Tuesday, October 29, 2019

Telugu Murli 30/10/2019

30-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - ఒక్క తండ్రి స్మృతిలో ఉండడమే అవ్యభిచారి స్మృతి, ఈ స్మృతి ద్వారా మీ పాపాలు అంతరించగలవు ''

ప్రశ్న :- తండ్రి అర్థం చేయించే జ్ఞానాన్ని కొంతమంది సులభంగా అంగీకరిస్తారు, కొంతమంది కష్టంగా అర్థము చేసుకుంటారు - దీనికి కారణమేమి ?
జవాబు :- చాలా కాలము భక్తి చేసిన పిల్లలు, అర్ధకల్పపు పాత భక్తులు, తండ్రి అర్థం చేయించే ప్రతి విషయాన్ని సులభంగా, సహజంగా అంగీకరిస్తారు. ఎందుకంటే వారికి భక్తి ఫలము లభిస్తుంది. పాత భక్తులు కాకుంటే వారికి అర్థము చేసుకునేందుకు కష్టమౌతుంది. ఇతర ధర్మాలవారు ఈ జ్ఞానాన్ని అర్థము కూడా చేసుకోలేరు.

ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మల తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - పిల్లలైన మీరంతా ఏం చేస్తున్నారు? మీది అవ్యభిచారి స్మృతి. ఒకటేమో వ్యభిచారి స్మృతి, రెండవది అవ్యభిచారి స్మృతి. మీ అందరిదీ అవ్యభిచారి స్మృతి. ఎవరి స్మృతిలో ఉన్నారు? ఒకే ఒక్క తండ్రి స్మృతిలో ఉన్నారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాలు సమాప్తమైపోతాయి. మీరు అక్కడకు చేరుకుంటారు. పావనంగా అయ్యి మళ్లీ నూతన ప్రపంచములోకి వెళ్లాలి. ఆత్మలైన మీరు వెళ్లాలి. ఆత్మనే ఈ అవయవాల ద్వారా అన్ని కర్మలు చేస్తుంది కదా. అందుకే తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. మానవులు అనేకమందిని స్మృతి చేస్తారు. భక్తిమార్గములో మీరు ఒక్కరినే స్మృతి చేస్తారు. మొట్టమొదట మీరు అత్యంత శ్రేష్ఠులైన శివబాబా భక్తినే చేశారు. దానిని అవ్యభిచారి భక్తి అని అంటారు. వారే అందరికి సద్గతినిచ్చే రచయిత, తండ్రి. వారి నుండి పిల్లలకు అనంతమైన వారసత్వము లభిస్తుంది. సోదరునికి సోదరుని నుండి వారసత్వము లభించదు. వారసత్వము తండ్రి నుండి పుత్రులకు మాత్రమే లభిస్తుంది. కన్యలకు ఏదో కొంత మాత్రమే లభిస్తుంది. వారు వెళ్లి జీవిత భాగస్వాములుగా అవుతారు. ఇక్కడ మీరందరూ ఆత్మలే. సర్వాత్మల తండ్రి ఒక్కరే. తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు అందరికీ హక్కు ఉంది. మీరంతా సోదరులు. శరీరము స్త్రీ, పురుషులదే అయినా ఆత్మలంతా భాయి-భాయి(సోదరులే). వారు కేవలం మాట వరుసకు హిందూ - ముస్లిం భాయి-భాయి అని అంటారు. కానీ వారికి అర్థమే తెలియదు. ఇప్పుడు మీరు అర్థము తెలుసుకున్నారు. భాయి-భాయి అనగా అందరూ ఆత్మలే, ఒకే తండ్రి పిల్లలు, ప్రజాపిత బ్రహ్మకు సంతానమైనప్పుడు సోదరీ-సోదరులు. ఇప్పుడు ప్రపంచము నుండి అందరూ వాపస్‌ వెళ్లాలని మీకు తెలుసు. ఇప్పుడు మానవులందరి పాత్ర పూర్తి అవుతుంది. తండ్రి వచ్చి పాత ప్రపంచము నుండి నూతన ప్రపంచానికి తీసుకెళ్తారు. నావను తీరానికి చేర్చండి అనగా సుఖధామానికి తీసుకెళ్లండి అని పాట కూడా పాడ్తారు. ఈ పాత ప్రపంచము పరివర్తన చెంది మళ్లీ నూతన ప్రపంచంగా తప్పకుండా అవుతుంది. మూలవతనము నుండి మొత్తం ప్రపంచ పటము మీ బుద్ధిలో ఉంది. ఆత్మలైన మనమంతా మధురమైన ఇల్లు అయిన(స్వీట్‌ హోమ్‌) శాంతిధామ నివాసులము. ఇది బుద్ధిలో ఉంది కదా. మనము సత్యయుగ ప్రపంచములో ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలంతా శాంతిధామములో ఉంటాయి. ఆత్మ ఎప్పుడూ నశించదు. ఆత్మలో అవినాశి పాత్ర నిండి ఉంది, అదెప్పుడూ నశించదు. ఒకరు ఇంజనీరు అనుకోండి, 5 వేల సంవత్సరాల తర్వాత మళ్లీ ఇదే విధంగా ఇంజనీరుగానే అవుతాడు. నామ-రూప-దేశ-కాలాలన్నీ ఇవే ఉంటాయి. ఈ విషయాలన్నీ తండ్రే స్వయంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు. ఇది అనాది, అవినాశి డ్రామా. ఈ డ్రామా వయసు 5 వేల సంత్సరాలు. ఒక్క సెకండు కూడా తక్కువ-ఎక్కువ ఉండదు. ఇది అనాదిగా తయారైన డ్రామా. అందరికీ పాత్ర లభించే ఉంది. దేహీ-అభిమానులుగా అయ్యి సాక్షిగా ఉంటూ డ్రామాను చూస్తూ ఉండాలి. తండ్రికి దేహమే లేదు. వారు జ్ఞానసాగరులు, బీజరూపులు. పైనున్న నిరాకార ప్రపంచములోని ఆత్మలన్నీ నెంబరువారుగా పాత్ర చేసేందుకు వస్తారు. మొట్టమొదట నెంబరు దేవతలతో ప్రారంభమవుతుంది. మొదటి నెంబరు వంశము వారి చిత్రాలే ఉన్నాయి. ఆ తర్వాత చంద్ర వంశీయుల చిత్రాలు కూడా ఉన్నాయి. అన్నిటికంటే ఉన్నతమైనది సూర్యవంశము, లక్ష్మీనారాయణుల రాజ్యము. వారి రాజ్యము ఎప్పుడు ఎలా స్థాపన అయ్యిందో మానవమాత్రులెవ్వరికీ తెలియదు. సత్యయుగము ఆయువు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు. ఎవ్వరి జీవిత కథ గురించి కూడా తెలియదు. ఈ లక్ష్మీనారాయణుల జీవిత కథను తెలుసుకోవాలి. తెలుసుకోకుండా తల వంచి నమస్కరించడం లేక వారిని మహిమ చేయడం తప్పు. తండ్రి కూర్చొని ముఖ్యమైన వారి జీవితచరిత్రలు వినిపిస్తున్నారు. వీరి రాజ్యమెలా నడుస్తుందో మీకు బాగా తెలుసు. సత్యయుగములో శ్రీ కృష్ణుడుండే వాడు కదా. ఇప్పుడా కృష్ణపురము మళ్లీ స్థాపనవుతూ ఉంది. కృష్ణుడు స్వర్గములోని రాకుమారుడు. లక్ష్మీనారాయణుల రాజధాని ఎలా స్థాపన అయ్యిందో మీ అందరికీ తెలుసు.
మాల కూడా నంబరువారుగా తయారు చేస్తారు. ఫలానా ఫలానావారు మాలలోని పూసలుగా అవుతారు. కానీ నడుస్తూ నడుస్తూ మళ్లీ ఓటమి కూడా పొందుతారు. మాయ ఓడిస్తుంది. సైన్యములో ఉన్నంత వరకు వీరు కమాండర్‌, వీరు ఫలానా అని అంటారు. తర్వాత మరణిస్తారు. ఇక్కడ మరణించడం అనగా స్మృతి తగ్గిపోయి, మాయతో ఓడిపోయి సమాప్తమైపోతారు. ఆశ్చర్యంగా వింటారు, వర్ణిస్తారు, పారిపోతారు..... ఓహో మాయ......... విడాకులిస్తారు! మరజీవులుగా అవుతారు, తండ్రివారిగా అవుతారు. మళ్లీ రామరాజ్యము నుండి రావణరాజ్యములోకి వెళ్లిపోతారు. దీనినే కౌరవ పాండవ యుద్ధంగా చూపించారు. దేవ-దానవుల యుద్ధమును కూడా చూపిస్తారు. ఒక యుద్ధము చూపిస్తే చాలదా? రెండు ఎందుకు? ఇవన్నీ ఇక్కడి విషయాలేనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. యుద్ధమంటే హింస. ఇది అహింసా పరమో దేవీదేవతా ధర్మము. ఇప్పుడు మీరు డబుల్‌ అహింసకులుగా అవుతారు. మీది యోగబలము. ఆయుధాలు మొదలైన వాటితో మీరు ఎవ్వరినీ ఏమీ చేయరు. ఆ శక్తి అయితే క్రైస్తవులలో కూడా చాలా ఉంది. రష్యా, అమెరికా ఇరువురూ సోదరులే. బాంబులు తయారు చేయడంలో ఇరువురు పోటీ పడ్తున్నారు. ఇరువురు ఒకరికంటే ఒకరు శక్తిశాలురు. ఇరువురు కలిస్తే ప్రపంచమంతటి పై రాజ్యము చేసేటంత శక్తి ఉంది. కానీ బాహుబలముతో విశ్వ రాజ్యాధికారాన్ని పొందుకునే నియమము (చట్టము, లా) లేదు. రెండు పిల్లులు పరస్పరము కొట్లాడుకుంటే వెన్న మధ్యలో మూడవ వారు తినిపోయారనే కథ కూడా ఉంది. ఈ విషయాలన్నీ తండ్రి ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. ఇతనికే మాత్రము తెలిసేది కాదు. ఈ చిత్రాలు మొదలైనవి కూడా తండ్రియే దివ్యదృష్టి ద్వారా తయారు చేయించారు. వారు పరస్పరము కొట్లాడుకుంటారని, మొత్తం విశ్వచక్రవర్తి పదవిని మీరు తీసుకుంటారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆ రెండు దేశాలు చాలా శక్తివంతమైనవి. అక్కడక్కడ కొట్లాటలు పెడ్తారు. మళ్లీ సహాయము చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారిది కూడా చాలా పెద్ద వ్యాపారము. రెండు పిల్లులు కొట్లాడినప్పుడే ఫిరంగులు మొదలైనవి పనికి వస్తాయి. పరస్పరములో అక్కడక్కడ యుద్ధాలు చేయిస్తారు. హిందుస్థాన్‌ - పాకిస్థాన్‌ మొదట వేరు వేరుగా ఉండేవా? రెండు కలిసే ఉండేవి. ఇదంతా డ్రామాలో రచింపబడింది. యోగబలము ద్వారా విశ్వాధికారులుగా అయ్యేందుకు మీరిప్పుడు పురుషార్థము చేస్తున్నారు. వారు పరస్పరములో కొట్లాడుకుంటారు. వెన్న మధ్యలో మీరు తినేస్తారు. వెన్న అనగా విశ్వచకవ్రర్తి పదవి. అది మీకు చాలా సులభంగా(సింపుల్‌గా) లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ! మీరు తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. పవిత్రంగా అయ్యి పవిత్ర ప్రపంచంలోకిి వెళ్లాలి. దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు. సంపూర్ణ నిర్వికారి ప్రపంచము. ప్రతి వస్తువు సతోప్రధానము, సతో, రజో, తమోల ద్వారా తప్పకుండా వస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీలో ఇంతకుముందు ఈ తెలివి లేదు. ఎందుకంటే శాస్త్రాలలో లక్షల సంవత్సరాలని అనేశారు. భక్తిమార్గమే అజ్ఞానాంధకారము. ఇది కూడా ఇంతకుముందు మీకు తెలియదు. ఇప్పుడు మీకు అన్నీ తెలుసు. వారేమో ఇంకా 40 వేల సంవత్సరాలు జరుగుతుందని అంటారు. సరే అలాగే అనుకుంటాము. 40 వేల సంవత్సరాలైన తర్వాత ఏమవుతుందో ఎవ్వరికీ తెలియదు. అందుకే అజ్ఞాన నిద్రలో నిదురిస్తున్నారని అంటారు. భక్తి అజ్ఞానము. జ్ఞానమిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. ఆ తండ్రి జ్ఞానసాగరులు. మీరు జ్ఞాన నదులు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్ములను అనగా ఆత్మలను చదివిస్తారు. వారు తండ్రే కాక టీచరు కూడా అయ్యారు, సద్గురువు కూడా అయ్యారు. మా తండ్రి-టీచరు-సద్గురువు వీరేనని ఇతరులెవ్వరూ అనరు. ఇది అనంతమైన విషయము. అనంతమైన తండ్రి, టీచరు, సద్గురువు అన్నీ ఒక్కరే. స్వయంగా వారే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. నేను మీ సుప్రీమ్‌ తండ్రిని, మీరందరూ నా పిల్లలు. మీరు కూడా - ''బాబా, మీరు అప్పటివారే'' అని అంటారు. తండ్రి కూడా - మీరు కల్ప-కల్పము వచ్చి కలుస్తారని చెప్తున్నారు. కనుక వారు పరమాత్మ, సుప్రీమ్‌. వారే వచ్చి పిల్లలందరికీ అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. కలియుగము ఆయువు ఇంకా 40 వేల సంవత్సరాలని చెప్పడం పూర్తిగా వ్యర్థ ప్రలాపము(తప్పు). 5 వేల సంవత్సరాలలో అన్ని వచ్చేస్తాయి. తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మీరు అంగీకరిస్తారు, అర్థము చేసుకుంటారు. మీరు అంగీకరించరని కాదు, ఒకవేళ అంగీకరించకుంటే ఇక్కడకు రారు. ఈ ధర్మానికి చెందని వారు తండ్రి మాటలు అంగీకరించరు. ఆధారమంతా భక్తి పైనే ఉందని తండ్రి అర్థం చేయించారు. ఎక్కువ భక్తి చేసినవారి భక్తికి ఫలము లభించాలి కదా. తండ్రి నుండి వారికే అనంతమైన వారసత్వము లభిస్తుంది. మనమే దేవతలుగా, విశ్వానికి అధికారులుగా అవుతామని మీకు తెలుసు. ఇక కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పురాతన ప్రపంచ వినాశనమైతే చూపించబడింది. ఇక ఏ ఇతర శాస్త్ర్రాలలోనూ ఈ విషయాలు లేవు. గీత ఒక్కటే భారతదేశ ధర్మశాస్త్రము. ప్రతి ఒక్కరు తమ ధర్మశాస్త్ర్రాన్ని చదవాలి. ఆ ధర్మము ఎవరి ద్వారా స్థాపన అయ్యిందో వారి గురించి కూడా తెలుసుకోవాలి. ఉదాహరణానికి క్రైస్తవులకు ఏసుక్రీస్తును గురించి తెలుసు. వారినే గౌరవిస్తారు, వారినే పూజిస్తారు. మీరు ఆదిసనాతన దేవీ దేవతా ధర్మము వారైతే దేవతలనే పూజిస్తారు. కానీ ఈ రోజుల్లో స్వయాన్ని హిందూ ధర్మము వారమని చెప్పుకుంటారు.
పిల్లలైన మీరిప్పుడు రాజయోగము నేర్చుకుంటున్నారు. మీరు రాజఋషులు, వారు హఠ యోగానికి చెందిన ఋషులు. రాత్రికి పగులుకు ఉన్నంత తేడా ఉంది. వారిది అపరిపక్వ(కచ్ఛా) సన్యాసము, హద్దు సన్యాసము. కేవలం ఇల్లు-వాకిలి వదిలేస్తారు. కానీ మీ సన్యాసము లేక వైరాగ్యము - ఈ పాత ప్రపంచాన్నే వదిలేయడం. మొట్టమొదట మీ ఇంటికి స్వీట్‌హోమ్‌కు(మధురమైన ఇంటికి) వెళ్లి మళ్లీ నూతన ప్రపంచము, సత్యయుగములోకి వస్తారు. బ్రహ్మ ద్వారా ఆది సనాతనా దేవీదేవతా ధర్మము స్థాపనవుతుంది. ఇప్పుడిది పాత ప్రపంచము. ఇవన్నీ అర్థము చేసుకోవాల్సిన విషయాలు. తండ్రి ద్వారా చదువుకుంటున్నారు. ఇది సత్యము కదా. ఇందులో నిశ్చయము లేకుండా ఉండే మాటే లేదు. ఈ జ్ఞానాన్ని చదివించేది ఆ తండ్రి ఒక్కరే. ఆ తండ్రి, టీచరు కూడా అయ్యారు. సత్యమైన సద్గురువు కూడా వారే, వెంట తీసుకెళ్తారు. ఆ గురువులైతే అర్ధములో వదిలేసి వెళ్లిపోతారు. ఒక గురువు పోతే మరొకరిని గురువుగా చేస్తారు. వారి శిష్యులను పీఠము పై కూర్చోబెడ్తారు. ఇక్కడ ఇది తండ్రి, పిల్లల విషయము. అది గురు-శిష్యుల వారసత్వపు హక్కు. వారసత్వము తండ్రిదే కదా. శివబాబా వచ్చేదే భారతదేశములో. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. శివునికి జాతకము లేనే లేదు. ఎలానో తెలుపమంటారా? వారికి తిథి-తారీఖులు ఉండవు. మొదటి నెంబరులో వచ్చే కృష్ణునికి తిథి-నక్షత్రాలు చూపిస్తారు. దీపావళి పండుగ జరుపుకోవడం ప్రపంచములోని మానవులు చేసే పని. పిల్లలైన మీకు దీపావళి లేదు. మనకు నూతన సంవత్సరమంటే నూతన ప్రపంచము, సత్యయుగము. ఇప్పుడు మీరు నూతన ప్రపంచము కొరకు చదువుతున్నారు. మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగములో ఉన్నారు. ఆ కుంభమేళాకు ఎంతోమంది మనుష్యులు గుంపులు గుంపులుగా వెళ్తారు. అది నదుల నీటి కలయిక. అనేక మేళాలు చేస్తారు. వారిలో కూడా చాలా పంచాయితీలు జరుగుతాయి. అప్పుడప్పుడు పరస్పరము చాలా కొట్లాడుకుంటారు. కారణం దేహాభిమానములో ఉన్నారు కదా. ఇక్కడ కొట్లాటలు మొదలైనవాటి ప్రసక్తే లేదు. తండ్రి కేవలం చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా, నన్ను స్మృతి చేయండి. సతోప్రధానము నుండి తమోప్రధానమైన మీ ఆత్మలో మైల చేరింది కదా. అది యోగాగ్ని ద్వారానే తొలగిపోతుంది. ఈ విషయము కంసాలికి తెలుసు. తండ్రినే పతిత పావనుడని అంటారు. తండ్రి సుప్రీమ్‌ కంసాలి. అందరి మైలను తొలగించి సత్యమైన బంగారుగా చేసేస్తారు. బంగారును అగ్నిలో వేస్తారు. ఇది యోగము అనగా యోగాగ్ని. ఎందుకంటే స్మృతి ద్వారానే పాపాలు భస్మమౌతాయి. తమోప్రధానము నుండి సతోప్రధానంగా స్మృతియాత్ర ద్వారానే తయారవ్వాలి. అందరూ సతోప్రధానంగా అవ్వలేరు. కల్పక్రితము వలె పురుషార్థము చేస్తారు. పరమాత్మకు కూడా డ్రామాలో పాత్ర నిశ్చయింపబడే ఉంది. ఏదైతే రచింపబడిందో అదే జరుగుతూ ఉంటుంది. మార్పు ఉండదు. రీలు తిరుగుతూనే ఉంటుంది. పోను పోను మీకు చాలా నిగూఢమైన విషయాలు వినిపిస్తారు. మొట్టమొదట ఇది నిశ్చయము చేసుకోవాలి - వారు సర్వాత్మల తండ్రి. వారిని స్మృతి చేయాలి. మన్మనాభవకు అర్థమిదే. కృష్ణ భగవానువాచ లేనే లేదు. ఒకవేళ కృష్ణుడైతే అందరూ వారి వద్దకు వస్తారు, అందరూ గుర్తిస్తారు. మరి కోటిలో ఏ ఒక్కరో నన్ను తెలుసుకుంటారని ఎందుకు అంటారు? ఇది తండ్రి అర్థం చేయిస్తున్నారు. అందుకే మనుష్యులు అర్థం చేసుకోవడం కష్టము. ఇంతకు ముందు కూడా ఇదే విధంగా జరిగింది. నేనే వచ్చి దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేశాను. తర్వాత ఈ శాస్త్ర్రాలు మొదలైనవన్నీ కనిపించవు. మళ్లీ తమ సమయంలో భక్తిమార్గములో శాస్త్ర్రాలు మొదలైనవన్నీ అప్పటివే వెలవడ్తాయి. సత్యయుగములో ఒక్క శాస్త్రము కూడా ఉండదు. భక్తికి నామ-రూపాలే ఉండవు. ఇప్పుడుండేది భక్తి రాజ్యము. అందరికంటే గొప్పవారు శ్రీ శ్రీ 108 జగద్గురువని పిలిపించుకునే వారు. ఈ రోజులలో 1,008 అని కూడా అంటారు. వాస్తవానికి ఈ మాల ఇక్కడిదే. మాల జపించినప్పుడు (తిప్పినపుడు) పుష్పము నిరాకారమని, ఆ తర్వాత మేరు పూస అని తెలుసు. బ్రహ్మ-సరస్వతులు జంట పూసలు. ఎందుకంటే ప్రవృత్తి మార్గము కదా. ప్రవృత్తి మార్గము వారు, నివృత్తి మార్గము వారిని గురువులుగా చేసుకుంటే వారేమిస్తారు? హఠయోగము నేర్చుకోవాల్సి పడ్తుంది. అనేక ప్రకారాల హఠయోగాలున్నాయి. రాజయోగము ఒక్కటే. స్మృతియాత్ర ఒక్కటే. దానిని రాజయోగమని అంటారు. మిగిలినవన్నీ హఠయోగాలు. అవి శరీర ఆరోగ్యము కొరకు. ఈ రాజయోగాన్ని నేర్పించువారు తండ్రి ఒక్కరే. మొదటిది ఆత్మ తర్వాతనే శరీరము. మీరు స్వయాన్ని ఆత్మకు బదులు శరీరమని భావించి ఉల్టా అయిపోయారు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే అంతమతి సో గతి అయిపోతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఈ అనాది-అవినాశి తయారైన డ్రామాలో ప్రతి ఒక్కరి పాత్రను దేహీ-అభిమానులుగా అయ్యి సాక్షిగా ఉండి చూడాలి. మీ స్వీట్‌ హోమ్‌(మధురమైన ఇల్లు), స్వీట్‌ రాజధానిని స్మృతి చేయాలి. ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి.
2. మాయతో ఓడిపోరాదు. స్మృతి అనే అగ్నిలో పాపాలను నశింపజేసుకొని ఆత్మను పావనంగా చేసుకునే పురుషార్థము చేయాలి.

వరదానము :- '' హద్దు వయ్యారాల నుండి వెలువడి ఆత్మిక నాజ్‌ (నాశా)లో ఉండే ప్రీతి బుద్ధి భవ ''
చాలామంది పిల్లలు హద్దు స్వభావ సంస్కారాల వయ్యారాలు చాలా చేస్తారు. ఎక్కడైతే నా స్వభావము, నా సంస్కారము అనే శబ్ధాలు వస్తాయో అక్కడ ఇటువంటి నాజ్‌ నఖరాలు (వయ్యారాలు) ప్రారంభమవుతాయి. 'నాది' అనే ఈ శబ్ధమే భ్రమలోకి తీసుకొస్తుంది. తండ్రికి భిన్నంగా ఉన్న ఏ వస్తువైనా నాది కానే కాదు. నా స్వభావము తండ్రి స్వభావము కంటే భిన్నంగా ఉండజాలదు. అందువలన నాజ్‌ నఖరాల నుండి వెలువడి ఆత్మిక నశాలో(నాజ్‌లో) ఉండండి. ప్రీతిబుద్ధి గలవారై ప్రేమ నఖరాలు భలే చేయండి.

స్లోగన్‌ :- '' తండ్రి పై, సేవ పై, పరివారం పై ప్రేమ ఉంటే శ్రమ నుండి విడుదల అవుతారు. ''

No comments:

Post a Comment