Sunday, October 27, 2019

Telugu Murli 28/10/2019

28-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - విశ్వ రాజ్యమును బాహుబలముతో తీసుకోలేరు, దాని కొరకు యోగబలము కావాలి. ఇది కూడా ఒక నియమము ''

ప్రశ్న :- శివబాబా తమలో తాము ఏ విషయములో ఆశ్చర్యపడ్తారు ?
జవాబు :- బాబా చెప్తున్నారు - ఎంత ఆశ్చర్యమో చూడండి నేను మిమ్ములను చదివిస్తున్నాను. కాని నేను ఎవ్వరి వద్ద ఎప్పుడూ చదువుకోలేదు. నాకు ఎవ్వరూ తండ్రి లేరు, టీచరు కూడా లేరు, గురువు కూడా లేరు. నేను సృష్టి చక్రములో పునర్జన్మ తీసుకోను. అయినా మీకు అన్ని జన్మల కథను వినిపిస్తాను. స్వయం 84 జన్మల చక్రములో రాను కాని చక్ర జ్ఞానమును చాలా ఖచ్చితంగా ఇస్తాను.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి పిల్లలైన మిమ్ములను స్వదర్శన చక్రధారులుగా చేస్తారు అనగా మీరు ఈ 84 జన్మల చక్రమును తెలుసుకుంటారు.
ఇంతకుముందు తెలియదు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు. 84 జన్మల చక్రములో మీరు తప్పనిసరిగా వస్తారు. పిల్లలైన మీకు 84 జన్మల చక్ర జ్ఞానమునిస్తాను. నేను స్వదర్శన చక్ర ధారిని కానీ పాక్ట్రికల్‌గా 84 జన్మల చక్రములోకి రాను. అందువలన దీని ద్వారా శివబాబాలో మొత్తం జ్ఞానమంతా ఉందని మీరు అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణులైన మనము ఇప్పుడు స్వదర్శన చక్రధారులుగా అవుతామని మీకు తెలుసు. బాబా అలా తయారవ్వరు. కానీ వారిలో ఈ అనుభవము ఎలా వచ్చింది? మనకైతే అనుభవము ప్రాప్తిస్తుంది. మీకు వినిపించేందుకు బాబాకు అనుభవము ఎలా వస్తుంది? ప్రాక్టికల్‌ అనుభవము కావాలి కదా. నన్ను జ్ఞానసాగరుడని అంటారు కానీ నేను 84 జన్మల చక్రములో రాను. అయితే నాకు ఈ జ్ఞానము ఎలా వచ్చింది? చదివించే టీచరు తప్పకుండా స్వయం చదువుకొని ఉంటాడు కదా. శివబాబా ఇది ఎలా చదివారు? వారికి 84 జన్మల చక్రము ఎలా తెలిసింది? వారేమో చక్రములోకి రారు. తండ్రి బీజరూపులైనందు వలన వారికి తెలుసు. స్వయం 84 జన్మల చక్రములోకి రారు. కానీ మీకు అంతా అర్థం చేయిస్తారు. ఇది కూడా ఎంత అద్భుతము! అలాగని బాబా శాస్త్ర్రాలు మొదలైనవన్నీ చదివారని కాదు. డ్రామానుసారము మీకు వినిపించే జ్ఞానమంతా వారిలో ఇమిడి ఉందని చెప్పబడ్తుంది. అందువలన వారు అద్భుతమైన టీచరు కదా. ఆశ్చర్యపడాలి కదా. అందుకే వారికి గొప్ప-గొప్ప పేర్లు ఉంచారు. ఈశ్వరుడు, ప్రభవు, అంతర్యామి మొదలైనవి. ఈశ్వరునిలో ఈ జ్ఞానమంతా ఎలా నిండి ఉందని మీరు ఆశ్చర్యపడ్తారు. మీకు తెలిపే జ్ఞానమంతా వారికెలా వచ్చింది? వారికి జన్మనిచ్చిన తండ్రి గానీ, జ్ఞానము తెలిసినవారు గానీ ఎవ్వరూ లేరు. మీరందరూ సోదరులు(భాయీ-భాయీ). ఆ ఒక్కరే మీకు తండ్రి, వారు బీజరూపులు. కూర్చుని పిల్లలకు ఎంతో జ్ఞానమును వినిపిస్తారు. 84 జన్మలు నేను తీసుకోను. మీరు తీసుకుంటారని చెప్తున్నారు. అలాంటప్పుడు తప్పకుండా ప్రశ్న
తలెత్తుతుంది - బాబా మీకెలా తెలుసు? బాబా చెప్తున్నారు - పిల్లలూ, అనాది డ్రామానుసారము నాలో మొదటి నుండి ఈ జ్ఞానముంది. దానినే మీకు వినిపించి చదివిస్తున్నాను. అందుకే నన్ను అత్యంత ఉన్నతమైన భగవంతుడని అంటారు. స్వయం చక్రములో రారు కానీ వారిలో సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానమంతా ఉంది. కనుక పిల్లలైన మీకెంత ఖుషీ ఉండాలి. వారికి 84 జన్మల చక్ర జ్ఞానము ఎక్కడ నుండి లభించింది? మీకైతే తండ్రి ద్వారా లభించింది. తండ్రిలో ఒరిజినల్‌ జ్ఞానముంది. వారిని జ్ఞానసాగరులని అంటారు. ఎవరి వద్దా చదువుకోలేదు కూడా. కనుక వారికి ఒరిజినల్‌గానే తెలుసు. అందుకే వారిని జ్ఞానసాగరులని అంటారు. ఇది అద్భుతము కదా. అందుకే ఇది అత్యంత ఉన్నతమైన చదువు అని గాయనము చేయబడ్తుంది. పిల్లలు తండ్రిని చూసి ఆశ్చర్యపడ్తారు. ఒకటేమో, వారిని జ్ఞానసాగరులని ఎందుకు అంటారో అర్థం చేసుకోవలసిన విషయము. రెండవది ఏ విషయము? మీరు ఈ చిత్రాలు
చూపించినప్పుడు మిమ్ములను ఎవరైనా ఇలా అడుగుతారు - బహ్మ్రలో కూడా తన ఆత్మ ఉంటుంది, నారాయణునిగా అయినప్పుడు వారిలో కూడా వారి ఆత్మ ఉంటుంది. రెండు ఆత్మలు కదా. ఒకటేమో బహ్మ్రది, రెండవది నారాయణునిది. కానీ ఆలోచిస్తే రెండు ఆత్మలు లేవు. ఆత్మ ఒక్కటే, రెండు ఆత్మలు లేవు. ఇది ఒక శ్యాంపుల్‌గా దేవతది చూపించారు. ఈ బహ్మ్రనే విష్ణువు అనగా నారాయణునిగా అవుతాడు - వీటినే రహస్యయుక్తమైన విషయాలని అంటారు. తండి చాలా నిగూఢమైన జ్ఞానము వినిపిస్తారు. ఈ విషయాలు తండి తప్ప ఇతరులెవ్వరూ చదివించలేరు. అందువలన బ్రహ్మ, విష్ణువులవి రెండు వేరు వేరు ఆత్మలు కాదు. అదే విధంగా సరస్వతి, లక్ష్మి వీరిద్దరికీ రెండు ఆత్మలా లేక ఒకే ఆత్మనా? ఆత్మ ఒక్కటే, శరీరాలు రెండు. ఈ సరస్వతియే తర్వాత లక్ష్మిగా అవుతుంది. అందుకే ఒకే ఆత్మగా లెక్కించబడ్తుంది. ఒక్క ఆత్మయే 84 జన్మలు తీసుకుంటుంది. ఇవి చాలా బాగా అర్థము చేసుకునే విషయాలు. బాహ్మ్రణులే దేవతలుగా, దేవతలే క్షత్రియులుగా అవుతారు. ఆత్మ ఒక శరీరమును వదిలి మరొకటి తీసుకుంటుంది. ఆత్మ ఒక్కటే. బ్రాహ్మణులే దేవతలుగా ఎలా అవుతారో, ఇది ఒక శ్యాంపుల్‌గా చూపించారు. '' హమ్‌ సో ''కు అర్థము ఎంతో బాగుంది. వీటినే నిగూఢమైన విషయాలని అంటారు. ఇందులో కూడా మొట్టమొదట మనమంతా ఒకే తండ్రికి పిల్లలమనే జ్ఞానము అవసరము. ఆత్మలన్నీ మొదట పరంధామములో ఉండేవి. ఇక్కడ పాత్ర చేసేందుకు వచ్చాయి. ఇది ఒక ఆట(డ్రామా). ఈ ఆటను గురించిన సమాచారాన్ని తండ్రి కూర్చుని వినిపిస్తారు. తండ్రికేమో ఒరిజినల్‌గా ఈ జ్ఞానము తెలుసు. వారికి ఎవ్వరూ నేర్పించలేదు. ఈ 84 జన్మల చక్రము వారికే తెలుసు. దానిని ఇప్పుడు ఈ సమయములో మీకు వినిపిస్తున్నారు. మళ్లీ మీరు మర్చిపోతారు. మళ్లీ వారి శాస్త్రాలు ఎలా తయారవుతాయి? తండ్రి అయితే ఏ శాస్త్ర్రాలూ చదవలేదు. మరి వారు వచ్చి కొత్త కొత్త విషయాలు వినిపిస్తున్నారు. అర్ధకల్పము భక్తిమార్గము. ఈ మాట కూడా శాస్త్రాలలో లేదు. ఈ శాస్త్రాలు కూడా డ్రామానుసారంగా భక్తిమార్గములో తయారయ్యాయి. మీ బుద్ధిలో ప్రారంభము నుండి చివరి వరకు ఈ డ్రామా గురించిన ఎంతో గొప్ప జ్ఞానముంది! వారు తప్పనిసరిగా మానవ శరీరమును ఆధారంగా తీసుకోవలసి వచ్చింది. శివబాబా ఈ బ్రహ్మ శరీరములో కూర్చుని ఈ సృష్టి చక్ర జ్ఞానమును వినిపిస్తారు. మానవులు ఎన్నో వ్యర్థ విషయాలు కల్పించి సృష్టి ఆయువునే ఎంతో పెంచేశారు. నూతన ప్రపంచమే మళ్లీ పాత ప్రపంచంగా అవుతుంది. నూతన ప్రపంచాన్ని స్వర్గమని, పాత ప్రపంచాన్ని నరకమని అంటారు. ఉన్న ప్రపంచమేమో ఒక్కటే. నూతన ప్రపంచములో నివసించేవారు దేవీ దేవతలు, అక్కడ అపారమైన సుఖముంది. సృష్టి అంతా నూతనంగా ఉంటుంది. ఇప్పుడు దీనిని పాతదని అంటారు. దీని పేరే ఇనుప యుగ ప్రపంచము. ఉదాహరణానికి పాత ఢిల్లి, కొత్త ఢిల్లీ అని అంటారు కదా. తండ్రి అర్థము చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, కొత్త ప్రపంచములో కొత్త ఢిల్లీ ఉంటుంది. ఈ పాత ప్రపంచములోనే కొత్త ఢిల్లీ అని ఇక్కడ అంటారు కానీ దీనిని కొత్తదని ఎలా అంటారు! తండ్రి అర్థం చేయిస్తున్నారు - నూతన ప్రపంచములో నూతన ఢిల్లీ ఉంటుంది. అందులో ఈ లక్ష్మీ నారాయణులు రాజ్య పాలన చేస్తారు. దానిని సత్యయుగమని అంటారు. మీరు ఈ మొత్తం భారతదేశము పై రాజ్య పాలన చేస్తారు. మీ సింహాసనము యమునా నది తీరములో ఉంటుంది. చివరి సమయములో రావణ రాజ్య సింహాసనము కూడా ఇక్కడే ఉంది. రామరాజ్య సింహాసనము కూడా ఇక్కడే ఉంటుంది. కానీ పేరు ఢిల్లీగా ఉండదు, దానిని ఫరిస్తాన్‌ అని అంటారు. ఆ తర్వాత రాజును బట్టి సింహాసనము పేరు కూడా మార్చుకుంటారు. ఇప్పుడు మీరందరూ పాత ప్రపంచములో ఉన్నారు. నూతన ప్రపంచములోకి వెళ్లేందుకు మీరు చదువుతున్నారు. మళ్లీ మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు, చదివించేవారు తండ్రి.అత్యంత ఉన్నతులైన తండ్రి క్రిందకు వచ్చి రాజయోగమును నేర్పించారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. ఈ పాత కలియుగ ప్రపంచము సమాప్తమవ్వనున్నది. తండ్రి దీని లెక్కాచారమంతా తెలిపించారు. నేను బ్రహ్మ శరీరములో వస్తాను. మనుష్యులకు బ్రహ్మ అనగా ఎవరో తెలియనే తెలియదు. వారు ప్రజాపిత బ్రహ్మ గురించి విన్నారు. మీరు బ్రహ్మకు ప్రజలు కదా. అందుకే స్వయాన్ని బి.కెలని పిలుచుకుంటారు. వాస్తవానికి మీరు నిరాకారులుగా ఉన్నప్పుడు శివబాబాకు పిల్లలు, శివ వంశీయులు. తర్వాత సాకారములో ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు - సోదర - సోదరీలు. ఇది తప్ప వేరే సంబంధమేదీ లేదు. ఇప్పుడు మీరు ఆ కలియుగ సంబంధాలను మర్చిపోతారు. ఎందుకంటే అందులో బంధనాలున్నాయి. మీరు నూతన ప్రపంచములోకి వెళ్తారు. బ్రాహ్మణులకు శిఖ(పిలక) ఉంటుంది. పిలక బ్రాహ్మణులకు గుర్తు. ఇది మీ బ్రాహ్మణ కులము. వారు
కలియుగములోని బ్రాహ్మణులు. తరచుగా బ్రాహ్మణులు పండాలుగా(మార్గదర్శకులుగా) ఉంటారు. ఒక రకమేమో భిక్షాటనతో జీవిస్తారు, రెండవ రకము వారు గీతను వినిపిస్తారు. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు ఈ గీతను వినిపిస్తారు. వారు కూడా గీతను వినిపిస్తారు, మీరు కూడా గీతను వినిపిస్తారు. వ్యత్యాసమెంత ఉందో గమనించండి. మీరేమో కృష్ణుడు భగవంతుడు కాదని, దేవత అని వారిలో దైవీ గుణాలున్నాయి, వారిని ఈ కనులతో చూడవచ్చని అంటారు. శివుని మందిరములో చూస్తే, శివునికి తన స్వంత శరీరము లేదు. వారు పరమ ఆత్మ అనగా పరమాత్మ. ఈశ్వరుడు, ప్రభువు, భగవంతుడు మొదలైన పదాలకు ఏ అర్థమూ ఉండదు. పరమాత్మయే సుప్రీమ్‌ ఆత్మ. మీరు సుప్రీమ్‌ కాదు. ఆత్మలైన మీకు, పరమాత్మ అయిన వారికి ఎంత వ్యత్యాసముందో చూడండి. ఆత్మలైన మీరు ఇప్పుడు పరమాత్మ నుండి నేర్చుకుంటున్నారు కానీ వారు ఎవరి వద్ద నేర్చుకోలేదు. వీరు తండ్రి కదా. ఆ పరమపిత పరమాత్మను మీరు తండ్రి అని కూడా అంటారు, టీచరు అని కూడా అంటారు, గురువు అని కూడా అంటారు. వారుండేది ఒక్కరే. ఏ ఇతర
ఆత్మలు కూడా తండ్రి, టీచరు, సద్గురువుగా అవ్వలేరు. పరమ ఆత్మ ఒక్కరే. వారినే సుప్రీమ్‌ అని అంటారు. ప్రతి ఒక్కరికి మొదట తండ్రి కావాలి, ఆ తర్వాత టీచరు, చివర్లో గురువు కావాలి. తండ్రి కూడా చెప్తున్నారు - నేను మీకు తండ్రిగా కూడా అవుతాను, తర్వాత టీచరుగా అవుతాను, ఆ తర్వాత నేనే మీ సద్గతిదాత అయిన సద్గురువుగా కూడా అవుతాను. సద్గతినిచ్చే గురువు ఒకే ఒక్కరు. ఇతర గురువులు అనేకమంది ఉన్నారు. తండ్రి చెప్తున్నారు - నేను మీ అందరికీ సద్గతినిస్తాను, మీరంతా సత్యయుగములోకి వెళ్తారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్లిపోతారు. దానిని పరంధామము అని అంటారు. సత్యయుగములో ఆదిసనాతన దేవీదేవతా ధర్మముండేది. ఇక ఏ ఇతర ధర్మము లేదు. మిగిలిన ఆత్మలంతా ముక్తిధామానికి వెళ్లిపోతారు.
సద్గతి అని సత్యయుగమును అంటారు. మీరే పాత్ర చేస్తూ చేస్తూ మళ్లీ దుర్గతిలోకి వచ్చేస్తారు. మీరే సద్గతి నుండి మళ్లీ దుర్గతిలోకి వచ్చేస్తారు. మీరే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. ఆ సమయంలో యథా రాజా రాణి తథా ప్రజలుగా ఉంటారు. మొదట 9 లక్షల మంది వస్తారు. ఈ 9 లక్షల మంది 84 జన్మలు తీసుకుంటారు కదా. తర్వాత ఇతరులు కూడా వస్తూ ఉంటారు, ఇది లెక్కించవచ్చు. తండ్రి ఈ లెక్కాచారాన్ని అర్థం చేయిస్తారు. అందరూ 84 జన్మలు తీసుకోరు. మొట్టమొదట వచ్చేవారే 84 జన్మలు తీసుకుంటారు. ఆ తర్వాత వచ్చేవారు తక్కువ-తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎక్కువలో ఎక్కువ 84 జన్మలు. ఈ విషయాలన్నీ ఏ ఇతర మానవులకు తెలియదు. తండ్రి ఒక్కరు మాత్రమే కూర్చుని అర్థం చేయిస్తారు. గీతలో భగవానువాచ అని
ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమును కృష్ణుడు రచించలేదని మీరిప్పుడు తెలుసుకున్నారు. దీనిని తండ్రియే స్థాపన చేస్తారు. కృష్ణుని ఆత్మ 84 జన్మల అంత్యములో ఈ జ్ఞానము విని మొదటి జన్మలో వచ్చింది. ఇవి అర్థము చేసుకునే విషయాలు. ప్రతి రోజూ చదవాలి. మీరు భగవంతుని విద్యార్థులు. భగవానువాచ కదా. నేను మిమ్ములను రాజాధి రాజులుగా చేస్తాను. ఇది పాత ప్రపంచము. నూతన ప్రపంచమంటే సత్యయుగము. ఇప్పుడిది కలియుగము. తండ్రి వచ్చి కలియుగపు పతితుల నుండి సత్యయుగ పావన దేవతలుగా చేస్తారు. అందుకే కలియుగములోని మానవులు ఆక్రందనలు చేస్తారు - ''ఓ తండ్రీ! మీరు వచ్చి మమ్ములను పావనంగా చేయండి, పతిత కలియుగమును పావన సత్యయుగంగా చేయండి.'' ఎంత తేడా ఉందో చూడండి. కలియుగములో అపార దు:ఖముంది. కొడుకు జన్మిస్తూనే సంతోషము, సుఖము కలుగుతుంది, రేపు మరణిస్తే దు:ఖపడ్తారు. జీవితమంతా ఎంతో దు:ఖపడ్తారు. ఇది దు:ఖ ప్రపంచము. ఇప్పుడు తండ్రి సుఖ ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు. మిమ్ములను స్వర్గవాసులైన దేవతలుగా చేస్తారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. ఉత్తమోత్తమ పురుషులుగా లేక స్త్రీలుగా అవుతారు. మీరు ఈ లక్ష్మీనారాయణులుగా అయ్యేందుకే వస్తారు. విద్యార్థికి టీచరుతో యోగముంటుంది. ఎందుకంటే వీరి ద్వారా మేము చదువుకొని ఫలానాగా అవుతామని భావిస్తారు. ఇక్కడ మీరు పరమపిత పరమాత్మ శివునితో యోగముంచుతారు. వారు మిమ్ములను దేవతలుగా చేస్తారు. సాలిగామ్రులైన పిల్లలూ, మీ తండిన్రైన నన్ను స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించి తండిన్రి స్మృతి చేయండి. వారే జ్ఞాన సాగరులు. తండ్రి మీకు సత్యమైన గీతను వినిపిస్తారు. కానీ స్వయం వారు చదవలేదు. వారు చెప్తున్నారు - నేను ఎవ్వరికీ పుత్రుడను కాదు, ఎవరి వద్దా నేను చదువుకోలేదు. నాకు గురువెవ్వరూ లేరు. కానీ నేను పిల్లలైన మీకు తండ్రి, టీచరు, గురువును. వారిని పరమ ఆత్మ అని అంటారు. వారికి ఈ మొత్తము సృష్టి ఆదిమధ్యాంతాలు తెలుసు. వారు వినిపించినంత వరకు మీరు దిమధ్యాంతాలను అర్థము చేసుకోలేరు. ఈ చక్రమును తెలుసుకున్నందున మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు. ఈ బాబా మిమ్ములను చదివించడం లేదు. ఇతనిలో శివబాబా ప్రవేశమై ఆత్మలను చదివిస్తున్నారు. ఇది నూతన విషయము కదా. ఇది సంగమ యుగములోనే జరుగుతుంది. పాత ప్రపంచము సమాప్తమైపోతుంది. కొంతమందిది మట్టిలో కలుస్తుంది, కొంతమందిది రాజులు తింటారు..... (కిస్‌కీ దబీ రహీ ధూల్‌ మే, కిస్‌కీ రాజా ఖాయే.........) పిల్లలకు చెప్తున్నారు - చాలామందికి కళ్యాణము చేసేందుకు మళ్లీ దేవతలుగా తయారు చేసేందుకు ఈ పాఠశాల, మ్యూజియం తెరవండి.
అక్కడకు చాలామంది వచ్చి సుఖ వారసత్వము పొందుతారు. ఇప్పుడిది రావణరాజ్యము కదా. రామరాజ్యములో అపారమైన సుఖముండేది. రావణ రాజ్యములో దు:ఖముంది. ఎందుకంటే అందరూ వికారులుగా అయిపోయారు. అది నిర్వికారి ప్రపంచము. ఈ లక్ష్మీనారాయణులకు కూడా పిల్లలు మొదలైనవారున్నారు కదా. కానీ అక్కడ యోగబలముంటుంది. తండ్రి మీకిప్పుడు యోగబలము నేర్పిస్తారు. యోగబలము ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. బాహుబలముతో ఎవ్వరూ విశ్వమంతటికి యజమానులుగా అవ్వలేరు. నియమము లేదు. పిల్లలైన మీరు స్మృతి బలముతో మొత్తం విశ్వానికి చకవ్రర్తి పదవి తీసుకుంటున్నారు. ఇది ఎంతో ఉన్నతమైన చదువు. తండి చెప్తున్నారు - మొట్టమొదట పవిత్రతా ప్రతిజ్ఞ చేయండి. పవితంగా అయితేనే మీరు పవిత పప్రంచానికి అధికారులుగా అవుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. కలియుగములోని సంబంధాలు ఏవైతే ఈ సమయములోని బంధనములుగా ఉన్నాయో వాటిని మర్చిపోయి స్వయాన్ని సంగమయుగ బ్రాహ్మణులుగా భావించాలి. సత్యమైన గీత వినాలి, వినిపించాలి.
2. పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. అందువలన మీ సర్వస్వమూ సఫలము చేసుకోవాలి. అనేకమంది కళ్యాణము కొరకు మానవులను దేవతలుగా చేసేందుకు ఈ పాఠశాలలు, మ్యూజియంలు తెరవాలి.

వరదానము :- '' దృఢ సంకల్పమనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబు యొక్క బురుజును వెలిగించే సదా విజయీ భవ ''
ఈ రోజుల్లో బురుజుతో బాంబులు తయారు చేస్తున్నారు. కానీ మీరు దృఢ సంకల్పమనే అగ్గిపుల్లతో ఆత్మిక బాంబు అనే బురుజును వెలిగించండి. తద్వారా పాతదంతా సమాప్తమైపోతుంది. వారు ఆ బురుజులు వెలిగించి ధనం పోగొట్టుకుంటారు. కాని మీరు సంపాదన జమ చేసుకుంటారు. అవి బురుజులు, మీది ఎగిరేకళ యొక్క ఆట. ఇందులో మీరు విజయులుగా అవుతారు. కనుక డబల్‌ లాభము తీసుకోండి. కాలుస్తారు, సంపాదిస్తారు కూడా - ఈ విధిని అనుసరించండి.

స్లోగన్‌ :- '' ఏదైనా విశేష కార్యములో సహాయకారులుగా అవ్వడమే ఆశీర్వాదాల లిఫ్ట్‌ను తీసుకోవడం ''

No comments:

Post a Comment