29-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
''మధురమైన పిల్లలారా - లేస్తూ - కూర్చుంటూ బుద్ధిలో జ్ఞానము ఉప్పొంగి పోతూ ఉంటే అపారమైన ఖుషీ (సంతోషము)లో ఉంటారు ''
ప్రశ్న :- పిల్లలైన మీరు ఎవరి సాంగత్యము నుండి చాలా చాలా కాపాడుకోవాలి ?
జవాబు :- ఎవరి బుద్ధిలో తండి స్మృతి నిలువదో, బుద్ధి అటూ-ఇటూ తిరుగుతూ ఉంటుందో, ఇటువంటి వారి సాంగత్యము నుండి మీరు చాలా కాపాడుకోవాలి. వారిని స్పర్శించను కూడా స్పర్శించరాదు. ఎందుకంటే స్మృతిలో లేని వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు.
ప్రశ్న :- మనుష్యులకు పశ్చాత్తాపము ఎప్పుడు కలుగుతుంది ?
జవాబు :- వీరిని చదివించేవారు స్వయం భగవంతుడని తెలిసినప్పుడు వారి ముఖాలు వెలవెలపోతాయి (పాలిపోతాయి). అప్పుడు వారు మేము నిర్లక్ష్యము చేశాము, చదువుకోలేదే అని పశ్చాత్తాపపడ్తారు.
ఓంశాంతి. ఆత్మికయాత్రను గురించి పిల్లలకిప్పుడు బాగా అర్థమయింది. ఏ హఠయోగములోనూ యాత్ర ఉండదు. దీనిని స్మృతి అని అంటారు. స్మృతి చేసేందుకు ఏ కష్టమూ లేదు. తండిన్రి స్మృతి చేయడంలో ఏ కష్టమూ లేదు. ఇది తరగతి. అందువలన కేవలం నియమానుసారం కూర్చోవాలి. మీరు తండ్రికి పిల్లలుగా అయ్యారు. పిల్లల పాలన జరుగుతూ ఉంది. ఎటువంటి పాలన ? అవినాశి జ్ఞాన రత్నాల ఖజానా లభిస్తూ ఉంది. తండ్రిని స్మృతి చేయడంలో ఏ కష్టమూ లేదు. కేవలం మాయ మీ బుద్ధి యోగాన్ని తుంచి వేస్తుంది. పోతే ఎలాగైనా కూర్చోండి, దానికి స్మృతితో ఎలాంటి సంబంధము లేదు. చాలామంది పిల్లలు హఠముతో 3-4 గంటలు కూడా కూర్చుంటారు. పూర్తి రాత్రి కూడా కూర్చుంటారు. ఇంతకుముందు మీకు భట్టీ ఉండేది. అది వేరే విషయము. అక్కడ మీకు ప్రవృత్తి వ్యాపార వ్యవహారాలు ఉండేవి కావు. అందువలన ఇది నేర్పించేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీరు గృహస్థ
వ్యవహారములో ఉండండి. వృత్తి వ్యాపారాదులు కూడా భలే చేసుకోండి. ఏ పని చేస్తున్నా తండ్రిని స్మృతి చేయాలి. అలాగని ఇప్పుడు మీరు నిరంతరము స్మృతి చేయగలరని కాదు. ఈ స్థితి వచ్చేందుకు సమయము పడ్తుంది. నిరంతరము స్మృతి ఉంటే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. తండి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, డ్రామా ప్లాను అనుసారము ఇప్పుడు కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది. లెక్కాచారమంతా బుద్ధిలో ఉంటుంది. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము భారతదేశము మాత్రమే ఉండేదని, అది స్వర్గమనబడేదని అంటారు. ఇప్పుడు 2 వేల సంవత్సరాలు పూర్తి కావచ్చింది. అంతా కలిస్తే 5 వేల సంవత్సరాల లెక్క పూర్తవుతుంది.
మీ కీర్తి ప్రతిష్ఠలు విదేశాల నుండే ప్రఖ్యాతమౌతాయి. ఎందుకంటే వారి బుద్ధి భారతీయుల కంటే చురుకైనది. భారతదేశము నుండి వారు శాంతిని కూడా కోరుతారు. భారతీయులే లక్షల సంవత్సరాలని అంటూ సర్వవ్యాపి జ్ఞానమునిచ్చి బుద్ధిని చెడగొట్టారు, తమోప్రధానమైపోయారు. వారు ఇంత తమోప్రధానంగా అవ్వలేదు. వారి బుద్ధి చాలా చురుకైనది. భారతీయుల నుండి వారు చాలా నేర్చుకుంటారు. వారి నుండి ఎప్పుడు శబ్ధము వ్యాపిస్తుందో అప్పుడు భారతీయులు మేల్కొంటారు. ఎందుకంటే భారతీయులు పూర్తిగా గాఢనిద్రలో నిద్రించి ఉన్నారు. వారు కొద్దిగా మాత్రమే నిద్రించి ఉన్నారు. వారి ద్వారా శబ్ధము బాగా వెలువడ్తుంది. విదేశాల నుండి కూడా ఇక్కడకు వచ్చి శాంతి ఎలా లభిస్తుందో ఎవరైనా చెప్పగలరా? అని అడిగారు. ఎందుకంటే తండ్రి కూడా భారతదేశములోనే వస్తారు. ఈ ప్రపంచములో శాంతి ఎప్పుడు, ఎలా వ్యాపిస్తుందో పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేయించగలరు. స్వర్గము లేక ప్యారడైజ్ లేక హెవెన్ ఉండేదని పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచములో భారతదేశము స్వర్గంగా ఉండేది. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు.
ఈశ్వరుడు సర్వవ్యాపి అని, కల్పమంటే లక్షల సంవత్సరాలని మానవుల బుద్ధిలో గట్టిగా కూర్చుండిపోయింది. ప్రపంచమంతటిలో ఎక్కువగా రాతి బుద్ధి గలవారు భారతీయులే. ఈ గీతాశాస్త్రము మొదలైనవన్నీ భక్తిమార్గానికి చెందినవే. మళ్లీ ఇవన్నీ ఇదే విధంగా తయారౌతాయి. భలే డ్రామాను గురించి తెలుసు. అయినా తండ్రి పురుషార్థము చేయిస్తారు. వినాశము తప్పకుండా జరుగుతుందని పిల్లలైన మీకు తెలుసు. నూతన ప్రపంచ స్థాపన చేసేందుకే తండ్రి వస్తారు. ఇది సంతోషించే విషయము కదా. ఏదైనా పెద్ద పరీక్ష పాస్ అయితే లోపల సంతోషము కలుగుతుంది కదా. మనము ఇవన్నీ పాస్ అయ్యి,అక్కడకెళ్లి దేవతలుగా అవుతాము. ఇదంతా చదువు పై ఆధారపడి ఉంది.తండ్రి మనలను చదివించి ఇలా దేవతలుగా(లక్ష్మినారాయణులుగా) తప్పకుండా తయారు చేస్తారని మీకు తెలుసు. ప్యారడైజ్ - హెవెన్(స్వర్గము) ఉండేదని కూడా మీకు తెలుసు. పాపం ఈ మానవులంతా పూర్తిగా దిక్కు తెలియక భ్రమలో పడి ఉన్నారు. అనంతమైన తండ్రి వద్ద గల జ్ఞానాన్ని పిల్లలైన మీకు ఇస్తున్నారు. బాబా జ్ఞానసాగరులు, ఆనందసాగరులే కాక ఖజానాలు కూడా వారి వద్ద ఫుల్‌గా(సంపూర్ణముగా) ఉన్నాయని మీరు తండ్రిని మహిమ చేస్తారు. మిమ్ములను ఇంత గొప్ప ధనవంతులుగా ఎవరు చేస్తారు? ఇక్కడకు మీరెందుకు వచ్చారు? వారసత్వము పొందుకునేందుకు. ఎవరికైనా ఆరోగ్యము బాగుండి ధనము లేకుంటే ఏమవుతుంది! వైకుంఠములో మీ వద్ద ధనము చాలా ఉంటుంది. ఇక్కడ ఉన్న షాహుకార్లకు మా వద్ద ఇంత ధనముంది, ఈ ఫ్యాక్టరీలు మొదలైనవి ఉన్నాయని నషా ఉంటుంది. శరీరము వదిలినట్లైతే ఇవన్నీ సమాప్తమైపోతాయి. మనకు 21 జన్మలకు బాబా ఎంతో గొప్ప ఖజానా ఇస్తారని మీకు తెలుసు. తండ్రి స్వయంగా ఖజానాలకు అధికారిగా అవ్వరు. పిల్లలైన మిమ్ములను అధికారులుగా చేస్తారు. ఈ
విశ్వములో శాంతిని గాడ్‌ఫాదర్ తప్ప మరెవ్వరూ స్థాపించలేరని కూడా మీకు తెలుసు. అన్నింటికంటే ఫస్ట్‌క్లాస్ చిత్రాలు - ఈ త్రిమూర్తి, సృష్టి చక్రము. ఈ చక్రములోనే సంపూర్ణ జ్ఞానము నిండి ఉంది. మీ వద్ద ఇటువంటి అద్భుతమైన వస్తువేదైనా ఉంటే ఇందులో ఏదో రహస్యముందని వారు భావిస్తారు. కొంతమంది పిల్లలు చిన్న చిన్న చిత్రాలు తయారుచేస్తారు. అవి బాబాకు నచ్చవు. పెద్ద పెద్ద చిత్రాల ఉంచమని బాబా చెప్తూనే ఉన్నారు. అప్పుడు దూరము నుండే ఎవరైనా చదువుకొని అర్థము చేసుకుంటారు. మానవుల గమనము పెద్ద వస్తువుల పైకి వెళ్తుంది. ఈ చిత్రములో ఒకవైపు కలియుగము, మరొకవైపు సత్యయుగము స్పష్టంగా చూపించబడింది. పెద్ద - పెద్ద చిత్రాలుంటే మానవుల అటెన్షన్‌ను ఆకర్షిస్తుంది. యాత్రికులు కూడా చూస్తారు. బాగా అర్థము కూడా చేసుకుంటారు. క్రీస్తుకు 3 వేల సంవత్సరాల క్రితము స్వర్గము ఉండేదని కూడా తెలుసు. ఈ విధంగా బయటవారికి తెలియదు. 5 వేల సంవత్సరాల లెక్కాచారము మీరు స్పష్టంగా తెలిపేందుకు దూరము నుండే కనిపించి చదవగలిగేటంత పెద్ద చిత్రాన్ని తయారుచేయాలి. దాని ద్వారా ఈ
ప్రపంచము తప్పకుండా అంత్యమౌతుందని అర్థం చేసుకుంటారు. బాంబులేమో తయారవుతూనే ఉంటాయి. ప్రకృతి భీభత్సాలు కూడా జరుగుతాయి. వినాశనము పేరు వింటే మీకు లోపల చాలా సంతోషము కలగాలి. కానీ జ్ఞానమే లేకుంటే సంతోషము కూడా ఉండదు. దేహ సహితంగా సర్వమూ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మలైన మీరు తండ్రి అయిన నాతో యోగము చేయండి. ఇది శ్రమ చేసే విషయము. పావనంగా అయ్యి పావన ప్రపంచములోకి రావాలి. మనమే చక్రవర్తి పదవి పొందుతామని, మళ్లీ పోగొట్టుకుంటామని మీకు తెలుసు. ఇది చాలా సులభము. లేస్తూ - కూర్చుంటూ, నడుస్తూ బుద్ధిలో జ్ఞానము మెదులుతూ ఉండాలి. బాబా వద్ద జ్ఞానమెలా ఉందో అలా మీ వద్ద ఏం చేస్తున్నా ఈ జ్ఞానము మెదులుతూ ఉండాలి. చదివించి దేవతలుగా చేసేందుకే బాబా వచ్చారు. కనుక పిల్లలకు ఇంత అపారమైన సంతోషము ఉండాలి. నాకు ఇంత సంతోషముందా? అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. తండ్రిని అంత బాగా స్మృతి చేస్తున్నారా? చక్ర జ్ఞానమంతా బుద్ధిలో ఉంటే ఎంత ఖుషీ ఉండాలి. నన్ను స్మృతి చేసి పూర్తిగా సంతోషములో ఉండండి అని తండ్రి చెప్తున్నారు. మిమ్ములను చదివించేవారెవరో గమనించండి. ఇది అందరికీ తెలిస్తే అందరి ముఖాలు పాలిపోతాయి. కానీ వారు తెలుసుకునేందుకు ఇంకా కొంత సమయముంది. దేవతా ధర్మానికి చెందినవారు అంత సంఖ్యలో ఇంకా తయారవ్వలేదు. పూర్తి రాజ్యస్థాపన ఇంకా జరగలేదు. తండ్రి సందేశాన్ని ఎంతమంది మనుష్యులకు ఇవ్వాలి? అనంతమైన తండ్రి మళ్లీ మాకు స్వర్గ చక్రవర్తి పదవిని ఇస్తున్నారు. మీరు కూడా ఆ తండ్రిని స్మృతి చేయండి అని అందరికి చెప్పండి. అనంతమైన తండ్రి అనంతమైన సుఖమును తప్పకుండా ఇస్తారు కదా. పిల్లలలో అపారమైన జ్ఞానయుక్త సంతోషముండాలి. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంత పావనమౌతూ ఉంటారు.
డ్రామా ప్లాను అనుసారము పిల్లలైన మీరు సేవ ఎంత బాగా చేసి ప్రజలను తయారు చేసుకుంటారో వారికి ఎంత కళ్యాణము జరుగుతుందో అంత వారి నుండి మీకు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. పేదల సేవ చేస్తారు. ఆహ్వానిస్తూ పిలుస్తూ ఉండండి. రైలులో కూడా మీరు చాలా సేవ చేయవచ్చు. చిన్న బ్యాడ్జిలోనే ఎంతో జ్ఞానము ఇమిడి ఉంది. చదువు సారమంతా ఇందులో ఇమిడి ఉంది. మంచి-మంచి బ్యాడ్జిలు చాలా తయారు చేయాలి. ఇతరులకు కానుకగా కూడా ఇవ్వగలగాలి. ఇతరులకు అర్థం చేయించడం కూడా చాలా సులభము. కేవలం శివబాబాను స్మృతి చేయండి. శివబాబా నుండే వారసత్వము లభిస్తుంది. అలాంటప్పుడు తండ్రిని, తండ్రి ఇచ్చే వారసత్వమైన స్వర్గ చక్రవర్తి పదవిని, కృష్ణపురమును స్మృతి చేయండి. మానవుల మతములన్నీ చాలా తికమకగా ఉన్నాయి. కొద్దిగా కూడా అర్థము చేసుకోరు. వికారాల కొరకు ఎంతో విసిగిస్తారు. కామ వికారము కొరకు ఎంతో పడి చస్తున్నారు. ఏ మాటనూ అర్థము చేసుకోరు. మానవులందరి బుద్ధి పూర్తిగా నశించింది. తండ్రిని గురించి తెలియనే తెలియదు. ఇది కూడా డ్రామాలో నిర్ణియించబడి ఉంది. అందరి బుద్ధి పూర్తిగా ఖాళీ అయిపోయింది. తండ్రి అంటున్నారు - పిల్లలూ, మీరు పవిత్రంగా ఉంటే స్వర్గానికి ఇటువంటి అధికారులుగా అయిపోతారు. కానీ అర్థము చేసుకోవడం లేదు. ఆత్మలోని శక్తి అంతా ఖాళీ అయిపోయింది. ఎంతగానో అర్థం చేయిస్తున్నారు. అయినా పురుషార్థము చేయాలి, చేయించాలి. పురుషార్థములో అలసిపోరాదు, హార్ట్‌ఫెయిల్ అవ్వరాదు. ఎంతో శ్రమ చేశాము, ఎంతో బాగా ఉపన్యసించాము. ఒక్కరు కూడా తయారవ్వలేదని నిరుత్సాహ పడరాదు. మీరేం వినిపించారో, దానిని ఎవరు విన్నారో వారి పై దాని ప్రభావము తప్పకుండా పడ్తుంది. చివర్లో అందరూ తప్పకుండా తెలుసుకుంటారు. బి.కెల మహిమ అనంతంగా, అపారంగా వెలువడ్తుంది. కానీ పని చూస్తే చాలా తెలివితక్కువ పని చేశామనిపిస్తుంది, గౌరవమే లేదు. పూర్తిగా తెలుసుకోనే లేదు. పరిచయమే లేదు. బుద్ధి బయట తిరుగుతూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేస్తే సహాయము కూడా లభిస్తుంది. తండ్రిని స్మృతి చెయ్యరు అనగా వారు పతితులు. మీరు పావనంగా అవుతారు. ఎవరు తండ్రిని స్మృతి చేయరో వారి బుద్ధి తప్పకుండా ఎక్కడో భ్రమిస్తూ ఉంటుంది. కనుక వారిని స్పర్శించను కూడా స్పర్శించరాదు. ఎందుకంటే స్మృతిలో లేనందున వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. పవిత్రులు, అపవిత్రులు కలిసి ఉండలేరు. అందుకే తండ్రి పాత సృష్టిని సమాప్తం చేస్తారు. పోను పోను నియమాలు కఠినమౌతూ పోతాయి. తండ్రిని స్మృతి చేయకుంటే లాభానికి బదులు ఇంకా నష్టపోతారు. పవిత్రతకు ఆధారమంతా స్మృతి. ఒక్కచోట కూర్చునే అవసరమే లేదు. ఇక్కడ కలిసి కూర్చోవడం కంటే కొండ పైకి వెళ్లి వేరు వేరుగా కూర్చోవడం మంచిది. ఎవరు స్మృతి చేయరో వారు పతితులు. వారితో స్నేహము కూడా చేయరాదు. నడవడికలోనే తెలిసిపోతుంది. స్మృతి చేయకుంటే పావనంగా అవ్వలేరు. ప్రతి ఒక్కరి పై జన్మ-జన్మాంతరాల పాప భారము చాలా ఉంది. స్మృతియాత్ర చేయకుంటే పాప భారము ఎలా తొలగిపోతుంది అనగా వారు పతితులే.
తండ్రి చెప్తున్నారు - పిల్లలైన మీ కొరకు మొత్తం పతిత ప్రపంచాన్నంతా సమాప్తం చేస్తాను. వారి సాంగత్యమే ఉండరాదు. ఎవరి సాంగత్యములో ఉండాలి అన్న బుద్ధి కూడా లేదు. పవిత్రులైన మీ ప్రేమ పవిత్రులతోనే ఉండాలి. దీనికి కూడా బుద్ధి కావాలి కదా. మధురమైన తండ్రి, మధురమైన రాజధాని తప్ప ఇతరులెవ్వరూ స్మృతిలోకి రాకూడదు. ఇంత త్యాగము చేయడం పిన్నమ్మ ఇల్లేమీ కాదు (సులభము కాదు). తండ్రికి పిల్లల పై అపారమైన ప్రేమ ఉంది.పిల్లలూ! మీరు పావనంగా అయితే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు. నేను మీ కొరకు పావన ప్రపచాన్ని స్థాపన చేస్తాను. ఈ పతిత ప్రపంచాన్ని పూర్తిగా సమాప్తము చేసేస్తాను. ఈ పతిత ప్రపంచములోని ప్రతి వస్తువు మీకు దు:ఖమే కలుగజేస్తుంది. మీ ఆయువు కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇది పైసకు కూడా కొరగానిదని అంటారు. గవ్వకు, వజ్రానికి తేడా ఉంది కదా. అందువలన పిల్లలైన మీకు ఎంత ఖుషీ ఉండాలి! సత్యంగా ఉన్నవారు నాట్యము చేస్తూ ఉంటారనే గాయనము కూడా ఉంది(సచ్ తో బిటో నచ్). మీరు సత్యయుగములో సంతోషంగా నాట్యము చేస్తారు. ఇక్కడ ఏ వస్తువునూ ప్రేమించండి. వీటిని చూస్తున్నా చూడనట్లుండాలి. కనులు తెరుచుకొని ఉన్నా నిదురించినట్లు ఉండాలి. కానీ ఆ ధైర్యము, ఆ స్థితి కావాలి. ఈ పాత పప్రంచము ఉండనే ఉండదనడం నిశ్చితము. సంతోషపు పాదరస మీటరు ఎంతో పైకి ఎక్కి ఉండాలి. శివబాబాను స్మృతి చేస్తే మాకు ఈ విశ్వ చకవ్రర్తి పదవి లభిస్తుందని సంతోషముతో చిటికెలు వేయాలి. హఠయోగముతో అట్లే కూర్చోరాదు. తింటూ, తిరుగుతూ, పని చేస్తూ తండ్రిని స్మృతి చేయండి. రాజధాని స్థాపనౌతూ ఉందని కూడా మీకు తెలుసు. తండ్రి దాసీలుగా అవ్వమని చెప్పరు. పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థము చేయమంటారు. తండ్రి పావనంగా అయ్యేందుకు పురుషార్థము చేయిస్తారు. మీరు మళ్లీ పతితమౌతారు. ఎన్నో అసత్యాలు చెప్తారు, ఎంతో పాపము చేస్తారు. సదా శివబాబాను
స్మృతి చేస్తే పాపాలన్నీ స్వాహా అయిపోతాయి. ఇది బాబా యజ్ఞము కదా, చాలా గొప్ప యజ్ఞము. వారు లక్షల రూపాయల ఖర్చుతో యజ్ఞము చేస్తారు. ఈ యజ్ఞములో ప్రపంచమంతా స్వాహా అవుతుందని మీకు తెలుసు. వెలుపలి నుండి శబ్ధము వ్యాపిస్తుంది. భారతదేశంలో కూడా వ్యాపిస్తుంది. మొదటిది తండ్రితో బుద్ధి యోగముంటే పాపాలు నశిస్తాయి. ఉన్నత పదవి కూడా లభిస్తుంది. పిల్లలతో పురుషార్థము చేయించడం తండ్రి కర్తవ్యము. లౌకిక తండ్రి పిల్లల సేవ చేస్తారు. పిల్లలతో సేవ కూడా చేయించుకుంటారు. ఈ తండ్రి చెప్తున్నారు - నేను మీకు 21 జన్మల వారసత్వమును ఇస్తాను. అటువంటి తండ్రిని తప్పకుండా స్మృతి చేయాలి. స్మృతి ద్వారా మీ పాపాలు తొలగిపోతాయి. పోతే నీటితో పాపాలు నశించవు. నీరు ఎక్కడైనా లభిస్తుంది. విదేశాలలో కూడా నదులున్నాయి. ఇక్కడి నదులు పావనంగా చేసి, అక్కడి నదులు పతితులుగా చేస్తాయా! మానవులకే మాత్రము తెలియదు. తండ్రికి జాలి కలుగుతుంది కదా. తండి అర్థం చేయిస్తున్నారు - ''పిల్లలూ నిర్లక్ష్యము చేయకండి. తండి ఇంత పవితమ్రైన పుష్పాలుగా చేస్తూ ఉంటే శమ్ర చేయాలి కదా. మీ పై మీరే దయ చూపుకోండి.'' అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇక్కడ ఉన్న ఏ వస్తువుల పైనా మనస్సు ఉంచరాదు. చూస్తున్నా చూడనట్లే ఉండాలి. కనులు తెరిచి ఉన్నా నిద్ర మత్తు ఉన్నట్లు సంతోషపు నషా పెరిగి ఉండాలి.
2. అంతా పవిత్రత పై ఆధారపడి ఉంది. పతితులను కనీసము స్పర్శించను కూడా స్పర్శించకుండా స్వయాన్ని సంభాళించుకోవాలి. మధురమైన తండ్రి మధురమైన రాజధాని తప్ప ఇతరమేదియు గుర్తు రాకూడదు.
వరదానము :- '' సేవ ద్వారా మేవాను (బలమైన ఆహారము) ప్రాప్తి చేసుకునే సర్వ హద్దు కోరికలకు అతీతంగా సదా సంపన్నం మరియు సమాన్ భవ ''
సేవ అంటే అర్థము మేవా ఇచ్చేది. ఒకవేళ ఏదైనా సేవ అసంతుష్టంగా చేసిందంటే, అది సేవ కాదు. అటువంటి సేవను భలే వదిలేయండి, కానీ సంతుష్టతను వదలకండి. ఎలాగైతే శారీరికంగా తృప్తిగా ఉండేవారు సదా సంతుష్టంగా ఉంటారో అలా మానసిక తృప్తి గలవారు కూడా సంతుష్టంగా ఉంటారు. తృప్తికి గుర్తు సంతుష్టత. తృప్తిగా ఉన్న ఆత్మలో ఎలాంటి హద్దు కోరిక, గౌరవం, కీర్తి, పరిష్కారము, సాధనాల ఆకలి ఉండదు. వారు హద్దులోని అన్ని కోరికలకు అతీతంగా సంపన్నంగా, సమానంగా ఉంటారు.
స్లోగన్ :- '' సత్యమైన హృదయం ద్వారా నిస్వార్థమైన సేవలో ముందుకు వెళ్లడం అనగా పుణ్య ఖాతా జమ అవ్వడం ''
No comments:
Post a Comment