉంటుంది ''
ప్రశ్న :- సంగమ యుగములో ఏ విధి ద్వారా మీ హృదయాలను శుద్ధంగా(పవిత్రంగా) చేసుకోగలరు?
జవాబు :- స్మృతిలో ఉండి భోజనాన్ని తయారు చేయండి, స్మృతిలో ఉండి స్వీకరించండి. అప్పుడు హృదయము శుద్ధమైపోతుంది. సంగమ యుగములో బ్రాహ్మణులైన మీ ద్వారా తయారు చేయబడిన పవిత్ర బ్రహ్మా భోజనము దేవతలకు కూడా చాలా ఇష్టము. ఎవరు బ్రహ్మాభోజనానికి ప్రాధాన్యతనిస్తారో వారు పళ్లెము కూడా కడిగి త్రాగుతారు. దీని మహిమ కూడా చాలా గొప్పది. స్మృతిలో తయారు చేయబడిన భోజనాన్ని స్వీకరించడం వలన శక్తి లభిస్తుంది, హృదయము శుద్ధమైపోతుంది.
ఓంశాంతి. సంగమ యుగములోనే తండ్రి వస్తారు, ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారని పిల్లలకు ప్రతిరోజూ చెప్పవలసి వస్తుంది. పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించమని ఎందుకు చెప్తున్నారు? బేహద్ తండ్రి ఆత్మలను చదివిస్తున్నారని పిల్లలకు గుర్తు వచ్చేందుకు. సర్వీసు చేసేందుకు భిన్న భిన్నమైన పాయింట్ల పై అర్థం చేయిస్తారు. సర్వీసు లేదు అని పిల్లలు చెప్తారు. మేము బయట సర్వీసు ఎలా చేయాలి? అని అడుగుతారు. తండ్రి సర్వీసు చేసేందుకు సహజ యుక్తులు తెలిపిస్తున్నారు. చిత్రము చేతిలో ఉండాలి. రఘునాథుని నల్లని చిత్రమూ, తెల్లని చిత్రము కూడా ఉండాలి. కృష్ణుడు లేక నారాయణుని నలుపు - తెలుపు చిత్రాలు కూడా ఉండాలి. చిన్న చిత్రమైనా పర్వాలేదు. కృష్ణుని చాలా చిన్న చిత్రము కూడా తయారు చేస్తారు. వాస్తవానికి వీరు తెల్లగా ఉండేవారు, వీరిని నల్లగా ఎందుకు చేశారు! అని మీరు మందిరములోని పూజారిని అడగవచ్చు. వాస్తవములో శరీరము నల్లగా ఉండదు కదా. మీ వద్ద చాలా మంచి తెల్లని చిత్రాలు కూడా ఉంటాయి, వీరిని ఎందుకు నల్లగా చేసినారో, పిల్లలైన మీకు అర్థం చేయించబడింది. ఆత్మ ఎలా భిన్న భిన్న నామ-రూపాలను ధారణ చేసి క్రిందకు ఎలా దిగుతుందో అంటే ఎప్పుడైతే కామచితి పైకి ఎక్కుతుందో అప్పటి నుండి నల్లగా అవుతుంది. జగన్నాథ మందిరము, శ్రీనాథ ద్వారములో అనేకమంది యాత్రికులుంటారు. మీకు ఆహ్వానము కూడా లభిస్తుంది. మేము శ్రీనాథుని 84 జన్మల జీవనకథను వినిపిస్తాము, సోదరీ-సోదరుల్లారా! వచ్చి వినండని అందరికీ చెప్పండి. ఇలాంటి ఉపన్యాసము ఇంకెవ్వరూ ఇవ్వలేరు. వీరు నల్లగా ఎందుకు అయ్యారు? అని మీరు అర్థం చేయించగలరు. పావనమైన ప్రతి ఒక్కరు పతితులుగా తప్పకుండా అవ్వాలి. దేవతలు వామమార్గములోకి వెళ్లినప్పుడు వారిని నల్లగా చేశారు. కామచితి పై కూర్చోవడం వలన ఇనుప యుగము వారిగా అయిపోతారు. ఇనుము నల్లగా ఉంటుంది, బంగారము బంగారు రంగులో ఉంటుంది, వారిని సుందరమైనవారని చెప్తారు. వారే మళ్లీ 84 జన్మల తర్వాత నల్లగా అవుతారు. మెట్ల చిత్రము కూడా తప్పకుండా చేతిలో ఉండాలి. మెట్ల చిత్రము పెద్దగా ఉంటే ఎవరైనా దూరము నుండి కూడా బాగా చూడగలరు. భారతదేశానికి పట్టిన ఈ హీనగతిని గురించి మీరు అర్థం చేయిస్తారు. ఉత్తానము, పతనము అని వ్రాయబడి కూడా ఉంది. పిల్లలకు సర్వీసు చేయు ఆసక్తి చాలా ఉండాలి. ఈ ప్రపంచ చక్రము ఎలా తిరుగుతూ ఉందో అర్థం చేయించాలి. బంగారు యుగము, వెండి యుగము, తామ్ర యుగము........... మళ్లీ ఈ పురుషోత్తమ సంగమ యుగాన్ని కూడా చూపించాలి. ఎక్కువ చిత్రాలు తీసుకోకండి. మెట్ల చిత్రము భారతదేశానికి ముఖ్యమైనది. ఇప్పుడు మళ్లీ పతితుల నుండి పావనంగా ఎలా అవ్వగలరో మీరు అర్థం చేయించవచ్చు. పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేయడం వలన సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. పిల్లలైన మీలో ఈ జ్ఞానము పూర్తిగా ఉంది. మిగిలిన వారంతా అజ్ఞాన నిద్రలో నిదురిస్తున్నారు. భారతదేశము జ్ఞానములో ఉన్నప్పుడు చాలా ధనవంతముగా ఉండేది. ఇప్పుడు భారతదేశము అజ్ఞానములో ఉంది. కనుక ఎంత భికారిగా ఉంది! జ్ఞానీ మనుష్యులు, అజ్ఞానీ మనుష్యులు ఉంటారు కదా. దేవీదేవతలు మరియు మనుష్యులు ప్రసిద్ధంగా ఉన్నారు. దేవీదేవతలు సత్య-త్రేతా యుగాలలో, మనుష్యులు ద్వాపర-కలియుగాలలో ఉంటారు. సర్వీసు ఎలా చేయాలి? అని పిల్లల బుద్ధిలో సదా ఉండాలి. అది కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు. మెట్ల చిత్రము ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా బాగుంటుంది. తండ్రి చెప్తున్నారు - గృహస్థ వ్యవహారములో ఉండండి, శరీర నిర్వహణార్థము వ్యాపారాదులు చేయాల్సిందే, దేహ సంబంధమైన చదువు కూడా చదువుకోవాలి. తర్వాత సమయము లభించినప్పుడు సేవ కొరకు మేము ఇతరుల కళ్యాణము ఎలా చేయాలి? అని ఆలోచించండి. ఇక్కడ మీరు అనేకమందికి కళ్యాణము చేయలేరు. ఇక్కడకు తండ్రి మురళి వినేందుకే వస్తారు, ఇందులోనే ఇంద్రజాలముంది. తండ్రిని ఇంద్రజాలికుడు అని అంటారు కదా. మురళి నీలో ఇంద్రజాలముంది... (మురళి తేరేమే హై జాదూ... ) అని మహిమ చేస్తారు. బాబా, మీ నోటి ద్వారా ఏ మురళి వెలవడుతుందో అందులో ఇంద్రజాలముంది. దీని వలన మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఇలాంటి ఇంద్రజాలికుడు తండ్రి తప్ప ఎవ్వరూ లేరు. మనష్యులను దేవతలుగా తయారుచేసే ఈ చాతుర్యాన్ని ఎవ్వరూ వర్ణించలేరని గాయనము కూడా ఉంది. పాత ప్రపంచము నుండి తప్పకుండా కొత్త ప్రపంచము వస్తుంది. పాతది తప్ప వినాశనము కూడా అవుతుంది. ఈ సమయంలో మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు, తప్పకుండా రాజులుగా కూడా అవ్వాలి. 84 జన్మల తర్వాత మళ్లీ మొదటి నెంబరు జన్మ రావాలి. ఎందుకంటే ప్రపంచ చరిత్ర-భూగోళాలు రిపీట్ అవుతాయని ఇప్పుడు మీకు తెలుసు. సత్య-త్రేతా యుగాలు ఏవైతే ఉండి వెళ్లిపోయాయో అవి తప్పకుండా రిపీట్ అవ్వాలి.
మీరిక్కడ కూర్చుని ఉన్నప్పటికీ మేము వాపస్ వెళ్తాము, మళ్లీ సతోప్రధాన దేవీ దేవతలుగా అవుతామని మీ బుద్ధిలో స్మృతి చేయాలి. వారిని దేవీ దేవతలని అంటారు. ఇప్పుడు మనుష్యులలో దైవీ గుణాలు లేవు. కనుక మీరు సర్వీసు ఎక్కడైనా చేయవచ్చు. వృత్తి వ్యాపారాదులు ఎన్ని ఉన్నా గృహస్థ వ్యవహారములో ఉంటున్నా సంపాదన చేసుకోవాలి. ఇందులో ముఖ్యమైన విషయము పవిత్రత. పవిత్రత ఉంటే శాంతి-సంపదలు కూడా ఉంటాయి. సంపూర్ణ పవిత్రంగా అయినప్పుడు ఇక్కడ ఉండలేరు ఎందుకంటే మనము శాంతిధామానికి తప్పకుండా వెళ్లాలి. ఆత్మ పవిత్రంగా అయిన తర్వాత ఈ పాత శరీరములో ఉండదు. ఇది అపవిత్రమైనది కదా. 5 తత్వాలు కూడా అపవిత్రంగా ఉన్నాయి. శరీరము కూడా వీటి ద్వారానే తయారవుతుంది. దీనిని మట్టి బొమ్మ అని అంటారు. 5 తత్వాల శరీరము ఒకటి సమాప్తమై మరొకటి తయారవుతుంది. ఆత్మ అవినాశిగా ఉండేనే ఉంటుంది. ఆత్మ తయారయ్యే వస్తువు కాదు. శరీరము మొదట ఎంత చిన్నదిగా ఉండి తర్వాత ఎంత పెద్దదిగా అవుతుంది! పూర్తి పాత్రాభినయము చేసేందుకు ఆత్మకు ఎన్ని అవయవాలు లభిస్తాయి. వీటి ద్వారా ఆత్మ పాత్రను అభినయిస్తుంది. ఈ ప్రపంచమే అద్భుతమైనది. ఆత్మల పరిచయాన్నిచ్చే తండ్రి అందరికంటే అద్భుతమైనవారు. ఆత్మలమైన మనము ఎంత చిన్నగా ఉంటాము. ఆత్మ ప్రవేశము చేస్తుంది. ప్రతి వస్తువు అద్భుతమైనది. జంతువుల శరీరాలు మొదలైనవి ఎలా తయారవుతాయి, ఇవన్నీ అద్భుతమైన విషయాలు కదా. అందరిలో ఆత్మ అదే విధంగా చిన్నదిగా ఉంటుంది. ఏనుగు ఎంత పెద్దది, దానిలో ఇంత చిన్న ఆత్మ వెళ్లి విరాజమానమౌతుంది. తండ్రి మనుష్యుల జన్మల గురించి అర్థం చేయిస్తారు. మనుష్యులు ఎన్ని జన్మలు తీసుకుంటారు? 84 లక్షల జన్మలు తీసుకోరు. ఎన్ని ధర్మాలు ఉన్నాయో అన్ని వెరైటీలు తయారౌతాయని అర్థం చేయించారు. ప్రతి ఆత్మ ఎన్ని రూపురేఖలున్న శరీరాలను తీసుకుంటుంది! ఇది అద్భుతము కదా. మళ్లీ ఇప్పుడు చక్రము ఎలా పునరావృతమవుతుందో ప్రతి జన్మలో రూపురేఖలు, నామ-రూపాలు మొదలైనవన్నీ మారిపోతాయి. నల్ల కృష్ణుడు, తెల్ల కృష్ణుడు అని అనరు. వారి ఆత్మ మొదట తెల్లగా ఉండేది తర్వాత 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ నల్లగా అవుతుంది. మీ ఆత్మ కూడా రకరకాల రూపురేఖలు, రకరకాల శరీరాలు తీసుకొని పాత్రను అభినయము చేస్తుంది. ఇది కూడా డ్రామా.
పిల్లలైన మీకు ఎప్పుడూ ఏ చింతా ఉండరాదు. పాత్రధారులంతా ఒక శరీరాన్ని వదిలి మరొక దానిని తీసుకొని మళ్లీ పాత్రను అభినయము చేయాల్సిందే. ప్రతి జన్మలో సంబంధాలు మొదలైనవి మారిపోతాయి. కనుక తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది తయారైన డ్రామా. ఆత్మయే 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ తమోప్రధానమైపోయింది. ఇప్పుడు మళ్లీ ఆత్మ సతోప్రధానంగా అవ్వాలి. పావనంగా అయితే తప్పకుండా అవ్వాలి. పావన సృష్టి ఉండేది, ఇప్పుడు పతితమైపోయింది మళ్లీ పావనంగా అవ్వాలి. సతోప్రధానము, తమోప్రధానము అనే పదాలున్నాయి కదా. సతోప్రధాన సృష్టి మళ్లీ సతో, రజో, తమో సృష్టిగా అవుతుంది. ఇప్పుడు ఎవరైతే తమోప్రధానంగా అయ్యారో వారు మళ్లీ సతోప్రధానంగా ఎలా అవ్వాలి? పతితుల నుండి పావనంగా ఎలా అవ్వాలి? వర్షపు నీటి నుండి అయితే పావనంగా అవ్వరు. వర్షము ద్వారా అయితే మనుష్యులకు మృత్యువు కూడా సంభవిస్తుంది. వరదలు వచ్చినప్పుడు ఎంతమంది మునిగిపోతారు! ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉంటారు - ఇప్పుడు ఈ ఖండములన్నీ ఉండవు. ప్రకృతి వైపరీత్యాలు కూడా సహాయము చేస్తాయి. ఎంతోమంది మనుష్యులు, పశువులు మొదలైనవి కొట్టుకుని పోతాయి. కనుక నీటి ద్వారా పావనమైపోరు. శరీరము వెళ్లిపోతుంది. శరీరాలు పతితము నుండి పావనంగా అవ్వవు. పావనంగా అవ్వాల్సింది ఆత్మ. కనుక పతితపావనులు ఒక్క తండ్రి మాత్రమే. భలే ఆ గురువులను జగద్గురువులు అని అంటారు కానీ గురువుల కర్తవ్యము సద్గతినివ్వడము. ఒక్క తండ్రి మాత్రమే సద్గతిదాత. సద్గురువు అయిన తండ్రే సద్గతిని ఇస్తారు. తండ్రి చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. ఇతను కూడా వింటాడు కదా. గురువులు కూడా శిష్యులకు నేర్పించేందుకు ప్రక్కనే కూర్చోబెట్టుకుంటారు. ఇతను కూడా వారి ప్రక్కనే కూర్చుంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు అంటే వీరు కూడా అర్థం చేయిస్తుంటారు కదా. అందుకే గురుబ్రహ్మ మొదటి నెంబరులోకి వెళ్తారు. శంకరుడు కళ్లు తెరచి భస్మము చేస్తాడని చెప్తారు. కనుక అతనిని గురువు అని అనరు. పిల్లలారా, నన్ను స్మృతి చేయండి అని తండ్రే చెప్తారు. ఎన్నో కార్య వ్యవహారాల చింత ఉంటుంది, మేము స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని ఎలా స్మృతి చేయాలి? అని కొందరు పిల్లలు అడుగుతారు. తండ్రి అర్థం చేయిస్తారు - భక్తిమార్గములో కూడా మీరు ఓ ఈశ్వరా, ఓ భగవంతుడా! అని స్మృతి చేస్తారు కదా. ఎప్పుడైతే ఏదైనా దు:ఖము కలుగుతుందో అప్పుడు స్మృతి చేస్తారు. మరణించే సమయములో కూడా రామ నామము పలకమని చెప్తారు. రామ నామ దానము చేసే సంస్థలు చాలా ఉన్నాయి. మీరు ఎలాగైతే జ్ఞాన దానము చేస్తారో అలా వారు రామ-రామ అనమని రామనామాన్ని చెప్పిస్తారు. మీరు కూడా శివబాబాను స్మృతి చేయండి అని చెప్తారు. వారికైతే శివబాబా గురించి తెలియనే తెలియదు. రామ-రామ అని చెప్తూ ఉంటారు. మరి అందరిలో పరమాత్మ ఉన్నప్పుడు రామ-రామ అని కూడా ఎందుకు చెప్పాలి? రాముడు, కృష్ణుడు కూడా పరమాత్మ అని అనబడరు అని తండ్రి అర్థం చేయిస్తారు. కృష్ణుని కూడా దేవత అని అంటారు. రాముడిని సెమీ దేవత అని అర్థం చేయించారు. రెండు కళలు తగ్గిపోతాయి. ప్రతి వస్తువుకు కళలు తగ్గిపోతాయి. దుస్తులు కూడా మొదట క్రొత్తవిగా తర్వాత పాతవిగా అవుతాయి.
కనుక తండ్రి ఎన్నో విషయాలు అర్థం చేయిస్తారు. అయినా ''నా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా! - స్వయాన్ని ఆత్మ అని భావించండి, స్మరణ చేస్తూ చేస్తూ సుఖాన్ని పొందండి'' అని చెప్తారు. ఇదైతే దు:ఖధామము. తండ్రిని మరియు వారసత్వమును స్మృతి చేయండి. స్మృతి చేస్తూ చేస్తూ అపారమైన సుఖాన్ని పొందుతారు. కలహ క్లేశాలు, రోగాలు మొదలైనవన్నీ దూరమైపోతాయి. మీరు 21 జన్మలకు నిరోగులుగా అవుతారు. శరీర సంబంధమైన అన్ని కలహక్లేశాలు సమాప్తమై జీవన్ముక్త పదవిని పొందండి. ఇలా గానము చేస్తారు కానీ కర్మలో తీసుకొని రారు. మీకు తండ్రి ప్రాక్టికల్‌గా అర్థం చేయిస్తున్నారు - తండ్రిని స్మరణ చేస్తే మీ సర్వ మనోకామనలు పూర్తి అవుతాయి. సుఖంగా ఉంటారు. శిక్షలు అనుభవించి రొట్టెముక్కను తినడము(చిన్న పదవి పొందుట) మంచిది కాదు. అందరికీ తాజా రొట్టె ఇష్టమవుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే నూనెనే వాడుతున్నారు. అక్కడైతే నేతి నదులు ప్రవహిస్తాయి. కనుక పిల్లలు తండ్రిని స్మరణ చేయాలి. ఇక్కడే కూర్చుని తండ్రిని స్మృతి చేయండి అని కూడా బాబా చెప్పరు. నడుస్తూ, తిరుగుతూ కూడా శివబాబాను స్మృతి చేయాలి. ఉద్యోగాలు మొదలైనవి కూడా చేయాలి. తండ్రి స్మృతి బుద్ధిలో ఉండాలి. పిల్లలు ఉద్యోగము చేస్తున్నా వారి లౌకిక తండ్రి స్మృతి ఉండనే ఉంటుంది కదా. ఎవరైనా ప్రశ్నిస్తే తక్షణమే మేము ఎవరి పిల్లలమో తెలుపుతారు. బుద్ధిలో తండ్రి ఆస్తి కూడా గుర్తు ఉంటుంది. మీరు కూడా ఆ తండ్రికి పిల్లలుగా అయ్యారు కనుక ఆస్తి కూడా గుర్తు ఉంటుంది. తండ్రిని కూడా స్మృతి చేయాలి. ఇతరులెవ్వరితోనూ సంబంధముండదు. ఆత్మలోనే మొత్తం పాత్ర అంతా నిర్ణయించబడి ఉంది. అది ఎమర్జ్ అవుతుంది. ఈ బ్రాహ్మణ కులములో కల్ప-కల్పము మీది ఏ పాత్ర నడిచిందో అదే ఉత్పన్నమవుతూ ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - భోజనము తయారు చేస్తున్నా, మిఠాయి తయారు చేస్తున్నా శివబాబాను జరుగుతుంది. ఎక్కడైనా సాక్షాత్కారము కూడా జరగవచ్చు. బ్రహ్మ సాక్షాత్కారము కూడా జరగవచ్చు. శుద్ధమైన అన్నము స్వీకరించడం వల్ల బ్రహ్మ, కృష్ణుడు శివుని సాక్షాత్కారాలు చేసుకోగలరు. బ్రహ్మ ఇక్కడ ఉన్నారు. బ్రహ్మ కుమారకుమారీల పేరు అయితే ఉంటుంది కదా. తండ్రిని స్మృతి చేస్తున్న కారణంగా అనేకమందికి సాక్షాత్కారము అవుతూ ఉంటుంది. తండ్రి యుక్తులైతే అనేకం తెలియజేస్తారు. వారు నోటి నుండి రామ-రామ అని అంటారు. మీరు నోటి ద్వారా ఏమీ చెప్పనవసరం లేదు. వారు గురునానక్‌కు భోగ్ పెడుతున్నామని ఎలా భావిస్తారో అలాగే మీరు కూడా శివబాబాకు భోగ్ సమర్పించేందుకు తయారుచేస్తున్నామని భావిస్తారు. శివబాబాను స్మృతి చేస్తూ తయారుచేస్తే అనే మందికి కళ్యాణము జరుగగలదు. ఆ భోజనములో శక్తి వచ్చేస్తుంది. కనుక బాబా భోజనము తయారుచేసే వారికి కూడా శివబాబాను స్మృతి చేస్తూ చేస్తున్నారా? అని అడుగుతారు. శివబాబా స్మృతి ఉందా? అని వ్రాయబడి కూడా ఉంది. స్మృతిలో ఉండి తయారు చేసినట్లైతే తిన్నవారికి కూడా శక్తి లభిస్తుంది, హృదయము శుద్ధమవుతుంది. బ్రహ్మాభోజనానికి మహిమ కూడా ఉంది కదా. బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనము దేవతలు కూడా ఇష్టపడ్తారు. ఇది కూడా శాస్త్రాలలో ఉంది. బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనాన్ని స్వీకరించడం వలన బుద్ధి శుద్ధమవుతుంది, అందులో శక్తి ఉంటుంది. బ్రహ్మాభోజనానికి చాలా మహిమ ఉంది. బ్రహ్మ భోజనము యొక్క మహత్యము తెలిసినవారు పళ్లెము కడిగి కూడా తాగుతారు. చాలా శ్రేష్ఠమని భావిస్తారు. భోజనము లేకుండా అయితే ఉండలేరు. కరువు సమయములో భోజనము లేకుండా మరణిస్తారు. ఆత్మ కూడా భోజనము చేస్తుంది. ఈ అవయవాల ద్వారా వాసన లేక రుచిని అదే తీసుకుంటుంది. మంచిది, చెడ్డది, స్వాదిష్టమైనది, శక్తివంతమైనది అని ఆత్మనే చెప్తుంది కదా. పోను పోను ఎలా ఉన్నతిని పొందుతూ ఉంటారో భోజనము కూడా మీకు అలాంటిదే లభిస్తుంది. కనుక శివబాబాను స్మృతి చేస్తూ భోజనము తయారు చేయండి అని పిల్లలకు చెప్తారు. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని అమలులోకి తీసుకు రావాలి కదా.
మీరు తండ్రి ఇంటిలో ఉన్నారు, అత్తవారింటికి వెళ్తారు. సూక్ష్మ వతనములో కూడా పరస్పరము కలుస్తారు, భోగ్ తీసుకెళ్తారు, దేవతలకు భోగ్ పెడ్తారు కదా. దేవతలు వస్తారు బ్రాహ్మణులైన మీరు కూడా అక్కడకు వెళ్తారు. అక్కడ సభ నడుస్తుంది. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఏ విషయము గురించీ చింత చేయరాదు ఎందుకంటే ఈ డ్రామా పూర్తి ఖచ్చితంగా తయారై ఉంది. పాత్రధారులందరూ ఇందులో తమ తమ పాత్రలను అభినయిస్తున్నారు.
2. జీవన్ముక్త పదవిని పొందేందుకు సదా సుఖంగా ఉండేందుకు ఆంతరికములో సదా ఒక్క తండ్రినే స్మరణ చేయాలి. నోటి ద్వారా ఏమీ చెప్పనవసరము లేదు. భోజనము తయారు చేసే సమయములో మరియు స్వీకరించే సమయములో తండ్రి స్మృతిలో తప్పక ఉండాలి.
వరదానము :- ''నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితిలో సేవ చేసే సఫలతామూర్త్ భవ ''
సేవలో సఫలతకు ఆధారము - నిస్వార్థ మరియు నిర్వికల్ప స్థితి. ఈ స్థితిలో ఉండేవారు సేవ చేస్తూ స్వయం కూడా సంతుష్టంగా, హర్షితంగా ఉంటారు, వారితో ఇతరులు కూడా సంతుష్టంగా (తృప్తిగా) ఉంటారు. సేవలో సంఘటన ఉంటుంది. సంఘటనలో రకరకాల మాటలు, రకరకాల విచారాలు ఉంటాయి. కానీ అనేకతలో తికమక పడకండి. ఎవరి మాట వినాలి, ఎవరి మాట వినరాదని అనుకోకండి. నిస్వార్థ మరియు నిర్వికల్ప భావంతో నిర్ణయం తీసుకుంటే ఎవ్వరికీ వ్యర్థ సంకల్పాలు రావు. సఫలతా మూర్తులుగా అవుతారు.
స్లోగన్ :- ''ఇప్పుడు సకాశ్ ద్వారా మనుష్యుల బుద్ధిని పరివర్తన చేసే సేవ ప్రారంభించండి''
No comments:
Post a Comment