16-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము
'' మధురమైన పిల్లలారా - ఆత్మలోని వికారాల మలినాలను తొలగించుకొని శుద్ధమైన పుష్పాలుగా అవ్వండి. బాబా స్మృతి ద్వారానే మలినాలు పూర్తిగా తొలగిపోతాయి ''
ప్రశ్న :- పవిత్రంగా అయ్యే పిల్లలు ఏ విషయములో బాబాను అనుసరించాలి ?
జవాబు :- బాబా పవిత్రమైనవారు. వారెప్పుడూ అపవిత్ర మలిన మనుష్యులతో కలవరు. ఇది చాలా చాలా రహస్యమైన విషయము. అలాగే పవిత్రులు గా అవుతున్న పిల్లలైన మీరు కూడా బాబాను అనుసరించండి. చెడును చూడకండి,..........
ఓంశాంతి. బాబా కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వీరిరువురూ తండ్రులే. ఒకరిని ఆత్మిక తండ్రి అని, మరొకరిని దేహధారి తండ్రి అని అంటారు. శరీరము ఇరువురికీ ఒక్కటే. కనుక ఇరువురు తండ్రులు చేయిస్త్తున్నట్లే. భలే ఒకరు అర్థం చేయిస్తారు, మరొకరు అర్థం చేసుకుంటారు. అయినా ఇరువురూ అర్థం చేయిస్తున్నారని అంటారు. ఇంత చిన్న ఆత్మలో ఎంత మలినము చేరి ఉంది! మలినము చేరడం వలన ఎంత నష్టము వాటిల్లుతుంది! ఈ లాభ-నష్టాలు చూసేందుకు శరీరముతో ఉన్నప్పుడే వీలౌతుంది. ఆత్మలైన మనము పవితంగా అయినప్పుడు ఈ లక్ష్మీనారాయణుల వంటి పవిత శరీరము లభిస్తుందని మీకు తెలుసు. ఇప్పుడు ఆత్మలో ఎంత మలినము చేరుకొని ఉంది! తేనెను తీయునప్పుడు, దానిని వడపోయునప్పుడు ఎంత మలినము వస్తుంది. తర్వాత శుద్ధమైన తేనె వెలికి వస్తుంది. ఆత్మ కూడా చాలా మలినమైపోతుంది. ఆత్మ కంచన(బంగారు) సమానంగా, పూర్తి పవిత్రంగా ఉండేది. శరీరము ఎంత సుందరంగా ఉండేది! ఈ లక్ష్మీనారాయణుల శరీరము ఎంత సుందరంగా ఉందో చూడండి. మనుష్యులు శరీరమునే పూజిస్తారు కదా. ఆత్మ వైపు చూడరు. ఆత్మను గురించి తెలియనే తెలియదు. ఆత్మ సుందరంగా ఉండేది. అప్పుడు శరీరము కూడా సుందరమైనదే లభిస్తుంది. ఇప్పుడు మీరు కూడా అలా అవ్వాలనుకుంటున్నారు. కనుక ఆత్మ ఎంత శుద్ధంగా ఉండాలి. తమోపధ్రానమని ఆత్మనే అంటారు. ఎందుకంటే అందులో మలినము పూర్తిగా నిండి ఉంది. ఒకటి దేహాభిమానపు మలినము, రెండవది కామ-కోధ్రాల మలినము. మలినాలు తొలగించేందుకు వడపోయవలసి ఉంటుంది కదా. వడపోయడం ద్వారా రంగే పరివర్తనైపోతుంది. మీరు బాగా కూర్చుని విచారము చేసినట్లైతే చాలా మలినము నిండి ఉందని అనుభవమవుతుంది. ఆత్మలో రావణుని ప్రవేశత ఉంది. ఇప్పుడు మీరు బాబా స్మృతిలో ఉండుట ద్వారానే మలినము తొలగుతుంది. ఇందుకు కూడా సమయము పడ్తుంది. దేహాభిమానము కారణంగా వికారాల మలినము ఎంత ఉందో తండ్రి అర్థం చేయిస్తున్నారు. క్రోధ మలినము కూడా తక్కువైనదేమీ కాదు. క్రోధి ఆంతరికంగా కాలిపోతూ ఉంటాడు. ఏదో ఒక విషయాన్ని గురించి హృదయము కాలుతూ ఉంటుంది. ముఖము కూడా రాగి వలె(ఎర్రగా) ఉంటుంది. మన ఆత్మ దహింపబడిందని మీకు తెలుసు. ఆత్మలో ఎంత మలినముందో ఇప్పుడు తెలిసింది. ఈ విషయాలను అర్థము చేసుకునేవారు కూడా చాలా కొద్ది మంది మాత్రమే. ఇందులో ఫస్ట్‌క్లాస్ పుష్పాలు అవసరము కదా. ఇప్పుడు చాలా లోపాలున్నాయి. మీరు అన్ని లోపాలను తొలగించుకుని పూర్తి పవిత్రంగా అవ్వాలి కదా. ఈ లక్ష్మీనారాయణులు ఎంత పవిత్రమైనవారు. వాస్తవానికి వారిని చేతితో స్పర్శించే అధికారము కూడా లేదు. పతితులు వెళ్లి అంత శ్రేష్ఠమైన పవిత్ర దేవతల పై చేయి వెయ్యలేరు. చెయ్యి వేసే యోగ్యత మరియు అర్హత కూడా లేదు. శివుని పై చేయి వెయ్యలేరు. వారు నిరాకారులు. వారికి చెయ్యే తగలదు. వారు పరమ పవిత్రులు. వారి ప్రతిమను పెద్దదిగా ఉంచేశారు. ఎందుకంటే అంత చిన్న బిందువును ఎవ్వరూ తాకేందుకు కూడా సాధ్యము కాదు. ఆత్మ శరీరములో ప్రవేశించినప్పుడు శరీరము పెద్దదిగా ఉంటుంది. ఆత్మ పెద్దదిగా, చిన్నదిగా ఉండదు. ఇది మురికి ప్రపంచము. ఆత్మలో ఎంత మలినము ఉంది! శివబాబా చాలా గుప్తమైనవారు. అత్యంత పవిత్రమైనవారు. ఇక్కడ అందరినీ ఒకే విధంగా చేసేస్తారు. ఒకరినొకరు నీవు పశువు................ అని కూడా అనుకుంటూ ఉంటారు. సత్యయుగములో ఇలాంటి భాష ఉండదు. ఆత్మలో చాలా మలినము చేరి ఉందని ఇప్పుడు మీరు అనుభవము చేస్తారు. తండిన్రి స్మృతి చేసేందుకు ఆత్మకు యోగ్యత కూడా లేదు. అయోగ్యులని తెలుసుకొని మాయ కూడా ఒక్కసారిగా వారిని తొలగించి వేస్తుంది.
తండ్రి ఎంత గుప్తమైనవారు. ఆత్మలమైన మనము ఎలా ఉండేవారము. ఎలా అవుతున్నాము. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఆత్మను శుద్ధంగా చేసేందుకే మీరు నన్ను పిలిచారు. ఎంత మలినము నిండి ఉంది! తోటలో అన్నీ ఫస్ట్‌క్లాస్ పుష్పాలే ఉండవు, నెంబరువారుగా ఉంటాయి. బాబా తోట యజమాని. ఆత్మ ఎంత పవిత్రంగా అవుతుంది. మళ్లీ ఎంత మలినంగా, పూర్తి ముల్లుగా తయారవుతుంది. ఆత్మలోనే దేహాభిమాన మలినము, కామ-క్రోధాల మలినము నిండుతుంది. క్రోధము కూడా మనుష్యులలో ఎంతగా ఉంది! మీరు పవిత్రంగా అవుతే ఎవరి ముఖాలను చూచేందుకు కూడా ఇష్టముండదు. చెడును చూడకండి, అపవిత్రులను చూడరాదు. ఆత్మ పవిత్రమై పవిత్రమైన కొత్త శరీరాన్ని తీసుకున్నప్పుడు మలినాన్ని చూడనే చూడదు. ఈ మురికి ప్రపంచమే సమాప్తమైపోతుంది. తండ్రి చెప్తున్నారు - మీరు దేహాభిమానములోకి వచ్చి ఎంత మలినంగా తయారయ్యారు, పతితులయ్యారు. ''బాబా మాలో క్రోధ భూతముంది, బాబా మేము పవిత్రంగా అయ్యేందుకు మీ వద్దకు వచ్చాము'' అని పిల్లలు పిలుస్తూ ఉంటారు. బాబా సదా పవిత్రులని తెలుసు. అలాంటి సర్వ శ్రేష్ఠ అథారిటీని సర్వవ్యాపి అని ఎంత అగౌరవపరచారు! మేము ఎలా ఉండేవారము. మళ్లీ ఎలాంటివారము ఎలా తయారవుతున్నామని మీ పై మీకే ఏవగింపు కలుగుతుంది. ఈ మాటలు పిల్లలైన మీరు మాత్రమే అర్థము చేసుకుంటారు. వేరే ఇతర సత్సంగాలలో, విశ్వవిద్యాలయాలలో ఎక్కడా ఇలాంటి లక్ష్యము గురించి ఎవ్వరూ చెప్పరు. ఆత్మలో మలినము ఎలా నిండుతూ వచ్చిందో మీరు తెలుసుకున్నారు. రెండు కళలు తగ్గిపోయాయి. తర్వాత నాలుగు కళలు తగ్గిపోయాయి. మలినము నిండుతూ వచ్చింది. అందుకే తమోప్రధానమని చెప్పబడ్తుంది. కొందరు లోభములో, మరి కొందరు మోహములో కాలి మరణిస్తారు. ఈ స్థితిలోనే కాలి మరణిస్తారు. ఈ లక్ష్మీ-నారాయణులను బాబాయే ఇలా తయారుచేశారు. కనుక స్వయం ఎంత అప్రమత్తంగా ఉండాలి. తుఫానులు చాలా వస్తూ ఉంటాయి. మాయ తుఫానులే వస్తుంటాయి. వేరే తుఫానులు రావు. ఉదాహరణానికి శాస్త్రాలలో హనుమంతుడు మొదలైనవారి కథలు వ్రాశారు కదా. భగవంతుడు శాస్త్రాలను తయారు చేశారని అంటారు. భగవంతుడు సర్వ వేద శాస్త్రాల సారాన్ని వినిపిస్తున్నారు. భగవంతుడు సద్గతినిచ్చారు. వారికి శాస్త్రాలను తయారు చేసే అవసరమేముంది? ఇప్పుడు తండ్రి చెడును వినకండి అని చెప్తున్నారు. ఈ శాస్త్రాలు మొదలైనవాటి ద్వారా మీరు శ్రేష్ఠంగా తయారవ్వలేరు. నేను ఈ అన్నింటి నుండి భిన్నంగా ఉన్నాను. నన్ను ఎవ్వరూ గుర్తించలేరు. తండ్రి ఎవరో, వారు ఏమిటో, ఎవ్వరికీ తెలియదు. ఎవరెవరు సర్వీసు చేస్తారో అనగా కళ్యాణకారులుగా అయ్యి ఇతరులకు కూడా కళ్యాణము చేస్తారో వారు తండ్రికి తెలుసు. వారే తండ్రి హృదయములో ఉంటారు. సర్వీసు గురించి తెలియనివారు కూడా కొందరున్నారు. స్వయాన్ని ఆత్మ అని తెలుసుకొని తండ్రిని స్మృతి చేయండి అనే జ్ఞానము మీకు లభించింది. ఆత్మ శుద్ధమవుతుంది కాని శరీరము పతితమైనదే కదా. ఎవరి ఆత్మ శుద్ధమౌతూ పోతుందో వారి ప్రవర్తనలో రాత్రికి పగలుకు ఉన్నంత వ్యత్యాసముంటుంది. నడవడికల ద్వారానే తెలుస్తుంది. ఎవరి పేరూ చెప్పబడదు. ఒకవేళ పేరు చెప్తే ఇంకా అధ్వాన్నంగా అవుతారు.
ఇప్పుడు మీరు వ్యతాసము చూడగలరు. మీరు ఎలా ఉండేవారు, ఎలా తయారవ్వాలి? కనుక శ్రీమతానుసారము నడవాలి కదా. లోపల ఏ మలినము చేరి ఉందో దానిని తొలగించాలి. లౌకిక సంబంధములో కూడా కొందరు చాలా మురికి పిల్లలుగా ఉంటారు. వారి తండ్రి కూడా వారితో విసిగిపోతాడు. అలాంటి పిల్లలు లేకపోవడమే మంచిదని అంటారు. పుష్పాల తోటకు సువాసన ఉంటుంది. కాని డ్రామానుసారము మలినము కూడా ఉండాలి. జిల్లేడు పుష్పాన్ని చూసేందుకు కూడా ఇష్టముండదు. కాని తోటలోకి వెళ్లినట్లైతే దృష్టి అన్నింటి పై పడ్తుంది కదా. ఇది ఫలానా పుష్పము అని ఆత్మ తెలిపిస్తుంది. మంచి పుష్పము నుండి సువాసన తీసుకుంటారు కదా. ఈ ఆత్మ స్మృతియాత్రలో ఎంతగా ఉంటుందో, ఎంత పవిత్రంగా అయిందో, ఎంతవరకు ఇతరులను తమ సమానంగా చేసిందో బాబా కూడా చూస్తారు. జ్ఞానాన్ని వినిపిస్తారు. ముఖ్యమైన విషయము - మన్మనాభవ. తండ్రి చెప్తారు - నన్ను స్మృతి చేయండి, పవిత్ర పుష్పాలుగా అవ్వండి. ఈ లక్ష్మీ నారాయణులు పవిత్రమైన పుష్పాలు. వీరి కంటే కూడా శివబాబా చాలా పవిత్రమైనవారు. ఈ లక్ష్మీనారాయణులను కూడా శివబాబాయే ఇలా చేశారని మనుష్యులకు తెలియదు. ఈ పురుషార్థము ద్వారా ఇలా అయ్యారని మీకు తెలుసు. రాముడు తక్కువ పురుషార్థము చేసినందున చంద్ర వంశీయునిగా అయ్యాడు. తండ్రి చాలా అర్థం చేయిస్తూ ఉంటాడు. ఒకటి స్మృతియాత్రలో ఉండాలి. దీని ద్వారా మురికి తొలగిపోయి ఆత్మ పవిత్రంగా అవ్వాలి. మీ వద్దకు మ్యూజియం చూచేందుకు చాలా మంది వస్తారు. పిల్లలలో సర్వీసు చేయాలని చాలా ఆసక్తి ఉండాలి. సర్వీసును వదిలి ఎప్పుడూ నిద్రంచరాదు. సర్వీసు గురించి చాలా ఖచ్చితంగా ఉండాలి. మ్యూజియంలో మీరు విశ్రాంతి సమయాన్ని కూడా సేవకే ఉపయోగిస్తారు. గొంతు అలసిపోతుంది. భోజనము చేయాలి కానీ ఆంతరిములో రాత్రింబవళ్లు ఉమంగముండాలి. ఎవరైనా వచ్చినట్లైతే వారికి మార్గాన్ని తెలియజేయాలి. భోజనము చేసే సమయములో ఎవరైనా వచ్చినట్లైతే మొదట వారికి సర్వీసు చేసిన తర్వాత భోజనము చేయాలి. అలా సర్వీసు చేసేవారు ఉండాలి. కొందరికి దేహాభిమానము చాలా వస్తుంది. విశ్రాంతి ప్రియులుగా, నవాబులుగా తయారవుతారు. తండ్రి అర్థం చేయించాల్సి వస్తుంది కదా. ఈ నవాబుతనాన్ని, దొరతనాన్ని వదిలేయండి. మీ పదవిని చూడండి అని బాబా సాక్షాత్కారము కూడా చేయిస్తారు. దేహాభిమానము అనే గొడ్డలితో తమ కాలిని తామే నరుక్కుంటారు. చాలా మంది పిల్లలు బాబాతో కూడా పోటీకి వస్తారు. అరే! ఇతడు శివబాబాగారి రథము. ఇతనిని సంభాళన చేయవలసి ఉంటుంది. ఇక్కడ కొందరు అనేక ఔషధాలను తీసుకుంటూ ఉంటారు. వైద్యుల ద్వారా వైద్యము చేసుకుంటూ ఉంటారు కానీ బాబా చెప్తున్నారు - శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి కానీ మీ స్థితిని కూడా చూసుకోవాలి కదా. మీరు బాబా స్మృతిలో ఉండి తిన్నట్లైతే ఏ వస్తువూ హాని చేయదు. స్మృతి ద్వారా శక్తి నిండుతుంది. భోజనము చాలా శుద్ధంగా అవుతుంది. కానీ ఆ స్థితి లేనే లేదు. బాబా చెప్తున్నారు - బ్రాహ్మణుల ద్వారా తయారైన భోజనము సర్వోన్నతమైనది. కానీ అది కేవలం స్మృతిలో ఉండి చేసినప్పుడు మాత్రమే. స్మృతిలో ఉండి చేసినట్లైతే చేసిన వారికి కూడా లాభము, తిన్నవారికి కూడా లాభము కలుగుతంది.
జిల్లేడు పువ్వులాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. పాపం వారు ఏ పదవిని పొందుతారు! తండ్రికి జాలి కలుగుతుంది. కానీ దాస-దాసీలుగా అవ్వడం కూడా రచింపబడింది. అంతలో సంతోషించరాదు, మేము అలా కావాలని ఆలోచించను కూడా ఆలోచించరాదు. దాస-దాసీలుగా అవ్వడం కన్నా దాస-దాసీలను ఉంచుకోగలిగే శ్రీమంతులైనా మంచిదే. తండ్రి చెప్తున్నారు-నిరంతరము నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. స్మృతి చేసి చేసి సుఖాన్ని పొందండి.భక్తులు కూర్చుని స్మరణ మాలను తయారు చేశారు. అది భక్తుల పని. తండ్రి కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని చెప్తారు. జపము చేయకండి, మాలను తిప్పకండి. తండ్రిని తెలుసుకోవాలి. వారిని స్మృతి చేయాలి. నోటి ద్వారా బాబా బాబా అనే అవసరము లేదు. వారు ఆత్మలైన మనకు అనంతమైన తండ్రి. వారిని స్మృతి చేయడం ద్వారా మనము సతోప్రధానమైపోతాము అనగా ఆత్మ కంచనంగా(బంగారుగా) తయారవుతుందని మీకు తెలుసు. ఎంత సహజమైనది. కానీ ఇది యుద్ధ మైదానము కదా. మీ యుద్ధము మాయతో జరుగుతుంది. అది క్షణ-క్షణము మీ బుద్ధియోగాన్ని తెంచేస్తుంది. వినాశ కాలములో ఎంత ప్రీతిబుద్ధి గలవారిగా అవుతారో అంత పదవి లభిస్తుంది. ఒక్క తండ్రి తప్ప వేరెవ్వరూ స్మృతికి రాకూడదు. కల్పక్రితము కూడా విజయ మాలలో మణులుగా అయినవారే ఇప్పుడు కూడా వచ్చారు. మీరు ఏ బ్రాహ్మణ కులానికి చెందినవారో ఆ బ్రాహ్మణులదే రుద్రమాల తయారవుతుంది. మీరు చాలా గుప్త శ్రమ చేశారు. జ్ఞానము కూడా గుప్తమైనదే కదా. బాబా ప్రతి ఒక్కరి గురించి చాలా బాగా తెలుసుకున్నారు. మంచి-మంచి నెంబరువన్ పిల్లలు మహారథులనబడే పిల్లలు ఈ రోజు లేరు. దేహాభిమానము చాలా ఉంది. తండ్రి స్మృతి ఉండడం లేదు. మాయ చాలా జోరుగా చెంపదెబ్బ వేస్తుంది. చాలా కొద్దిమంది మాల మాత్రమే తయారౌతుంది. అయినా బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు - ఎంత పవిత్ర దేవతలుగా ఉండేవారము, మేము ఎలాంటివారము, ఎంత మలినంగా అయ్యాము అని స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి. ఇప్పుడు శివబాబా లభించారు కనుక వారి మతానుసారము నడవాలి కదా. ఏ దేహధారిని స్మృతి చేయరాదు. ఎవ్వరూ గుర్తు రాకూడదు. ఎవరి చిత్రాలు కూడా ఉండరాదు. ఒక్క శివబాబా స్మృతిలోనే ఉండాలి. శివబాబాకు తమ స్వంత శరీరము లేదు. ఈ శరీరాన్ని తాత్కాలికంగా అప్పు తీసుకుంటారు. మిమ్ములను ఇలా దేవీ దేవతలుగా, లక్ష్మీనారాయణులుగా చేసేందుకు ఎంత శ్రమ పడ్తారు! తండ్రి చెప్తున్నారు - నన్ను పతిత ప్రపంచములోనే పిలుస్తారు. మిమ్ములను పావనంగా చేస్తాను కానీ మీరు పావన ప్రపంచములో నన్ను పిలవనే పిలవరు. వారు అక్కడకు వచ్చి ఏం చేస్తారు! పావనంగా తయారు చేయడమే వారి సర్వీసు. పూర్తిగా కాలి నల్లటి బొగ్గుగా అయ్యారని తండ్రికి తెలుసు. మిమ్ములను సుందరంగా తయారు చేసేందుకే తండ్రి వచ్చారు. అచ్ఛా! మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. సర్వీసులో చాలా ఖచ్ఛితంగా ఉండాలి. రాత్రింబవళ్లు సర్వీసు చేసే ఉత్సాహముండాలి. సర్వీసును వదలి ఎప్పుడూ విశ్రాంతి తీసుకోరాదు. తండ్రి సమానం కళ్యాణకారులుగా అవ్వాలి.
2. ఒక్కరి స్మృతి ద్వారా ప్రీతి బుద్ధి గలవారిగా అయ్యి ఆంతరికములోని మలినాన్ని తొలగించుకోవాలి. సుగంధ పుష్పాలుగా అవ్వాలి. ఈ మురికి ప్రపంచము పై మనసును ఉంచుకోరాదు.
వరదానము :- '' '' ముందు మీరు '' అనే మంత్రము ద్వారా సర్వుల స్వమానాన్ని ప్రాప్తి చేసుకునే నిర్మానం నుండి మహాన్ భవ ''
సదా 'నిర్మానమే మహాన్' అనే మహామంత్రము గుర్తుంచుకోండి. ''ముందు మీరు'' అని అనడమే సర్వుల నుండి స్వమానం(గౌరవం) ప్రాప్తి చేసుకునేందుకు ఆధారము. మహాన్‌గా అయ్యే ఈ మంత్రము వరదాన రూపంలో సదా జతలో ఉంచుకోవాలి. వరదానాలతోనే పాలింపబడ్తూ, ఎగురుతూ గమ్యానికి చేరుకోవాలి. వరదానాలను కార్యములో ఉపయోగించుకోనప్పుడు కష్టపడ్తారు. వరదానాలతో పాలింపబడ్తూ, వరదానాలను కార్యములో ఉపయోగిస్తూ ఉంటే శ్రమ(కష్టము) సమాప్తమవుతుంది. సదా సఫలతను, సంతుష్టతను అనుభవం చేస్తూ ఉంటారు.
స్లోగన్ :- '' ముఖము ద్వారా సేవ చేసేందుకు చిరునవ్వుతో ఉన్న మీ రమణీయమైన, గంభీరమైన స్వరూపాన్ని ఎమర్జ్ (ఉత్పన్నము) చేయండి ''
No comments:
Post a Comment