Monday, October 14, 2019

Telugu Murli 15/10/2019

15-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - సద్గురువు ఇచ్చిన మొట్టమొదటి శ్రీమతము - ఆత్మాభిమానులుగా అవ్వండి, దేహాభిమానము వదిలేయండి.''

ప్రశ్న :- ఈ సమయములో పిల్లలైన మీరు ఎలాంటి ఇష్టమును గాని, కోరికను గానీ ఉంచుకోరాదు - ఎందుకు?
జవాబు :- ఎందుకంటే ఇప్పుడు మీరందరూ వానప్రస్థులు. కనుల ద్వారా చూచేదంతా వినాశమవుతుందని మీకు తెలుసు. ఇప్పుడు మీకు దేని అవసరమూ లేదు. పూర్తి భికారులుగా అవ్వాలి. ఒకవేళ ఇప్పుడు మీరు ఇటువంటి వైభవయుక్తమైన వస్తువులను ధరిస్తూ ఉంటే ఆకర్షింపబడ్తారు, దేహాభిమానములో చిక్కుకుంటూ ఉంటారు. ఇందులోనే శ్రమ ఉంది. బాగా కష్టపడి పూర్తి ఆత్మాభిమానులుగా అయితే విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది.

ఓంశాంతి. ఈ 15 నిమిషాలు లేక అర్ధగంట పిల్లలు ఇక్కడ కూర్చుని ఉన్నారు. బాబా కూడా 15 నిమిషాలు కూర్చోబెడ్తారు. ఎందుకంటే స్వయమును ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఈ శిక్షణ లేక సూచన ఒక్కసారి మాత్రమే లభిస్తుంది, మరెప్పుడూ లభించదు. సత్యయుగములో ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చోండి అనే శిక్షణ లభించదు. ఈ మాట ఒక్క సద్గురువు మాత్రమే చెప్పగలరు. అందుకే ''ఒక్క సద్గురువు మాతమ్రే కాపాడ్తారు (తేలుస్తారు), మిగిలిన వారందరూ ముంచేస్తారు.'' అని వారిని గురించే అంటారు. ఇక్కడ తండ్రి మిమ్ములను ఆత్మాభిమానులుగా చేస్తారు. స్వయం వారు కూడా ఆత్మయే కదా. అర్థం చేయించేందుకు నేను సర్వాత్మల తండ్రినని చెప్తారు. వారు ఆత్మాభిమానులుగా అయ్యి తండ్రిని స్మృతి చేసే అవసరము లేదు. ఆదిసనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారు మాత్రమే స్మృతి చేస్తారు. నెంబరువారు పురుషార్థానుసారము ఈ ధర్మానికి చెందినవారు అనేకమంది ఉంటారు కదా. ఇది చాలా బాగా అర్థము చేసుకొని, చేయించాల్సిన విషయము. పరమపిత పరమాత్మ మీ అందరి తండ్రే కాక జ్ఞానసాగరులు కూడా. జ్ఞానము ఆత్మలోనే ఉంటుంది కదా. మీ ఆత్మ సంస్కారాన్ని తీసుకెళ్తుంది. తండ్రిలో మొదటి నుండే సంస్కారముంది. వారు తండ్రి అని అందరూ అంగీకరిస్తారు. మరొక ప్రత్యేకత ఏమిటంటే వారిలో యథార్థమైన జ్ఞానముంది. వారు బీజరూపులు. తండ్రి మీకు కూర్చుని ఎలా అర్థము చేయిస్తున్నారో అలా మీరు కూడా ఇతరులకు అర్థము చేయించాలి. తండ్రి మనుష్య సృష్టికి బీజరూపులు. వారే సత్యమైనవారు, చైతన్యమైనవారు, జ్ఞానసాగరులు. వారిలో పూర్తి కల్పవృక్ష జ్ఞానమంతా ఉంది. ఇతరులెవ్వరిలోనూ ఈ వృక్ష జ్ఞానము లేనే లేదు. ఈ వృక్ష బీజము తండ్రి. వారిని పరమపిత పరమాత్మ అని అంటారు. ఉదాహరణానికి మామిడి వృక్షానికి రచయిత అని దాని బీజమునే అంటారు కదా. బీజము తండ్రి సమానము. కాని అది జడ బీజము. ఒకవేళ చైతన్యమైతే, దాని నుండి వృక్షమంతా ఎలా వెలువడ్తుందో తెలిసే ఉంటుంది. కానీ అది జడము. అది క్రింద భూమిలో నాటబడ్తుంది. వీరు చైతన్య బీజరూపులు. వీరు పైన ఉంటారు. మీరు కూడా మాస్టర్‌ బీజరూపులుగా అవుతారు. తండ్రి ద్వారా మీకు జ్ఞానము లభిస్తుంది. వారు అత్యంత ఉన్నతమైనవారు. మీరు శ్రేష్ఠమైన పదవిని పొందుతారు. స్వర్గములో కూడా ఉన్నతమైన పదవి కావాలి కదా. ఇది మనుష్యులు అర్థము చేసుకోరు. స్వర్గములో దేవీదేవతల రాజధాని ఉంటుంది. రాజధానిలో రాజు, రాణి, ప్రజలు, పేదవారు - ధనవంతులు మొదలైనవారంతా ఎలా తయారై ఉంటారో, ఆదిసనాతన దేవీదేవతా ధర్మము ఎలా స్థాపన అవుతుందో, ఎవరు స్థాపన చేస్తారో మీకిప్పుడు తెలుసు. భగవంతుడు. తండ్రి చెప్తున్నారు - పిల్లలారా! ఏం జరిగినా డ్రామా ప్లాను అనుసారమే జరుగుతుంది. అందరూ డ్రామాకు బద్ధులై ఉన్నారు. నేను కూడా డ్రామా వశములో ఉన్నాను, నాకు కూడా డ్రామాలో పాత్ర లభించి ఉంది, అదే పాత్రను అభినయిస్తానని తండ్రి చెప్తున్నారు. వారు సుప్రీమ్‌ ఆత్మ. వారిని సుప్రీమ్‌ ఫాదర్‌(పరమపిత) అని అంటారు. మిగిలినవారందరూ సోదరులు. ఇతరులెవ్వరినీ తండ్రి-శిక్షకుడు-గురువు అని అనరు. వారు అందరి పరమపిత కూడా. శిక్షకుడు, సద్గురువు కూడా వారే. ఈ విషయాలు మర్చిపోరాదు. నంబరువారు పురుషార్థానుసారము రాజధాని స్థాపన అవుతూ ఉంది. పిల్లలు మర్చిపోతారు. ప్రతి ఒక్కరూ ఎలా పురుషార్థము చేస్తారో స్థూలములో కూడా వీరు తండ్రిని స్మృతి చేస్తున్నారా లేదా? ఆత్మాభిమానులుగా అయ్యారా, లేదా? అని వెంటనే తెలిసిపోతుంది. వీరు జ్ఞానములో తీక్షణంగా వెళ్తున్నారని వారి ప్రవర్తన ద్వారా అర్థమవుతుంది. కాని పిల్లలు ఖంగు తింటారని తండ్రి ఎవ్వరికీ నేరుగా చెప్పరు. ఏమిటి బాబా ఇలా అన్నారు! అందరూ ఏమనుకుంటారు? అని పిల్లలు చింత చేస్తూ కూర్చోరాదు. ఫలానా, ఫలానా అంటే ఎవరెవరు ఎలా సర్వీసు చేస్తారో తండ్రి చెప్పగలరు. అంతా సర్వీసు పై ఆధారపడి ఉంది. తండ్రి కూడా వచ్చి సర్వీసు చేస్తారు కదా. పిల్లలే తండ్రిని స్మృతి చేయాలి. స్మృతియే కష్టమైన సబ్జెక్టు. తండ్రి జ్ఞాన-యోగాలను నేర్పిస్తారు. జ్ఞానమైతే చాలా సహజమైనది. కానీ స్మృతిలోనే ఫెయిల్‌ అవుతారు. దేహాభిమానము వచ్చేస్తుంది. తర్వాత ఇది కావాలి, ఈ మంచి వస్తువు కావాలని ఇలాంటి సంకల్పాలు వస్తూ ఉంటాయి.
తండ్రి చెప్తున్నారు - ఇక్కడ మీరు వనవాసములో ఉన్నారు కదా. మీరిప్పుడు వానప్రస్థములోకి వెళ్లాలి. కనుక అలాంటి వస్తువులేవీ ధరించరాదు. మీరు వనవాసములో ఉన్నారు కదా. ఒకవేళ అలాంటి ప్రాపంచిక వస్తువులేవైనా ఉంటే అవి ఆకర్షిస్తాయి. శరీరము కూడా ఆకర్షిస్తుంది. క్షణ క్షణము దేహాభిమానములోకి తీసుకొస్తాయి. ఇందులో శ్రమ ఉంది. కష్టపడకుండా విశ్వసామ్రాజ్యము లభించదు. శ్రమ కూడా నెంబరువారు పురుషార్థమనుసారము కల్ప-కల్పము చేస్తూ ఉంటారు. ఫలితము కనిపిస్తూ ఉంటుంది. పాఠశాలలో కూడా నెంబరువారుగా బదిలీ అవుతారు. ఫలానావారు చాలా శ్రమ చేశారని టీచరుకు అర్థమైపోతుంది. వీరికి చదివించే ఆసక్తి ఉంది. అలాంటి భావన కలుగుతుంది. అక్కడ ఒక క్లాసు నుండి బదిలీ అయ్యి రెండవ తరగతికి, మూడవ తరగతికి వస్తారు. ఇక్కడ ఒకేసారి చదవాలి. ముందు ముందు మీరు ఎంతెంత సమీపానికి వస్తూ ఉంటారో అంతంత అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ చాలా కష్టపడాలి. తప్పకుండా ఉన్నత పదవి పొందుతారు. కొందరు రాజా-రాణులుగా అవుతారు. కొందరు మరొకటి, కొందరు ఇంకొకటి అవుతారని మీకు తెలుసు. ప్రజలుగా కూడా చాలామంది అవుతారు. ఇదంతా వారి ప్రవర్తన ద్వారా అర్థమవుతుంది. వీరిలో ఎంత దేహాభిమానముఉందో, వీరికి తండ్రి పై ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఒక్క తండ్రి పైనే ప్రేమ ఉండాలి కదా, సోదరుల పై కాదు. సోదర ప్రేమ ద్వారా ఏమీ లభించదు. అందరికీ ఆస్తి తండ్రి నుండే లభిస్తుంది. తండ్రి చెప్తారు - పిల్లలారా! స్వయాన్ని ఆత్మ అని భావించి నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు సమాప్తమవుతాయి. ఇదే ముఖ్యమైన విషయము. స్మృతి ద్వారా శక్తి లభిస్తుంది. రోజురోజుకు బ్యాటరీ నిండుతూ ఉంటుంది. ఎందుకంటే జ్ఞాన ధారణ జరుగుతూ ఉంటుంది కదా. బాణము తగుల్తూ వస్తుంది. రోజురోజుకు నెంబరువారు పురుషార్థానుసారము మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది. ఈ ఒక్క తండ్రి-టీచరు-సద్గురువు మాత్రమే ఆత్మాభిమానిగా అయ్యే శిక్షణను ఇస్తారు, వేర్వెవరూ ఇవ్వలేరు. మిగిలినవారంతా దేహాభిమానులుగా ఉన్నారు. ఆత్మాభిమానుల జ్ఞానము ఎవ్వరికీ లభించదు. మనుష్యులెవ్వరూ తండ్రి, టీచరు, సద్గురువుగా అవ్వలేరు. ప్రతి ఒక్కరూ వారి వారి పాత్రను అభినయిస్తున్నారు. మీరు సాక్షిగా ఉండి చూస్తారు. పూర్తి నాటకమంతా మీరు సాక్షిగా ఉండి చూడాలి, అభినయించాలి కూడా. తండ్రి, నిర్మాత, దర్శకుడు, నటుడు కూడా అయ్యారు. శివబాబా వచ్చి పాత్ర అభినయము చేస్తారు. వారు అందరి తండ్రి కదా. ఆడ పిల్లలు-మగ పిల్లలు అందరికీ వారసత్వం ఇస్తారు. తండ్రి ఒక్కరే. మిగిలిన ఆత్మలందరూ సోదరులు. ఆస్తి ఒక్క తండ్రి నుండి మాత్రమే లభిస్తుంది. ఈ ప్రపంచములోని ఏ వస్తువూ బుద్ధిలోకి రాదు. ఏం చూస్తున్నారో అదంతా వినాశనము అయ్యేదేనని తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్లాలి. వారు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు అనగా ఇంటిని స్మృతి చేస్తారు. బ్రహ్మ తత్వములో లీనమైపోతామని భావిస్తారు. దీనినే అజ్ఞానమని అంటారు. మనుష్యులు ముక్తి - జీవన్ముక్తి గురించి ఏం చెప్తున్నారో, ఏ యుక్తులు రచించారో అవన్నీ తప్పే. సరియైన మార్గాన్ని ఒక్క తండ్రి మాత్రమే తెలియజేస్తారు. తండ్రి చెప్తారు - డ్రామా ప్లాను అనుసారము నేను మిమ్ములను రాజాధి రాజులుగా చేస్తాను. మా బుద్ధిలో కూర్చోవడం లేదని కొంతమంది అంటూ ఉంటారు. బాబా మా నోటిని తెరిపించండి, కృప చూపించండి అని కొందరు అంటారు. తండ్రి చెప్తారు - ఇందులో నేను చేసేదేమీ లేదు. ముఖ్యమైన విషయమేమిటంటే మీరు ఆజ్ఞానుసారము సడచుకోవాలి. సరియైన ఆదేశ - నిర్దేశాలు తండ్రి నుండే లభిస్తాయి. మిగిలిన మనుష్యులిచ్చేదంతా తప్పు నిర్దేేశము (డైరెక్షన్‌). ఎందుకంటే అందరిలోనూ 5 వికారాలున్నాయి కదా. క్రిందికే దిగుతూ దిగుతూ తప్పుగా అవుతూ వచ్చారు. ఏమేమో రిద్ధి-సిద్ధులు(క్షుద్ర విద్యలు) మొదలైనవి చేస్తూ ఉంటారు. అందులో సుఖము లేదు. అవన్నీ అల్పకాలిక సుఖాలని మీకు తెలుసు. దానిని కాకిరెట్టకు సమానమైన సుఖమని అంటారు. మెట్ల చిత్రము చూపించి చాలా బాగా అర్థము చేయించాలి. కల్ప వృక్షము పై కూడా అర్థము చేయించాలి. మీ ధర్మ స్థాపన చేసినవారు ఫలానా - ఫలానా సమయములో వస్తారని, క్రీస్తు ఫలానా సమయములో వస్తారని ఏ ధర్మము వారికైనా మీరు ఈ చిత్రమును చూపించి తెలుపవచ్చు. ఎవరు ఇతర ధర్మాలలోకి మత మార్పిడి అయ్యి ఉంటారో వారికి ఈ ధర్మమే బాగుందనిపిస్తుంది. తక్షణము వచ్చేస్తారు. మిగిలిన వారెవ్వరికీ ఇది నచ్చదు. మరి వారు పురుషార్థము ఎలా చేయగలరు? మనుష్యులు మనుష్యులను ఉరికంబమును ఎక్కిస్తారు. మీరు ఒక్క బాబా స్మృతిలోనే ఉండాలి. ఇది చాలా మధురమైన ఉరి. ఆత్మ బుద్ధియోగము తండి వైపు ఉంటుంది. తండిన్రి స్మృతి చేయమని ఆత్మకు చెప్పబడ్తుంది. ఇది స్మృతి అనే ఉరి. తండ్రి పైన ఉంటారు కదా. మేము ఆత్మలము, తండ్రిని స్మృతి చేయాలని మీకు తెలుసు. ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. మీ వద్ద ఈ జ్ఞానమంతా ఉంది. మీరిక్కడ కూర్చుని ఏం చేస్తారు? శబ్ధానికి అతీతంగా వెళ్లుటకు పురుషార్థము చేస్తారు. అందరూ నా వద్దకు వచ్చే తీరాలని తండ్రి చెప్తున్నారు. వారు మృత్యువుకే మృత్యువు కదా. ఆ మృత్యువైతే ఒక్కరిని తీసుకెళ్తుంది. అది కూడా తీసుకెళ్ళేందుకు మృత్యువు అనే వ్యక్తి ఎవ్వరూ లేరు. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఆత్మ సమయానుసారము తనంతకు తనే వెళ్లిపోతుంది. ఈ తండ్రి అయితే ఆత్మలందరినీ తీసుకెళ్తారు. కనుక ఇప్పుడు మీ అందరి బుద్ధియోగము ఇంటికి వెళ్లడము పైనే ఉంది. శరీరాన్ని వదలడాన్ని మరణించడమని అంటారు. శరీరము సమ్తామైపోతుంది. ఆత్మ వెళ్లిపోతుంది. '' బాబా, వచ్చి మమ్ములను ఈ సృష్టి నుండి తీసుకెళ్లండి. ఇక్కడ మేము ఉండలేము అని పిలుస్తారు.'' డ్రామా ప్లాను అనుసారము ఇప్పుడు వాపస్‌ వెళ్లాలి. బాబా ఇక్కడ అపారమైన దు:ఖముంది, ఇక ఇక్కడ ఉండము. ఇది చాలా ఛీ-ఛీ ప్రపంచము అని అంటారు. అందరూ తప్పకుండా మరణించాల్సిందే. అందరిదీ వానప్రస్థ అవస్థయే. ఇప్పుడు శబ్ధానికి అతీతంగా వెళ్లాలి. మిమ్ములను ఏ మృత్యువూ కబళించదు. మీరు సంతోషంగా వెళ్తారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గమునకు చెందినవి. ఇవి మళ్లీ ఉంటాయి. ఇది డ్రామాలోని అద్భుతమైన విషయము. ఈ టేపు రికార్డరు, ఈ గడియారము ఈ సమయములో మీరు ఏమేమి చూస్తున్నారో ఇవన్నీ మరలా వస్తాయి. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. ఈ విశ్వ చరిత్ర-భూగోళాలు పునరావృతమౌతాయి అనగా ఉన్నదున్నట్లు రిపీట్‌ అవుతాయి. మనము మళ్లీ ఇటువంటి దేవీ దేవతలుగా అవుతున్నాము, మళ్లీ అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. ఇందులో కొద్దిగా కూడా వ్యతాసముండదు. ఇవన్నీ అర్థము చేసుకోవాల్సిన విషయాలు.
వారు బేహద్‌ తండ్రి, టీచరు, సద్గురువు కూడా అని మీకు తెలుసు. ఇలా మనుష్యులెవ్వరూ అయ్యేందుకు వీలు లేదు. వీరిని మీరు బాబా అని అంటారు. ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. నా నుండి మీకు ఆస్తి ఏమీ లభించదని ఈ బాబా(బ్రహ్మ) కూడా చెప్తున్నారు. బాపూజీ గాంధీ కూడా ప్రజాపిత కాదు కదా. ఈ విషయాల్లో మీరు తికమక పడకండి అని తండ్రి చెప్తున్నారు. మేము బ్రహ్మను భగవంతుడని గానీ, దేవత అని గానీ చెప్పమని మీరు చెప్పండి. తండ్రి తెలియజేశారు - అనేక జన్మల అంతిమంలో వానప్రస్థ స్థితిలో పూర్తి విశ్వమంతా పావనంగా చేసేందుకు నేను ఇతనిలో ప్రవేశిస్తానని చెప్పండి. కల్పవృక్షములో కూడా చూడండి. బ్రహ్మ చిట్టచివరిలో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు అందరూ తమోప్రధానమై శిథిలావస్థలో ఉన్నారు కదా. ఇతను కూడా తమోప్రధానమై..... నిలబడి ఉన్నారు. అవే రూపు రేఖలున్నాయి. ఇతనిలో తండ్రి ప్రవేశించి ఇతనికి బ్రహ్మ అని నామకరణము చేశారు. లేకుంటే బ్రహ్మ అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది? మీరే చెప్పండి. వీరు పతితులు, వారు పావనులు. ఆ పావన దేవతలే మళ్లీ 84 జన్మలు తీసుకొని పతిత మనుష్యులుగా అవుతారు. వీరు మనుష్యుల నుండి దేవతలయ్యేవారు. మనుష్యులను దేవతలుగా తయారు చేయడం - ఇది కేవలం తండ్రి కర్తవ్యమే. ఇవన్నీ చాలా అద్భుతమైన అర్థము చేసుకోవలసిన విషయాలు. వీరు వారుగా ఒక్క సెకండులో అవుతారు. మళ్లీ వారు 84 జన్మలు తీసుకుని వీరిగా అవుతారు. ఇతనిలో తండ్రి ప్రవేశించి చదివిస్తున్నారు. ఇతను కూడా చదువుకుంటాడు. ఇతని వంశము కూడా ఉంది కదా. లక్ష్మీనారాయణుల, రాధా-కృష్ణుల మందిరాలు కూడా ఉన్నాయి. కానీ రాధా-కృష్ణులు మొదట రాకుమార, రాకుమారీలుగా ఉండేవారు. వారే మళ్లీ లక్ష్మీనారాయణులుగా అవుతారని ఎవ్వరికీ తెలియదు. వీరు భికారుల నుండి రాకుమారులుగా, రాకుమారుల నుండి భికారులుగా అవుతారు. ఎంత సహజమైన విషయము. 84 జన్మల కథ ఈ రెండు చిత్రాలలో ఉంది. వీరు వారు అవుతారు. యుగల్‌ అయిన కారణంగా నాలుగు భుజాలను చూపించారు. ప్రవృత్తి మార్గము కదా? ఒక్క సద్గురువే మిమ్ములను తీరానికి చేరుస్తారు. ఎంత బాగా అర్థము చేయిస్తున్నారు. దైవీగుణాలు కూడా కావాలి. పత్నిని గురించి పతిని, పతిని గురించి పత్నిని అడిగినట్లయితే వారిలోని లోపాలేమిటో తక్షణమే చెప్తారు. ఫలానా విషయములో చాలా విసిగిస్తారనో లేక మేమిరువురము బాగా ఉన్నామని గానీ చెప్తారు. కొంతమంది ఎవ్వరినీ విసిగించరు. ఇరువురూ పరస్పరములో సహయోగులుగా అయ్యి జతగా నడుస్తారు. కొందరు ఒకరినొకరు క్రింద పడవేయాలని ప్రయత్నము చేస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు - ఇందులో స్వభావాన్ని బాగా పరివర్తన చేసుకోవలసి ఉంటుంది. అవన్నీ ఆసురీ స్వభావాలు. దేవతలది దైవీ స్వభావము. అసురులు, దేవతల యుద్ధము జరగలేదని మీకు తెలుసు. పాత ప్రపంచము వారు, క్రొత్త ప్రంచము వారు పరస్పరములో ఎలా కలువగలరు? తండ్రి చెప్తారు - గడిచిపోయిన విషయాలను వ్రాసేశారు. వాటిని కథలని అంటారు. పండుగలు మొదలైనవి ఈ సమయానికి సంబంధించినవే. ద్వాపరము నుండి ఆచరిస్తారు. సత్యయుగములో ఆచరించరు. ఇవన్నీ బుద్ధి ద్వారా అర్థము చేసుకోవాల్సిన విషయాలు. దేహాభిమానము వలన పిల్లలు చాలా పాయింట్లు మర్చిపోతారు. జ్ఞానము చాలా సహజము. ఏడు రోజులలో పూర్తి జ్ఞానమంతా ధారణ అవ్వగలదు. మొట్టమొదట స్మృతి యాత్ర పై గమనముంచడం అవసరము. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ బేహద్‌(అనంతమైన) నాటకములో అభినయిస్తూ పూర్తి నాటకాన్ని సాక్షిగా చూడాలి. ఇందులో తికమక పడరాదు. ఈ ప్రపంచములోని ఏ వస్తువును చూస్తున్నా బుద్ధిలో గుర్తుండరాదు.
2. మీ ఆసురీ స్వభావాలను పరివర్తన చేసుకొని దైవీ స్వభావాలను ధారణ చేయాలి. ఒకరికొకరు సహయోగులుగా అయ్యి నడుచుకోవాలి. ఎవ్వరినీ సతాయించరాదు(విసిగించరాదు).

వరదానము :- '' హృదయంలో ఒక్క హృదయాభిరాముని ఇముడ్చుకొని ఒక్కరిలో సర్వ సంబంధాల అనుభూతిని చేసే సంతుష్ట ఆత్మ భవ ''
జ్ఞానాన్ని ఇముడ్చుకునే స్థానమును బుద్ధి(దిమాగ్‌) కానీ ప్రియుని ఇముడ్చుకునే స్థానము హృదయము(దిల్‌). ఒక్కొక్క ప్రేయసి బుద్ధిని చాలా ప్రయోగిస్తుంది, కానీ బాప్‌దాదా సత్యమైన హృదయం గలవారి పై రాజీగా ఉంటారు. అందువలన హృదయం ద్వారా చేసే అనుభవం హృదయానికి, హృదయాభిరామునికి తెలుస్తుంది. ఎవరైతే హృదయపూర్వకంగా సేవ చేస్తారో, వారికి తక్కువ శ్రమతో ఎక్కువ సంతుష్టత(తృప్తి) లభిస్తుంది. హృదయం గలవారు(దిల్‌వాలే) సదా సంతుష్ట పాటలు పాడుతూ ఉంటారు. వారికి సమయానుసారము ఒక్కరితోనే సర్వ సంబంధాల అనుభూతి అవుతూ ఉంటుంది.

స్లోగన్‌ :- '' అమృతవేళలో ప్లెయిన్‌ బుద్ధి గలవారిగా కూర్చుంటే సేవ చేసేందుకు కొత్త విధులు టచ్‌ అవుతాయి ''

No comments:

Post a Comment