Friday, October 25, 2019

Telugu Murli 26/10/2019

26-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - బుద్ధిని స్వచ్ఛంగా (రిఫైన్‌) చేసుకోవాలనుకుంటే ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి, స్మృతి ద్వారానే ఆత్మ స్వచ్ఛమౌతూ పోతుంది''

ప్రశ్న :- వర్తమాన సమయములో మనుష్యులు తమ సమయాన్ని, ధనాన్ని ఏ విధంగా వ్యర్థము చేస్తున్నారు ?
జవాబు :- ఎవరైనా శరీరమును వదిలినప్పుడు వారి కొరకు ఎంతో ధనము మొదలైనవాటిని ఖర్చు చేస్తూ ఉన్నారు. శరీరమును వదలి వెళ్లిన తర్వాత శరీరానికి ఏ విలువా లేదు కదా. కావున దాని కొరకు ఏం చేసినా సమయాన్ని, ధనాన్ని వ్యర్థము చేస్తున్నట్లే.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇతడు కూడా అలాగే చెప్తున్నారు కదా. అయితే చెప్పేది బాబానా లేక దాదానా? ఆత్మిక తండ్రి పిల్లలైన మీకు భూత, భవిష్యత్తు, వర్తమానాల జ్ఞానము వినిపిస్తున్నారని దాదా కూడా చెప్తారు. వాస్తవానికి సత్యయుగము నుండి త్రేతాయుగము అంత్యము వరకు ఏం జరిగిందో అదే ముఖ్యమైనది. ద్వాపర-కలియుగాలలో ఎవరెవరు ఎప్పుడు వచ్చారో, ఏం జరిగిందో, వారి చరిత్ర-భూగోళము అయితే చాలా ఉంది. సత్య-త్రేతా యుగాల గురించి ఏ చరిత్రా లేదు, భూగోళమూ లేదు. ఇతరుల చరిత్ర, భూగోళాలన్నీ ఉన్నాయి. పోతే దేవీ-దేవతలను లక్షల సంవత్సరాలు వెనుకకు తీసుకెళ్లారు. దీనిని అనంతమైన(బేహద్‌) బుద్ధిహీనత అని అంటారు. మీరు కూడా అలాగే బేహద్‌ బుద్ధిహీనతలో ఉండేవారు. ఇప్పుడు కొద్ది కొద్దిగా అర్థము చేసుకుంటున్నారు. కొందరు ఇప్పుడు కూడా అర్థము చేసుకోవడం లేదు. అర్థము చేసుకోవలసింది ఇంకా చాలా ఉంది. తండ్రి ఆబూ మహిమ గురించి అర్థం చేయించారు. దీని పై మీరు ఆలోచించాలి, గమనముంచాలి. ఇప్పుడు మేమిక్కడ కూర్చుని ఉన్నామని మీ బుద్ధిలోకి రావాలి. మీ జ్ఞాపక చిహ్నమైన దిల్వాడా మందిరము ఎప్పుడు తయారయ్యింది, ఎన్ని సంవత్సరాల తర్వాత తయారయ్యింది. 1250 సంవత్సరాలని అంటారు. ఎన్ని సంవత్సరాలు జరిగిపోయాయి? 3750 సంవత్సరాలు జరిగిపోయాయి అనగా వారు కూడా ఇప్పటి మీ స్మృతి చిహ్నము, వైకుంఠపు స్మృతి చిహ్నాలను తయారు చేశారు. మందిరాలు కట్టించునప్పుడు ఒకరికంటే ఒకరు బాగా కట్టాలని పోటీ ఉంటుంది కదా. ఇప్పుడు అలా కట్టించేందుకు ధనము కూడా లేదు. ఒకప్పుడు చాలా ధనముండేది అందుకే సోమనాథ మందిరాన్ని చాలా పెద్దదిగా కట్టించారు. ఇప్పుడంత పెద్దది కట్టలేరు. ఆగ్రా మొదలైన చోట్ల కట్టిస్తూ ఉంటారు. కానీ అవన్నీ వ్యర్థమైనవి, పనికిరానివి ఎందుకంటే మానవులంతా అంధకారములో ఉన్నారు కదా. తయారయ్యే సమయానికి వినాశనము కూడా వచ్చేస్తుంది. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. పడగొడ్తూ, కట్టిస్తూ ఉంటారు. ధనము ఉచితంగా వస్తూ ఉంటుంది. సమయము, ధనము, శక్తి అన్నీ వ్యర్థమవుతూ ఉన్నాయి. ఎవరైనా మరణిస్తే ఎంతో సమయాన్ని పోగొట్టుకుంటారు. మనము వ్యర్థము చేయము. ఆత్మ ఏమో వెళ్లిపోయింది. మిగిలిన శవానికి విలువ ఏముంది? సర్పము కుబుసము విడుస్తుంది. దానికేమైనా విలువ ఉందా? ఏ విలువా లేదు. భక్తి మార్గములో శరీరానికి విలువ ఉంది. జడ చిత్రాలను ఎంతగానో పూజిస్తారు కానీ వారు ఎప్పుడు వచ్చారో, ఎలా వచ్చారో దానిని గురించి వారికేమీ తెలియదు. దీనిని భూత పూజ అని అంటారు. పంచ తత్వాలను పూజిస్తారు. ఈ లక్ష్మీనారాయణులు స్వర్గములో రాజ్యమేలుతూ ఉండేవారు. 150 సంవత్సరాల ఆయుష్షు పూర్తి అవుతూనే శరీరము వదిలేవారు. శరీరము దేనికీ పనికి రాదు. అక్కడ దానికేం విలువ ఉంటుంది? ఆత్మ వెళ్లిపోతుంది, ఛండాలునికి ఇస్తారు. పద్ధతి, ఆచారాలను అనుసరించి దహనము చేస్తారు. అంతేకాని వారి మట్టిని విమానాలలో పేరు-ప్రతిష్ఠల కొరకు తీసుకెళ్తారు. అక్కడ(సత్యయుగములో) ఇదంతా ఏమీ ఉండదు. ఇక్కడ ఏమేమో చేస్తారు. బ్రాహ్మణులకు తినిపించడం మొదలైనవి చేస్తారు. అక్కడ అటువంటిదేమీ ఉండదు. శరీరము దేనికీ పనికిరాదు. శరీరాన్ని కాల్చేస్తారు. వారి చిత్రాలు మాత్రము ఉంటాయి. అయినా వారి ఖచ్ఛితమైన చిత్రాలు లభించవు. ఈ మందిరాలలోని ఆదిదేవుని రాతి విగ్రహము ఖచ్ఛితమైనది కాదు. పూజలు మొదలైనప్పుడు ఈ రాతి బొమ్మలు తయారు చేశారు. అసలైన రూపము కాలిపోయి ఎప్పుడో సమాప్తమైపోయింది కదా. ఆ తర్వాత భక్తిమార్గములో ఈ రాతి విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విషయాల పై కూడా ఆలోచనలు నడుస్తాయి కదా. ఆబూ మహిమను చాలా మంచి రీతిగా(బాగా) విశదీకరించి ఋజువు చేయాలి. మీరు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఇచ్చటనే ఆ తండ్రి మొత్తం విశ్వమునంతా నరకము నుండి స్వర్గంగా తయారు చేస్తున్నారు కనుక ఇదే అన్నింటికంటే ఉన్నతోన్నతమైన తీర్థ స్థానము. ఇప్పుడింకా అంత భావన లేదు. కేవలం శివుని యందు మాత్రమే భావన ఉంది. ఎక్కడకెళ్లినా శివుని మందిరము తప్పకుండా ఉంటుంది. అమరనాథ్‌లో కూడా శివుని చిత్రముంది. శంకరుడు పార్వతికి కథ వినిపించారని చెప్తారు. అక్కడ కథల మాటే ఉండదు. మానవులకు కొంచెము కూడా జ్ఞానము లేదు. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇంతకు ముందేమైనా తెలుసా?
ఇప్పుడు బాబా ఆబూను ఎంతో మహిమ చేస్తున్నారు. అన్ని తీర్థ స్థానాలలో ఇది గొప్పది. బాబా దీనిని గురించి చాలా అర్థం చేయిస్తారు కానీ అనన్య పిల్లల బుద్ధిలో కూర్చోవాలి. ఇప్పుడింకా చాలా దేహాభిమానములో ఉన్నారు. జ్ఞానమింకా చాలా ఎక్కువగా కావాలి. చాలా విశుద్ధమవ్వాలి. ఇప్పుడు కొంతమందికి కష్టము మీద యోగము కుదురుతూ ఉంది. యోగముతో పాటు జ్ఞానము కూడా కావాలి. కేవలం యోగములోనే ఉండమని కాదు. యోగము చేసేందుకు జ్ఞానము తప్పకుండా అవసరము. ఢిల్లిలో జ్ఞాన-విజ్ఞాన భవనమని పేరు పెట్టారు. కానీ దాని అర్థమేమిటో తెలియదు. ఇది అర్థమే చేసుకోరు. జ్ఞాన - విజ్ఞానాలు ఒక్క సెకండు విషయమే. శాంతిధామము - సుఖధామము. కానీ మానవులకు ఏ మాత్రము బుద్ధి లేదు, వారికి అర్థమే తెలియదు. చిన్మయానంద మొదలైన గొప్ప గొప్ప సన్యాసులున్నారు, గీతను వినిపిస్తారు. వారికెంతో మంది శిష్యులున్నారు. కానీ అందరికంటే గొప్ప జగద్గురువు ఒక్క తండ్రి మాత్రమే. తండ్రి, టీచరు కంటే గురువు గొప్పవారు. స్త్రీ రెండవ పతిని ఎలా వివాహమాడదో అలాగే మరో గురువును కూడా ఆశ్రయించరాదు. ఒక్క గురువును ఆశ్రయించారు, వారే సద్గతిని కలుగజేయాలి. ఇంకా ఇతర గురువులు ఎందుకు? బేహద్‌ తండ్రి ఒక్కరే సద్గురువు. సర్వులకు సద్గతినిచ్చువారు. కానీ ఈ విషయాలు ఏ మాత్రము అర్థము చేసుకోనివారు చాలామంది ఉన్నారు. రాజధాని స్థాపనవుతూ ఉందని తండ్రి అర్థం చేయించారు కావున నెంబరువారుగా ఉంటారు కదా. కొంతమంది కొద్దిగా కూడా అర్థము చేసుకోలేరు. డ్రామాలో వారి పాత్ర అలా ఉంది. టీచరైతే అర్థము చేసుకోగలరు. ఏ శరీరము ద్వారా అర్థం చేయిస్తున్నారో వారికి కూడా తెలిసిపోతుంది. ఇది బెల్లమునకు తెలుసు, బెల్లపు సంచికి తెలుసు. శివబాబాను బెల్లము అని అంటారు. వారికి(శివబాబా) అందరి స్థితి ఎలా ఉందో బాగా తెలుసు. ఎవరు ఎలా చదువుతున్నారో, ఎంత సేవ చేస్తున్నారో బాబా సేవలో జీవితమెంత సఫలము చేసుకుంటున్నారో వారి వారి చదువు ద్వారా అర్థము చేసుకోగలరు. ఈ బ్రహ్మ ఇల్లు-వాకిలి వదిలేశారు కనుక లక్ష్మీ నారాయణులౌతారని అనుకోరాదు. శ్రమ చేస్తున్నారు కదా. ఈ జ్ఞానము చాలా ఉన్నతమైనది. ఎవరైనా తండ్రి ఆజ్ఞను మీరితే ఒక్కసారిగా రాతి బుద్ధి గలవారిగా అయిపోతారు. ఇది ఇంద్రసభ అని బాబా అర్థం చేయించారు. శివబాబా జ్ఞాన వర్షము కురిపిస్తారు. వారి ఆజ్ఞను ఉల్లంఘిస్తే రాతిబుద్ధి గలవారిగా మారిపోతారని శాస్త్రాలలో వ్రాసి ఉన్నారు. మీ వెంట ఎవరినైనా సంభాళించి తీసుకొని రండి అని బాబా అందరికీ వ్రాస్తూ ఉంటారు. అలాగని ఎవరినంటే వారిని అపవిత్రులను, వికారులను తీసుకు రాకూడదు. అలా తీసుకు వచ్చే బ్రాహ్మణి పై దోషము ఏర్పడ్తుంది. అటువంటి వారిని ఎవ్వరినీ తీసుకు రాకూడదు. ఇది చాలా గొప్ప బాధ్యత. తండ్రి అత్యంత ఉన్నతమైనవారు. మీకు విశ్వచక్రవర్తి పదవిని ఇస్తారు కనుక అటువంటి వారినెంత గౌరవించాలి! చాలా మందికి బంధు-మిత్రులు మొదలైనవారు గుర్తుకొస్తూ ఉంటారు. తండ్రి స్మృతి ఉండనే ఉండదు. లోలోపలే గుటకలు మింగుతూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది ఆసురీ ప్రపంచము. ఇప్పుడు దైవీ ప్రపంచము తయారవుతుంది. ఇది మన లక్ష్యము. ఈ లక్ష్మీ-నారాయణుల వలె తయారవ్వాలి. ఏ ఏ చిత్రాలున్నాయో వారందరి జీవిత చరిత్రలు మీకు తెలుసు. మనుష్యులకు అర్థం చేయించేందుకు ఎంతో శ్రమిస్తున్నారు. కొంతమంది కొంచెము బుద్ధివంతులని, మరి కొంతమందికి ఏ మాత్రము అర్థమవ్వడం లేదని మీరు కూడా అర్థము చేసుకుని ఉంటారు. ఎవరెంత జ్ఞానము తీసుకుంటారో, దాని అనుసారమే సేవ చేస్తున్నారు. గీతా భగవంతుని గురించిన విషయమే ముఖ్యమైనది. సూర్యవంశ దేవీ దేవతల శాస్త్రము గీత ఒక్కటే. వేరే ఏదీ లేదు. బ్రాహ్మణులకు కూడా వేరే శాస్త్రమేదీ లేదు. ఇవి చాలా అర్థము చేసుకోవలసిన విషయాలు. ఈ జ్ఞాన మార్గములో నడుస్తూ నడుస్తూ వికారాల వశమైతే జ్ఞానము బుద్ధి నుండి వెళ్లిపోతుంది. చాలా మంచి-మంచి పిల్లలు వికారాలకు వశమై రాతి బుద్ధి గలవారిగా అయిపోయారు. ఇందులో మంచి తెలివి కావాలి. తండ్రి తెలిపిన జ్ఞానమును నెమరు వేస్తూ ఉండాలి. ఇక్కడ మీకు చాలా సులభము. ఎలాంటి చిక్కు పనులు, అలజడులు మొదలైనవేవీ లేవు. బాహ్యములో ఉండుట వలన వ్యాపారాదుల చింత ఎంతో ఉంటుంది. మాయ చాలా తుఫానులు తీసుకొస్తుంది. ఇక్కడ ఏ చిక్కు పని లేదు. ఏకాంతములో ఉంటారు. తండ్రి(శివబాబా) ఏమో పిల్లలతో పురుషార్థము చేయిస్తూ ఉంటారు. ఈ బాబా(బ్రహ్మాబాబా) కూడా పురుషార్థియే. పురుషార్థము చేయించువారైతే తండ్రి(శివబాబా). ఇందులో విచార సాగర మథనము చేయవలసి వస్తుంది. ఇచ్చట తండి పిల్లల తన జతలో కూర్చుని ఉన్నారు. సంపూర్ణ సహకారమిచ్చువారినే సేవాధారులని అంటారు. ఆటంకపరచువారు చాలా నష్టము కలుగజేస్తారు. ఇంకా డిస్‌ సర్వీసు చేస్తారు, విఘ్నాలు కలిగిస్తారు. మహారాజు-మహారాణులుగా తయారైతే వారికి దాస-దాసీలు కూడా కావాలని మీకు తెలుసు. వారు(దాస-దాసీలు) కూడా ఇక్కడ నుండే వస్తారు. ఆధారమంతా చదువు పైనే ఉంది. ఈ శరీరాన్ని కూడా సంతోషంగా వదలాలి, దు:ఖముతో కాదు. పురుషార్థము కొరకు సమయము లభించింది కదా. జ్ఞానమేమో ఒక్క క్షణముదే. శివబాబా నుండి వారసత్వము లభిస్తుందని బుద్ధిలో ఉంది. ప్రజలు చాలామంది తయారవ్వాలి. మన సూర్యవంశ, చంద్రవంశ రాజధానులు ఇక్కడ స్థాపనౌతూ ఉన్నాయి. తండివ్రారిగా అయ్యి గ్లాని చేస్తే తల పైకి చాలా బరువు ఎక్కుతుంది. ఒక్కసారిగా రసాతలానికి(పాతాళానికి) పోయినట్లవుతుంది. బాబా అర్థం చేయిస్తున్నారు - ఇచ్చట కూర్చుని ఎవరు పూజలు చేయించుకుంటారో వారు పూజ్యులెలా అవుతారు? సర్వుల సద్గతిదాత, కళ్యాణము చేయువారు ఒక్క తండ్రి మాత్రమే. మనుష్యులకు శాంతికి అర్థము కూడా తెలియదు. హఠయోగము ద్వారా ప్రాణాయామము మొదలైనవి చేయుటే శాంతి అని భావిస్తారు. అందులో కూడా చాలా శ్రమ కలుగుతుంది. కొంతమందికి మెదడు చెడిపోతుంది. ఏ ప్రాప్తి కూడా ఉండదు. అది అల్పకాలపు శాంతి. అల్పకాలిక సుఖమును కాకిరెట్టకు సమానమని అంటారు. అలాగే ఈ శాంతి కూడా కాకిరెట్ట సమానమైనది. అది అల్పకాలము మాత్రమే ఉంటుంది. తండ్రి 21 జన్మలకు మీకు సుఖ-శాంతులు రెండిటినీ ఇస్తారు. కొంతమంది చివరి వరకు శాంతిధామములోనే ఉంటారు. ఎవరి పాత్ర చివర్లో ఉందో వారు ఎక్కువ సుఖమును చూడలేరు. అక్కడ కూడా నెంబరువారుగా పదవులు ఉంటాయి కదా. భలే దాస-దాసీలుగా ఉంటారు కానీ కృష్ణున్ని చూచేందుకు లోపలికి కూడా వెళ్లలేరు. అందరికీ వేరు వేరు భవనాలు ఉంటాయి కదా. చూసేందుకు ప్రత్యేకమైన సమయముంటుంది. పోప్‌ వస్తే వారిని చూచేందుకు ఎంతమంది వెళ్తారో చూడండి. ఇటువంటివారు చాలామంది వస్తారు. వారికి చాలా ప్రభావముంటుంది. వారిని దర్శించుకునేందుకు లక్షల మంది వెళ్తారు. ఇక్కడ శివబాబా దర్శనమెలా అవుతుంది? ఇది అర్థము చేసుకునే విషయము.
ఇది(ఆబూ) అత్యుత్తమమైన తీర్థ స్థానమని ప్రపంచానికెలా తెలియాలి? దిల్వాడా వంటి మందిరాలు దగ్గరలో ఇంకా ఉంటే వెళ్లి చూడాలి. అవి ఎలా తయారై ఉన్నాయో చూడాలి. వారికి జ్ఞానము తెలిపే అవసరము కూడా ఉండదు. ఎందుకంటే వారు మళ్లీ మీకు జ్ఞానము ఇవ్వడం ప్రారంభిస్తారు. ఇవి చేయండి, అవి చేయండి అని సలహా ఇస్తారు కదా. మిమ్ములను చదివించేదెవరో వారికి తెలియదు. ఒక్కొక్కరికి అర్థం చేయించేందుకు శ్రమ కలుగుతుంది. దాని పై కథలు కూడా ఉన్నాయి. నాన్నా పులి, నాన్నా పులి........... అని అంటాడు. మీరు కూడా మృత్యువు(వినాశనము) రానే వస్తుంది అని చెప్తారు. కానీ వారు నమ్మరు. ఇంకా 40 వేల సంవత్సరాలుందని అంటారు. మృత్యువెక్కడొస్తుంది? అని అంటారు. కానీ మృత్యువు తప్పకుండా వస్తుంది. అందరినీ తీసుకెళ్తుంది. అక్కడ ఎలాంటి మురికి ఉండదు. ఇక్కడి ఆవులకు, అక్కడి ఆవులకు చాలా వ్యత్యాసముంటుంది. కృష్ణుడు ఆవులను మేపడు. వారి(కృష్ణుడు) వద్దకు పాలు హెలికాఫ్టరులో వస్తూ ఉండవచ్చు. ఈ మురికి ఎక్కడో దూరంగా ఉంటుంది. ఇంటి వెనుక-ముందు మురికి ఉండనే ఉండదు. అక్కడ అపారమైన సుఖముంటుంది. దాని కొరకు ఇప్పుడు పూర్తిగా పురుషార్థము చేయాలి. ఎంతో మంచి మంచి పిల్లలు సేవాకేంద్రాల నుండి వస్తారు. బాబా చూసి ఎంతో సంతోషిస్తారు. నెంబరువారు పురుషార్థానుసారము పుష్పాలు వెలువడ్తాయి. పుష్పాలుగా ఉన్నవారు స్వయాన్ని కూడా పుష్పాలుగా భావిస్తారు. ఢిల్లీలో కూడా పిల్లలు రాత్రింబవళ్ళు ఎంతో సేవ చేస్తున్నారు. జ్ఞానము కూడా ఎంతో ఉన్నతమైనది. ఇంతకు ముందు ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడెంతో శ్రమ చేయవలసి వస్తుంది. బాబా వద్దకు మొత్తం సమాచారమంతా వస్తుంది. కొంతమంది సమాచారము వినిపిస్తారు, కొంతమంది వినిపించరు. ఎందుకంటే ద్రోహులుగా కూడా చాలామంది ఉంటారు. చాలా ఫస్ట్‌క్లాస్‌గా ఉండినవారు కూడా ద్రోహులుగా అవుతారు. థర్డ్‌క్లాస్‌ వారు కూడా ద్రోహులుగా ఉన్నారు. కొంచెము జ్ఞానము తెలుసుకుంటూనే మేము శివబాబాకు కూడా బాబాగా అయ్యామని భావిస్తారు. ఈ జ్ఞానమిచ్చేదెవరో కూడా గుర్తించరు. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. విశ్వ చక్రవర్తి పదవినిచ్చే తండ్రిని చాలా చాలా గౌరవించాలి. తండ్రి సేవలో తమ జీవితాన్ని సఫలము చేసుకోవాలి. చదువు పై పూర్తిగా ధ్యాస పెట్టాలి.
2. తండ్రి ద్వారా లభించిన జ్ఞానము పై విచార సాగర మథనము చేయాలి. ఎప్పుడు కూడా విఘ్న రూపంగా అవ్వరాదు. డిస్‌ సర్వీసు చేయరాదు, అహంకారముండరాదు.

వరదానము :- '' నిరాకారము మరియు సాకారము రెండు రూపాల స్మృతి చిహ్నాన్ని విధి పూర్వకంగా జరుపుకునే శ్రేష్ఠ ఆత్మా భవ ''
దీపావళి అనగా అవినాశిగా మేల్కొన్న అనేక అవినాశి దీపాల స్మృతిచిహ్నము. ప్రకాశిస్తున్న ఆత్మలైన మీరు దీపాల వెలుగు వలె కనిపిస్తారు. అందువలన ప్రకాశిస్తున్న ఆత్మల దివ్య జ్యోతుల స్మృతిచిహ్నము స్థూల దీపాల జ్యోతులుగా చూపించారు. కనుక ఒకవైపు నిరాకార ఆత్మల స్మృతిచిహ్నము, మరోవైపున మీ భవిష్య సాకార దివ్య స్వరూపమైన లక్ష్మి రూపములో స్మృతిచిహ్న రూపము. ఈ దీపమాలలోని దీపాలైన మీరే దైవీ పదవిని ప్రాప్తి చేసుకుంటారు. కనుక శ్రేష్ఠ ఆత్మలైన మీరు, తమ స్మృతిచిహ్నాన్ని స్వయంగా జరుపుకుంటున్నారు.

స్లోగన్‌ :- ''నెగటివ్‌ను పాజిటివ్‌లోకి పరివర్తన చేసుకునేందుకు మీ భావనలను శుభంగా మరియు అనంతంగా చేసుకోండి ''

No comments:

Post a Comment