31-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - తండ్రి నావికుడై వచ్చారు, మీ అందరి నావలను విషయ సాగరము నుండి క్షీర సాగరములోకి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు ఈ తీరము నుండి ఆ తీరానికి వెళ్లాలి ''
ప్రశ్న :- పిల్లలైన మీరు ప్రతి ఒక్కరి పాత్ర చూస్తూ ఎవ్వరినీ నిందించరాదు - ఎందుకు?
జవాబు :- ఇది అనాదిగా తయారు చేయబడిన డ్రామా అని మీకు తెలుసు. ఈ డ్రామాలో ప్రతి పాత్రధారి ఎవరి పాత్ర వారు అభినయిస్తున్నారు. ఇందులో ఎవరి దోషమూ లేదు. ఈ భక్తిమార్గము కూడా మళ్లీ పాస్ అయ్యే తీరాలి. ఇందులో కొద్దిగా కూడా మార్పులు జరగవు.
ప్రశ్న :- ఏ రెండు శబ్ధాలలో సృష్టిచక్ర జ్ఞానమంతా ఇమిడి ఉంది?
జవాబు :- ఈ రోజు, రేపు. నిన్న మనము సత్యయుగములో ఉండేవారము. 84 జన్మల చక్రము పూర్తి చేసుకొని ఈ రోజు నరకములోకి చేరుకున్నాము. రేపు మళ్లీ మనము స్వర్గములోకి వెళ్లిపోతాము.
ఓంశాంతి. ఇప్పుడు పిల్లలు నా ముందే కూర్చొని ఉన్నారు. సేవాకేంద్రాలలో ఉన్నప్పుడు, ఉన్నతోన్నతమైన బాబా ఎదుట మేము కూర్చొని ఉన్నామని భావించరు. ఆ తండ్రే మనకు టీచరు, వారే మన నావను దాటించేవారు. వారినే గురువు అని అంటారు. ఇక్కడ మీరు సన్ముఖములో కూర్చొని ఉన్నామని భావిస్తారు. మనలను విషయ సాగరము నుండి క్షీరసాగరములోనికి తీసుకెళ్తారు. ఆవలి తీరానికి తీసుకెళ్లే తండ్రి కూడా సన్ముఖములో కూర్చొని ఉన్నారు. ఆ ఒక్క శివబాబా ఆత్మను మాతమ్రే సుపీమ్ర్ అనగా సర్వ శేష్ఠ్రమైన భగవంతుడు అని అంటారు. మనమిప్పుడు ఉన్నతోన్నతమైన భగవంతుడు శివబాబా సన్ముఖములో కూర్చొని ఉన్నామని పిల్లలైన మీకు తెలుసు. వారిప్పుడు ఈ (బహ్మ్ర) శరీరములో కూర్చొని ఉన్నారు. వారు మీ అందరినీ తీరానికి కూడా చేరుస్తారు. వారికి రథము కూడా తప్పకుండా కావాలి కదా! లేకుంటే శ్రీమతమును ఎలా ఇవ్వాలి? బాబా మన తండ్రే కాక, టీచరు, అంతేకాక ఆవలి తీరానికి తీసకెళ్లేవారు కూడా వారే. ఇప్పుడు ఆత్మలైన మనము, మన ఇల్లైన శాంతిధామానికి వెళ్తున్నాము. ఆ బాబా మనకు మార్గాన్ని చూపుతున్నారు. అక్కడ సెంటర్లలో కూర్చునేందుకు, ఇక్కడ సన్ముఖంలో కూర్చునేందుకు రాత్రికి-పగులుకు ఉన్నంత వ్యత్యాసముంది. అక్కడ సన్ముఖంలో కూర్చొని ఉన్నామని భావించరు. ఇక్కడ ఈ అనుభూతి కలుగుతుంది. ఇప్పుడింకా మనము పురుషార్థము చేస్తున్నాము. పురుషార్థము చేయించేవారికి సంతోషముంటుంది. ఇప్పుడు మనము పావనంగా అయ్యి ఇంటికి వెళ్తున్నాము. ఎలాగైతే నాటకములోని పాత్రధారులు నాటకమైపోయిందని భావిస్తారో అలా ఇప్పుడు ఆత్మలమైన మనలను తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారని మీరు తెలుసుకున్నారు. మీరు ఇంటికి ఎలా వెళ్లగలరో ఆ విధానము కూడా అర్థం చేయిస్తారు. వారు తండ్రే కాక నావను తీరానికి చేర్చే నావికుడు కూడా. ప్రపంచములోనివారు ఇలా పాడ్తారు కాని నావ అని దేనినంటారో వారికి ఏ మాత్రము తెలియదు. ఆ తండ్రి శరీరాలనేమైనా తీసుకెళ్తారా? మన ఆత్మలను తీరానికి చేరుస్తారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మ ఈ శరీరములో వేశ్యాలయము నందు విషయవైతరిణీ నదిలో పడి ఉంది. మనము వాస్తవానికి శాంతిధామములో నివసించేవారము. మనలను తీరానికి చేర్చేవారు అనగా ఇంటికి తీసుకెళ్లే తండి లభించారు. రావణుడు మీ రాజధానిని రావణుడు పూర్తిగా లాక్కున్నాడు. ఆ రాజధానిని మళ్లీ తప్పకుండా తీసుకోవాలి. అనంతమైన తండ్రి అంటున్నారు - పిల్లలూ, ఇప్పుడు మీ ఇంటిని స్మృతి చేయండి. అచ్చటికి వెళ్లి మళ్లీ క్షీరసాగరములోకి రావాలి. ఇక్కడ ఉండేది విషయసాగరము, అక్కడ ఉండేది క్షీరసాగరము, మూలవతనము శాంతిసాగరము వంటిది. మూడు ధామాలున్నాయి. ఇది దు:ఖధామము.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇలా చెప్పేదెవరు? ఎవరి ద్వారా చెప్తున్నారు? రోజంతా మధురమైన పిల్లలూ, మధురమైన పిల్లలూ అని అంటూ ఉంటారు. ఇప్పుడు ఆత్మ పతితంగా ఉంది. అందువలన శరీరము కూడా అటువంటిదే లభిస్తుంది. మనము పక్కా-పక్కా(స్వచ్ఛమైన) బంగారు ఆభరణాలుగా ఉండేవారము తర్వాత మలినము కలుస్తూ కలుస్తూ అసత్యమైపోయాము. ఇప్పుడు ఆ అసత్యము ఎలా తొలగాలి? దాని కొరకే ఈ స్మృతియాత్ర(యోగ) భట్టి. అగ్నిలో బంగారు స్వచ్ఛమౌతుంది కదా. తండ్రి మాటిమాటికి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు నేను ఇచ్చే ఈ జ్ఞానము ప్రతి కల్పము ఇస్తూ వచ్చాను. ఇది నా పాత్ర. నేను మళ్లీ 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి '' పిల్లలూ! - పవిత్రులు కండి '' అని అందరికీ చెప్తున్నాను. సత్యయుగములో కూడా ఆత్మలైన మీరు పవిత్రంగా ఉండేవారు. శాంతిధామములో కూడా ఆత్మలు పావనంగా ఉంటాయి. అది మన ఇల్లు. అది ఎంతో మధురమైన ఇల్లు. అక్కడకు పోవాలని మనుష్యులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, తల బాదుకుంటూ ఉంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇప్పుడు అందరూ వెళ్ళాల్సిందే. మళ్లీ పాత్ర చేసేందుకు రావాల్సిందే. ఇది పిల్లలు అర్థము చేసుకున్నారు. పిల్లలు దు:ఖములో ఉన్నప్పుడు - '' ఓ భగవంతుడా! మీ వద్దకు మమ్ములను తీసుకెళ్లండి, మమ్ములనెందుకు ఈ దు:ఖములో వదిలేశావు'' అని అంటారు. తండ్రి పరంధామములో ఉంటారని తెలుసు. అందుకే ''ఓ భగవంతుడా! మమ్ములను పరంధామానికి పిలుచుకొని వెళ్ళండి'' అని అంటారు. సత్యయుగములో అలా పిలువరు. అక్కడ సుఖమే సుఖముంటుంది. ఇక్కడ అనేక రకాలైన దు:ఖాలున్నాయి. అందుకే ఆత్మ 'ఓ భగవంతుడా!' అని పిలుస్తుంది. ఆత్మకు స్మృతి ఉంటుంది. కానీ భగవంతుడెవరో అసలు తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి పరిచయము లభించింది. తండ్రి ఉండేదే పరంధామములో, ఇంటినే స్మృతి చేస్తారు. రాజధానికి పోవాలని కోరరు. రాజధాని కొరకు ఎప్పుడూ పిలువరు. పరంధామములో భగవంతుని వద్ద తప్పకుండా శాంతి ఉండనే ఉంటుంది. దానిని ముక్తిధామమని అంటారు. అది ఆత్మలుండే స్థానము. అక్కడ నుండే ఆత్మలు ఇక్కడకు వస్తాయి. సత్యయుగాన్ని ఇల్లు అని అనరు. అది రాజధాని. మీరు ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. తండ్రి పిల్లలూ!-పిల్లలూ! అంటూ మనతో మాట్లాడ్తారు. పిల్లలూ, పిల్లలూ! అని అంటారు. టీచరుగా అయ్యి సృష్టి ఆది, మధ్య, అంత్యముల రహస్యాన్ని అనగా చరిత్ర - భూగోళాలను అర్థం చేయిస్తారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. మూలవతనము ఆత్మలైన మన ఇల్లు అని మీకు తెలుసు. సూక్ష్మవతనము దివ్యదృష్టికి అందేది. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలు ఇక్కడనే ఉంటాయి. మీరు పాత్రలు చేసేది కూడా ఇక్కడే. సూక్ష్మవతనములో ఏ పాత్రా లేదు. ఇది సాక్షాత్కారాల విషయం. ఈ రోజు, రేపు. ఇది బుద్ధిలో బాగా కూర్చోవాలి. నిన్న మనము సత్యయుగములో ఉండేవారము. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ, ఈ రోజు నరకములోకి వచ్చేశాము. తండ్రిని పిలిచేది కూడా నరకములోనే. సత్యయుగములో అపారమైన సుఖముంటుంది. అందువలన ఎవ్వరూ పిలవనే పిలవరు. ఇక్కడ మీరు శరీరములో ఉన్నారు. అందుకే మాట్లాడ్తారు. తండ్రి కూడా నేను అన్నీ తెలిసిన వాడను(జానీ జానన్‌హార్) అనగా ఈ సృష్టి ఆదిమధ్యాంతాలు తెలిసినవాడను అని అంటారు. కానీ మీకు ఎలా వినిపించాలి? ఆలోచించాల్సిన విషయము కదా, అందుకే తండ్రి రథము తీసుకుంటారని వ్రాయబడి ఉంది. నా జన్మ మీ జన్మ వలె కాదు అని అంటున్నారు. నేను ఇతనిలో ప్రవేశిస్తాను. రథము పరిచయము కూడా ఇస్తాను. ఈ ఆత్మ కూడా అనేక నామ-రూపాలు కలిగిన శరీరాలను ధరిస్తూ-ధరిస్తూ తమోప్రధానమైపోయింది. ఇప్పుడు అందరూ అనాథలే. ఎందుకంటే తండ్రిని గురించే తెలియదు. కావున అందరూ అనాథలైపోయారు. పరస్పరములో కొట్లాడుతూ ఉంటే, ఎందుకు కొట్టుకుంటున్నారని అడుగుతారు కదా! నన్ను అందరూ మర్చిపోయారని తండ్రి చెప్తున్నారు. ఆత్మయే అనాథలుగా అయ్యారని అంటుంది. లౌకిక తండ్రి కూడా ఇలాగే అంటారు. అనంతమైన తండ్రి కూడా అలాగే అంటారు. ఇలా చేసే తండ్రిని అర్ధకల్పము నుండి పిలుస్తూ వచ్చిన ఆ తండ్రిని రాయి-రప్పలలో ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు ఆ తండ్రి మీ ఎదురుగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. బాబా వద్దకు వచ్చామని పిల్లలైన మీరిప్పుడు భావిస్తారు. ఈ బాబాయే మనలను చదివిస్తున్నారు. మన నావను తీరానికి చేరుస్తారు. ఎందుకంటే ఈ నావ చాలా పాతదైపోయింది అందుకే ఆవలి తీరానికి చేర్చమని అంటారు. మళ్లీ మాకు క్రొత్త నావ ఇవ్వమని అడుగుతారు. పాత నావ అపాయకరమైనది. దారిలో విరిగిపోవచ్చు, ప్రమాదము జరగవచ్చు. అందుకే మా నావ పాతదైపోయిందని, క్రొత్తది ఇవ్వమని అడుగుతారు. దీనిని వస్త్రమని కూడా అంటారు, నావ అని కూడా అంటారు. బాబా, మాకు ఇటువంటి(లక్ష్మీనారాయణుల) వస్త్రము కావాలని పిల్లలంటారు.
తండ్రి అంటున్నారు - మధురమైన పిల్లలూ, స్వర్గవాసులుగా అవ్వాలని అనుకుంటున్నారా? ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత మీ వస్త్రాలు పాతవైపోతాయి. మళ్లీ కొత్త వస్త్రమునిస్తాను. ఇది ఆసురీ వస్త్రము(శరీరము). ఆత్మ కూడా ఆసురీ(పైశాచికము)గా ఉంది. మానవులు పేదవారైతే పేద వస్త్రాలే ధరిస్తారు. ధనవంతులైతే వస్త్రాలు కూడా ఖరీదైనవే ధరిస్తారు. ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడే అర్థం చేసుకున్నారు. మనము ఎవరి ముందు కూర్చొని ఉన్నామో తెలుసుకుంటే ఎంతో నషా ఎక్కుతుంది. సెంటర్లలో కూర్చుంటే అక్కడ మీకు ఈ భావముండదు. ఇక్కడ సన్ముఖములో ఉండుట వలన ఖుషీ ఉంటుంది. ఎందుకంటే తండ్రి డైరెక్టుగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. అక్కడ ఎవరైనా అర్థం చేయిస్తే బుద్ధియోగము అన్ని వైపులా పరుగెడ్తూ ఉంటుంది. తీరిక లేని పనులలో ఇరుక్కొని ఉంటామని అంటారు కదా. ఫుర్సత్(తీరిక) దొరకదని అంటారు. నేను మీకు అర్థం చేయిస్తున్నాను. బాబా ఈ నోటి ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారని మీకు కూడా తెలుసు. ఈ నోటికి కూడా ఎంతో మహిమ ఉంది. గోముఖము నుండి అమృతము తాగేందుకు ఎక్కడెక్కడికో వెళ్లి ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. ఎంతో శ్రమ కోర్చి వెళ్తారు. గోముఖమంటే ఏదో ఎవ్వరికీ తెలియదు. ఎంతో తెలివి గల మనుష్యులు కూడా అక్కడకెళ్తారు. ఇందులో లాభమేమీ లేదు. లాభము లేకపోగా ఇంకా సమయము వృథా అవుతుంది. ఈ సూర్యాస్తమయము(సన్ సెట్ పాయింట్) మొదలైనవేం చూస్తారు? ఇందులో ఏ లాభమూ లేదు. చదువుకుంటే లాభముంటుంది. గీతలో చదువుంది కదా. గీతలో హఠయోగము మొదలైన మాటలేవీ లేవు. అందులో ఉండేది రాజయోగము. మీరు రాజ్య పదవి తీసుకునేందుకు వస్తారు. ఈ ఆసురీ ప్రపంచములో కొట్లాటలు, జగడాలు మొదలైనవెన్నో ఉన్నాయి. బాబా మనలను యోగబలముతో పవిత్రంగా చేసి విశ్వ రాజ్యాధికారమునిస్తారు. దేవతలకు ఆయుధాలనిచ్చారు. వాస్తవానికి ఇందులో ఆయుధాల మాటే లేదు. కాళికా దేవిని ఎంతో భయంకరంగా చూపించారు. ఇవన్నీ మానవుల మానసిక భ్రాంతుల వలన అలా తయారు చేశారు. 4-8 భుజాలు గల దేవతలు ఉండనే ఉండరు. ఇవన్నీ భక్తి మార్గములోని విషయాలు. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఇది ఒక అనంతమైన తయారైన నాటకము. ఇందులో ఎవరినీ నిందించే మాటే లేదు. ఇది తయారైన అనాది డ్రామా. ఇందులో తేడా ఏమీ ఉండదు. జ్ఞానమంటే ఏమిటో, భక్తి అనగా ఏమిటో మనకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మీరు మళ్లీ భక్తిమార్గము ద్వారా వెళ్లాలి. ఇదే విధంగా మీరు 84 జన్మల చక్రములో తిరుగుతూ తిరుగుతూ క్రిందకు వచ్చేస్తారు. ఇది అనాదిగా తయారైన చాలా మంచి నాటకము. దీనిని గురించి తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ డ్రామా రహస్యాన్ని తెలుసుకుంటే మీరు విశ్వాధికారులుగా అవుతారు. ఇది అద్భుతము కదా! భక్తి ఎలా నడుస్తుందో, జ్ఞానమెలా నడుస్తుందో, ఈ అనాది నాటకమెలా తయారై ఉందో, ఇందులో ఏ మాత్రము మార్పుండదు. వారు బ్రహ్మములో లీనమయ్యారని అంటారు. జ్యోతి జ్యోతిలో లీనమైపోయిందని అంటారు. ఇది సంకల్పాల ప్రపంచము. ఎవరికేం తోస్తుందో అది అంటూ ఉంటారు. ఇది తయారై తయారవుతున్న డ్రామా. మానవులు సినిమాలు చూస్తున్నారు. దానిని సంకల్పాల డ్రామా(ఆట) అని అంటారా? తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఇది అనంతమైన నాటకము. ఉన్నదున్నట్లు రీపీట్(పునరావృతము) అవుతుంది. ఆ తండ్రే వచ్చి ఈ జ్ఞానమునిస్తున్నారు. ఎందుకంటే వారు జ్ఞానసాగరులు. మానవ సృష్టికి బీజరూపులు, చైతన్యము. వారే ఈ జ్ఞానమంతా తెలిసినవారు. మానవులు లక్షల సంవత్సరాల ఆయువుగా చూపించారు. అంత ఆయువు లేదని తండ్రి చెప్తున్నారు. లక్షల సంవత్సరాల సినిమా ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మీరు పూర్తిగా వర్ణించగలరు. లక్షల సంవత్సరాల మాట అయితే ఎలా వర్ణించగలరు? అందువలన అదంతా భక్తి మార్గము. భక్తి మార్గపు పాత్ర కూడా మీరే అభినయించారు. రకరకాల దు:ఖాలను అనుభవిస్తూ ఇప్పుడు చివరికి వచ్చేశారు. వృక్షమంతా శిథిలావస్థకు చేరుకుంది. ఇప్పుడు అక్కడకు వెళ్లాలి. మిమ్ములను తేలికపరచుకోండి. ఇతను కూడా స్వయాన్ని తేలిక(బంధనముక్తము)గా చేసుకున్నారు కదా. అన్ని బంధనాలు తెగిపోవాలి. లేకుంటే పిల్లలు, ధనము, ఫ్యాక్టరీలు, కొనుగోలుదారులు, రాజులు, షాహుకార్లు మొదలైనవన్నీ జ్ఞాపకము వస్తూ ఉంటాయి. ఇతను వ్యాపారమే వదిలేశారు. కావున వారెందుకు గుర్తొస్తారు? ఇక్కడ అన్నిటినీ మర్చిపోవాలి. వీటన్నిటినీ మరచి మన ఇంటిని, రాజధానిని గుర్తు చేసుకోవాలి. శాంతిధామము, సుఖధామమును స్మృతి చేయాలి. శాంతిధామము నుండి మళ్లీ మనము ఇక్కడకు రావాలి. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి. దీనినే యోగాగ్ని అని అంటారు. ఇది రాజయోగము కదా. మీరు రాజఋషులు. ఋషి అనగా పవిత్రులు. మీరు రాజ్యము కొరకు పవిత్రంగా అవుతున్నారు. ఆ తండ్రి మీకు అన్ని సత్యాలు తెలుపుతున్నారు. ఇది నాటకమని మీకు తెలుసు. పాత్రధారులంతా ఇక్కడకు తప్పకుండా రావాల్సిందే. అప్పుడు తండ్రి మళ్లీ అందరినీ తీసుకెళ్తారు. ఇది ఈశ్వరుని వివాహ ఊరేగింపు(మెరవణి). అక్కడ తండ్రి, పిల్లలు ఉంటారు. ఇక్కడకు మళ్లీ పాత్ర చేసేందుకు వస్తారు. తండ్రి సదా అక్కడే ఉంటారు. దు:ఖములో ఉన్నప్పుడే నన్ను స్మృతి చేస్తారు. అక్కడ నేనేం చేస్తాను. మిమ్ములను శాంతిధామానికి, సుఖధామములోకి పంపించాను. ఇక నాకేం కావాలి! మీరు సుఖధామములో ఉండేవారు. మిగిలిన ఆత్మలంతా శాంతిధామములో ఉండేవారు. నెంబరువారుగా వస్తూ ఉంటారు. నాటకము పూర్తి కావచ్చింది. తండి చెప్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు నిర్లక్ష్యము చేయకండి. తప్పకుండా పావనంగా అవ్వాలి. తండి చెప్తున్నారు - డామ్రానుసారము ఇతను పాత చేస్తున్నారు. మీ కొరకు డామ్రానుసారము కల్ప-కల్పము వస్తాను. ఇప్పుడు నూతన ప్రపంచములోకి వెళ్లాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. ఇప్పుడు పాత వృక్షము శిథిలావస్థకు చేరుకుంది. ఆత్మ వాపస్ ఇంటికి వెళ్లాలి. అందువలన స్వయాన్ని బంధనముక్తము గావించుకొని తేలికగా చేసుకోవాలి. ఇక్కడిదంతా బుద్ధి ద్వారా మర్చిపోవాలి.
2. అనాది డ్రామాను బుద్ధిలో ఉంచుకొని ఏ పాత్రధారినీ నిందించరాదు. డ్రామా రహస్యాన్ని అర్థము చేసుకొని విశ్వాధికారులుగా అవ్వాలి.
వరదానము :- '' బుద్ధితో పాటు సహయోగమనే చెయ్యి ద్వారా ఆనందాన్ని అనుభవం చేసే భాగ్యశాలి ఆత్మా భవ ''
లాగైతే సహయోగానికి గుర్తుగా చేతిలో చేతిని చూపిస్తారో అలా తండ్రికి సదా సహయోగిగా అవ్వాలి - ఇదే చేతిలో చేయి వేయడం. సదా బుద్ధి ద్వారా జతలో (తోడుగా) ఉండాలి. అనగా మనసు ఒక్కరితోనే లగ్నమై ఉండాలి. సదా ఈశ్వరీయ గార్డెన్‌లో చేతిలో చేయి వేసి జతలో నడుస్తున్నామనే స్మృతి ఉండాలి. తద్వారా సదా మనోరంజనంలో ఉంటారు. సదా సంతోషంగా, సంపన్నంగా ఉంటారు. ఇటువంటి భాగ్యశాలి ఆత్మలు సదా ఆనందాన్ని అనుభవం చేస్తూ ఉంటారు.
స్లోగన్ :- '' ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకునే సాధనం - సంతుష్టంగా ఉండాలి, సంతుష్ట పరచాలి. ''
No comments:
Post a Comment