12-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - తండ్రి నుండి లభించే దృష్టి ద్వారా విశ్వములోని మనుష్యమాత్రులందరూ సంతుష్టులై పరివర్తనవుతారు. అందుకే నజర్ సే నిహాల్..... అని చెప్పబడ్తుంది. ''
ప్రశ్న :- పిల్లలైన మీ హృదయములో సంతోషపు ఢంకాలు మ్రోగుతూ ఉండాలి - ఎందుకు?
జవాబు :- ఎందుకంటే బాబా తమ జతలో అందరినీ తీసుకెళ్లేందుకు వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు మనము మన తండ్రితో ఇంటికి వెళ్లిపోతాము, హాహాకారాల తర్వాత జయ జయ ధ్వనులు జరగనున్నాయి. తండ్రి దృష్టి ద్వారా మొత్తం విశ్వమంతటికీ ముక్తి - జీవన్ముక్తుల వారసత్వము లభించనున్నది. విశ్వమంతా పరివర్తనైపోతుంది.
ఓంశాంతి. ఆత్మిక శివబాబా కూర్చుని తమ ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మూడవ నేత్రము కూడా ఉంటుందని మీకు తెలుసు. ప్రపంచములోని ఆత్మలందరికి వారసత్వము ఇచ్చేందుకు వచ్చానని తండ్రికి తెలుసు. తండ్రి హృదయములో వారసత్వమే గుర్తుంటుంది. లౌకిక తండ్రి హృదయములో కూడా వారసత్వమే గుర్తుంటుంది. పిల్లలకు వారసత్వమునిస్తారు. పిల్లలు లేకుంటే వారసత్వము ఎవ్వరికి ఇవ్వాలని తికమకపడుతూ ఉంటారు. అప్పుడు దత్తత తీసుకుంటారు. ఇక్కడ తండ్రి కూర్చుని ఉన్నారు. వారి దృష్టి ప్రపంచములోని అందరి పైకి వెళ్తుంది. అందరికీ వారసత్వము ఇవ్వాలని తండ్రికి తెలుసు. భలే ఇక్కడ కూర్చుని ఉన్నారు కాని వారి దృష్టి మొత్తం విశ్వం పై, విశ్వములోని మనుష్యమాత్రులందరి పై ఉంటుంది ఎందుకంటే విశ్వమంతటిని పరివర్తన చేయవలసి ఉంటుందని వారికి తెలుసు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని తండ్రి అర్థం చేయిస్తున్నారు. అందరినీ శాంతిధామము, సుఖధామానికి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. అందరూ పరివర్తన అవ్వనున్నారు. డ్రామా ప్లాను అనుసారము కల్ప-కల్పము పరివర్తనైపోతారు. తండ్రి పిల్లలందరినీ గుర్తు చేసుకుంటారు. వారి దృష్టి అందరి పైకి పోతుంది కదా. అందరూ చదవరు. డ్రామా ప్లాను అనుసారము అందరూ వాపసు వెళ్లాలి. ఎందుకంటే నాటకము పూర్తవుతుంది. ఇక కొంత సమయము గడిస్తే వినాశనము జరుగుతుందని అందరూ అర్థం చేసుకుంటారు. ఇప్పుడు నూతన ప్రపంచము స్థాపన అవ్వనున్నది. ఆత్మ చైతన్యమయింది కదా. కనుక తండ్రి వచ్చి ఉన్నారని బుద్ధికి తోస్తుంది. స్వర్గ స్థాపన జరుగుతుంది. మనమందరమూ శాంతిధామానికి వెళ్లిపోతాము. అందరికి ముక్తి లభిస్తుంది కదా. మీకు ముక్తితో పాటు సద్గతి(జీవన్ముక్తి) కూడా లభిస్తుంది. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. మనము స్వర్గములోకి వెళ్లిపోతాము. జయ జయ ధ్వనులు వినిపిస్తాయి. ఇప్పుడు చాలా హాహాకారాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల కరువులు వస్తున్నాయి, కొన్ని చోట్ల యుద్ధాలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల భూకంపాలు సంభవిస్తున్నాయి. వేలమంది మరణిస్తూ ఉంటారు. మరణించే తీరాలి. సత్యయుగములో ఇవన్నీ ఉండవు. ''ఇప్పుడు నేను సృష్టిలోకి వెళ్తున్నాను, మొత్తం విశ్వమంతటా జయ జయ ధ్వనులు వినిపిస్తాయి'' అని తండ్రికి తెలుసు. నేను భారతదేశములోకే వెళ్తాను. మొత్తము ప్రపంచానికి పోల్చిస్తే భారతదేశము ఒక చిన్న పల్లె వంటిది. బాబాకైతే ఇది ఒక పల్లె వలె ఉంటుంది. చాలా కొద్దిమంది మనుష్యులుంటారు. సత్యయుగములో మొత్తం విశ్వమంతా ఒక చిన్న పల్లెగా ఉండేది. ఇప్పుడు ఎంతో వృద్ధి చెందింది. తండ్రి బుద్ధిలో అందరూ ఉన్నారు కదా. ఇప్పుడు ఈ శరీరము ద్వారా పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. కల్ప-కల్పము జరిగిన మీ పురుషార్థమే ఇప్పుడు కూడా జరుగుతుంది. తండ్రి కూడా కల్పవృక్షానికి బీజరూపులు. ఇది సాకార వృక్షము. పైన పరంధామములో నిరాకార వృక్షముంటుంది. ఇది ఎలా తయారు చేయబడిందో మీకు తెలుసు. ఈ జ్ఞానము ఏ మనుష్యమాత్రుల బుద్ధిలోనూ లేదు. తెలివిహీనులకు, తెలివిగలవారికి గల వ్యత్యాసము గమనించండి. తెలివిగలవారు స్వర్గములో రాజ్యపాలన చేశారు. దానిని సత్యఖండమని, స్వర్గమని అంటారు.
ఇప్పుడు పిల్లలైన మీ ఆంతరికములో చాలా సంతోషముండాలి. ఎందుకంటే తండ్రి వచ్చి ఉన్నారు. ఈ పాత ప్రపంచమైతే తప్పకుండా పరివర్తన అవుతుంది. ఎవరు ఎంత పురుషార్థము చేస్తారో అంత పదవి పొందుతారు. తండ్రి ఏమో చదివిస్తున్నారు. ఈ పాఠశాల చాలా వృద్ధి చెందుతూ ఉంటుంది. చాలామంది వస్తారు. అందరికీ ఒకే స్కూలు ఉండదు. ఇంతమంది ఒకే చోట ఎలా ఉంటారు? ఎక్కడ ఉంటారు? ఇప్పుడు మనము సుఖధామానికి వెళ్తామని మీకు గుర్తుంది. ఎవరైనా విదేశాలకు వెళ్తే అక్కడ 8-10 సంవత్సరాలు ఉండి మళ్లీ భారతదేశానికి వస్తారు కదా. భారతదేశము నిరుపేదగా ఉంది. విదేశాల వారికి ఇక్కడ సుఖంగా ఉండదు. వాస్తవానికి పిల్లలైన మీకు కూడా ఇక్కడ సుఖము లేదు. మనము చాలా శ్రేష్ఠమైన చదువు చదువుతున్నామని, ఆ చదువు ద్వారా మనము అధికారులైన దేవతలుగా అవుతామని మీకు తెలుసు. అక్కడ ఎంతో సుఖంగా ఉంటారు. ఆ సుఖమును అందరూ గుర్తు చేసుకుంటారు. ఈ కలియుగము గుర్తు కూడా రాదు. ఇందులో అపారమైన దు:ఖముంది. ఈ రావణ రాజ్యము అనగా పతిత ప్రపంచములో ఈ రోజు అపారమైన దు:ఖముంది. రేపు మళ్లీ అపారమైన సుఖముంటుంది. మనము యోగబలముతో అపారమైన సుఖము ఉండే ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నాము. ఇది రాజయోగము కదా. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నేను మిమ్ములను రాజాధి రాజులుగా చేస్తాను. కనుక ఇలా తయారు చేయు టీచరును స్మృతి చేయాలి కదా. టీచరు లేకుండా బ్యారిస్టరు, ఇంజనీర్ మొదలైనవారిగా అవ్వలేరు. ఇది కొత్త విషయము. పరమాత్మ తండ్రితో ఆత్మలు యోగము జోడించాలి. అది లేనందునే చాలా కాలము వేరుగా ఉన్నారు. చాలా కాలమంటే ఏమిటో అది కూడా తండ్రే వచ్చి అర్థం చేయిస్తున్నారు. మనుష్యులు లక్షల సంవత్సరాలని అంటారు. తండ్రి చెప్తున్నారు - ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మొట్టమొదట ఎవరైతే నా నుండి విడిపోయారో వారే వచ్చి మళ్లీ నాతో కలుస్తారు. అందుకు మీరే పురుషార్థము చేయాలి. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి ఏ కష్టమూ ఇవ్వరు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు. మీరందరూ జీవాత్మలు కదా. ఆత్మ అవినాశి, జీవము(శరీరము) వినాశి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ ఎప్పుడూ పాతదిగా అవ్వదు. ఇది అద్భుతము కదా. చదివించేవారు కూడా అద్భుతమైనవారు, చదువు కూడా అద్భుతమైనది. ఇది ఎవ్వరికీ గుర్తు లేదు. మర్చిపోతారు. ఇంతకుముందు జన్మలో ఏం చదివారో ఎవరికైనా గుర్తుందా? ఈ జన్మలో మీరు చదువుకుంటారు, ఫలితము నూతన ప్రపంచములో లభిస్తుంది. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇది పురుషోత్తమ సంగమ యుగమని, మనము నూతన ప్రపంచములోకి వెళ్ళేవారమని గుర్తుండాలి. ఇది గుర్తుండినా మీకు తండ్రి గుర్తుకు వస్తాడు. జ్ఞాపకముండేందుకు తండ్రి అనేక ఉపాయాలు తెలుపుతారు. వారు తండ్రే కాక టీచరు, సద్గురువు కూడా అయ్యారు. మూడు రూపాలలో స్మృతి చేయండి. స్మృతి చేసేందుకు ఎన్నో యుక్తులు తెలుపుతున్నారు. కానీ మాయ మరపింపచేస్తుంది. తండ్రి ఎవరైతే నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారో ఆ తండ్రే ఇది పురుషోత్తమ సంగమ యుగమని, దీనిని గుర్తుంచుకోమని కూడా తెలిపించారు. అయినా ఎందుకు స్మృతి చేయలేరు! స్మృతి చేసేందుకు యుక్తులు కూడా తెలుపుతూ ఉంటారు. వాటితో పాటు మాయ చాలా ప్రబలమైనది అని కూడా చెప్తుంటారు. అది క్షణ క్షణము మిమ్ములను మరపింపజేస్తుంది. దేహాభిమానులుగా చేస్తుంది. అందువలన ఎంత ఎక్కువగా వీలైతే అంత స్మృతి చేస్తూ ఉండండి. లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ - తిరుగుతూ స్వయాన్ని దేహానికి బదులు ఆత్మగా భావించండి. ఇది శ్రమతో కూడిన పని. జ్ఞానమేమో చాలా సులభము. పిల్లలందరూ స్మృతి నిలవదని అంటారు. మీరు తండ్రిని స్మృతి చేస్తారు, మాయ తనవైపు ఆకర్షించుకుంటుంది. దీని పైనే ఈ నాటకము తయారయ్యింది. మన బుద్ధియోగము తండ్రి జతలో, చదువులోని సబ్జెక్ట్‌ల పై ఉండాలి కానీ, అది ఉండడం లేదని, మర్చిపోతున్నామని మీకు కూడా తెలుసు. కానీ మీరు మర్చిపోరాదు. వాస్తవానికి ఈ చిత్రాలు కూడా అవసరము లేదు. అయితే చదివించేటప్పుడు మీ ముందు ఏమైనా ఉండాలి కదా. అనేక చిత్రాలు తయారవుతూ ఉంటాయి. పాండవ ప్రభుత్వము ప్లాను ఎలా ఉందో గమనించండి. ఆ ప్రభుత్వానికి కూడా ప్రణాళికలున్నాయి. కొత్త ప్రపంచములో కేవలం భారతదేశమొక్కటే ఉండేదని, చాలా చిన్నదిగా ఉండేదని మీకు తెలుసు. భారతదేశము విశ్వమంతటికి అధికారిగా ఉండేది. అక్కడ ప్రతి వస్తువు కొత్తదిగా ఉంటుంది. ఉన్న ప్రపంచమేమో ఒక్కటే. పాత్రధారులు కూడా వారే, చక్రము తిరుగుతూ ఉంటుంది. మీరు ఇన్ని సెకండ్లు, ఇన్ని గంటలు, ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు పూర్తి అయ్యాయని లెక్కపెడుతూ ఉంటారు. చక్రము మళ్లీ మళ్లీ తిరుగుతూ ఉంటుంది. ఈ రోజు, రేపు అంటూ అంటూ 5 వేల సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అన్ని దృశ్యాలు, ఆట పాటలు జరుగుతూ ఉంటాయి. ఇది ఎంతో పెద్ద అనంతమైన వృక్షము. వృక్షములోని ఆకులను లెక్క పెట్టలేము. ఇది వృక్షము. దీని పునాది దేవీదేవతా ధర్మము. ఆ తర్వాత ఈ మూడు ముఖ్యమైన శాఖలు(ధర్మాలు) వెలువడ్డాయి. పోతే వృక్షములో లెక్కలేనన్ని ఆకులున్నాయి. ఎన్ని ఆకులున్నాయో లెక్క పెట్టేందుకు ఎవ్వరికీ శక్తి లేదు. ఈ సమయములో సర్వ ధర్మాల వృక్షము వృద్ధి చెందింది. ఇది అనంతమైన పెద్ద వృక్షము. తర్వాత ఇన్ని ధర్మాలుండవు. ఇప్పుడు వృక్షమంతా నిలబడి ఉంది కానీ పునాది లేనే లేదు. దీనికి ఉదాహరణగా వటవృక్షము చాలా ఖచ్ఛితంగా ఉంటుంది. ఈ ఒక్క వృక్షమే అద్భుతమైనది. తండ్రి అర్థము చేయించేందుకు ఈ దృష్టాంతము డ్రామాలో ఉంచారు. పునాది లేనే లేదు. ఇది అర్థము చేసుకునే విషయము. తండ్రి మిమ్ములను ఎంతో తెలివిగలవారిగా చేశారు. ఇప్పుడు పునాది అయిన దేవీదేవతా ధర్మము లేనే లేదు. పోతే పిండిలో ఉప్పు ఉన్నంత స్వల్పంగా కొన్ని గుర్తులు మాత్రము మిగిలి ఉన్నాయి. ఈ గుర్తులు చాలా కొద్దిగా మాత్రమే మిగిలి ఉన్నాయి. పిల్లల బుద్ధిలో ఈ జ్ఞానమంతా వచ్చేయాలి. తండ్రి బుద్ధిలో కూడా ఈ జ్ఞానమంతా ఉంది కదా. వారు జ్ఞానమంతా తెలిపి మిమ్ములను తమ సమానంగా చేస్తున్నారు. తండ్రి బీజరూపులు. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము. ఇది చాలా పెద్ద బేహద్ డ్రామా. ఇప్పుడు మీ బుద్ధి పైకి వెళ్లిపోయింది. మీరు తండ్రిని, రచనను తెలుసుకున్నారు. భలే శాస్త్రాలలో ఉంది ఋషులు, మునులు ఎలా తెలుసుకుంటారు? ఒక్కరికి తెలిసి ఉండినా పరంపరగా వస్తూ ఉండాలి. అవసరమే లేదు. మధ్యలో ఎవరూ వాపస్ వెళ్లలేరు. నాటకము పూర్తి అయినంతవరకు పాత్రధారులందరూ ఇక్కడే ఉండాలి. తండ్రి ఇక్కడ ఉన్నంతవరకు, అక్కడ పూర్తిగా ఖాళీ అయినంత వరకు ఎవ్వరూ వాపస్ వెళ్లలేరు. ఖాళీ అయినప్పుడు శివబాబా ఊరేగింపు బయలుదేరి వెళ్లిపోతుంది. ముందే వెళ్లి అక్కడ కూర్చోరు. కనుక తండ్రి కూర్చొని ఈ జ్ఞానమంతా ఇస్తున్నారు. ఈ ప్రపంచ చక్రము ఎలా రిపీట్ అవుతుందో తెలుపుతున్నారు. సత్యయుగము, త్రేతా, ద్వాపర, కలియుగము............. తర్వాత సంగమ యుగము వస్తుందని గాయనముంది కానీ సంగమ యుగము ఎప్పుడు అవుతుందో ఎవ్వరికీ తెలియదు.
పిల్లలైన మీరు యుగాలు నాలుగు అని, ఇది లీప్ యుగమని, దీనిని మిడ్‌గేట్ అని అంటారని అర్థము చేసుకున్నారు. కృష్ణునికి కూడా మిడ్‌గేట్‌గా చూపిస్తారు. కనుక ఇది జ్ఞానము. జ్ఞానమును రకరకాలుగా త్రిప్పి భక్తిలో ఏదేదో తయారు చేశారు. జ్ఞాన దారమంతా చిక్కుపడి ఉంది. ఆ జ్ఞానమును అర్థం చేయించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ప్రాచీన రాజయోగమును నేర్పేందుకు విదేశాలకు వెళ్తారు. అది ఇదే కదా. ప్రాచీనమనగా మొదటిది. సహజ రాజయోగము నేర్పించేందుకు తండ్రి వచ్చారు. ఎంత గమనముంటుంది. స్వర్గ స్థాపన అవ్వాలని మీరు కూడా చాలా గమనముంచుతారు. ఆత్మకు స్మృతి కలుగుతుంది కదా. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు నేను ఏ జ్ఞానమైతే ఇస్తున్నానో అది మళ్లీ నేనే వచ్చి ఇస్తాను. ఇది నూతన ప్రపంచము కొరకు నూతన జ్ఞానము. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంటే చాలా ఖుషీ ఉంటుంది. ఇక కొద్ది సమయము మాత్రమే ఉంది. ఇప్పుడు వాపస్ వెళ్లాలి. ఒకవైపు సంతోషముంటుంది. మరోవైపు అరే ఇటువంటి మధురమైన బాబాను మనము మళ్లీ కల్పము తర్వాతనే చూస్తామను ఫీలింగ్ కూడా వస్తుంది. పిల్లలకు ఇంత సుఖమిచ్చేది తండ్రే కదా. శాంతిధామము, సుఖధామానికి తీసుకెళ్లేందుకే తండ్రి వస్తారు. మీరు శాంతిధామమును, సుఖధామమును స్మృతి చేస్తే తండ్రి కూడా గుర్తుకు వస్తారు. ఈ దు:ఖధామమును మర్చిపోండి. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలు వినిపిస్తారు. పాత ప్రపంచము పై మీకు మమకారము తొలగిపోతే ఖుషీ కూడా ఉంటుంది. మీరు మళ్లీ సుఖధామానికి వాపస్ వెళ్తారు. సతోప్రధానంగా అవుతూ ఉంటారు. కల్ప-కల్పము ఎవరు తయారయ్యారో వారే మళ్లీ తయారవుతారు. వారికే సంతోషముంటుంది. ఈ పాత శరీరమును వదిలేస్తారు. మళ్లీ నూతన శరీరము తీసుకొని సతోప్రధాన ప్రపంచములోకి వస్తారు. ఈ జ్ఞానము సమాప్తమైపోతుంది. ఇవి చాలా సహజమైన విషయాలు. రాత్రి పూట నిదురించు సమయములో ఇలా ఇలా స్మృతి చేసినా సంతోషము కలుగుతుంది. మనము మళ్లీ ఇలా తయారవుతున్నాము. రోజంతటిలో ఏ వికారీ కర్మలు చేయలేదు కదా? 5 వికారాలలో ఏ వికారము కూడా నన్ను సతాయించలేదు కదా? లోభము రాలేదు కదా? ఈ విధంగా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
పిల్లలైన మీరు యుగాలు నాలుగు అని, ఇది లీప్ యుగమని, దీనిని మిడ్‌గేట్ అని అంటారని అర్థము చేసుకున్నారు. కృష్ణునికి కూడా మిడ్‌గేట్‌గా చూపిస్తారు. కనుక ఇది జ్ఞానము. జ్ఞానమును రకరకాలుగా త్రిప్పి భక్తిలో ఏదేదో తయారు చేశారు. జ్ఞాన దారమంతా చిక్కుపడి ఉంది. ఆ జ్ఞానమును అర్థం చేయించేవారు ఒక్క తండ్రి మాత్రమే. ప్రాచీన రాజయోగమును నేర్పేందుకు విదేశాలకు వెళ్తారు. అది ఇదే కదా. ప్రాచీనమనగా మొదటిది. సహజ రాజయోగము నేర్పించేందుకు తండ్రి వచ్చారు. ఎంత గమనముంటుంది. స్వర్గ స్థాపన అవ్వాలని మీరు కూడా చాలా గమనముంచుతారు. ఆత్మకు స్మృతి కలుగుతుంది కదా. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు నేను ఏ జ్ఞానమైతే ఇస్తున్నానో అది మళ్లీ నేనే వచ్చి ఇస్తాను. ఇది నూతన ప్రపంచము కొరకు నూతన జ్ఞానము. ఈ జ్ఞానము బుద్ధిలో ఉంటే చాలా ఖుషీ ఉంటుంది. ఇక కొద్ది సమయము మాత్రమే ఉంది. ఇప్పుడు వాపస్ వెళ్లాలి. ఒకవైపు సంతోషముంటుంది. మరోవైపు అరే ఇటువంటి మధురమైన బాబాను మనము మళ్లీ కల్పము తర్వాతనే చూస్తామను ఫీలింగ్ కూడా వస్తుంది. పిల్లలకు ఇంత సుఖమిచ్చేది తండ్రే కదా. శాంతిధామము, సుఖధామానికి తీసుకెళ్లేందుకే తండ్రి వస్తారు. మీరు శాంతిధామమును, సుఖధామమును స్మృతి చేస్తే తండ్రి కూడా గుర్తుకు వస్తారు. ఈ దు:ఖధామమును మర్చిపోండి. అనంతమైన తండ్రి అనంతమైన విషయాలు వినిపిస్తారు. పాత ప్రపంచము పై మీకు మమకారము తొలగిపోతే ఖుషీ కూడా ఉంటుంది. మీరు మళ్లీ సుఖధామానికి వాపస్ వెళ్తారు. సతోప్రధానంగా అవుతూ ఉంటారు. కల్ప-కల్పము ఎవరు తయారయ్యారో వారే మళ్లీ తయారవుతారు. వారికే సంతోషముంటుంది. ఈ పాత శరీరమును వదిలేస్తారు. మళ్లీ నూతన శరీరము తీసుకొని సతోప్రధాన ప్రపంచములోకి వస్తారు. ఈ జ్ఞానము సమాప్తమైపోతుంది. ఇవి చాలా సహజమైన విషయాలు. రాత్రి పూట నిదురించు సమయములో ఇలా ఇలా స్మృతి చేసినా సంతోషము కలుగుతుంది. మనము మళ్లీ ఇలా తయారవుతున్నాము. రోజంతటిలో ఏ వికారీ కర్మలు చేయలేదు కదా? 5 వికారాలలో ఏ వికారము కూడా నన్ను సతాయించలేదు కదా? లోభము రాలేదు కదా? ఈ విధంగా స్వయాన్ని చెక్ చేసుకోవాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము :-
1. యోగబలముతో అపారమైన సుఖాల ప్రపంచాన్ని స్థాపన చేయాలి. ఈ పాత దు:ఖ ప్రపంచాన్ని మర్చిపోవాలి. సత్య ఖండానికి అధికారులుగా అవుతున్నామనే ఖుషీ ఉండాలి.
2. ప్రతి రోజు స్వయాన్ని - ''పూర్తి రోజులో ఏ వికారమూ నన్ను సతాయించలేదు కదా? ఏ వికారీ కర్మ చేయలేదు కదా? లోభానికి వశము కాలేదు కదా? '' అని చెక్ చేసుకోవాలి.
వరదానము :- '' సదా ఒక్క తండ్రి స్నేహంలో ఇమిడి ఉండే సహజయోగీ భవ ''
ఏ పిల్లలకైతే తండ్రితో చాలా స్నేహముందో, ఆ స్నేహీ ఆత్మ సదా తండ్రి శ్రేష్ఠ కార్యంలో సహయోగిగా ఉంటుంది మరియు ఎవరు ఎంత సహయోగులో అంత సహజయోగులుగా అవుతారు. తండ్రి స్నేహంలో ఇమిడిపోయిన సహయోగి ఆత్మ ఎప్పుడూ మాయకు సహయోగిగా అవ్వజాలదు. కానీ ప్రతి సంకల్పంలో బాబా మరియు సేవ ఉంటుంది. అందువలన వారు నిదురించినా అందులో విశ్రాంతి, శాంతి, శక్తి లభిస్తుంది. నిద్ర నిద్రగా ఉండదు, సంపాదించి సంతోషంగా పడుకున్నట్లు ఉంటుంది. ఇంత పరివర్తన జరుగుతుంది.
స్లోగన్ :- '' ప్రేమ బాష్పాలు హృదయమనే డబ్బీలో ముత్యాలుగా అవుతాయి ''
No comments:
Post a Comment