Thursday, October 3, 2019

Telugu Murli 03/10/2019

03-10-2019 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - అపారమైన సుఖాన్ని పొందేందుకు మీరు మాత - పితల సన్ముఖములోకి వచ్చారు. తండ్రి మిమ్ములను అపారమైన దు:ఖముల నుండి వెలికి తీసి అపారమైన సుఖాలలోకి తీసుకెళ్తారు ''

ప్రశ్న:- ఒక్క తండ్రి మాత్రమే రిజర్వ్లో ఉంటారు, పునర్జన్మలు తీసుకోరు, ఎందుకు ?
జవాబు:- ఎందుకంటే ఎవరో ఒకరు మిమ్ములను తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేసేవారు కావాలి. ఒకవేళ తండ్రి కూడా పునర్జన్మలో వచ్చినట్లైతే నల్లగా(అపవిత్రంగా) ఉన్న మిమ్ములను సుందరంగా(పవిత్రంగా) ఎవరు చేస్తారు! కనుక బాబా రిజర్వ్లో ఉంటారు.

ప్రశ్న:- దేవతలు సదా సుఖీలుగా ఎందుకుంటారు ?
జవాబు:- ఎందుకంటే వారు పవిత్రులు. పవిత్రత కారణంగా వారి నడవడికలు పరివర్తన చెంది ఉంటాయి. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖ-శాంతులు ఉంటాయి. ముఖ్యమైనది పవిత్రత.

ఓంశాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు - వారు తండ్రే కాక మతా-పిత కూడా అయినారు. మీరు మా మాతా-పితలు, మేము మీ సంతానము........ అని పాడేవారు కదా. అందరూ పిలుస్తూ ఉంటారు. ఎవరిని పిలుస్తారు? పరమపిత పరమాత్మను. కాని వారి కృప ద్వారా ఎలాంటి అపారమైన సుఖము ఎప్పుడు లభించిందో వారికి తెలియదు. అపారమైన సుఖము అని దేనిని అంటారో కూడా వారికి తెలియదు. ఇప్పుడు మీరు సన్ముఖములో కూర్చుని ఉన్నారు. ఇక్కడ ఎంత అపార దు:ఖముందో మీకు తెలుసు. ఇది దు:ఖధామము, అది సుఖధామము. మేము 21 జన్మలు స్వర్గములో చాలా సుఖంగా ఉన్నామని ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మీకు కూడా మొదట ఈ అనుభవము ఉండేది కాదు. మనము ఆ పరమపిత పరమాత్మ మాతా-పిత సన్ముఖములో ఉన్నాము, మేము 21 జన్మల కొరకు స్వర్గ సామాజ్య్రాన్ని పాప్త్రి చేసుకునేందుకు ఇక్కడికి వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రిని కూడా తెలుసుకున్నారు. ఆ తండ్రి ద్వారా పూర్తి సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేసుకున్నారు. మనము మొదట అపారమైన సుఖములో ఉండేవారము తర్వాత దు:ఖములోకి వచ్చామని కూడా నెంబరువారుగా ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంటుంది. విద్యార్థికి సదా స్మృతి ఉండాలి కానీ క్షణ-క్షణము మర్చిపోవడం బాబా గమనిస్తున్నారు. అందువల్లనే మళ్లీ వాడిపోతారు. స్థితి బలహీనమౌతుంది(అత్తిపత్తి వలె). మాయ యుద్ధము చేస్తుంది. ఉండవలసినంత సంతోషము ఉండదు. పదవులు నంబరువారుగా ఉన్నాయి కదా. స్వర్గములోకి వెళ్తారు కానీ అక్కడ కూడా రాజుల నుండి పేదవారి వరకు ఉంటారు కదా. వారు పేద ప్రజలు, వారు శ్రీమంతులు, స్వర్గములోనూ ఉంటారు, నరకములో కూడా ఉంటారు. ఉన్నతమైనవారు మరియు నీచమైనవారు. అపార సుఖమును పొందేందుకు మనము పురుషార్థము చేస్తున్నామని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణులకు అందరికంటే ఎక్కువ సుఖముంది కదా. ముఖ్యమైనది పవితత్ర. పవితత్ర లేకుండా శాంతి, సంపదలు లభించవు. ఇందులో నడవడిక చాలా బాగుండాలి. పవితత్ర ద్వారానే మనుష్యుల నడవడిక బాగుపడ్తుంది. పవిత్రంగా ఉండువారిని దేవతలని అంటారు. మీరు ఇక్కడకు దేవతలుగా అయ్యేందుకే వచ్చారు. దేవతలు సదా సుఖంగా ఉండేవారు. మనుష్యులు సదా సుఖంగా ఉండేందుకు వీలు లేదు. దేవతలకు మాత్రమే సుఖము ఉంటుంది. ఈ దేవతలనే మీరు పూజిస్తుండేవారు కదా! ఎందుకంటే వారు పవిత్రంగా ఉండేవారు. పూర్తి ఆధారమంతా పవిత్రత పై ఉంది. విఘ్నాలు కూడా ఇందులోనే వస్తాయి. ప్రపంచములో శాంతి కావాలని కోరుకుంటారు. పవిత్రత లేకుండా శాంతి ఉండేందుకు వీలు లేదని బాబా చెప్తున్నారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయమే పవితత్ర. పవితత్ర ద్వారానే నడవడికలు బాగుపడ్తాయి. పతితులుగా అగుట వల్ల మళ్లీ నడవడికలు పాడవుతాయి. ఇప్పుడు మనము మళ్లీ దేవతలుగా అవ్వాలంటే పవిత్రత తప్పకుండా అవసరమని అర్థం చేసుకోవాలి. దేవతలు పవిత్రమైనవారు. అందువల్లనే అపవిత్ర మనుష్యులు వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. ముఖ్యమైన విషయమే పవిత్రత. పిలవడము కూడా '' హే పతితపావనా! వచ్చి మమ్ములను పావనంగా చేయండి '' అని పిలుస్తారు. తండి చెప్తున్నారు - కామము మహాశతువ్రు, దీని పైన విజయము పొందండి. దీని పై విజయము పొందడం వల్లనే మీరు పవితంగా అవుతారు. మీరు పవితుల్రుగా, సతోపధ్రానంగా ఉన్నప్పుడు సుఖ-శాంతులు ఉండేవి. పిల్లలైన మీకు ఇప్పుడు జ్ఞాపకము వచ్చింది. ఇది నిన్నటి మాటే. మీరు పవిత్రంగా ఉన్నప్పుడు అపారమైన సుఖము, శాంతి సర్వస్వమూ ఉండేవి. ఇప్పుడు మళ్లీ మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అవ్వాలి. ఇందులో మొట్టమొదట ముఖ్యమైన విషయము సంపూర్ణ నిర్వికారులుగా అవ్వడము. ఇది జ్ఞాన యజ్ఞము, ఇందులో విఘ్నాలు తప్పకుండా ఏర్పడ్తాయని గాయనముంది. పవిత్రత పై ఎంత వేధిస్తారు! ఆసురీ సంప్రదాయము, దైవీ సంప్రదాయాలు కూడా గాయనము చేయబడ్డాయి. సత్యయుగములో ఈ దేవతలు ఉండేవారని మీ బుద్ధిలో ఉంది. భలే రూపము మనుష్యులది కానీ వారిని దేవతలని అంటారు. అక్కడ సంపూర్ణ సతోప్రధానంగా ఉంటారు. అక్కడ ఏ లోపాలు ఉండవు. ప్రతి వస్తువు లోప రహితంగా, సంపూర్ణంగా ఉంటుంది. తండి సంపూర్ణులు(పర్ఫెక్ట్) కాబట్టి పిల్లలను కూడా అలాగే తయారు చేస్తారు. యోగబలము ద్వారా మీరు ఎంత పవితంగా, అందంగా అవుతారు! ఈ యాత్రికుడు సదా పవిత్రమైనవారు. వారు నల్లగా(అపవిత్రులుగా) ఉన్న మిమ్ములను సుందరంగా (పవిత్రంగా) చేస్తారు. అక్కడ సహజ సౌందర్యము ఉంటుంది. అందంగా చేసుకునే అవసరముండదు. సతోప్రధానమైనవారు సౌందర్యవంతులుగానే ఉంటారు. వారే మళ్లీ తమోప్రధానంగా అవ్వడం వలన నల్లగా అవుతారు. శ్యామసుందర అను పేరు కూడా ఉంది. కృష్ణుని శ్యామసుందరుడని ఎందుకు అంటారు? దీని అర్థము తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తెలియచేయలేరు. భగవంతుడైన తండ్రి ఏ విషయాలను వినిపిస్తారో ఆ విషయాలను ఏ మనుష్యులూ వినిపించలేరు. చిత్రాలలో స్వదర్శన చక్రాన్ని దేవతలకు ఇచ్చేశారు.

తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలారా! స్వదర్శన చక్రము దేవతలకు అవసరము లేదు. వారు శంఖము మొదలైనవి ఏం చేస్తారు? బాహ్మ్రణ పిల్లలైన మీరే స్వదర్శన చకధ్రారులు. శంఖుధ్వని కూడా మీరే చేయాలి. ఇప్పుడు విశ్వములో ఎలా శాంతి స్థాపన జరుగుతూ ఉందో మీకు తెలుసు. దానితో పాటు నడవడికలు కూడా బాగుండాలి. భక్తిమార్గములో కూడా మీరు దేవతల ముందుకు వెళ్లి తమ నడవడికలను వర్ణన చేస్తారు కదా. కానీ దేవతలు మీ నడవడికలను బాగు చేయరు. బాగు చేయువారు వేరొకరున్నారు. ఆ శివబాబా నిరాకారులు. వారి ముందు మీరు సర్వ గుణ సంపన్నులు,............. అని మహిమ చెయ్యరు. శివుని మహిమయే వేరుగా ఉంటుంది. దేవతల మహిమను గానము చేస్తారు. కానీ మనము అలా ఎలా తయారవ్వాలి? పవిత్రంగా, అపవిత్రంగా అయ్యేది ఆత్మయే. ఇప్పుడు మీ ఆత్మ పవితంగా అవుతూ ఉంది, ఆత్మ సంపూర్ణమైనప్పుడు ఈ పతిత శరీరము ఉండదు. మళ్లీ వెళ్లి పావన శరీరము తీసుకుంటుంది. ఇక్కడ పావన శరీరము ఉండేందుకు వీలు లేదు. ఎప్పుడైతే ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుందో అప్పుడు పావన శరీరము ఉంటుంది. క్రొత్త ప్రపంచములో ప్రతి వస్తువు సతోప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు 5 తత్వాలు తమోప్రధానంగా ఉన్నాయి. కనుక ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తూ ఉంటాయి! ఎలా మనుష్యులు మరణిస్తూ ఉంటారు! తీర్థయాత్రలకు వెళ్తారు, ఏవైనా ప్రమాదాలు సంభవించినాయంటే మరణిస్తారు! నీరు, పృథ్వి మొదలైనవి ఎంత నష్టపరుస్తాయి! ఈ తత్వాలన్నీ మీకు సహాయము చేస్తాయి. వినాశములో ఆకస్మికంగా వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి - ఇవి ప్రాకృతిక ఆపదలు. వారు బాంబులు మొదలైనవి ఏవైతే తయారు చేస్తున్నారో అది కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. వాటిని ఈశ్వరీయ ఆపదలని అనరు. అవి మనుష్యుల ద్వారా తయారైనవి. భూకంపాలు మొదలైనవేవీ మనుష్యుల ద్వారా తయారైనవి కావు. ఈ ఆపదలన్నీ పరస్పరము కలుస్తాయి. భూభారము తగ్గి తేలికైపోతుంది. బాబా మనలను ఎలా పూర్తి తేలికగా తయారు చేసి కొత్త ప్రపంచానికి జతలో తీసుకెళ్తారో మీకు తెలుసు. తల తేలికైనప్పుడు మళ్లీ చురుకుగా అవుతారు కదా. మిమ్ములను బాబా పూర్తి తేలికగా చేసేస్తారు. అన్ని దు:ఖాలు దూరమైపోతాయి. ఇప్పుడు మీ అందరి తలలు చాలా భారంగా ఉన్నాయి. తర్వాత అందరూ తేలికగా, శాంతిగా, సుఖంగా ఉంటారు. ఎవరు ఏ ధర్మము వారైనా అందరికీ సంతోషముండాలి. సర్వులకు సద్గతినిచ్చేందుకు బాబా వచ్చి ఉన్నారని అందరికీ సంతోషముండాలి. స్థాపన ఎప్పుడైతే పూర్తిగా జరిగిపోతుందో అప్పుడు మళ్లీ అన్ని ధర్మాలు వినాశనమైపోతాయి. మొదట మీ బుద్ధిలో కూడా ఈ ఆలోచనలు లేవు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని మహిమ కూడా ఉంది. మిగిలిన అనేక ధర్మాలను వినాశనము చేసే కర్తవ్యాన్ని ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. వేరెవ్వరూ చేయలేరు. ఒక్క శివబాబాకు తప్ప ఇలాంటి అలౌకిక జన్మ, అలౌకిక కర్తవ్యాలు వేరెవ్వరికీ ఉండవు. తండి సర్వోన్నతమైనవారు. కనుక వారి కర్తవ్యము కూడా చాలా ఉన్నతమైనది. చేసి చేయించేవారు కదా. మీరు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ సృష్టి నుండి పాపాత్మల భారాన్ని తొలగించేందుకు తండి వచ్చి ఉన్నారు. ఏక ధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనము కొరకు బాబా వస్తారని గాయనము కూడా ఉంది కదా. మిమ్ములను ఇప్పుడు ఎంత ఉన్నతమైన మహాత్ములుగా చేస్తున్నారు! దేవతలు తప్ప మహాత్ములెవ్వరూ ఉండరు. ఇక్కడ అనేమందిని మహాత్మలని అంటూ ఉంటారు. కానీ మహాత్మ అని మహోన్నతమైన ఆత్మలకే చెప్తారు. స్వర్గమును రామ రాజ్యమని అంటారు. అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కనుక వికారాల ప్రశ్నే తలెత్తదు. కనుక వారిని సంపూర్ణ నిర్వికారులని అంటారు. ఎంత సంపూర్ణంగా అవుతారో అంత అధిక సమయము సుఖాన్ని పొందుతారు. అసంపూర్ణులు అంత సుఖాన్ని పొందలేరు. పాఠశాలలో కూడా కొందరు సంపూర్ణులు, మరి కొందరు అసంపూర్ణులు ఉంటారు. వ్యత్యాసము కనపడ్తుంది. డాక్టరంటే డాక్టరే కానీ కొందరి వేతనము చాలా తక్కువ, మరి కొందరి వేతనము చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దేవతలంటే దేవతలే. కానీ పదవిలో వ్యత్యాసము చాలా ఉంటుంది. తండ్రి వచ్చి మీకు శ్రేష్ఠమైన చదువును చదివిస్తారు. కృష్ణుని భగవంతుడని అనరాదు. కృష్ణుని శ్యామసుందరుడని అంటారు. కృష్ణుని నల్లగా కూడా చూపిస్తారు. కృష్ణుడు నల్లగా ఉండడు. నామ-రూపాలు మారిపోతాయి కదా. ఆత్మ భిన్న భిన్న నామ-రూప-దేశ-కాలాలలో నల్లగా (అపవిత్రంగా) అవుతుంది. ఇప్పుడిదంతా మీకు అర్థం చేయించబడ్తుంది. మనము ప్రారంభము నుండి ఎలా పాత్రలోకి వస్తామో మీరు అర్థం చేసుకున్నారు. మొదట దేవతలుగా ఉండేవారు. తర్వాత దేవతల నుండి అసురులుగా అయ్యారు. తండ్రి 84 జన్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి అన్ని రహస్యాలు అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు - నా ముద్దు పిల్లలారా, మీరు నాతో పాటు ఇంట్లో ఉండేవారు. మీరంతా సోదరులుగా ఉండేవారు. అక్కడ మీకు శరీరాలు లేవు. అందరూ ఆత్మలుగానే ఉండేవారు. తండ్రి మరియు సోదరులైన మీరు ఉండేవారు. వేరే ఏ సంబంధమూ లేదు. తండ్రి పునర్జన్మలోకి రారు. వారు డ్రామానుసారంగా రిజర్వ్లో ఉంటారు. వారి పాత్రయే అలాంటిది. మీరు ఎంత సమయము పిలిచారో, అది కూడా తండ్రి తెలిపించారు. ద్వాపరము నుండి పిలవడం ప్రారంభించలేదు. చాలా సమయము తర్వాత మీరు పిలవడం ప్రారంభించారు. మిమ్ములను తండ్రి సుఖవంతులుగా చేస్తున్నారు అనగా సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబా మేము మీ వద్దకు కల్ప-కల్పము అనేకసార్లు వచ్చామని మీరు కూడా చెప్తారు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత బాబా మీతో అంటారు. వారసత్వాన్ని మీరు పొందుతారు. దేహధారులందరూ విద్యార్థులే, చదివించేవారు విదేహీ. ఇది వారి దేహము కాదు. వారు స్వయంగా విదేహి. ఇక్కడకు వచ్చి దేహ ధారణ చేస్తారు. దేహము లేకుండా పిల్లలను ఎలా చదివిస్తారు? సర్వాత్మలకు వారు తండ్రి. భక్తిమార్గములో అందరూ వారిని పిలుస్తారు. రుద్రమాలను స్మరిస్తారు. పైన పుష్పము తర్వాత జంటపూస. వారు ఒకే విధంగా ఉన్నారు. పుష్పానికి ఎందుకు నమస్కరిస్తారో, ఎవరి మాలను తిప్పుతున్నారో కూడా ఇప్పుడు మీకు తెలిసింది. దేవతల మాలను తిప్పుతారా లేక మీ మాలను తిప్పుతారా? మాల దేవతలదా లేక మీదా? దేవతలది కాదు. మాల బ్రాహ్మణులదే. వీరికే తండ్రి కూర్చొని చదువు నేర్పిస్తున్నారు. బ్రాహ్మణుల నుండి మళ్లీ మీరే దేవతలుగా అవుతారు. ఇప్పుడు చదువుతున్నారు తర్వాత అక్కడకు వెళ్లి దేవతా పదవిని పొందుతారు. మాల బ్రాహ్మణులైన మీదే. మీరు తండ్రి ద్వారా చదివి, శ్రమపడి మళ్లీ దేవతలుగా అవుతారు. బలిహారము (సమర్పణ) చదివించేవారిది. తండ్రి పిల్లలకు ఎంత సేవ చేశారు! అక్కడైతే తండ్రిని ఎవ్వరూ స్మృతి కూడా చేయరు. భక్తిమార్గములో మీరు మాలను తిప్పేవారు. ఇప్పుడు ఆ పుష్పము(శివబాబా) వచ్చి మిమ్ములను కూడా పుష్పాలుగా చేస్తున్నారు. అనగా తన మాలలోని మణులుగా చేస్తున్నారు. మీరు పుష్పాలుగా అవుతున్నారు కదా. ఆత్మ జ్ఞానము కూడా మీకు ఇప్పుడే లభిస్తుంది. పూర్తి సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. మహిమ మీదే, బ్రాహ్మణులైన మీరు మీ సమానంగా బ్రాహ్మణులను తయారుచేసి మళ్లీ స్వర్గవాసులైన దేవీ దేవతలుగా చేస్తారు. దేవతలు స్వర్గములో ఉంటారు. మీరెప్పుడు దేవతలుగా అవుతారో అప్పుడు అక్కడ మీకు భూత, వర్తమాన, భవిష్యత్తుల జ్ఞానము ఉండదు.

ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీకే భూత, వర్తమాన, భవిష్యత్తుల జ్ఞానము లభించింది, ఇతరులెవ్వరికీ ఈ జ్ఞానము లభించదు. మీరు చాలా చాలా భాగ్యశాలురు కానీ మాయ మళ్లీ మరపింపజేస్తుంది. మిమ్ములను ఈ బాబా చదివించడం లేదు. ఇతడు కూడా మనిషే. ఇతను కూడా చదువుకుంటున్నారు. ఇతను అందరికంటే చివరిలో ఉండేవారు. మొదటి నంబరు పతితులైనవారే మళ్లీ మొదటి నంబరు పావనంగా అవుతారు. ఎంత సుఖీలుగా అవుతారు! లక్ష్యము ఎదురుగా ఉంది. తండ్రి మిమ్ములను ఎంతో ఉన్నతంగా చేస్తారు. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ,........ ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. ఒకవేళ నేను ఆశ్వీదించినట్లైతే అందరినీ ఆశీర్వదించాలి. నేను పిల్లలైన మిమ్ములను చదివించేందుకు వస్తాను. ఈ చదువు ద్వారానే మీకు అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయని తండ్రి చెప్తారు. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ఎలా పరిపూర్ణులో, అలా స్వయాన్ని పరిపూర్ణంగా(పర్ఫెక్ట్గా) చేసుకోవాలి. పవిత్రతను ధారణ చేసి మీ నడవడికలను బాగు చేసుకోవాలి. సత్యమైన సుఖ-శాంతులను అనుభవము చేయాలి.
2. సృష్టి ఆది-మధ్యాంత జ్ఞానములను బుద్ధిలో ఉంచుకొని బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేసే సేవ చేయాలి. మీ శ్రేష్ఠ భాగ్యాన్ని ఎప్పుడూ మర్చిపోరాదు.

వరదానము:- '' సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానంగా న్యారా, ప్యారాగా ఉండే బేహద్ వైరాగీ భవ ''
సాధనాలు లభించాయంటే వాటిని విశాల హృదయంతో ఉపయోగించండి. ఈ సాధనాలు మీ కొరకే ఉన్నాయి. కానీ సాధనను మర్జ్ చేయకండి(మానకండి). రెండిటి బ్యాలెన్స్ పూర్తిగా ఉండాలి. సాధనాలు చెడ్డవి కాదు. అవి మీ కర్మలకు, యోగానికి లభించిన ఫలము. కానీ సాధనాల ప్రవృత్తిలో ఉంటూ కమలపుష్ప సమానం న్యారాగా(అతీతంగా), తండ్రికి ప్రియంగా అవ్వండి. ఉపయోగిస్తూ వాటి ప్రభావంలోకి రాకండి. సాధనాలను ఉపయోగిస్తూ అందులో అనంతమైన వైరాగ్య వృత్తిని మర్జ్ చేయకండి. మొదట స్వయంలో దీనిని(వైరాగ్య వృత్తిని) ఎమర్జ్ చేయండి. తర్వాత విశ్వములో వాయుమండలాన్ని వ్యాపింపజేయండి.

స్లోగన్:- '' పరేశాన్ను (వ్యాకులతను) తమ శాన్లో స్థితం చేయడమే అన్నిటికంటే మంచి సేవ ''

No comments:

Post a Comment