Wednesday, October 23, 2019

Telugu Murli 24/10/2019

24-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

''మధురమైన పిల్లలారా - మిమ్ములను దు:ఖధామము నుండి సన్యాసము చేయించేందుకే తండ్రి వచ్చారు, ఇదే బేహద్‌ సన్యాసము ''

ప్రశ్న :- ఆ సన్యాసుల సన్యాసానికి, మీ సన్యాసానికి గల ముఖ్యమైన వ్యత్యాసమేది ?
జవాబు :- ఆ సన్యాసులు ఇల్లు-వాకిలి వదిలి అడవికి వెళ్తారు, కానీ మీరు ఇల్లు-వాకిలి వదలి అడవికి వెళ్లరు. ఇంటిలో ఉంటూ పూర్తి ప్రపంచాన్నిముళ్ల అడవిగా భావిస్తారు. మీరు బుద్ధి ద్వారా పూర్తి పప్రంచాన్నంతా సన్యసిస్తారు.

ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు ప్రతి రోజూ అర్థం చేయిస్తారు ఎందుకంటే అర్ధకల్పపు అవివేకులు(తెలివిహీనులు) కదా. కనుక ప్రతిరోజూ అర్థం చేయించవలసి వస్తుంది. మొట్టమొదట మనుష్యులకు శాంతి కావాలి. ఆత్మలందరూ వాస్తవానికి శాంతిధామ నివాసులు. తండ్రి సదా శాంతిసాగరులు. ఇప్పుడు మీరు శాంతి వారసత్వమును ప్రాప్తి చేసుకుంటున్నారు. శాంతిదేవా........... అని అంటారు కదా. అనగా మమ్ములను ఈ సృష్టి నుండి మా ఇల్లైన శాంతిధామానికి తీసుకెళ్లండి లేక శాంతి వారసత్వమును ఇవ్వండి అని అర్థము. దేవతల ముందుకు, శివబాబా ముందుకు వెళ్లి శాంతినివ్వండి అని అడుగుతారు ఎందుకంటే శివబాబా శాంతిసాగరులు. ఇప్పుడు మీరు శివబాబా నుండి శాంతి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతిధామములోనికి తప్పకుండా వెళ్లాలి. స్మృతి చేయకపోయినా తప్పకుండా వెళ్తారు. పాప భారము తల పై ఉంది, అది సమాప్తమవ్వాలని స్మృతి చేస్తారు. సుఖ-శాంతులు ఒక్క తండ్రి నుండే లభిస్తాయి. ఎందుకంటే వారు సుఖ-శాంతుల సాగరులు. శాంతియే ముఖ్యమైనది. శాంతిని ముక్తి అని కూడా అంటారు. జీవన్ముక్తి మరియు జీవన బంధనము కూడా ఉంది. ఇప్పుడు మీరు జీవన బంధనము నుండి జీవనముక్తులుగా అవుతున్నారు. సత్యయుగములో ఏ బంధనాలూ ఉండవు. సహజ జీవన్ముక్తి, సహజ గతి-సద్గతి అని మహిమ కూడా చేస్తారు. ఇప్పుడు రెండింటి అర్థము పిల్లలైన మీరు తెలుసుకున్నారు. గతి అని శాంతిధామాన్ని, సద్గతి అని సుఖధామాన్ని అంటారు. సుఖధామము, శాంతిధామము తర్వాత ఇది దు:ఖధామము. మీరిక్కడ కూర్చుని ఉన్నారు, తండ్రి చెప్తున్నారు - పిల్లలారా, ఇల్లైన శాంతిధామమును స్మృతి చేయండి. ఆత్మలు తమ ఇంటిని మర్చిపోయారు. తండ్రి గుర్తు చేయిస్తున్నారు. ఓ ఆత్మిక పిల్లలారా! - మీరు ఎంతవరకు నన్ను స్మృతి చేయరో అంతవరకు ఇంటికి వెళ్లలేరు అని అర్థం చేయిస్తున్నారు. స్మృతి ద్వారా మీ పాపాలు భస్మమైపోతాయి. ఆత్మ పవితంగా అయ్యి మళ్లీ తన ఇంటికి వెళ్తుంది. ఇది అపవిత్ర ప్రపంచమని పిల్లలైన మీకు తెలుసు. పవిత్రమైన మనుష్యులు ఒక్కరు కూడా లేరు. పవిత్రమైన ప్రపంచాన్ని సత్యయుగమని, అపవిత్ర ప్రపంచమును కలియుగమని అంటారు. రామరాజ్యము, రావణ రాజ్యము అని కూడా అంటారు. రావణ రాజ్యము ప్రారంభము నుండి అపవిత్ర ప్రపంచము స్థాపన అవుతుంది. ఇది తయారైన ఆట కదా. ఈ విషయాలు బేహద్‌ తండ్రి అర్థం చేయిస్తారు. వారినే 'సత్యము' అని అంటారు. సత్యమైన విషయాలు మీరు సంగమ యుగములోనే వింటారు. తర్వాత మీరు మళ్లీ సత్యయుగానికి వెళ్తారు. ద్వాపరము నుండి మళ్లీ రావణ రాజ్యము స్థాపనవుతుంది. రావణుడు అనగా అసురుడు, అసురులు ఎప్పుడూ సత్యము చెప్పరు. అందుకే దీనిని అసత్య మాయ, అసత్య కాయము............ అని అంటారు. ఆత్మ కూడా అసత్యంగా అయ్యింది కనుక శరీరము కూడా అసత్యమైనది. ఆత్మలో సంస్కారము నిండుతుంది కదా. నాలుగు ధాతువులు(లోహాలు) ఉన్నాయి కదా. బంగారము, వెండి, తామ్రము, ఇనుము.... మలినమంతా తొలగిపోతుంది. ఈ యోగబలము ద్వారా మీరు సత్యమైన బంగారుగా అవుతారు. మీరు సత్యయుగములో ఉన్నప్పుడు సత్యమైన బంగారుగా ఉండేవారు. తర్వాత వెండి చేరినప్పుడు చంద్ర వంశీయులని అనబడ్తారు. తర్వాత తామమ్రు, ఇనుముల మలినాలు, ద్వాపర కలియుగాలలో చేరుతాయి. యోగము ద్వారా మీలో చేరిన వెండి, తామ్రము, ఇనుముల మలినాలు తొలగిపోతాయి. మొదట ఆత్మలైన మీరంతా శాంతిధామంలో ఉండేవారు. అక్కడి నుండి మొట్టమొదట సత్యయుగములోకి వస్తారు, దానిని స్వర్ణిమ యుగమని అంటారు. మీరు సత్యమైన బంగారుగా ఉండేవారు. యోగబలము ద్వారా మలినాలు పూర్తిగా తొలగి సత్యమైన బంగారు మిగులుతుంది. శాంతిధామాన్ని స్వర్ణిమ యుగమని అనరు. స్వర్ణ యుగము, వెండి యుగము, తామ్ర యుగము అని ఇక్కడే అంటారు. శాంతిధామములో శాంతి ఉంటుంది, ఆత్మ ఎప్పుడు శరీరము తీసుకుంటుందో అప్పుడు స్వర్ణ యుగపు ఆత్మ అని అనబడ్తుంది. తర్వాత సృష్టియే స్వర్ణ యుగమైపోతుంది. సతోప్రధానమైన పంచ తత్వాలతో శరీరము తయారవుతుంది. ఆత్మ సతోప్రధానమైనప్పుడు శరీరము కూడా సతోప్రధానంగా అవుతుంది. తర్వాత చివర్లో ఇనుపయుగ శరీరము లభిస్తుంది, ఎందుకంటే ఆత్మలో మలినము చేరుతుంది. కనుక స్వర్ణిమ యుగము, వెండి యుగము అని ఈ సృష్టినే అంటారు.
కనుక ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి? మొట్టమొదట శాంతిధామానికి వెళ్లాలి కనుక తండ్రిని స్మృతి చేయాలి. అప్పుడే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. ఇందులో తండ్రి ఇక్కడ ఎంత సమయము ఉంటారో, అంత సమయము పడ్తుంది. వారు స్వర్ణ యుగములో పాత్ర చేయరు. ఆత్మకు ఎప్పుడు శరీరము లభిస్తుందో అప్పుడది స్వర్ణయుగ జీవాత్మ అని అంటారు. స్వర్ణ యుగ ఆత్మ అని అనరు. స్వర్ణ యుగ జీవాత్మయే తర్వాత వెండి యుగ జీవాత్మగా అవుతుంది. మీరిక్కడ కూర్చుని ఉన్నారు. మీకు శాంతితో పాటు సుఖము కూడా ప్రాప్తి అవుతుంది. కనుక ఏం చేయాలి? దు:ఖధామ సన్యాసము. దీనిని అనంతమైన సన్యాసము అని అంటారు. ఆ సన్యాసులది హద్దు సన్యాసము, ఇల్లు-వాకిలి వదిలి అడవికి వెళ్లిపోతారు. ఈ పూర్తి సృష్టి అంతా అడవే అని వారికి తెలియదు. ఇది ముళ్ల అడవి. ఇది ముళ్ల ప్రపంచము, అది పుష్పాల ప్రపంచము. వారు భలే సన్యాసిస్తారు. కానీ ముళ్ల ప్రపంచములో, అడవిలో పట్టణాలకు దూరంగా వెళ్లి ఉంటారు. వారిది నివృత్తి మార్గము, మీది ప్రవృత్తి మార్గము. మీరు పవిత్ర జంటగా ఉండేవారు, ఇప్పుడు అపవిత్రంగా అయ్యారు. దానిని గృహస్థాశ్రమము అని కూడా అంటారు. సన్యాసులైతే తర్వాత వస్తారు. ఇస్లాం మతస్థులు, బౌద్ధులు కూడా తర్వాత వస్తారు. క్రైస్తవులకు కొంచెం ముందుగా వస్తారు. నుక ఈ వృక్షాన్ని కూడా స్మృతి చేయాలి, చక్రాన్ని కూడా స్మృతి చేయాలి. తండ్రి కల్ప-కల్పము వచ్చి కల్పవృక్ష జ్ఞానాన్ని ఇస్తారు ఎందుకంటే స్వయం బీజరూపులు, సత్యమైనవారు చైతన్యమైనవారు. కనుక కల్ప-కల్పము వచ్చి కల్పవృక్షము గురించిన పూర్తి రహస్యాన్ని అర్థం చేయిస్తారు. మీరు ఆత్మలు, కానీ మిమ్ములను జ్ఞానసాగరులు, సుఖసాగరులు, శాంతిసాగరులు అని అనరు. ఈ మహిమ ఒక్క తండ్రిది మాత్రమే. వారే మిమ్ములను ఇలా తయారు చేస్తారు. తండ్రికి గల ఈ మహిమ సదా కాలానికి చెందినది. వారు సదా పవిత్రులు, నిరాకారులు. పావనంగా తయారు చేసేందుకు కేవలం కొద్ది సమయానికి మాత్రమే వస్తారు. 'సర్వవ్యాపి' మాటే లేదు. తండ్రి సదా అక్కడే ఉంటారని మీకు తెలుసు. భక్తిమార్గములో సదా వారిని స్మృతి చేస్తారు. సత్యయుగములో అయితే స్మృతి చేసే అవసరమే లేదు. రావణ రాజ్యములో మీరు పిలవడం ప్రారంభమవుతుంది. వారే వచ్చి సత్యమైన సుఖ-శాంతులనిస్తారు. కనుక మళ్లీ తప్పకుండా అశాంతి సమయములో వారి స్మృతి వస్తుంది. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత నేను వస్తానని తండ్రి అర్థం చేయిస్తారు. అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దు:ఖము ఉంటుంది. అర్ధకల్పము తర్వాతనే రావణ రాజ్యము ప్రారంభమవుతుంది. ఇందులో మొదటి నంబరు ముఖ్యమైనది దేహాభిమానము. దాని తర్వాతనే వేరే వేరే వికారాలు వస్తాయి. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి దేహీ - అభిమానులుగా అవ్వండి అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఆత్మ పరిచయము కూడా అవసరము. ఆత్మ భృకుటి మధ్యలో మెరుస్తూ ఉంటుందని మనుష్యులు కేవలం నోటితో చెప్తారు. అది అకాలమూర్తి అని, ఆ అకాలమూర్తి ఆత్మ ఉండు సింహాసనము ఈ శరీరము అని మీకు తెలుసు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది. అకాలమూర్తికి ఇది సింహాసనము, అందరూ చైతన్య అకాల సింహాసనాలే. అమృత్‌సర్‌లో చెక్కతో చేయబడిన సింహాసనము ఏదైతే ఉందో అది అకాలసింహానము కాదు. ఎందరు మనుష్యమాత్రులున్నారో వారందరికి వారి వారి అకాల సింహాసనాలున్నాయి అని తండ్రి తెలియజేశారు. ఆత్మ ఇక్కడకు వచ్చి అందులో విరాజమానమౌతుంది. సత్యయుగమైనా, కలియుగమైనా ఆత్మ సింహాసనము ఈ మనుష్య శరీరమే. కావున ఎన్ని అకాలసింహానాలు ఉన్నాయి. ఎంతమంది మనుష్యులున్నారో అన్ని అకాల సింహాసనాలున్నాయి. ఆత్మ ఒక సింహాసనాన్ని వదిలి వెంటనే మరొకటి తీసుకుంటుంది. మొదట చిన్న సింహాసనముంటుంది, తర్వాత పెద్దదవుతుంది. ఈ శరీర రూపీ సింహాసనము చిన్నదిగా, పెద్దదిగా అవుతుంది. సిక్కులు చెక్కతో చేసిన అకాల సింహాసనము చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. మనుష్య మాత్రులందరి అకాల సింహాసనము ఈ భృకుటి స్థానము అని ఎవ్వరికీ తెలియదు. ఆత్మ అకాల్‌ అనగా ఎప్పుడూ వినాశనమవ్వదు. ఆత్మకు భిన్న భిన్న సింహాసనాలుంటాయి. సత్యయుగములో మీకు చాలా ఫస్ట్‌క్లాస్‌ సింహాసనము లభిస్తుంది. దానిని స్వర్ణ యుగ సింహాసనము అని అంటారు. తర్వాత ఆ ఆత్మకు వెండి, తామ్ర, లోహపు సింహాసనాలు లభిస్తాయి. స్వర్ణిమ యుగ సింహాసనము లభించాలంటే తప్పకుండా పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది. కనుక తండ్రి చెప్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేస్తే మీలోని మలినము తొలగిపోతుంది. తర్వాత మళ్లీ మీకు ఇలాంటి దైవీ సింహాసనము లభిస్తుంది. ఇప్పుడున్న బ్రాహ్మణ కుల సింహాసనము పురుషోత్తమ సంగమయుగ సింహాసనము. తర్వాత ఆత్మకు ఈ దేవతా సింహాసనము లభిస్తుంది. ఈ విషయాలు ప్రపంచములోని మనుష్యులకు తెలియదు. దేహాభిమానములోకి వచ్చిన తర్వాత ఒకరికొకరు దు:ఖాన్నిచ్చుకుంటూ ఉంటారు. కనుక దీనిని దు:ఖధామము అని అంటారు. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మీ వాస్తవ నివాస స్థానమైన శాంతిధామాన్ని స్మృతి చేయండి. సుఖధామాన్ని స్మృతి చేయండి, దీనిని మర్చిపోండి. దీని పై వైరాగ్యము రావాలి. అలాగని సన్యాసుల వలె ఇల్లు-వాకిలి వదిలి పెట్టరాదు. వారిది ఒకవైపు మంచిది, మరొక వైపు చెడ్డది. మీది మాత్రము అన్ని రకాలా మంచిదే అని తండ్రి చెప్తున్నారు. వారి హఠయోగము మంచిది, చెడ్డది కూడా. ఎందుకంటే దేవతలు ఎప్పుడైతే వామమార్గములోకి వెళ్తారో అప్పుడు భారతదేశాన్ని అదుపు చేసేందుకు పవిత్రత తప్పకుండా అవసరము. కనుక అందులో కూడా సహయోగము చేస్తారు. భారతదేశమే అవినాశి ఖండము. తండ్రి కూడా ఇక్కడే వస్తారు. కనుక ఎక్కడైతే బేహద్‌ తండ్రి వసారో, అది అన్నిటికంటే పెద్ద తీర్థ స్థానమయింది కదా. తండ్రియే వచ్చి సర్వులకు సద్గతినిస్తారు. కనుక భారతదేశమే అత్యున్నతమైన దేశము.
ముఖ్యమైన విషయము తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలారా, స్మృతియాత్రలో ఉండండి. గీతలో కూడా 'మన్మనాభవ' అనే శబ్ధము ఉంది. కానీ తండ్రి సంస్కృతమేమీ తెలుపరు. తండ్రి 'మన్మనాభవ' అర్థాన్ని తెలియజేస్తున్నారు. సర్వ దేహ ధర్మాలను వదిలి స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి. ఆత్మ అవినాశి, అది ఎప్పుడూ చిన్నదిగా - పెద్దదిగా అవ్వదు. అందులో అనాది, అవినాశి పాత్ర నిండి ఉంది. ఇది తయారైన డ్రామా. చివర్లో ఏ ఆత్మలైతే వస్తారో వారికి చాలా కొద్ది పాత్ర మాత్రమే ఉంటుంది. మిగిలిన సమయమంతా శాంతిధామములో ఉంటారు. స్వర్గములోకైతే రాలేరు. చివర్లో వచ్చేవారు ఇక్కడే కొద్దిగా సుఖము, కొద్దిగా దు:ఖము పొందుతారు. ఎలాగైతే దీపావళి సమయంలో దోమలు లెక్కలేనన్ని వెలువడి ఉదయము లేచి చూచేసరికి అన్ని దోమలు మరణించి ఉంటాయో, అలా మనుష్యులది కూడా ఇలాగే. చివర్లో వచ్చేవారికి విలువ ఏం విలువ ఉంటుంది? పశువుల వలె ఉంటారు. కనుక తండ్రి వచ్చి ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుందో అర్థం చేయిస్తున్నారు. మనుష్య సృష్టి రూపీ వృక్షము చిన్నది - పెద్దదిగా, పెద్దది - చిన్నదిగా ఎలా అవుతుంది! సత్యయుగములో ఎంత కొద్దిమంది మనుష్యులుంటారు! కలియుగములో ఎంత వృద్ధి జరిగి వృక్షము ఎంత పెద్దదవుతుంది! తండ్రి సూచిస్తున్న ముఖ్య విషయము - గృహస్థ వ్యవహారములో ఉంటూ నన్నొక్కరినే స్మృతి చేయండి. 8 గంటలు స్మృతిలో ఉండే అభ్యాసము చేయండి. స్మృతి చేస్తూ చేస్తూ చివరికి పవితంగా అయ్యి తండి వద్దకు వెళ్లిపోతే స్కాలర్‌షిప్‌ కూడా లభిస్తుంది. ఒకవేళ ఇంకా పాపం మిగిలి ఉంటే మళ్లీ జన్మ తీసుకోవలసి పడ్తుంది. శిక్షలు అనుభవించవలసి వస్తుంది అంతేకాక పదవి కూడా తగ్గిపోతుంది. అందరూ లెక్కాచారాన్ని ముగించుకోవాలి. మనుష్యమాత్రులందరూ ఇప్పటివరకు జన్మ తీసుకుంటూనే ఉన్నారు. ఈ సమయములో చూసినట్లైతే భారతవాసుల కంటే క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా ఉంది. వారు ఎక్కువ వివేకవంతులుగా కూడా ఉన్నారు. భారతవాసులు 100 శాతము వివేకవంతులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్లీ అవివేకులుగా అయ్యారు. ఎందుకంటే వీరే 100 శాతము సుఖాన్ని పొందుతారు. మళ్లీ 100 శాతము దు:ఖాన్ని కూడా వీరే పొందుతారు. ఇతరులు రావడమే చివరిలో వస్తారు.
తండ్రి అర్థం చేయించారు - క్రైస్తవ రాజ్యానికి, కృష్ణుని రాజ్యముతో సంబంధముంది. క్రైస్తవులు రాజ్యము లాక్కున్నారు మళ్లీ క్రైస్తవుల ద్వారానే రాజ్యము లభించాలి. ఈ సమయములో క్రైస్తవుల ప్రభావముంది. వారికి భారతదేశము నుండి సహయోగము లభిస్తుంది. ఇప్పుడు భారతదేశము ఆకలితో ఉంది. కనుక రిటర్న్‌ సర్వీసు జరుగుతోంది. ఇక్కడ నుండి చాలా ధనము, చాలా వజ్ర వైడూర్యాలు మొదలైనవి అక్కడకు తీసుకెళ్లారు. చాలా ధనవంతులుగా అయ్యారు కనుక ఇప్పుడు మళ్లీ ఇక్కడకు ధనాన్ని చేరుస్తూ ఉంటారు. ఈ ధనం వారికేమీ వాపస్‌ లభించదు. ఇప్పుడు పిల్లలైన మిమ్ములను ఎవ్వరూ గుర్తించలేరు. ఒకవేళ గుర్తించినట్లైతే వచ్చి సలహా తీసుకునేవారు. మీరు ఈశ్వరుని మతానుసారము నడిచే ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారు. వారే మళ్లీ ఈశ్వరీయ సంప్రదాయము నుండి దైవీ సంప్రదాయము వారిగా అవుతారు. మళ్లీ క్షత్రియ, వైశ్య, శూద్ర సంప్రదాయము వారిగా అవుతారు. ఇప్పుడు మనము బ్రాహ్మణులము. మనమే దేవతలము, మనమే క్షత్రియులు....... మనమే(హమ్‌ సో) అను శబ్ధార్థము ఎంత బాగుందో చూడండి. ఇది బాజోలి (పల్టీల ఆట, పిల్లి మొగ్గల ఆట). దీనిని అర్థము చేసుకోవడం చాలా సహజము. అయితే మాయ మరపింపజేస్తుంది. మళ్లీ దైవీ గుణాల నుండి ఆసురీ గుణాలలోకి తీసుకెళ్తుంది. అపవిత్రులుగా అవ్వడం ఆసురీ గుణము కదా. మంచిది.
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. స్కాలర్‌షిప్‌ తీసుకునేందుకు గృహస్థ వ్యవహారములో ఉంటూ తక్కువలో తక్కువ 8 గంటలు తండ్రిని స్మృతి చేసే అభ్యాసము చేయాలి. స్మృతి చేసే అభ్యాసము ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి, స్వర్ణిమ యుగ సింహాసనము కూడా లభిస్తుంది.
2. ఈ దు:ఖధామము పై బేహద్‌ వైరాగ్యము కలిగి మీ నిజ నివాస స్థానమైన శాంతిధామము మరియు సుఖధామాలను స్మృతి చేయాలి. దేహాభిమానానికి వశమై మీరెవ్వరికీ దు:ఖమునివ్వరాదు.

వరదానము :- '' ఆత్మిక ప్రియుని ఆకర్షణలో ఆకర్షితమై శ్రమ నుండి ముక్తంగా ఉండే ఆత్మిక ఆశిక్‌ (ప్రేయసి) భవ ''
ప్రియుడు తన నుండి దూరమైన ప్రేయసులను చూసి సంతోషిస్తారు. ఆత్మిక ఆకర్షణతో ఆకర్షితులై మీ సత్యమైన ప్రియుని తెలుసుకున్నారు, పొందుకున్నారు, యథార్థమైన ఆధారము పైకి చేరుకున్నారు. ఎప్పుడైతే ఇటువంటి ప్రేయసి ఆత్మలు ఈ ప్రేమ రేఖ లోపలికి చేరుకుంటారో అప్పుడు అనేక ప్రకారాలైన శ్రమ నుండి విడుదల అవుతారు. ఎందుకంటే ఇక్కడ జ్ఞానసాగరుని స్నేహ అలలు, శక్తి అలలు............ సదా కొరకు రిఫ్రెష్‌ చేసేస్తాయి. ఇది మనోరంజనానికి విశేషమైన స్థానము, కలుసుకునే స్థానము. దీనిని ప్రేయసులైన మీ కొరకు ప్రియుడు తయారు చేశారు.

స్లోగన్‌ :- '' ఏకాంతవాసులుగా అవ్వడంతో పాటు ఏక్‌నామీ మరియు ఎకానమి వారిగా అవ్వండి ''

No comments:

Post a Comment