09-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - తండ్రి చదివించే జ్ఞానములో తాంత్రిక విద్యలు, అల్పకాల క్షుద్ర విద్యలు లేవు. చదువులో ఛూ-మంత్రాలతో పని జరగదు ''
ప్రశ్న :- దేవతలను తెలివిగలవారని అంటారు, మనుష్యులను అలా అనరు - ఎందుకు?
జవాబు :- ఎందుకంటే దేవతలు సర్వగుణసంపన్నులు. మానవులలో ఏ గుణమూ లేదు. దేవతలు తెలివిగలవారు కాబట్టే మనుష్యులు వారిని పూజిస్తారు. వారి బ్యాటరీ పూర్తి శక్తివంతంగా (ఫుల్ చార్జ్‌గా) ఉంది. అందుకే వారిని సంపన్నులు అని అంటారు. బ్యాటరీ డిస్‌చార్జ్ అయినప్పుడు పైసకు సమానమైనవారని అంటారు. అనగా తెలివిలేనివారిగా అవుతారు.
ఓంశాంతి. ఇది ఒక పాఠశాల అని, ఇది చదువు అని తండ్రి పిల్లలకు అర్థం చేయించారు. ఈ చదువు ద్వారా ఈ(లక్ష్మీనారాయణుల) పదవి ప్రాప్తిస్తుంది. దీనిని పాఠశాల లేక విశ్వవిద్యాలయమని అర్థం చేసుకోవాలి. దూర-దూరాల నుండి చదువుకునేందుకు ఇక్కడకు వస్తారు. ఏం చదువుకుంటారు? లక్ష్యము బుద్ధిలో ఉంది. మనము చదువుకునేందుకు వస్తాము. చదివించేవారిని టీచర్ అని అంటారు. భగవంతుడు చెప్పిందే గీత. ఇతరమేదీ కాదు. గీతను చదివించేవారి పుస్తకముంది కానీ పుస్తకము మొదలైనవేవీ చదివించరు. చేతిలో ఏ గీతా లేదు. ఇది భగవానువాచ. మానవులను భగవంతుడని అనరు. భగవంతుడు అత్యంత శ్రేష్ఠమైనవారు మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము - ఇవన్నీ కలిపి విశ్వమని అంటారు. నాటకము సూక్ష్మవతనములో గానీ, మూలవతనములో గానీ జరగదు. నాటకము ఇక్కడే జరుగుతుంది. 84 జన్మల చక్రము కూడా ఇక్కడనే నడుస్తుంది. దీనినే 84 జన్మల నాటక చక్రము అని అంటారు. ఇది తయారైన డ్రామా. ఇవన్నీ బాగా అర్థము చేసుకునే విషయాలు. ఎందుకంటే అత్యంత శ్రేష్ఠమైన భగవంతుని మతము(సలహా) మీకు లభిస్తుంది. ఇతరమేదీ లేదు. ఆ ఒక్కరినే సర్వశక్తివంతుడు, ప్రపంచమంతటికీ సర్వశక్తివంతమైన అథారిటీ(అధికారి) అని అంటారు. అథారిటీకి అర్థము కూడా వారే స్వయంగా అర్థం చేయిస్తున్నారు. ఈ మానవులకు తెలియదు వందుకంటే అందరూ తమోప్రధానంగా ఉన్నారు. దీనిని కలియుగమని అంటారు. అంతేగాని కొంతమందికి సత్యయుగము, కొంతమందికి కలియుగము, కొంతమందికి త్రేతాయుగము కాదు. ఇప్పుడిది నరకము. కనుక మా వద్ద సంపద ఉంది, ధనముంది కావున మాకిది స్వర్గము అని అనరాదు. అలా ఉండేందుకు వీలు లేదు. ఇది తయారైన నాటకము. సత్యయుగము గడచిపోయింది. ఇప్పుడుండేందుకు వీలు లేదు. ఇవన్నీ అర్థము చేసుకునే విషయాలు. తండ్రి కూర్చుని అన్ని విషయాలు అర్థం చేయిస్తున్నారు. సత్యయుగములో వీరి రాజ్యముండేది. అప్పుడు భారతీయులను సత్యయుగ నివాసులు అనేవారు. ఇప్పుడు కలియుగ నివాసులని అంటారు. సత్యయుగములో ఉంటే దానిని స్వర్గమనేవారు. అంతేకాని నరమును కూడా స్వర్గమని అనరు. మానవులకు వారి వారి మతములు అనేకమున్నాయి. అల్పకాలిక సుఖమునిచ్చే ధనముంటే మేము స్వర్గములో ఉన్నామని అనుకుంటున్నారు. నా వద్ద చాలా సంపద ఉంది అందువలన నేను స్వర్గములో ఉన్నానని అనుకుంటారు. కానీ ఇది స్వర్గము కాదని వివేకము చెప్తుంది. ఇది నరకమే నరకము. ఎవరి వద్దనైనా 10-20 లక్షలున్నాయనుకోండి. కానీ ఇది రోగుల ప్రపంచము. సత్యయుగమును రోగ రహిత ప్రపంచమని అంటారు. ప్రపంచమేమో ఇదే. సత్యయుగములో ఈ ప్రంచమును యోగీ ప్రపంచమని అంటారు. కలియుగమును భోగీ ప్రపంచమని అంటారు. అక్కడ ఉన్నవారు యోగులు. ఎందుకంటే అక్కడ వికారాల భోగవిలాసాలుండవు. ఇది పాఠశాల. ఇందులో శక్తి మాటే లేదు. టీచరు శక్తి ఏమైనా చూపిస్తారా? మేము ఫలానా అవుతామనే లక్ష్యముంటుంది. మీరు ఈ చదువు ద్వారా మానవుల నుండి దేవతలుగా అవుతారు. అంతేగాని ఇంద్రజాలము, ఛూ - మంత్రము, క్షుద్ర శక్తుల సిద్ధుల మాటే లేదు. ఇది పాఠశాల. పాఠశాలలో తాంత్రిక విద్యలుంటాయా? చదవుకొని కొంతమంది డాక్టర్లుగా, కొంతమంది లాయర్లుగా అవుతారు. ఈ లక్ష్మీనారాయణలు కూడా మానవులే. కానీ పవిత్రంగా ఉండేవారు. అందుకే వారిని దేవీ దేవతలని అంటారు. పవిత్రమయ్యే తీరాలి. ఇది పతిత పాత ప్రపంచము.
ఈ ప్రపంచము పాతదిగా అయ్యేందుకు లక్షల సంవత్సరాలు పడ్తుందని మానవులు అనుకుంటారు. కలియుగము తర్వాత సత్యయుగము వస్తుంది. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. దీనిని గురించి ఇతరులకెవ్వరికీ తెలియదు. సత్యయుగానికి లక్షల సంవత్సరాలని అంటారు. ఈ విషయాలను తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. వారిని సుప్రీమ్(అత్యంత శ్రేష్టము) అని అంటారు. ఆత్మల తండ్రిని 'బాబా' అని అంటారు. అంతకంటే వేరే పేరు లేదు. బాబా పేరు శివుడు. శివుని మందిరాలకు కూడా వెళ్తారు. పరమాత్మ శివుడిని నిరాకారమనే అంటారు. వారికి మనుష్య శరీరము లేదు. ఆత్మలైన మీరిచ్చట పాత్రను అభినయించేందుకు వస్తారు. అప్పుడు మీకు మానవ శరీరము లభిస్తుంది. ఆయన శివుడు. మీరు సాలిగ్రామాలు. శివుని పూజ, సాలిగ్రామాల పూజ కూడా జరుగుతుంది. ఎందుకంటే చైతన్యములో ఉండి వెళ్లారు. ఏదో మేలు చేసి వెళ్లారు కాబట్టే వారిని మహిమ చేస్తారు లేక పూజిస్తారు. పూర్వ జన్మలను గురించి ఎవ్వరికీ తెలియదు. ఈ జన్మలో మహిమ చేస్తారు. దేవీ దేవతలను పూజిస్తారు. ఈ జన్మలో చాలామంది నాయకులు కూడా తయారయ్యారు. ఉండి వెళ్లిన మంచి మంచి సాధువులు - సత్పురుషుల పేరు ప్రతిష్ఠలకై స్టాంపులు కూడా తయారు చేస్తారు. కానీ ఇక్కడ అందరికంటే గొప్ప పేరు ఎవరిది? అందరికంటే గొప్పవారెవరు? ఉన్నతోన్నతులైన వారు ఒక్క భగవంతుడే. ఆయన నిరాకారులు. వారి గొప్పతనము పూర్తి ప్రత్యేకమైనది. దేవతల మహిమ వేరు, మానవుల మహిమ వేరు. మానవులను దేవతలని అనరు. దేవతలలో అన్ని గుణాలు ఉండేవి. లక్ష్మీనారాయణులు ఇక్కడ ఉండి వెళ్లిపోయారు కదా. వారు పవిత్రంగా ఉండేవారు, విశ్వాధికారులుగా ఉండేవారు. వారిని పూజిస్తారు. అపవిత్రులను పూజ్యులని అనరు. సదా అపవిత్రులు పవిత్రులను పూజిస్తారు. కన్య పవిత్రంగా ఉన్నప్పుడు పూజింపబడ్తుంది. పతితమైన తర్వాత అందరి పాదాలకు నమస్కరించవలసి వస్తుంది. ఇప్పుడు అందరూ పతితంగానే ఉన్నారు. సత్యయుగములో అందరూ పావనంగా ఉండేవారు. అది పవిత్ర ప్రపంచము. కలియుగము పతిత ప్రపంచము. పతితమైనప్పుడే పతితపావనుడైన తండ్రిని పిలుస్తారు. పవిత్రంగా ఉన్నప్పుడు పిలువరు. తండ్రి స్వయంగా చెప్తున్నారు - నన్ను సుఖములో ఎవ్వరూ స్మృతి చేయరు. ఇది భారతదేశ విషయమే. భారతదేశములోనే తండ్రి వస్తారు. భారతదేశమే ఇప్పుడు పూర్తి పతితమై ఉంది. భారతదేశమే ఒకప్పుడు పవిత్రంగా ఉండేది. పవిత్ర దేవతలను చూడాలనుకుంటే మందిరాలకు వెళ్లి చూడండి. దేవతలందరూ పావనులే. వారిలో ముఖ్యమైన వారిని మందిరాలలో చూపిస్తారు. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యములో అందరూ పవిత్రంగా ఉండేవారు. యథా రాజా - రాణి తథా ప్రజా. అందరూ 'ఓ పతితపావనా రండి' అని పిలుస్తూ ఉంటారు. సన్యాసులు కృష్ణుని ఎప్పుడూ భగవంతుడని గాని, బ్రహ్మము అని గాని అంగీకరించరు. వారు నిరాకారమునే భగవంతునిగా భావించి పూజిస్తారు. వారి పేరు శివుడు. ఆత్మలైన మీరు ఇక్కడకు వచ్చి శరీర ధారణ చేసినప్పుడు మీకు పేరు పెడ్తారు. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. ఆత్మ ఒక శరీరమును వదిలి మరొకటి తీసుకుంటుంది. 84 జన్మలు కావాలి కదా. 84 లక్షలు కాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ ప్రపంచమే సత్యయుగములో కొత్తదిగా ఉండేది. ధర్మయుక్తముగా ఉండేది. ఈ ప్రపంచమే మళ్లీ అధర్మయుక్తముగా అవుతుంది. అది సత్యఖండము. అక్కడ అందరూ సత్యము చెప్పేవారే ఉంటారు. భారతదేశమును సత్యఖండమని అంటారు. అసత్యఖండమే మళ్లీ సత్యఖండముగా అవుతుంది. సత్యమైన తండ్రియే వచ్చి సత్యఖండమును తయారు చేస్తారు. వారిని సత్యమైన చక్రవర్తి, సత్యము(ట్రూత్/ుతీబ్‌ష్ట్ర) అని అంటారు. ఇది అసత్య ఖండము. మానవులు చెప్పేదంతా అసత్యము. దేవతలు తెలివిగలవారు. తెలివిగలవారు, తెలివిహీనులు అని అంటారు కదా! తెలివిగలవారుగా ఎవరు చేస్తారు? తెలివిహీనులుగా ఎవరు చేస్తారు? ఇది కూడా తండ్రే అర్థం చేయిస్తున్నారు. తెలివిగలవారు సర్వగుణ సంపన్నులు. వారిని తయారు చేసేవారు తండ్రి. వారే స్వయంగా వచ్చి తమ పరిచయమునిస్తున్నారు. ఆత్మలైన మీరు ఇక్కడకు వచ్చి శరీరములో ప్రవేశించి పాత్ర ఎలా చేస్తున్నారో అలా నేను కూడా ఒక్కసారి మాత్రమే ఇతనిలో ప్రవేశిస్తాను. వారొక్కరే అని, వారినే సర్వశక్తివంతులని అంటారని మీకు తెలుసు. సర్వశక్తివంతులనదగిన మానవులెవ్వరూ లేరు. లక్ష్మీనారాయణులను కూడా అలా అనరు. ఎందుకంటే వారికి కూడా శక్తినిచ్చేవారు వేరొకరున్నారు. పతిత మనుష్యులలో శక్తి ఉండదు. ఆత్మలో ఉన్న శక్తి నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అనగా ఆత్మలో గల సతోప్రధాన శక్తి, తమోప్రధాన శక్తిగా మారుతుంది. ఎలాగైతే పెట్రోలు అయిపోతే కారు నిలబడిపోతుందో అలా నిలిచిపోతుంది. ఈ బ్యాటరీ మాటిమాటికి డిస్‌ఛార్జ్ అవ్వదు. అందుకు పూర్తి సమయము పడ్తుంది. కలియుగము అంతిమ సమయములో బ్యాటరీ చల్లబడ్తుంది. ప్రారంభంలో సతోప్రధానంగా ఉండి విశ్వానికి అధికారులుగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానమైనందున శక్తి క్షీణించింది. శక్తి లేకుండా పోయింది. పైసాకు కొరగాకుండా (వర్త్ నాట్ ఏ పెనీ) అవుతారు. భారతదేశములో దేవీ దేవతా ధర్మమున్నప్పుడు సంపన్నంగా ఉండేవారు. ధర్మమునే శక్తి(రిలిజియన్ ఈజ్ మైట్) అని అంటారు. దేవతా ధర్మములో శక్తి ఉంది. దేవతలు విశ్వానికి అధికారులు. వారికి ఏ శక్తి ఉంది? యుద్ధము చేసే శక్తి కాదు. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి శక్తి లభిస్తుంది. శక్తి అంటే ఏమిటి?
తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! ఆత్మలైన మీరు సతోప్రధానంగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా ఉన్నారు. విశ్వరాజ్యాధికారులుగా ఉండే మీరు విశ్వానికి బానిసలుగా అయ్యారు. పంచ వికారాల రూపములో రావణుడు మీ శక్తినంతా లాక్కున్నాడు. అందువలన భారతీయులు పూర్తిగా నిరుపేదలుగా అయ్యారు. సైన్సువారికి చాలా శక్తి ఉందని భావించకండి. అది శక్తి కాదు. ఇది ఆత్మిక శక్తి. సర్వశక్తివంతులైన తండ్రితో యోగము జోడించినందున శక్తి లభిస్తుంది. ఇప్పుడు సైన్సు(విజ్ఞానము), సైలెన్సు(శాంతి)కు మధ్య యుద్ధమున్నట్లుంది. మీకు సైలెన్స్ ద్వారా బలము లభిస్తుంది. సైలెన్స్ బలము ద్వారా మీరు సైలెన్సు ప్రపంచానికి వెళ్లిపోతారు. తండ్రిని స్మృతి చేసి స్వయాన్ని శరీరము నుండి వేరు చేసుకుంటున్నారు. భక్తిమార్గములో భగవంతుని వద్దకు వెళ్లేందుకు మీరు చాలా తలలు బాదుకున్నారు(కష్టపడ్డారు). కానీ సర్వవ్యాపి అని అనుకున్నందున మార్గము ఏ మాత్రమూ లభించలేదు, తమోప్రధానమైపోయారు. ఇది చదువు. చదువును శక్తి అని అనరు. తండ్రి అంటున్నారు - మొదట మీరు పవిత్రంగా అవ్వండి. తర్వాత సృష్టిచక్రము ఎలా తిరుగుతూ ఉందో, దాని జ్ఞానమంతా తెలుసుకోండి. జ్ఞానసాగరులు తండ్రి ఒక్కరు మాత్రమే. ఇందులో శక్తి మాటే లేదు. సృష్టి చక్రము ఎలా తిరుగుతూ ఉందో పిల్లలకు తెలియదు. మీరు పాత్రధారులు, నటులు కదా. ఇది అనంతమైన(బేహద్) డ్రామా. మనుష్యులు చేసే డ్రామాలో పాత్రధారులు మారిపోవచ్చు. ఇప్పుడు సినిమాలు తయారయ్యాయి. సినిమాను ఉదహరించి అర్థం చేయించేందుకు తండ్రికి కూడా చాలా సులభము. ఆ సినిమా చిన్నది. ఇది చాలా పెద్ద సినిమా. నాటకములో పాత్రధారులను మొదలైన వాటిని మార్పు చేయవచ్చు. కానీ ఇది అనాది డ్రామా. ఒక్కసారి షూటింగ్(చిత్రీకరణ) జరిగిపోయింది. ఇప్పుడు ఎంత మాత్రము మార్పు చేయలేరు. ఈ ప్రపంచము ఒక అనంతమైన సినిమా. శక్తి మాటే లేదు. అంబా దేవిని శక్తి అని అంటారు. కానీ ఆమెకు పేరేమో ఉంది. అయితే ఆమెను అంబ అని ఎందుకు అంటారు? ఏ కార్యము నిర్వర్తించి వెళ్లారు? అత్యంత శ్రేష్ఠమైనవారు అంబ మరియు లక్ష్మీ అని ఇప్పుడు మీకు తెలుసు. అంబనే తర్వాత లక్ష్మీగా అవుతుంది. ఇది కూడా పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. మీరు జ్ఞాన సంపన్నంగా అవుతారు. అంతేకాక మీకు పవిత్రతను కూడా నేర్పిస్తారు. ఆ పవిత్రత అర్ధకల్పము కొనసాగుతుంది. మళ్లీ ఆ తండ్రే వచ్చి పవిత్రతకు దారి చూపిస్తారు. వారిని పిలిచేది కూడా ఇప్పుడే - మీరు వచ్చి మార్గము చూపండి, మార్గదర్శకులు(గైడ్)గా కూడా అవ్వండి అని పిలుస్తారు. వారు పరమ ఆత్మ. సుప్రీమ్(అత్యంత శ్రేష్ఠమైన) చదువు ద్వారా ఆత్మ కూడా సుప్రీమ్‌గా అవుతుంది. సుప్రీమ్ అని పవిత్రంగా ఉన్నవారిని అంటారు. ఇప్పుడు మీరు పతితులుగా ఉన్నారు. తండ్రి ఏమో సదా పవిత్రులు. వ్యతాసము ఉంది కదా! సదా పవిత్రులైన ఆ తండ్రియే వచ్చి అందరికీ వారసత్వమునిచ్చి నేర్పిస్తారు. వారు స్వయంగా వచ్చి నేను మీ తండ్రిని అని అంటున్నారు. నాకు రథము కావాలి. రథము లేకుంటే ఆత్మ ఎలా మాట్లాడ్తుంది? రథము ప్రసిద్ధి గాంచింది. భాగ్యశాలి రథమని గాయనము చేస్తారు. భాగ్యశాలి రథము మనుష్య రథము. గుర్రపు బండి కానే కాదు. మనుష్యులకు అర్థం చేయించాలంటే మానవ రథమే కావాలి. వారు గుర్రపు బండిలో కూర్చున్నట్లు చూపించారు. భాగ్యశాలి రథమని మనిషిని అంటారు. ఇక్కడ కొన్ని జంతువులకు చాలా మంచి సేవ జరుగుతూ ఉంది. మనుష్యులకు కూడా అంత సేవ జరగదు. కుక్కలను ఎంతగానో ప్రేమిస్తున్నారు. గుఱ్ఱాలను, ఆవులను కూడా చాలా ప్రేమిస్తున్నారు. కుక్కల ఎగ్జిబిషన్‌లు కూడా జరుగుతూ ఉంటాయి. ఇటువంటివి అక్కడ(సత్యయుగములో) ఉండవు. లక్ష్మీనారాయణులు కుక్కలను పెంచుకుంటారా? ఈ సమయంలో మానవులంతా తమోప్రధాన బుద్ధి కలిగి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. వారిని సతోప్రధానంగా చేయాలి. అక్కడ గల గుఱ్ఱాలు మొదలైన వాటికి మానవులు సేవ చేసే అవసరముండదు. మీ పరిస్థితి ఎలా తయారయ్యిందో గమనించండి. రావణుడు మిమ్ములను ఇలా తయారు చేశాడు. అతను మీ శత్రువు. కానీ ఈ శత్రువు ఎప్పుడు జన్మిస్తాడో మీకు తెలియదు. శివుని జన్మ గురించి కూడా తెలియదు. అలాగే రావణుని జన్మ గురించి కూడా తెలియదు. త్రేతా యుగము అంత్యము, ద్వాపర యుగము ఆదిలో రావణుడు వస్తాడని తండ్రి చెప్తున్నారు. అతనికి 10 తలలు ఎందుకు చూపించారు? ప్రతి సంవత్సరము ఎందుకు తగులబెడ్తున్నారు? ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు మానవుల నుండి దేవతలుగా అయ్యేందుకు చదువుతున్నారు. చదవనివారు దేవతలుగా అవ్వలేరు. వారు మళ్లీ రావణ రాజ్యము ప్రారంభమైన తర్వాత వస్తారు. మనము దేవతా ధర్మానికి చెందినవారమని, ఇప్పుడు మళ్లీ ఆ ధర్మ స్థాపన జరుగుతోందని మీకు తెలుసు. తండ్రి అంటున్నారు - నేను ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి మిమ్ములను ఇదే విధంగా చదివిస్తాను. ప్రస్తుతం ఈ సృష్టి వృక్షమంతా పాతదైపోయింది. క్రొత్తదిగా ఉన్నప్పుడు ఒకే దేవీ దేవతా ధర్మముండేది. తర్వాత నెమ్మది-నెమ్మదిగా దిగజారిపోతూ వచ్చారు. ఆ తండ్రి మీకు 84 జన్మల లెక్కాచారమంతా అర్థం చేయిస్తున్నారు. వారు జ్ఞానసాగరులు కదా. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సైలెన్స్ బలమును(శాంతి శక్తిని) జమ చేసుకోండి. సైలెన్స్ బలముతో సైలెన్స్ ప్రపంచానికి వెళ్లాలి. తండ్రి స్మృతి ద్వారా శక్తి తీసుకొని బానిసత్వము(అధీనత) నుండి విడుదల అవ్వాలి. అధికారులుగా అవ్వాలి.
2. సుప్రీమ్ చదువును చదువుకొని ఆత్మను శ్రేష్ఠంగా చేసుకోవాలి. పవిత్రతా మార్గములో నడిచి, పవిత్రంగా అయ్యి ఇతరులకు మార్గమును చూపించాలి, మార్గదర్శకులుగా అవ్వాలి.
వరదానము :- '' విఘ్నాలను కలిగించే ఆత్మలను శిక్షకులుగా భావించి వారి ద్వారా పాఠాన్ని చదివే అనుభవీమూర్త్ భవ ''
ఏ ఆత్మలైతే విఘ్నాలను కలిగించేందుకు నిమిత్తంగా అవుతారో వారిని విఘ్నకారి ఆత్మలుగా చూడకండి, వారిని సదా పాఠాలను చదివించే ఆత్మలుగా, ముందుకు తీసుకెళ్లేందుకు నిమిత్త ఆత్మలుగా భావించండి. అనుభవీలుగా చేసే శిక్షకులుగా భావించండి. నిందించేవారు మిత్రులని భావించినప్పుడు వారు విఘ్నాలను దాటించి అనుభవీలుగా చేసే శిక్షకులుగా అవుతారు. అందువలన విఘ్నకారి ఆత్మలను ఆ దృష్టితో చూచేందుకు బదులు సదా కొరకు విఘ్నాల నుండి దాటించేందుకు నిమిత్తులని, అచలంగా చేసేందుకు నిమిత్తులని భావించండి. దీని ద్వారా ఇంకా అనుభవాల అథారిటి వృద్ధి చెందుతూ ఉంటుంది.
స్లోగన్ :- '' ఫిర్యాదుల ఫైలును సమాప్తం చేసి ఫైన్‌గా, రిఫైన్‌గా (సంపూర్ణ పవిత్రంగా) అవ్వండి ''
No comments:
Post a Comment