Wednesday, October 16, 2019

Telugu Murli 17/10/2019

17-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - బాబా స్మృతితో పాటు జ్ఞాన ధనముతో సంపన్నమవ్వండి. బుద్ధిలో పూర్తి జ్ఞానము మెదులుతూ ఉండాలి. అప్పుడు అపారమైన సంతోషముంటుంది. సృష్టి చక్ర జ్ఞానము ద్వారా మీరు చక్రవర్తి రాజాలుగా అవుతారు ''

ప్రశ్న :- ఏ పిల్లల(మనుష్యుల) ప్రీతి తండ్రి పై ఉండదు?
జవాబు :- ఎవరు రౌరవ నరములో ఉండే వికారులను ప్రేమిస్తారో, అలాంటి మనుష్యులకు తండ్రి పై ప్రేమ ఉండదు. పిల్లలైన మీరు తండ్రిని గుర్తించారు కనుక మీకు తండ్రి పై ప్రీతి ఉంది.

ప్రశ్న :- సత్యయుగములోకి వచ్చేందుకు ఎవరికి అనుమతి ఉండదు?
జవాబు :- తండ్రి కూడా సత్యయుగానికి రారు. కనుక అక్కడకు మృత్యువు కూడా రాలేదు. ఎలాగైతే రావణునికి సత్యయుగములోకి వచ్చేందుకు అనుమతి లేదో అలా ''పిల్లలారా! నాకు కూడా సత్యయుగములోకి వచ్చేందుకు అనుమతి లేదు'' అని బాబా అంటారు. బాబా మిమ్ములను సుఖధామానికి యోగ్యులుగా తయారు చేసి ఇంటికి వెళ్లిపోతారు. వారికి కూడా హద్దు ఉంది.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక పిల్లలూ! స్మృతి యాత్రలో కూర్చుని ఉన్నారా? ఆత్మలమైన మేము స్మృతి యాత్రలో ఉన్నామని ఆంతరికములో జ్ఞానముంది కదా. యాత్ర అను అక్షరము తప్పకుండా మనసులో రావాలి. వారు హరిద్వారము, అమరనాథ్‌లకు వెళ్లే యాత్ర చేస్తారు. యాత్ర పూర్తి చేసుకొని తిరిగి వస్తారు. మనము శాంతిధామానికి వెళ్తున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. తండ్రి వచ్చి మన చేతిని పట్టుకున్నారు. చేతిని పట్టుకొని ఒడ్డుకు తీసుకెళ్తారు కదా. విషయ సాగరములో పడి ఉన్నాము కదా, కనుక మా చెయ్యి పట్టుకోండి బాబా అని అంటారు. మీరు బాబాను స్మృతి చేయండి, ఇంటిని స్మృతి చేయండి. ఇంటికి వెళ్తున్నామని మీ మనసులో ఉండాలి. నోటితో చెప్పే అవసరమే లేదు. మమ్ములను తీసుకెళ్లేందుకు బాబా వచ్చారని ఆంతరికములో స్మృతి ఉండాలి. స్మృతియాత్రలో తప్పకుండా ఉండాలి. ఈ స్మృతి యాత్ర ద్వారానే మీ పాపాలు సమాప్తమవ్వాలి. అప్పుడే మళ్లీ ఆ గమ్యానికి చేరగలరు. చిన్న పిల్లలను ఎలా చదివిస్తారో అలా ఎంత స్పష్టంగా తండ్రి అర్థము చేయిస్తున్నారు. మేము బాబాను స్మృతి చేస్తూ వెళ్తన్నామని సదా బుద్ధిలో ఉండాలి. పావనంగా చేసి పావన ప్రపంచానికి తీసుకెళ్లడమే తండ్రి కర్తవ్యము. పిల్లలను తీసుకెళ్తారు. యాత్ర చేయవలసింది ఆత్మయే. ఆత్మలమైన మనము బాబాను స్మృతి చేసి ఇంటికి వెళ్లాలి. ఇంటికి చేరినట్లైతే తండ్రి కర్తవ్యము పూర్తి అవుతుంది. పతితుల నుండి పావనంగా చేసి ఇంటికి తీసుకెళ్లేందుకు తండ్రి వస్తారు. ఈ చదువు ఇక్కడే చదువుతారు. నడవండి, తిరగండి, ఏ పనైనా చేయండి కానీ బుద్ధిలో ఈ స్మృతి ఉండాలి. యోగమనే శబ్ధము ద్వారా యాత్ర అని సిద్ధము కాదు. యోగము సన్యాసులది. అవన్నీ మనుష్యుల మతాలు. అర్ధకల్పము మీరు మనుష్యుల మతము అనుసరించారు. అర్ధకల్పము దైవీ మతముననుసరించారు. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది. యోగమనే శబ్ధము అనకండి. స్మృతి యాత్ర అని చెప్పండి. ఆత్మ ఇక్కడ యాత్ర చేయాలి. అది శరీరము ద్వారా చేసే దైహిక యాత్ర, శరీరము ద్వారా చేస్తారు. ఇందులో శరీరానికి పని ఉండదు. అది మన మధురమైన ఇల్లు అని ఆత్మలమైన మనకు తండ్రి శిక్షణ ఇస్తున్నారని దాని ద్వారా పావనంగా అవుతామని ఆత్మలైన మనకు తెలుసు. స్మృతియాత్ర చేస్తూ చేస్తూ తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి. ఇది యాత్ర. మనము ఇంటికి, బాబా వద్దకే వెళ్లాలని తండ్రి స్మృతిలో కూర్చుంటాము. పావనంగా చేసేందుకే తండ్రి వస్తారు. కనుక పావన ప్రపంచానికి తప్పకుండా వెళ్లాలి. తండ్రి పావనంగా చేస్తారు. తర్వాత నెంబరువారు పురుషార్థానుసారము మీరు పావన ప్రపంచానికి వెళ్తారు. ఈ జ్ఞానము బుద్ధిలో ఉండాలి. మనము స్మృతియాత్రలో ఉన్నాము. ఈ మృత్యులోకానికి తిరిగి రాము. మనలను ఇంటి వరకు చేర్చడం బాబా పని. బాబా మార్గాన్ని తెలుపుతారు. ఇప్పుడు మీరు మృత్యులోకములో ఉన్నారు. తర్వాత అమరలోకము, కొత్త ప్రపంచములో ఉంటారు. తండ్రి యోగ్యులుగా చేసే వదుల్తారు. సుఖధామానికి బాబా తీసుకెళ్లరు. ఇంటివరకు చేర్చడమే వారి హద్దు/లిమిట్‌. ఈ పూర్తి జ్ఞానము బుద్ధిలో ఉండాలి. కేవలం తండ్రిని స్మృతి చేయడం కాదు. దానితో పాటు జ్ఞానము కూడా ఉండాలి. జ్ఞానము ద్వారా మీరు ధనము సంపాదిస్తారు కదా. ఈ సృష్టి చక్ర జ్ఞానము ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. బుద్ధిలో ఈ జ్ఞానముంది. ఇందులో తిరుగుతూ వచ్చాము. మళ్లీ ఇంటికి వెళ్తాము. తర్వాత మళ్లీ చక్రము ప్రారంభమౌతుంది. ఈ పూర్తి జ్ఞానము బుద్ధిలో ఉన్నప్పుడే ఖుషీ పెరుగుతుంది. తండ్రిని కూడా స్మృతి చేయాలి. శాంతిధామాన్ని, సుఖధామాన్ని కూడా స్మృతి చేయాలి. 84 జన్మల చక్రాన్ని ఒకవేళ స్మృతి చేయకుంటే చక్రవర్తి రాజులుగా ఎలా అవుతారు. కేవలం ఒక్కదానినే స్మృతి చేయడం సన్యాసుల పని. ఎందుకంటే వారికి ఈ విషయాలు తెలియవు. బ్రహ్మ తత్వాన్నే స్మృతి చేస్తారు. తండ్రి చాలా బాగా పిల్లలకు అర్థం చేయిస్తారు. స్మృతి చేస్తూ చేస్తూనే మీ పాపాలు సమాప్తమవ్వాలి. మొదట ఇంటికి వెళ్లాలి. ఇది ఆత్మిక యాత్ర. నలువైపులా తిరిగినా మీ నుండి దూరంగా ఉండిపోయామని................. (చారో ఓర్‌ ఫేరే లగాయే ఫిర్‌ భీ హర్‌ దమ్‌ దూర్‌) గాయనముంది. అనగా బాబా నుండి దూరంగానే ఉండిపోయాము. ఏ తండ్రి నుండి బేహద్‌ ఆస్తి లభిస్తుందో వారి గురించి తెలుసుకోనేలేదు. ఎంతగా తిరిగాము! కొందరు ప్రతి సంవత్సరము యాత్ర చేస్తారు. ధనము ఎక్కువ ఉన్నందున యాత్రలు చేయాలనే ఆసక్తి ఉంటుంది. కానీ ఇది పిల్లలైన మీరు చేసే స్మృతి యాత. మీ కొరకు నూతన పప్రంచము తయారవుతుంది. ఆ నూతన పప్రంచానికే మళ్లీ మీరు వస్తారు. దానినే అమరలోకమని అంటారు. తీసుకెళ్లేందుకు అక్కడ మృత్యువే ఉండదు. కొత్త పప్రంచములోకి వచ్చేందుకు మృత్యువుకు అనుమతి లేదు. ఇది రావణుని పాత ప్రపంచము కదా. మీరు ఇక్కడికే పిలుస్తారు. నేను పాత ప్రపంచములో పాత శరీరములోనే వస్తాను. నాకు కూడా నూతన ప్రపంచములోకి వచ్చేందుకు అనుమతి లేదు. నేను పతితులను పావనంగా చేసేందుకు వస్తాను. మీరు పావనంగా అయ్యి ఇతరులను కూడా పావనంగా చేస్తారు. సన్యాసులు పారిపోతారు. ఒక్కసారిగా అదృశ్యమైపోతారు. ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదు. ఎందుకంటే వారు దుస్తులను మార్చుకుంటారు. పాత్రధారులు రూపాన్ని పరివర్తన చేసుకుంటారు. ఒకసారి పురుషుని నుండి స్త్రీగా, మరొకసారి స్త్రీ నుండి పురుషునిగా అవుతారు. అలా మీరు కూడా రూపాన్ని మార్చుకుంటారు. సత్యయుగములో ఇలాంటి విషయాలు ఉండవు.
తండ్రి చెప్తారు - నేను వచ్చేదే నూతన ప్రపంచాన్ని తయారు చేసేందుకు. అర్ధకల్పము పిల్లలైన మీరు రాజ్యపాలన చేస్తారు. తర్వాత డ్రామా ప్లాను అనుసారము ద్వాపర యుగము ప్రారంభమౌతుంది. దేవతలు వామ మార్గములోకి వెళ్లిపోతారు. వారి అసభ్య చిత్రాలు కూడా జగన్నాథపురిలో ఉన్నాయి. జగన్నాథుని మందిరముంది. స్వయం విశ్వాధికారులుగా ఉండేవారు. వాస్తవానికి వారి రాజధాని ఉండేది. స్వయం వారే మందిరాలలోకి వెళ్లి బందీ అయినారు. వారిని నల్లగా చూపించారు. ఈ జగన్నాథుని మందిరము గురించి మీరు చాలా అర్థం చేయించగలరు. ఇతరులెవ్వరూ దీని అర్థాన్ని తెలియజేయలేరు. దేవతలే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. వారు మీరే పూజ్యులు, మీరే పూజారులు. అన్నీ మీరే అని భగవంతుని గురించే చెప్తారు. మీరే సుఖాన్నిస్తారు, మీరే దు:ఖాన్నిస్తారని కూడా అంటారు. నేను ఎవ్వరికీ దు:ఖాన్నివ్వనని తండ్రి చెప్తారు. ఇది అర్థము చేసుకోవలసిన విషయము. బిడ్డ జన్మించినట్లయితే సంతోషము కలుగుతుంది. మరణించినట్లైతే ఏడ్వడం ప్రారంభిస్తారు. భగవంతుడు దు:ఖమిస్తారని చెప్తారు. అరే! ఈ అల్పకాల సుఖ-దు:ఖాలు మీకు రావణ రాజ్యములోనే లభిస్తాయి. నా రాజ్యములో దు:ఖమను మాటే ఉండదు. సత్యయుగమును అమరలోకమని అంటారు. దీని పేరే మృత్యులోకము. ఇక్కడ అకాల మృత్యువులుంటాయి. అక్కడ చాలా ఖుషీని అనుభవిస్తారు. ఆయువు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువలో ఎక్కువ 150 సంవత్సరాల ఆయువు ఉంటుంది. ఇక్కడ కూడా అప్పుడప్పుడు కొందరికి ఉంటుంది. కానీ ఇక్కడ స్వర్గము లేదు కదా. కొందరు శరీరాన్ని చాలా కాపాడుకుంటారు. కనుక ఆయువు ఎక్కువగా కూడా ఉంటుంది. సంతానము కూడా చాలా మంది ఉంటారు. పరివారము పెరుగుతూ ఉంటుంది. త్వరగా వృద్ధి చెందుతుంది. ఉదాహరణానికి వృక్షము నుండి కొమ్మ-రెమ్మలు వెలువడుతాయి. 50 మరియు దాని నుండి మరి ఇంకొక 50 వెలువడుతాయి. ఎంత వృద్ధి జరుగుతుంది! ఇక్కడ కూడా అలాగే కనుక దీనికి మఱ్ఱివృక్షాన్ని ఉదాహరణగా చూపిస్తారు. పూర్తి వృక్షమంతా ఉంది, కానీ పునాది లేదు. ఇక్కడ కూడా పునాది అయిన ఆదిసనాతన దేవీదేవతా ధర్మము లేదు. దేవతలు ఎప్పుడు ఉండేవారో ఎవ్వరికీ తెలియదు. వారు లక్షల సంవత్సరాలని చెప్తూ ఉంటారు. ఇంతకుముందు మీరెప్పుడూ యోచన చేసేవారు కూడా కాదు. తండ్రి వచ్చి ఈ విషయాలు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు తండ్రిని కూడా తెలుసుకున్నారు. అంతేకాక పూర్తి డ్రామా ఆదిమధ్యాంతాలు, దాని వ్యవధి(గడువు) మొదలైనవన్నీ తెలుసుకున్నారు. క్రొత్త ప్రపంచము నుండి పాతది, పాతదాని నుండి క్రొత్తది ఎలా తయారవుతుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు స్మృతి యాతల్రో కూర్చుంటారు. ఈ యాత పత్రి నిత్యము జరగాలి. నడవండి, తిరగండి కానీ స్మృతి యాతల్రో ఉండండి. ఇది ఆత్మిక యాత. భక్తిమార్గములో మనము కూడా ఈ యాత్రను చేసేవారమని మీకు తెలుసు. ఎవరైతే పక్కా భక్తులుగా ఉంటారో వారు చాలాసార్లు యాత్ర చేసి ఉండవచ్చు. ఒక్క శివుని భక్తే చేయాలి. అది అవ్యభిచారి భక్తి అని తండ్రి తెలిపిస్తారు. తర్వాత దేవతల భక్తి, తర్వాత 5 తత్వాల భక్తి చేస్తారు. దేవతల భక్తి అయితే పర్వాలేదు. ఎందుకంటే వారి శరీరము సతోప్రధానంగా ఉంటుంది. మనుష్యుల శరీరము పతితమైపోయింది, వారు పావనమైనవారు. ద్వాపరము నుండి మళ్లీ అందరూ పతితులైపోయారు. క్రింద పడుతూ వచ్చారు. మీరు ఇతరులకు అర్థం చేయించేందుకు మెటికల చిత్రము చాలా బాగుంది. జిన్‌ రాక్షసుని కథ కూడా చెప్తారు కదా. ఈ దృష్టాంతములన్నీ ఈ సమయములోనివే. ఇవన్నీ మీ గురించి తయారైనవే. భ్రమరము ఉదాహరణ కూడా మీదే. క్రిమి కీటకములాంటి వారిని మీ సమానము బ్రాహ్మణులుగా చేస్తారు. అన్ని దృష్టాంతాలూ ఇక్కడివే.
మీరు మొదట దైహిక యాత్ర చేసేవారు. ఇప్పుడు తండ్రి ద్వారా మళ్లీ ఆత్మిక యాత్ర నేర్చుకుంటున్నారు. ఇది చదువు కదా. భక్తిలో ఏమేం చేస్తూ ఉంటారో చూడండి. అందరి ముందు తల వంచి నమస్కరిస్తూ ఉంటారు. ఒక్కరి కర్తవ్యాలను గురించి కూడా తెలియదు. అందరికంటే ఎక్కువ జన్మలు ఎవరు తీసుకుంటారో అన్నీ లెక్కించవచ్చు కదా. తర్వాత తక్కువ అవుతూ ఉంటాయి. ఈ జ్ఞానము కూడా మీకు ఇప్పుడు లభిస్తుంది. ఒకప్పుడు స్వర్గముండేదని మీకు తెలుసు. భారతవాసులు ఎంత రాతి బుద్ధిగలవారైపోయారు. స్వర్గము ఎప్పుడు ఉండేదో వారినే అడగండి. లక్షల సంవత్సరాలని చెప్తారు. మేము విశ్వానికి అధికారులుగా, ఎంతో సుఖంగా ఉండేవారమని ఇప్పుడు మళ్లీ భికారుల నుండి రాకుమారులుగా అవ్వాలని, ఇప్పుడు మీకు తెలుసు. ప్రపంచము క్రొత్తది నుండి పాతదిగా అవుతుంది కదా. తండ్రి చెప్తున్నారు - శ్రమ పడండి. మాయ క్షణ క్షణము మరపింపజేస్తుందని కూడా తెలుసు. ఈ పాత ప్రపంచము నుండి మా లంగరు ఎత్తివేయబడింది, మేము వెళ్తున్నామని సదా బుద్ధిలో స్మృతి ఉంచుకోమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నావ ఆ తీరానికి వెళ్లాలి. మా నావను ఆ తీరానికి చేర్చండని పాడ్తారు కదా. అయితే వారికి తీరానికెప్పుడు వెళ్లాలో తెలియదు. అందుకు స్మృతియాత్ర ముఖ్యమైనది. తండ్రితో పాటు స్వర్గము కూడా గుర్తు రావాలి. పిల్లలు యువకులైన తర్వాత తండ్రి ఆస్తియే బుద్ధిలో ఉంటుంది. మీరు కూడా పెద్దవారే. ఈ విషయము సరియైనదేనని ఆత్మ తక్షణం తెలుసుకుంటుంది. బేహద్‌ తండ్రి ఇచ్చే ఆస్తి స్వర్గము. బాబా స్వర్గ స్థాపన చేస్తున్నారు కనుక తండ్రి శ్రీమతానుసారము నడవాలి. తప్పక పవిత్రులుగా అవ్వాలని తండ్రి చెప్తారు. పవిత్రత కారణంగానే జగడాలు జరుగుతాయి. వారు పూర్తి రౌరవ నరకములో పడి ఉన్నారు. ఇంకా ఎక్కువగా వికారాలకు వశమౌతారు. కనుక తండ్రి పై ప్రీతి ఉంచుకోలేరు. వినాశకాలే విపరీత బుద్ధి కదా. ప్రీతి బుద్ధి గలవారిగా చేసేందుకే తండ్రి వస్తారు. కొంచెం కూడా ప్రీతి బుద్ధి లేనివారు చాలా మంది ఉన్నారు. తండ్రిని ఎప్పుడూ స్మృతి చేయరు. శివబాబాను గురించి తెలియనే తెలియదు, అంగీకరించనే అంగీకరించరు. మాయ గ్రహణము పూర్తిగా పట్టుకొని ఉంది. స్మృతి యాత్ర అసలే లేదు. తండ్రి శ్రమ చేయిస్తారు. సూర్యవంశి, చంద్రవంశి రాజధానులు ఇక్కడ స్థాపనౌతున్నాయని కూడా మీకు తెలుసు. సత్య, త్రేతా యుగాలలో ధర్మస్థాపన జరగదు. రాముడు ఏ ధర్మాన్నీ స్థాపన చేయడు. స్థాపన చేసే తండ్రి ద్వారా వారు అలా తయారవుతారు. ఇతర ధర్మ స్థాపకులకు, తండ్రి చేసే ధర్మ స్థాపనకు రాత్రికి పగలుకున్నంత వ్యతాసముంది. ప్రపంచాన్ని ఎప్పుడు పరివర్తన చేయాలని ఉంటుందో అప్పుడు సంగమ యుగములో తండ్రి వస్తారు. తండ్రి చెప్తారు - కల్ప-కల్పము కల్పము యొక్క సంగమ యుగములో వస్తాను, వారు యుగ యుగములో అని వ్రాశారు. అర్ధకల్పము భక్తిమార్గము కూడా నడవాలి. కనుక తండ్రి చెప్తున్నారు - పిల్లలారా! ఈ మాటలు మరవకండి. బాబా మేము మిమ్ములను మర్చిపోతామని పిల్లలు చెప్తారు. అరే! పశువులు కూడా వాటి తండ్రిని మర్చిపోవు. మీరెందకు మర్చిపోతారు? మిమ్ములను ఆత్మ అని అనుకోరా! దేహాభిమానులుగా అవ్వడం వల్లనే మీరు తండ్రిని మర్చిపోతారు. ఇప్పుడు తండ్రి ఎలా అర్థం చేయిస్తారో అలా పిల్లలైన మీరు కూడా అలవాటు చేసుకోవాలి. గొప్పగా, ధైర్యంగా మాట్లాడాలి. పెద్ద పెద్ద వ్యక్తుల వద్ద మీరు తికమక పడరాదు. కుమారీలైన మీరే పెద్ద పెద్ద విద్వాంసులు, పండితుల వద్దకు వెళ్లినప్పుడు నిర్భయులై అర్థం చేయించాలి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. మేము వెళ్తున్నాము, మా నావ యొక్క లంగరు ఈ పాత ప్రపంచము నుండి ఎత్తివేయబడింది. మేము ఆత్మిక యాత్రలో ఉన్నామని సదా బుద్ధిలో గుర్తుండాలి. ఈ యాత్రనే మీరు చేస్తూ ఉండాలి, ఇతరులతో కూడా చేయించాలి.
2. ఎవరైనా గొప్ప వ్యక్తుల ముందు నిర్భయంగా మాట్లాడాలి. ఖంగు తినరాదు(తికమక పడరాదు), ఆత్మాభిమానులై అర్థం చేయించే అభ్యాసము చేసుకోవాలి.

వరదానము :- '' సదా తేలికగా అయ్యి తండ్రి కనులలో ఇమిడిపోయే సహజయోగీ భవ ''
సంగమ యుగంలో సంతోషాల ఖజానా ఏదైతే లభిస్తుందో అది ఏ ఇతర యుగాలలోనూ లభించదు. ఈ సమయంలో తండ్రి మరియు పిల్లల మిలనముంది, వారసత్వముంది, వరదానముంది. వారసత్వము లేక వరదానాలు రెండిటిలోనూ కష్టముండదు. అందువలన మీ బిరుదే సహజయోగులు. బాప్‌దాదా పిల్లల కష్టాన్ని చూడలేరు. '' పిల్లలూ, మీ భారమునంతా తండ్రికిచ్చి మీరు తేలికైపోండి'' అని అంటారు. ఎంత తేలికగా అవ్వాలంటే తండ్రి తన కనుల పై ఉంచుకొని వెంట తీసుకెళ్లాలి. తండ్రి పై స్నేహమున్నందుకు గుర్తు - సదా తేలికగా అయి తండ్రి దృష్టిలో (కనులలో) ఇమిడిపోవడం.

స్లోగన్‌ :- '' నెగటివ్‌ను (నకారాత్మకతను) ఆలోచించే దారిని మూసేస్తే, సఫలతా స్వరూపులుగా అవుతారు ''

No comments:

Post a Comment