27-10-2019 ని అవ్యక్తబాప్‌దాదా కు ఓంశాంతి రివైజ్: 27-02-1985 మధువనము
''శివశక్తి పాండవ సేనల విశేషతలు ''
ఈ రోజు బాప్‌దాదా అమృతవేళ నుండి విశేషంగా సన్ముఖంగా వచ్చిన దూరదేశములో ఉంటున్నా, హృదయం ద్వారా సమీపంగా ఉన్న డబల్ విదేశీ పిల్లలను చూస్తున్నారు. ఈ రోజు తండ్రి మరియు దాదా ఇరువురి మధ్య మధురమైన ఆత్మిక సంభాషణ నడుస్తూ ఉంది. ఏ విషయం పై ? బ్రహ్మాబాబా విశేషంగా డబల్ విదేశీ పిల్లలను చూసి హర్షిస్తూ - ఇంత దూరదేశ వాసులుగా ఉంటున్నా సదా స్నేహముతో అందరికీ ఎలాగైనా బాప్‌దాదాల సందేశాన్ని తప్పకుండా అందించాలనే ఒకే లగ్నములో ఉన్నారు, అద్భుతము ఆ పిల్లలదే అని అన్నారు. దాని కొరకు చాలా మంది పిల్లలు డబల్ కార్యాలు చేస్తున్నా లౌకికము మరియు అలౌకికములో డబల్ బిజీగా ఉంటున్నా తమ విశ్రాంతిని కూడా లెక్కచేయక రాత్రింబవళ్లు అదే లగ్నములో లగ్నమై ఉన్నారు. తమ ఆహార పానీయాలను కూడా లెక్క చేయక ఏకాగ్రతతో సేవలో నిమగ్నమై ఉంటారు. ఏ పవిత్రత విషయాన్ని అప్రాకృతికమైన జీవితంగా భావించేవారో, ఆ పవిత్రతను ధారణ చేసేందుకు, అపవిత్రతను త్యజించేందుకు, ధైర్యముతో, దృఢ సంకల్పముతో, తండ్రి స్నేహముతో, స్మృతియాత్ర ద్వారా శాంతిని ప్రాప్తి చేసుకున్న ఆధారంతో, చదువు మరియు పరివార సాంగత్యము ఆధారంతో తమ జీవితములో ధారణ చేసుకున్నారు. దేనినైతే కష్టంగా భావించేవారో దానిని సహజంగా చేసుకున్నారు. బ్రహ్మబాబా విశేషంగా పాండవ సేనను చూసి పిల్లల మహిమను గానం చేస్తున్నారు. ఏ విషయం గురించి? పవిత్రతయే యోగులుగా అయ్యేందుకు మొదటి సాధనమని ప్రతి ఒక్కరి మనసులో ఉంది. పవిత్రతయే తండ్రి స్నేహాన్ని అనుభవం చేసే సాధనము, పవిత్రతయే సేవలో సఫలతను పొందేందుకు ఆధారము. ఈ శుభ సంకల్పము ప్రతి ఒక్కరి హృదయంలో పక్కాగా ఉంది. అంతేకాక పాండవుల అద్భుతమేమంటే, వారు శక్తులను ముందు ఉంచుతూ స్వయాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు సాగుతున్నారు. పాండవుల తీవ్ర పురుషార్థము చేసే వేగము మంచి ఉన్నతిని పొందేదిగా కనిపిస్తోంది. మెజారిటీ ఇదే వేగముతో ముందుకు వెళ్తున్నారు.
పాండవులు విశేషంగా రిగార్డు(గౌరవం) ఇచ్చే తమ రికార్డును మంచిగా చూపించారని శివబాబా అన్నారు. అలాగే నవ్వు పుట్టించే విషయాన్ని కూడా చెప్పారు. వీరు మధ్య మధ్యలో సంస్కారాల ఆట కూడా ఆడుతూ ఉంటారు. అయినా మళ్లీ ఉన్నతి చెందేందుకు ఉత్సాహమున్న కారణంగా, తండ్రితో అతిస్నేహమున్న కారణంగా అర్థం చేసుకుంటారు. స్నేహం వెనుక ఈ పరివర్తనయే తండ్రికి ప్రియమైనదని భావిస్తారు అందువలన బలిహారమైపోతారు. తండ్రి ఏం చెప్తారో, ఏం కోరుకుంటారో అదే చేస్తామనే సంకల్పముతో తమను తాము పరివర్తన చేసుకుంటారు. ప్రేమ ఉన్నందున శ్రమ, శ్రమగా అనిపించదు. స్నేహము ఉన్నప్పుడు సహించడం, సహించడముగా అనిపించదు. అందుకే మళ్లీ బాబా బాబా అంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఈ జన్మలోని శారీరిక సంస్కారాలు, పురుషత్వ సంస్కారాలుగా ఉన్నా అనగా హద్దులోని రచయితను అనే భావనతో ఉన్నా స్వయాన్ని బాగా పరివర్తన చేసుకున్నారు. రచయిత అయిన తండ్రిని ముందుంచుకున్న కారణంగా నిరహంకారతను, నమ్రతా భావమును ధారణ చేయాలనే లక్ష్యమును, లక్షణాలను బాగా ధారణ చేశారు, ఇంకా చేస్తున్నారు. ప్రపంచ వాతావరణము సంపర్కములోకి వస్తున్నా స్మృతి చేయాలనే లగ్నమనే ఛత్రఛాయ ఉన్న కారణంగా సురక్షితంగా ఉండే ప్రమాణాన్ని మంచిగా చూపుతున్నారు. పాండవుల విషయాలను విన్నారా! ఈ రోజు బాప్‌దాదా ప్రియునికి బదులు పాండవుల గుణాలకు ప్రేయసిగా అయిపోయారు. అందుకే చూస్తూ చూస్తూ హర్షితమవుతున్నారు. ఇరువురికీ పిల్లల పై విశేషమైన స్నేహమైతే ఉంది కదా! కావున ఈ రోజు అమృతవేళ నుండి పిల్లల విశేషతల గుణాల మాలను స్మరణ చేశారు. మీరందరు 63 జన్మలలో మాలను స్మరణ చేశారు, తండ్రి ప్రతిఫలంగా ఇప్పుడు మీ గుణమాలను స్మరిస్తూ బదులు ఇస్తున్నారు.
అచ్ఛా! శక్తుల ఏ మాలను స్మరించారు? శక్తి సేనలోని అన్నిటికంటే పెద్ద విశేషత ఏమంటే స్నేహము కొరకు అన్ని వేళలా ఒక తండ్రి ప్రేమలో లీనమై ఉండి, సర్వ సంబంధాల అనుభవాలలో మంచి లగ్నములో ముందుకు వెళ్తున్నారు. ఒక కంటిలో తండ్రి, రెండవ కంటిలో సేవ. రెండు నయనాలలో సదా ఇవే ఇమిడి ఉన్నాయి. తమ నిర్లక్ష్యాన్ని, నాజూకుతనమును త్యాగం చేయడం విశేష పరివర్తన. ధైర్యవంతులైన శక్తి స్వరూపులుగా అయ్యారు. బాప్‌దాదా ఈ రోజు విశేషంగా చిన్న వయసు కలిగిన శక్తులను చూస్తున్నారు. ఈ యువావస్థలో అనేక రకాల అల్పకాలిక ఆకర్షణలను వదిలి ఒక్క తండ్రి ఆకర్షణలో మంచి ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రపంచాన్ని నిస్సార ప్రపంచంగా అనుభవం చేసి తండ్రినే ప్రపంచంగా చేసుకున్నారు. తమ తనువు, మనసు, ధనములను తండ్రి మరియు సేవలో వినియోగించడం ద్వారా ప్రాప్తిని అనుభవం చేస్తూ ఎగిరేకళలో ముందుకు వెళ్తున్నారు. సేవ చేయాలనే బాధ్యతా కిరీటము మంచి రీతిగా ధారణ చేశారు. అప్పుడప్పుడు అలసటను అనుభవం చేస్తూ, అప్పుడప్పుడు బుద్ధి పై భారమును అనుభవం చేస్తున్నా తండ్రిని అనుసరించాల్సిందే, తండ్రిని ప్రత్యక్షము చేయాల్సిందే అన్న దృఢత్వంతో ఈ విషయాలన్నీ సమాప్తం చేసి సఫలతను పొందుతున్నారు. అందువలన బాప్‌దాదా పిల్లల ప్రేమను చూసి ''పిల్లలు ధైర్యము చేస్తే, తండ్రి సహాయం చేస్తారు'' అన్న వరదానమును పదే పదే ఇస్తున్నారు. సఫలత మీ జన్మ సిద్ధ అధికారంగా ఉండనే ఉంది. తండ్రి తోడు ఉండడం ద్వారా ప్రతి పరిస్థితిని వెన్న నుండి వెంట్రుక తీసినంత సులభంగా దాటేస్తారు. సఫలత పిల్లల మెడలోని హారము వంటిది. సఫలత మాల పిల్లలైన మిమ్ములను స్వాగతం చేస్తుంది. కనుక పిల్లల త్యాగము, తపస్సు మరియు సేవల పట్ల బాప్‌దాదా కూడా బలిహారమవుతారు. స్నేహము కారణంగా ఏ కష్టమూ అనుభవమవ్వదు. మీరు ఇలాగే ఉన్నారు కదా! ఎక్కడైతే స్నేహముందో ఆ స్నేహ ప్రపంచంలో లేక తండ్రి ప్రపంచంలో, తండ్రి భాషలో కష్టమనే పదము ఉండనే ఉండదు. కష్టమును సహజతరం చేయడమే శక్తిసేన విశేషత. అందరికన్నా ఎక్కువగా త్వరత్వరగా సందేశమును ఇచ్చేందుకు నిమిత్తులుగా అయ్యి తండ్రి ముందుకు ఆత్మిక గులాబీల పుష్ప గుచ్ఛమును తీసుకురావాలని ప్రతి ఒక్కరి హృదయంలో ఉత్సాహముంది. ఎలాగైతే బాబా మనలను తయారుచేశారో అలా మనం ఇతరులను తయారుచేసి తండ్రి ముందుకు తీసుకురావాలి. శక్తి సైన్యము పరస్పరము సహయోగము ద్వారా సంఘటిత రూపంలో భారతదేశము కంటే ఏదైనా విశేష నవీనతను విదేశంలో చూపించే శుభ ఉత్సాహంలో ఉన్నారు. ఎక్కడైతే సంకల్పము ఉంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది. శక్తి సేనలో ప్రతి ఒక్కరు తమ తమ భిన్న భిన్న స్థానాలలో వృద్ధిని మరియు సిద్ధిని ప్రాప్తించుకోవడంలో సఫలమవుతున్నారు ఇంకా అవుతూనే ఉంటారు. కావున ఇరువురి స్నేహమును చూసి సేవ చేయాలనే ఉత్సాహమును చూసి బాప్‌దాదా హర్షిస్తున్నారు. ఒక్కొక్క పుత్రుని గుణాన్ని ఎంతగా మహిమ చేయగలరు? కానీ వతనంలో బాప్‌దాదా పిల్లల ఒక్కొక్కరి గుణాలను వర్ణన చేస్తున్నారు. దేశంలోని వారు ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎంతోమంది ఉండిపోతారు. కానీ విదేశం వారు గుర్తించి అధికారులుగా అయిపోయారు. వారు చూస్తూ ఉండిపోతారు, మీరు బాబాతో ఇంటికి వెళ్లిపోతారు. వారు ఆర్తనాదాలు చేస్తారు, మీరు వరదానాల దృష్టి ద్వారా ఎంతో కొంత అంచలిని ఇస్తూ ఉంటారు సహాయము చేస్తూ ఉంటారు.
కనుక ఈ రోజు విశేషంగా బాప్‌దాదా ఏం చేశారో మీరు విన్నారా? మొత్తం సంఘటనంతా చూసి బాప్‌దాదా భాగ్యశాలి పిల్లల భాగ్యాన్ని తయారుచేసే మహిమను గానం చేస్తున్నారు. దూరంగా ఉన్నవారు సమీపంగా అయిపోయారు, సమీపంగా ఆబూలో ఉండేవారు ఎంత దూరమైపోయారు! వారు సమీపంగా ఉంటున్నా దూరంగా ఉన్నారు కానీ మీరు దూరంగా ఉంటున్నా సమీపంగా ఉన్నారు. వారు చూసేవారు, మీరు సదా హృదయ సింహాసనము పై కూర్చునేవారు. ఎంతో స్నేహంతో మధువనం వచ్చేందుకు సాధనాలను తయారుచేసుకుంటారు. ప్రతి నెల బాబాను కలుసుకోవాలి, వెళ్లాలి, జమ చేసుకోవాలి అన్న పాటనే గానం చేస్తూ ఉంటారు. కావున ఈ లగ్నము కూడా మాయాజీతులుగా అయ్యేందుకు సాధనంగా అయిపోతుంది. సహజంగా టికెట్ లభించినట్లయితే లగ్నములో విఘ్నాలు ఎక్కువగా కలుగుతాయి. కానీ ఒక్కొక్క చుక్కతో సరోవరంగా చేస్తారు. కనుక బిందువు బిందువును జమ చేయడంలో బాబా స్మృతి ఇమిడి ఉంటుంది. కావున డ్రామాలో ఏదైతే జరుగుతుందో అది కూడా కళ్యాణకారియే. ఎక్కువ ధనం లభించినట్లయితే మాయ వచ్చేస్తుంది, సేవను మర్చిపోతారు. కావున ధనవంతులు బాబాకు అధికారి పిల్లలుగా అవ్వరు.
సంపాదించారు, జమ చేసుకున్నారు. తమ సత్యమైన సంపాదనను జమ చేసుకోవడంలోనే శక్తి ఉంది. సత్యంగా సంపాదించిన ధనం బాబా కార్యంలో సఫలమవుతోంది. ధనము దానంతట అదే వచ్చేస్తే తనువును ఉపయోగించడం జరగదు. తనువును ఉపయోగించకపోతే మనసు కూడా పైకి క్రిందికి అవుతుంది. అందుకే తనువు, మనసు, ధనము మూడూ వినియోగించబడ్తున్నాయి. కావున సంగమ యుగంలో సంపాదించి ఈశ్వరీయ బ్యాంకులో జమ చేసుకుంటారు. ఇటువంటి జీవితమే నంబర్‌వన్ జీవితము. సంపాదించి లౌకిక వినాశి బ్యాంకులలో జమ చేసినట్లయితే సఫలమవ్వదు. సంపాదించారు మరియు అవినాశి బ్యాంకులో జమ చేసినట్లయితే ఒకటికి పదమాల రెట్లు తయారవుతుంది. 21 జన్మల కొరకు జమ అవుతుంది. హృదయపూర్వకంగా చేసింది హృదయాభిరాముని వద్దకు చేరుకుంటుంది. ఒకవేళ ఎవరైనా చూపించుకునేందుకు చేసినట్లయితే ఆ చూపించుకోవడంలోనే సమాప్తమైపోతుంది, హృదయాభిరాముని వద్దకు చేరదు. కావున హృదయపూర్వకంగా చేసే మీరే మంచివారు. హృదయపూర్వకంగా రెండు రూపాయలు చేసేవారైనా పదమా పదమ్‌పతులుగా అవుతారు. ప్రదర్శించడం కోసం వేలు చేసేవారు పదమా పదమ్ పతులుగా అవ్వరు. హృదయపూర్వకమైన సంపాదన, స్నేహముతో కూడిన సంపాదనయే సత్యమైన సంపాదన. ఎందుకోసం సంపాదిస్తున్నారు? సేవ కొరకు. మీ విశ్రాంతి కోసం కాదు కదా! కావున ఇదే సత్యమైన, హృదయపూర్వకమైన సంపాదన. ఒకటి కూడా పదమారెట్లుగా అయిపోతుంది. ఒకవేళ మీ విశ్రాంతి కొరకు సంపాదించినా లేక జమ చేసుకున్నా, భలే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు కానీ అక్కడ ఇతరుకు విశ్రాంతినిచ్చేందుకు నిమిత్తులుగా అవుతారు. దాస-దాసీలు ఏం చేస్తారు? రాయల్ ఫ్యామిలీకి (రాజకుటుంబానికి) విశ్రాంతినిచ్చేందుకే ఉంటారు కదా? ఇక్కడ విశ్రాంతి ద్వారా అక్కడ విశ్రాంతినిచ్చేందుకు నిమిత్తులుగా అవ్వవలసి ఉంటుంది. అందువలన ఎవరైతే ప్రేమతో, సత్యమైన హృదయంతో సంపాదించి, సేవలో వినియోగిస్తారో వారే సఫలం చేసుకుంటున్నారు, అనేక ఆత్మల ఆశీర్వాదాలను తీసుకుంటున్నారు. ఎవరి కొరకైతే నిమిత్తులుగా అవుతారో వారే మీ భక్తులుగా అయ్యి మిమ్ములను పూజిస్తారు. ఎందుకంటే మీరు ఆ ఆత్మల కోసం సేవ చేశారు. కనుక సేవకు ప్రతిఫలంగా వారు మీ జడచిత్రాలకు సేవ చేస్తారు. పూజ చేస్తారు. సేవకు ప్రతిఫలాన్ని 63 జన్మల వరకు ఇస్తూ ఉంటారు. తండ్రి నుండైతే లభిస్తుంది కానీ ఆ ఆత్మల ద్వారా కూడా లభిస్తుంది. ఎవరికైతే సందేశమునిస్తారో, ఎవరైతే అధికారులుగా అవ్వరో, వారు మళ్లీ ఈ రూపము ద్వారా రిటర్ను ఇస్తారు. ఎవరైతే అధికారులుగా అవుతారో వారు మీ సంబంధంలోకి వచ్చేస్తారు. కొందరు సంబంధంలోకి వస్తారు, కొందరు భక్తులుగా అవుతారు, కొందరు ప్రజలుగా అవుతారు. రకరకాల ఫలితము వెలువడ్తుంది. అర్థమయిందా! మీరు సేవ వెనుక ఎందుకు పడ్తున్నారు? తినండి, తాగండి, ఆనందించండి, మీకేం లభిస్తుందని రాత్రింబవళ్లు ఈ సేవ వెనుక పడ్తున్నారని కొంతమంది జనులు అడుగుతారు కదా! మీరేమంటారు? మీకేదైతే లభించిందో దానిని అనుభవం చేసి చూడండి. అనుభవజ్ఞులకే ఈ సుఖము ఎలాంటిదో తెలుస్తుంది అనే పాటను గానం చేస్తారు కదా! అచ్ఛా!
సదా స్నేహములో ఇమిడి ఉంటూ, సదా త్యాగమునే భాగ్యంగా అనుభవము చేసుకునేవారికి, సదా ఒకటిని పదమారెట్లుగా చేసుకునేవారికి, సదా బాప్‌దాదాను అనుసరించేవారికి, తండిన్రే పప్రంచంగా అనుభవం చేసుకునే హృదయ సింహాసనాధికారులైన పిల్లలకు మనోభిరాముడైన తండి పియ్రస్మృతులు మరియు నమస్తే.
విదేశీ సోదరులతో వ్యక్తిగత మిలనము - 1. స్వయాన్ని భాగ్యవంతులైన ఆత్మలుగా భావిస్తున్నారా? భాగ్యవిధాత స్థానము వరకు చేరుకునేంతటి భాగ్యమునైతే తయారు చేసుకున్నారు. ఇది ఎటువంటి స్థానమో అర్థమయిందా! శాంతి స్థానము వరకు చేరుకోవడం కూడా భాగ్యమే. కావున ఇది కూడా భాగ్యమును పొందేందుకు మార్గము తెరుచుకుంది. డ్రామా అనుసారంగా భాగ్యమును పొందే స్థానము వరకు వచ్చి చేరుకున్నారు. భాగ్యరేఖ ఇక్కడే గీయబడ్తుంది కనుక మీరు మీ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకున్నారు. ఇప్పుడు కేవలం ఇంకొద్దిగా సమయము కేటాయించాలి. సమయము కూడా ఉంది మరియు సాంగత్యము కూడా చేయగలరు. ఇంకే కష్టమూ లేదు. ఏదైతే కష్టంగా ఉంటుందో దానిని గూర్చి కాస్త ఆలోచించబడ్తుంది. సహజంగా ఉంటే చేయండి. దీని ద్వారా జీవితములో అల్పకాలికమైన ఆశలు, కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవినాశి ప్రాప్తిలో పూర్తయిపోతాయి. ఈ అల్పకాలిక కోరికల వెనుక పడడం తమ నీడ వెనుక పరిగెత్తడం వంటిది. ఎంతగా నీడ వెనుక పరిగెడుతుంటారో అది అంతగా ముందుకు వెళ్తూ ఉంటుంది. దానిని మీరు పొందలేరు. కానీ మీరు ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే ఆ నీడ మీ వెనుకే వస్తుంది. కావున ఇటువంటి అవినాశి ప్రాప్తి వైపుకు వెళ్లే వారికి ఈ వినాశి విషయాలన్నీ పూర్తయిపోతాయి. అర్థమయిందా! సర్వ ప్రాప్తులకు సాధనము ఇదే. కొద్దికాలపు త్యాగము సదాకాలికమైన భాగ్యమును తయారు చేస్తుంది. కావున సదా ఇదే లక్ష్యమును అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండండి. దీని ద్వారా ఎంతో సంతోషము యొక్క ఖజానా లభిస్తుంది. జీవితంలో అన్నిటికంటే పెద్ద ఖజానా సంతోషమే. సంతోషము లేకపోతే జీవితము లేదు. కావున అవినాశి సంతోషమనే ఖజానాను పొందగలరు.
2. బాప్‌దాదా, సదా ముందుకు వెళ్లాలనే ఉల్లాస ఉత్సాహాలను పిల్లలలో చూస్తారు. పిల్లలలోని ఉత్సాహము బాప్‌దాదా వద్దకు చేరుతుంది. విశ్వంలోని వి.వి.ఐ.పి.లను తండ్రి ముందుకు తీసుకెళ్ళాలని పిల్లలలో ఉంది. ఈ ఉత్సాహము కూడా సాకార రూపములోకి వస్తుంది. ఎందుకంటే నిస్వార్థ సేవకు ఫలము తప్పకుండా లభిస్తుంది. సేవయే స్వ స్థితిని తయారు చేస్తుంది. కావున ఇంత సేవ ఉంది, నా స్థితి అయితే అలా లేదని ఎప్పుడూ అనుకోకండి. సేవ మీ స్థితిని తయారు చేస్తుంది. ఇతరుల సేవయే స్వ ఉన్నతికి సాధనము. సేవ దానంతటదే శక్తిశాలి స్థితిని తయారు చేస్తూ ఉంటుంది. తండ్రి సహాయము లభిస్తూ ఉంటుంది కదా! తండ్రి సహాయము లభిస్తూ లభిస్తూ ఆ శక్తి పెరుగుతూ పెరుగుతూ ఆ స్థితి కూడా వచ్చేస్తుంది. అర్థమయిందా! కనుక ఇంత సేవ నేనెలా చేయను, నా స్థితి అలా లేదని భావించకండి. చేస్తూ ముందుకు వెళ్లండి. వెళ్లవలసిందేనని బాప్‌దాదా వరదానముంది. మధురమైన సేవా బంధనము కూడా ముందుకు వెళ్లేందుకు సాధనమే. ఎవరైతే హృదయపూర్వకంగా మరియు అనుభవం అథారిటీతో మాటాడ్తారో వారి శబ్ధము హృదయము వరకు చేరుకుంటుంది. అనుభవపూర్వకమైన అథారిటి మాటలు ఇతరులకు అనుభవం చేయాలనే ప్రేరణనిస్తుంది. సేవలో ముందుకు వెళ్తూ వెళ్తూ ఏ పరీక్షలైతే వస్తాయో అవి కూడా ముందుకు తీసుకెళ్లేందుకు సాధనాలే, ఎందుకంటే బుద్ధి పని చేస్తుంది, స్మృతిలో ఉండాలనే విశేషమైన అటెన్షన్ ఉంటుంది, కావున ఇది కూడా విశేషమైన లిఫ్ట్‌గా అవుతుంది. మేము వాతావరణాన్ని ఎలా శక్తిశాలిగా చేయాలని బుద్ధిలో సదా ఉంటుంది. విఘ్నము ఎంత పెద్ద రూపము ధరించి వచ్చినా శ్రేష్ఠ ఆత్మలైన మీకు అందులో లాభమే ఉంటుంది. ఆ పెద్ద రూపము కూడా స్మృతి శక్తి ద్వారా చిన్నగా అయిపోతుంది. అది కాగితపు పులి వంటిది. మంచిది.

వరదానము :- '' దీపావళి నాడు యథార్థ విధి ద్వారా తమ దైవీ పదవిని ఆహ్వానించే పూజ్య ఆత్మా భవ ''
పూర్వము దీపావళి రోజున జనులు విధి పూర్వకంగా దీపాలను వెలిగించేవారు, దీపము ఆరిపోకుండా ఉండాలనే ధ్యాస ఉంచుకునేవారు, నేయి వేస్తూ ఉండేవారు, విధి పూర్వకంగా ఆహ్వానించే అభ్యాసములో ఉండేవారు. ఇప్పుడైతే దీపాలకు బదులుగా బల్బులను వెలిగిస్తున్నారు. దీపావళిని జరుపుకోవడం లేదు. ఇప్పుడైతే మనోరంజనమైపోయింది. ఆహ్వానము చేసే విధి లేక సాధన సమాప్తమైపోయింది. స్నేహము సమాప్తమై కేవలం స్వార్థం మిగిలిపోయింది. అందుచేత యథార్థమైన దాతా రూపధారి లక్ష్మి ఎవరి వద్దకూ రావడం లేదు. మీరందరూ యథార్థ విధి ద్వారా తమ దైవీ పదవిని ఆహ్వానిస్తారు, అందుచేత పూజ్య దేవీ దేవతలుగా అవుతారు
స్లోగన్ :- ''అనంతమైన వృత్తి, దృష్టి మరియు స్థితి సదా ఉన్నప్పుడే విశ్వ కళళ్యాణ కార్యము సంపన్నమవుతుంది.''
No comments:
Post a Comment