11-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - అనంతమైన అపారమైన సంతోషమును అనుభవము చేసేందుకు అనుక్షణము బాబా జతలో ఉండండి ''
ప్రశ్న :- తండ్రి నుండి ఏ పిల్లలకు చాలా చాలా శక్తి లభిస్తుంది ?
జవాబు :- ఎవరికైతే మేము ఈ అనంతమైన విశ్వమును పరివర్తన చేసేవారము, మేము అనంతమైన విశ్వానికి అధికారులుగా అవ్వాలి, మమ్ములను చదివించేవారు స్వయం విశ్వాధికారులైన తండ్రి అని నిశ్చయముందో ఆ పిల్లలకు చాలా శక్తి లభిస్తుంది.
ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు లేక ఆత్మలను ఆత్మిక తండ్రి పరమపిత పరమాత్మ కూర్చుని చదివిస్తున్నారు. అంతేకాక అర్థము చేయిస్తున్నారు. ఎందుకంటే పిల్లలే పావనంగా అయ్యి మళ్లీ స్వర్గానికి అధికారులుగా అవుతారు. ఈ విశ్వమంతటికీ తండ్రి ఒక్కరే అను నిశ్చయము ఈ పిల్లలకు ఉంది. ఈ విశ్వమంతటికి తండ్రి, సర్వాత్మల తండ్రి పిల్లలైన మిమ్ములను చదివిస్తున్నారు. ఇంతమాత్రమైనా మీ బుద్ధిలో ఉందా? ఎందుకంటే తెలివి(బుద్ధి) తమోప్రధానవంగా, ఇనుపపాత్రగా, ఇనుప యుగముదిగా ఉంది. దిమాగ్(బుద్ధి) ఆత్మలో ఉంటుంది. ఇంతమాత్రమైనా దిమాగ్‌లో కూర్చుంటుందా? అనంతమైన తండ్రి మమ్ములను చదివిస్తున్నారు. మేము ఈ అనంతమైన విశ్వాన్ని పరివర్తన చేస్తామని అర్థము చేసుకునే శక్తి లభిస్తుంది. ఇప్పుడు ఈ అనంతమైన సృష్టిని నరకము(దోజక్) అని అంటారు. పేదలు నరకములో ఉన్నారని, సన్యాసులు, షావుకార్లు, గొప్ప పదవిలో ఉన్నవారు స్వర్గములో ఉన్నారని అనుకుంటున్నారా? తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు మానవ మాత్రులందరూ నరకములోనే ఉన్నారు. ఇవన్నీ చాలా అర్థము చేసుకునే విషయాలు. ఆత్మ చాలా సూక్ష్మమైనది. ఇంత చిన్న ఆత్మలో జ్ఞానమంతా నిలవడం లేదా లేక మర్చిపోతున్నారా? విశ్వములోని సర్వాత్మల తండ్రి మీ ఎదురుగా కూర్చుని చదివిస్తున్నారు. బాబా మీ జతలో ఉన్నారని రోజంతా బుద్ధిలో గుర్తుంటుందా? ఎంత సమయముంటుంది? ఒక గంటనా, అర్ధగంటనా? రోజంతా గుర్తుంటుందా? బుద్ధిలో ఉంచుకునే శక్తి కావాలి. ఈశ్వరుడు, పరమపిత పరమాత్మ మిమ్ములను చదివిస్తున్నారు. వెలుపల మీరు మీ ఇళ్లలో ఉన్నప్పుడు బాబా మీ జతలో ఉండరు. ఇక్కడ ప్రాక్టికల్‌గా (వాస్తవంగా) మీ జతలో ఉన్నారు. పత్ని ఇంటిలో, పతి ఎక్కడో బయట ఉన్నప్పుడు జతలో ఉన్నారని అనరు. అనంతమైన తండ్రి ఏమో ఒక్కరే. తండ్రి అందరిలో అయితే లేరు కదా. తండ్రి ఏదో ఒక స్థానములో కూర్చుంటారు కదా. అనంతమైన తండ్రి మిమ్ములను నూతన ప్రపంచానికి అధికారులుగా అయ్యేందుకు అర్హులుగా చేస్తున్నారని బుద్ధిలో ఉందా? ఈ విశ్వమంతటికీ అధికారులుగా అయ్యేవారమని, అందుకు అర్హులమని మీ హృదయంలో భావిస్తున్నారా? ఇది చాలా సంతోషించే విషయము. ఇంతకంటే ఎక్కువ సంతోషపు ఖజానా మరెవ్వరికీ లభించదు. ఇలా అయ్యేవారమని ఇప్పుడే మీకు తెలిసింది. ఈ దేవతలు అధికారులుగా ఎక్కడ ఉండేవారో కూడా మీకు తెలుసు. భారతదేశములోనే దేవతలుండేవారు. ఇతను విశ్వమంతటికీ అధికారిగా అయ్యేవారు, ఇది దిమాగ్‌లో ఉందా? అలాంటి నడవడిక ఉందా? మాట్లడే తీరు అలా ఉందా? అలాంటి బుద్ధి ఉందా? ఏదైనా మాటకు వెంటనే కోపము చేసుకోవడం, ఎవరికైనా నష్టము కలిగించడం, ఎవరినైనా నిందించడం లేదు కదా? సత్యయుగములో ఎప్పుడూ ఎవ్వరినీ నిందించరు. అక్కడ గ్లాని చేసే ఛీ-ఛీ ఆలోచనలు చేసేవారే ఉండరు. తండ్రి తన పిల్లలను ఎంతో శక్తివంతము చేసి ఉన్నతంగా చేస్తున్నారు. మీరు తండ్రిని స్మృతి చేస్తే పాపాలు నశిస్తాయి. మీరు చేతులెత్తుతారు అయితే మీ నడవడిక అలా ఉందా? తండ్రి కూర్చుని చదివిస్తున్నారు అనే విషయము బుద్ధిలో బాగా కూర్చున్నదా? చాలామంది నషా సోడావాటర్ వలె తుస్సుమంటుందని బాబాకు తెలుసు. అందరికీ ఇంత సంతోషపు పాదరస మీటరు పైకి ఎక్కదు బుద్ధిలో కూర్చున్నప్పుడు నషా ఎక్కుతుంది. విశ్వానికి అధికారులుగా చేసేందుకు స్వయంగా తండ్రియే చదివిస్తున్నారు.
ఇక్కడ అందరూ పతితులే. రావణ సంప్రదాయానికి చెందినవారు. రాముడు వానర సైన్యం సహాయము తీసుకున్నాడని కథ ఉంది కదా. తర్వాత ఏదేదో చేశారని వ్రాసేశారు. ఇప్పుడు బాబా రావణుని పై విజయమును కలిగించి లక్ష్మినారాయణులుగా చేస్తారు. ఎవరైనా అడిగినప్పుడు పిల్లలైన మీరు వెంటనే భగవంతుడు మమ్ములను చదివిస్తున్నారని చెప్తారు. ఒక టీచరు మిమ్ములను వకీలుగా, ఫలానాగా చేస్తానని చెప్పి నిశ్చయంతో చదివిస్తారు, వారు తయారైపోతారు. చదివేవారు కూడా నంబరువారుగా ఉంటారు కదా. కనుక పదవి కూడా నంబరువారుగా పొందుతారు. ఇది కూడా చదువే. బాబా లక్ష్యమును మీ ఎదుట చూపిస్తున్నారు. ఈ చదువు ద్వారా మేము ఈ విధంగా (లక్ష్మినారాయణులు) అవుతామని మీకు తెలుసు. ఇది సంతోషించే విషయము కదా. ఐ.సి.యస్ చదివేవారికి కూడా, మేము ఈ చదువు చదువుకుని ఈ పని చేస్తాము, ఇల్లు కట్టుకుంటాము, అలా చేస్తామని బుద్ధిలో మెదులుతూ ఉంటుంది కదా. ఇక్కడ తండ్రి కూర్చొని పిల్లలైన మిమ్ములను చదివిస్తున్నారు. అందరూ చదవాలి, పవిత్రంగా అవ్వాలి. మేము ఏ విధమైన అపవిత్ర కర్మ చేయము అని తండ్రికి మీరు ప్రతిజ్ఞ చేయాలి. తండ్రి చెప్తున్నారు - ఏవైనా విరుద్ధమైన కర్మలు చేస్తే సంపాదనంతా నష్టమైపోతుంది. ఇది మృత్యులోకము, పాత ప్రపంచము. మనము నూతన ప్రపంచము కొరకు చదువుతున్నాము. ఈ పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. తండ్రి మనలను అమరలోకము కొరకే చదివిస్తున్నారు. ఈ ప్రపంచ చక్రమంతటినీ తండ్రి మీకు అర్థం చేయిస్తున్నారు. వారి చేతిలో ఏ పుస్తకమూ లేదు. అలాగే నోటితో(ఓరల్) చెప్తూ ఉంటారు. మొట్టమొదట తండ్రి అర్థం చేయిస్తున్నారు - స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోండి. ఆత్మ తండ్రి అయిన భగవంతుని పుత్రుడు. పరమపిత పరమాత్మ పరంధామములో ఉంటారు. ఆత్మలమైన మనము కూడా అక్కడే ఉండేవారము. అక్కడ నుండి పాత్ర చేసేందుకు ఇక్కడకు నంబరువారుగా వస్తూ ఉంటాము. ఇది చాలా పెద్ద అనంతమైన నాటక రంగము. ఈ స్టేజి పై నూతన ప్రపంచములో పాత్ర చేసేందుకు మొదట పాత్రధారులు భారతదేశములో వస్తారు. ఇది వారి కర్తవ్యము. మీరు వారి మహిమను గానము కూడా చేస్తారు. మీరు వారిని కోటీశ్వరులని అంటారా? వారి వద్ద లెక్కలేనంత అపారమైన ధన రాసులుంటాయని తండ్రి చెప్తున్నారు కదా. ఎందుకంటే తండ్రి అనంతమైనవారు. ఇది కూడా తయారైన డ్రామా. శివబాబా వారిని ఇటువంటి ధనవంతులుగా చేసినందున భక్తిమార్గములో మళ్లీ వారికి(శివునికి) మందిరాలు కట్టించి పూజిస్తారు. మొట్టమొదట ఎవరైతే పూజ్యులుగా చేశారో వారి మందిరాలను తయారుచేస్తారు. తండ్రి మన నషా పెంచేందుకు ప్రతిరోజు చాలా అర్థం చేయిస్తూ ఉంటారు. అయితే నంబరువారు పురుషార్థానుసారము ఎవరైతే అర్థము చేసుకొని సేవలో నిమగ్నమవుతారో వారు తాజాగా ఉంటారు. లేకుంటే నిరాశతో వాడిపోయి ఉంటారు. ఈ భారతదేశములో మీరు రాజ్యపాలన చేయునప్పుడు ఇతర ధర్మమేదీ ఉండేది కాదు. ఒక్క దేవీ దేవతా ధర్మము మాత్రమే ఉండేది. తర్వాత ఇతర ధర్మాలు వచ్చాయి. ఈ సృష్టి చక్రమెలా తిరుగుతుందో ఇప్పుడు మీకు తెలుసు. పాఠశాలలో లక్ష్యముండాలి కదా. సత్యయుగము ఆదిలో వీరు (లక్ష్మినారాయణులు) రాజ్యపాలన చేసేవారు. తర్వాత 84 జన్మల చక్రములోకి వచ్చారు. ఇది అనంతమైన చదువు అని పిల్లలకు తెలుసు. జన్మ-జన్మాంతరాలుగా హద్దు చదువు చదువుతూ వచ్చారు. ఇందులో నిశ్చయము పక్కాగా ఉండాలి. ఈ సృష్టినంతటిని పరివర్తన చేసే, నూతనంగా మార్చే అనగా నరకమును స్వర్గముగా తయారు చేసే తండ్రి మనలను చదివిస్తున్నారు. ముక్తిధామానికైతే అందరూ వెళ్లక తప్పదు. కానీ అందరూ స్వర్గములోకి రాలేరు. మనలను తండ్రి ఈ విషయ సాగరము నుండి, వేశ్యాలయము నుండి వెలుపలికి తీస్తారు. ఇప్పుడిది వేశ్యాలయము. ఇది ఎప్పటి నుండి మొదలవుతుందో కూడా మీకు తెలుసు. రావణరాజ్యము మొదలై 2500 సంవత్సరాలయ్యింది. భక్తి కూడా అప్పుడే ప్రారంభమయ్యింది. అప్పుడు కేవలం దేవీ దేవతా ధర్మము వారు మాత్రమే ఉండేవారు. వారు వామమార్గములోకి వచ్చేశారు. భక్తి చేసేందుకే మందిరాలు కట్టిస్తారు. సోమనాథ మందిరము ఎంతో పెద్దదిగా కట్టించారు. చరిత్ర విన్నారు కదా. మందిరములో ఎంత సంపద ఉండేది! అనగా ఆ సమయములో వారెంత ధనవంతులుగా ఉండేవారు! కేవలం ఒక్క మందిరమే ఉండదు కదా. చరిత్రలో ఒక్క మందిరం పేరే వేశారు. మందిరాలను అనేకమంది రాజులు కట్టిస్తారు. ఒకరిని చూసి ఒకరు అందరూ పూజిస్తారు. అనేక మందిరాలు నిర్మిస్తారు. ఒక్క మందిరాన్నే లూటీ చేసి ఉండరు. దగ్గరలో ఇతర మందిరాలు కూడా ఉండి ఉంటాయి. అక్కడ సత్యయుగములో గ్రామాలు దూర దూరంగా ఉండవు. ఒకదానికొకటి దగ్గరగానే ఉంటాయి. ఎందుకంటే అక్కడ రైళ్లు మొదలైనవి ఉండవు కదా. ఒకదానికి ఒకటి చాలా దగ్గరగా ఉంటాయి. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా సృష్టి వ్యాపిస్తూ పోతుంది.
పిల్లలూ! మీరిప్పుడు చదువుకుంటున్నారు. అత్యంత గొప్ప శ్రేష్ఠమైన తండ్రి మిమ్ములను చదివిస్తున్నారు. ఈ నషా ఉండాలి కదా. ఇంటిలో ఎప్పుడూ ఏడ్వడం, కొట్టుకోవడం ఉండరాదు. ఇక్కడ మీరు దైవీగుణాలను ధారణ చేయాలి. ఈ పురుషోత్తమ సంగమ యుగములో పిల్లలైన మిమ్ములను చదివిస్తారు. ఈ మధ్య సమమయులో మీరు పరివర్తనవుతారు. పాత ప్రపంచము నుండి కొత్త ప్రపంచములోకి వెళ్లాలి. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో చదువుతున్నారు. భగవంతుడు మిమ్ములను చదివిస్తున్నారు. ప్రపంచమంతటిని మార్చేస్తారు. పాత ప్రపంచాన్ని నూతన ప్రపంచముగా చేస్తారు. ఆ నూతన ప్రపంచానికి మీరు మళ్లీ అధికారులుగా అవ్వాలి. మీకు యుక్త్తి తెలిపేందుకు తండ్రి కట్టుబడి ఉన్నారు. పిల్లలైన మీరు ఆ ప్రకారంగా నడుచుకోవాలి. మనము ఇక్కడేే ఉండేవారము కాదని అర్థం చేసుకున్నారు. ఒకప్పుడు మన రాజధాని ఉండేదని కూడా మీకు తెలియదు. రావణరాజ్యములో మీరు చాలా దు:ఖీలుగా ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. దీనిని వికారి ప్రపంచమని అంటారు. దేవతలు సంపూర్ణ నిర్వికారులు. వారి ముందు స్వయాన్ని వికారులమని చెప్పుకుంటారు. ఈ రావణరాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమయ్యిందో, ఏమి జరిగిందో ఎవ్వరికీ తెలియదు. బుద్ధి పూర్తి తమోప్రధానంగా ఉంది. సత్యయుగములో పారసబుద్ధి గలవారిగా ఉండేవారు. అప్పుడు విశ్వమంతటికీ అధికారులుగా ఉండేవారు. అపారమైన సుఖముండేది. దాని పేరే సుఖధామము. ఇక్కడ అపారమైన దు:ఖముంది. సుఖ ప్రపంచము, దు:ఖ ప్రపంచము ఎలా ఉంటుందో కూడా ఆ తండ్రే అర్థం చేయిస్తున్నారు. ఎంత సమయము సుఖము, ఎంత సమయము దు:ఖముంటుందో మానవులకు ఏ మాత్రమూ తెలియదు. మీలో కూడా నంబరువారుగా అర్థము చేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ అర్థం చేయించేవారు అనంతమైన తండ్రి. కృష్ణుని అనంతమైన తండ్రి అని అనరు. మనస్సుకు అలా అనిపించదు. కానీ తండ్రి అని ఎవరిని అనాలో ఏ మాత్రమూ తెలియదు. భగవంతుడు అర్థం చేయిస్తున్నారు - మీరు నన్ను నిందించారు. నేను మిమ్ములను దేవతలుగా తయారు చేస్తాను. నన్ను ఎంతగానో నిందించారు, దేవతలను కూడా నిందించారు. ఇంత మూఢమతులుగా అయ్యారు. భజగోవిందం,............ అని కూడా అంటారు. తండ్రి చెప్తున్నారు - ''ఓ మూఢమతులారా, గోవిందా, గోవిందా, రామా రామా'' అంటూ ఎవరిని భజిస్తున్నారో కూడా బుద్ధికి తెలియకుండా పోయింది. రాతిబుద్ధి వారిని మూఢమతులని అంటారు. తండ్రి చెప్తున్నారు - ఇప్పుడు నేను మిమ్ములను విశ్వమంతటికీ అధికారులుగా చేస్తాను. తండ్రి సర్వుల సద్గతిదాత.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు, మీ పరివారము మొదలైనవాటిలో ఎంతో చిక్కుకొనిపోయారు. భగవంతుడు చెప్పినదానిని బుద్ధిలోకి తెచ్చుకోవాలి. కానీ ఆసురీ మతానికి అలవాటు పడిపోయారు. ఈశ్వరీయ మతమును ఎలా అనుసరించాలి! గోవిందుడెవరు, ఏ వస్తువు అనేది కూడా తెలియదు అని తండ్ర్రి తెలిపిస్తున్నారు. బాబా మీరు అనేక పర్యాయాలు మాకు అర్థం చేయించారని మీరంటారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. బాబా మేము మళ్లీ మీ నుండి వారసత్వము తీసుకుంటున్నాము. మేము నరుని నుండి నారాయణునిగా తప్పకుండా అవుతాము. మేము ఫలానాగా అవుతామని విద్యార్థులకు నషా తప్పకుండా ఉంటుంది. నిశ్చయము ఉంటుంది. మీరు సర్వగుణ సంపన్నులుగా అవ్వాలని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఎవ్వరి పై కూడా కోపగించుకోరాదు. దేవతలలో 5 వికారాలు ఉండవు. శ్రీమతముననుసరించాలి. మొట్టమొదటి శ్రీమతము - స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మీరు పరంధామము నుండి ఇచ్చటకు పాత్రను అభినయించేందుకు వచ్చారు. మీ శరీరము వినాశమయ్యేది. ఆత్మ అవినాశి కనుక మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి. నేను ఆత్మను, పరంధామము నుండి ఇచ్చటకు పాత్రను అభినయించేందుకు వచ్చాను. ఇక్కడ దు:ఖము కలిగినప్పుడు ముక్తిధామానికి వెళ్లాలని అనుకుంటారు. అలా వెళ్లాలనుకుంటే మిమ్ములను పావనంగా తయారు చేసేదెవరు? ఒక్కరినే పిలుస్తారు. ఆ తండ్రి వచ్చి చెప్తున్నారు - నా మధురమైన పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించండి, దేహమని భావించకండి. నేను కూర్చుని ఆత్మలకు వినిపిస్తున్నాను. ఆత్మలే నన్ను - ''ఓ పతితపావనా! మీరు వచ్చి పావనంగా చేయండి'' అని పిలిచారు. భారతదేశములోనే పవిత్రంగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ పతితుల నుండి పావనంగా చేసి సుఖధామానికి తీసుకు వెళ్లండి అని పిలుస్తారు. కృష్ణుని పట్ల మీకు ప్రీతి అయితే ఉంది. అందరికంటే ఎక్కువగా వ్రతాలు, నియమాలు కన్యలు, మాతలే చేస్తారు. కృష్ణపురి అనగా సత్యయుగములోకి వెళ్లాలని నీరు కూడా త్రాగకుండా ఉంటారు. కానీ జ్ఞానము లేనందున చాలా హఠము మొదలైనవి చేస్తారు. మీరు కూడా చాలా హఠము చేస్తారు. ఇతరులకు వినిపించేందుకు కాదు, స్వయం కృష్ణపురికి, వైకుంఠానికి పోయేందుకు చేస్తున్నారు. మిమ్ములను ఎవ్వరూ అడ్డగించరు. అక్కడ వారు ప్రభుత్వము ఎదుట నిరాహారదీక్షలు చేస్తారు, హఠము చేస్తారు, విసిగిస్తారు. మీరు ఎవ్వరి వద్దా ధర్నా చేసే పని లేదు. ఇది మీకెవ్వరూ నేర్పించనూ లేదు.
శ్రీ కృష్ణుడు సత్యయుగములో మొదటి రాకుమారుడు కాని ఈ విషయము ఎవ్వరికీ తెలియదు. వారు కృష్ణుని ద్వాపర యుగములోకి తీసుకెళ్లారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురమైన పిల్లలూ! భక్తి వేరే, జ్ఞానము వేరే. జ్ఞానము పగలు, భక్తి రాత్రి. ఎవరికి ? బ్రహ్మకు రాత్రి, బ్రహ్మకు పగలు. కానీ దీని అర్థము గురువులకే తెలియదు, వారి శిష్యులకు అంతకంటే తెలియదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యముల రహస్యాన్ని తండ్రి పిల్లలైన మీకు అర్థం చేయించారు. జ్ఞ్ఞానము పగలు, భక్తి రాత్రి, ఆ తర్వాత వైరాగ్యము. వారికిది తెలియదు. జ్ఞానము, భక్తి, వైరాగ్యము అనే పదాలు మాత్రము కరెక్టే కానీ వాటి అర్థము తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు - తండ్రి జ్ఞానమునిస్తున్నారు దాని వలన పగలు వస్తుంది. భక్తి మొదలైతే రాత్రి అంటారు. ఎందుకంటే ఎదురుదెబ్బలు తగులుతాయి. ఎదురుదెబ్బలు తినవలసి వస్తుంది. బ్రహ్మకు రాత్రి అంటే బ్రాహ్మణులకు కూడా రాత్రే తర్వాత పగలవుతుంది. జ్ఞానము ద్వారా పగలు, భక్తి ద్వారా రాత్రి. రాత్రిలో మీరు వనవాసములో కూర్చొని ఉన్నారు. పగలులో మీరు చాలా గొప్ప ధనవంతులుగా అవుతారు. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. తండ్రి నుండి లభించిన సంతోష ఖజానా దిమాగ్‌లో(బుద్ధిలో) కూర్చుంటుందా ?
2. తండ్రి మనలను విశ్వాధికారులుగా చేసేందుకు వచ్చారు, అటువంటి ప్రవర్తన నాకుందా? నేను మాట్లడే విధానము అలా ఉందా? ఎప్పుడూ ఎవ్వరినీ నిందించడం లేదు కదా? తండ్రి వద్ద ప్రతిజ్ఞ చేసిన పిదప ఏ అపవిత్ర కర్మ చేయడం లేదు కదా?
వరదానము :- '' గతాన్ని శ్రేష్ఠ విధి ద్వారా గతింపజేసి స్మృతిస్వరూపంగా చేసుకునే పాస్ విత్ ఆనర్ భవ ''
గతం గత: (పాస్ట్ ఈజ్ పాస్ట్) అవ్వనే అవ్వాల్సిందే. సమయం మరియు అన్ని దృశ్యాలు పాస్ అయిపోతాయి(వెళ్లిపోతాయి) కాని గౌరవ పూర్వకంగా ఉత్తీర్ణులై ప్రతి సంకల్పము లేక సమయాన్ని పాస్ చేయండి అనగా గతాన్ని ఎలాంటి శ్రేష్ఠమైన విధి ద్వారా గతింపజేస్తారంటే ఆ గతాన్ని స్మృతిలోకి తెస్తూనే '' వాహ్ వాహ్ '' అనే మాటలు హృదయం నుండి వెలువడాలి. ఇతర ఆత్మలు గతించిపోయిన మీ కథ నుండి పాఠాలు చదువుకోవాలి. మీ గతము స్మృతి స్వరూపంగా అయితే మీ కీర్తనము అనగా మీ కీర్తిని పాడుతూ ఉంటారు.
స్లోగన్ :- '' స్వ కళ్యాణము కొరకు ప్లాన్ తయారు చేయండి, అప్పుడు విశ్వ సేవలో సకాశ్ లభిస్తుంది. ''
No comments:
Post a Comment