Thursday, October 3, 2019

Telugu Murli 04/10/2019

04-10-2019 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం

'' మధురమైన పిల్లలారా - స్మృతి యాత్ర పై సంపూర్ణ గమనము(అటెన్షన్) ఉంచండి. దీని ద్వారానే మీరు సతోప్రధానంగా అవుతారు ''

ప్రశ్న:- బాబా తన పిల్లల పై ఎటువంటి దయ చూపుతున్నారు ?
జవాబు:- పిల్లల కళ్యాణము కొరకు బాబా సూచనలు, ఆదేశాలు ఇస్తున్నారు. ఇదే వారు చూపించే దయ. తండ్రి ఇచ్చే మొట్టమొదటి సూచన(ఆదేశము) - మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానులుగా అవ్వండి. ఆత్మాభిమానముతో ఉన్నవారు చాలా శాంతిగా ఉంటారు. వారికి ఎప్పుడూ చెడు ఆలోచనలు, వ్యతిరేక ఆలోచనలు రావు.

ప్రశ్న:- పిల్లలు ఎటువంటి సెమినార్లు(చర్చించుకొను సభలు) జరుపుకోవాలి ?
జవాబు:- ఎక్కడికైనా వాకింగ్కు వెళ్లినప్పుడు స్మృతి యాత్ర చేయండి. తర్వాత కూర్చొని ఎవరు ఎంత సమయము స్మృతిలో ఉండినామని పరస్పరము సెమినార్చేసుకోండి. ఇక్కడ స్మృతి చేసేందుకు ఏకాంతము కూడా చాలా బాగుంది.
ఓంశాంతి.
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలను - మీరు ఏం చేస్తున్నారు? అని అడుగుతున్నారు. ఆత్మిక పిల్లలు చెప్తున్నారు - బాబా! సతోప్రధానంగా ఉన్న మేము, తమోప్రధానంగా అయ్యాము. మళ్లీ మీ శ్రీమతముననుసరించి మేము తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. ఇప్పుడు మీరు మార్గము చూపించారు. ఇది కొత్త విషయమేమీ కాదు. ఎంతో ప్రాచీన విషయము. అన్నింటికంటే పురాతనమైనది స్మృతి యాత్ర. ఇందులో షో చేసే(బయటకు చూపించే) మాటే లేదు. పత్రి ఒక్కరు నేను ఎంతవరకు తండిన్రి స్మృతి చేస్తున్నాను ? ఎంతవరకు సతోపధ్రానంగా అయ్యాను ? ఎలాంటి పురుషార్థము చేస్తున్నాను ? అని స్వయాన్ని పరిశీలించుకోండి. చివర్లో అంతిమ సమయము వచ్చినప్పుడు సతోప్రధానంగా అవుతాము. అది కూడా సాక్షాత్కారమవుతూ ఉంటుంది. ఎవరు ఏం చేసినా తమ కొరకే చేసుకుంటారు. తండ్రి కూడా దయ చూపేదేమీ లేదు. పిల్లల కళ్యాణము కొరకు సలహా ఇస్తారు. తండ్రి కళ్యాణకారి. చాలా మంది పిల్లలు జ్ఞానాన్ని ఉల్టాగా అర్థము చేసుకుంటారు. బాబా దేహాభిమానులను గర్విష్టులుగా భావిస్తారు. ఆత్మాభిమానులు చాలా శాంతిగా ఉంటారు. వారికి ఎప్పుడు అస్తవ్యస్త(వ్యతిరేక) ఆలోచనలు రావు. తండ్రి అన్ని ప్రకారాల పురుషార్థము చేయిస్తూ ఉంటారు. మాయ కూడా చాలా శక్తివంతమైనది. మంచి మంచి పిల్లల పై కూడా దాడి చేస్తుంది. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఈ రోజు చాలా బాగా స్మృతి చేస్తారు. రేపు అహంకార వశమై ఆంబోతుల వలె అవుతారు. వారికి చాలా అహంకారము ఉంటుంది. ఒక సామెత కూడా ఉంది - ''సురమండల సంగీతము దేహాభిమానులైన ఆంబోతులకు ఏం తెలుసు? '' దేహాభిమానము చాలా చెడ్డది. చాలా శ్రమ చేయవలసి వస్తుంది. నేను మీకు అత్యంత వినయ విధేయతలు గల సేవకుడను అని శివబాబా అంటున్నారు. అలాగని సేవకుడనని చెప్పుకుంటూ నవాబుగిరి చూపించరాదు. తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలారా! తప్పకుండా సతోప్రధానంగా అవ్వాలి. ఇది చాలా సులభము. ఇందులో శబ్ధము చేసే పని ఏమీ లేదు. నోటితో ఏమీ మాట్లాడరాదు. ఎచ్చటకు వెళ్లినా లోలోపల స్మృతి చేస్తూ ఉండాలి. అంతేకాని ఇక్కడే కూర్చొని ఉంటే బాబా సహాయము చేస్తారని అనుకోరాదు. తండ్రి సహాయము చేసేందుకే వచ్చారు. పిల్లలు ఎక్కడ నిర్లక్ష్యంగా, అజాగ్రత్తగా ఉంటారోనని తండ్రికి సదా సంకల్పాలు వస్తుంటాయి. మాయ ఇక్కడేే ముష్టిఘాతముతో క్రింద పడేస్తుంది. దేహాభిమానము చాలా చాలా చెడ్డది. దేహాభిమానములోకి వచ్చినందున పూర్తిగా క్రింద పడిపోయారు. బాబా చెప్తున్నారు - ఇక్కడ వచ్చి కూర్చున్నా అత్యంత పియ్రమైన తండిన్రి స్మృతి చేయండి. తండి చెప్తున్నారు - పతితపావనుడను నేన్నొక్కరినే. నన్ను స్మృతి చేసినందున, ఈ యోగాగ్ని ద్వారా జన్మ-జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. పిల్లలకు ఇంకా ఎవ్వరికీ బాగా అర్థం చేయించే స్థితి రాలేదు. జ్ఞాన ఖడ్గములో కూడా యోగమనే పదును లేకుంటే ఖడ్గము దేనికీ పనికిరాదు. ముఖ్యమైనది స్మృతి యాత. చాలామంది పిల్లలు ఉల్టా-సుల్టా వ్యాపారాలలో లగ్నమై ఉంటారు. స్మృతియాత్ర చేయరు, శ్రద్ధగా చదువుకోరు. అందుకే వారికి సమయము దొరకదు. తండ్రి చెప్తున్నారు - వృత్తి వ్యాపారాలు, వ్యవహారాలలో చిక్కుకుని మీ పదవిని పోగొట్టుకునే శ్రమ చేయకండి. మీ భవిష్యత్తును తయారు చేసుకోవాలి కదా. అందుకు సతోప్రధానంగా అవ్వాలి. ఇందులో చాలా శ్రమించాలి. చాలా పెద్ద పెద్ద మ్యూజియంలు మొదలైనవి సంభాళన చేయువారున్నారు. కానీ స్మృతియాత్రలో ఉండరు. బాబా అర్థం చేయించారు - పేదలు, బంధనములో ఉన్న మాతలు స్మృతియాత్ర ఎక్కువగా చేస్తున్నారు. మాటిమాటికి శివబాబాను స్మృతి చేస్తూ ఉంటారు. శివబాబా, మా బంధనాలను సమాప్తము చేయండి అని అంటూ ఉంటారు. అబలల పై అత్యాచారాలు జరుగుతాయి. ఇది కూడా గాయనముంది.

పిల్లలైన మీరు చాలా మధురంగా అవ్వాలి. సత్యమైన విద్యార్థులుగా అవ్వండి. మంచి విద్యార్థులు ఏకాంతంగా తోటలో కూర్చొని చదువుకుంటారు. తండి మీకు కూడా చెప్తున్నారు - మీరు ఎక్కడ తిరుగుతున్నా స్వయాన్ని ఆత్మగా భావించి బాబాను స్మృతి చేయండి. స్మృతి యాతల్రో ఆసక్తి కలిగి ఉండండి. ఆ ధన సంపాదనకు పోలిస్తే ఈ అవినాశి ధనము చాలా చాలా శ్రేష్ఠమైనది. ఆ వినాశి ధనము బూడిదైపోతుంది. బాబాకు తెలుసు - పిల్లలు సంపూర్ణ సేవ చేయడం లేదు. స్మృతియాత్రలో తక్కువగా ఉన్నారు. చేయవలసిన సత్యమైన సేవ చేయడం లేదు. స్థూల సేవలో శ్రద్ధ చూపిస్తున్నారు. భలే డ్రామానుసారము జరుగుతుంది. అయినా బాబా పురుషార్థమేమో చేయిస్తారు కదా. తండి చెప్తున్నారు - ఏ పని చేస్తున్నా, బట్టలు కుట్తున్నా, తండిన్రి స్మృతి చేయండి. స్మృతి చేయడంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. బాబా అర్థం చేయిస్తున్నారు - రుస్తుంతో మాయ కూడా రుస్తుమ్(గొప్ప పహిల్వాన్)లాగే పోట్లాడ్తుంది. నేను రుస్తుమ్ను, నేను భికారి నుండి రాకుమారునిగా అయ్యే వాడినని కూడా నాకు తెలుసు. అయినా మాయ ఎదిరిస్తుందని ఈ బాబా(బ్రహ్మ) తన తపస్సు గురించి కూడా తెలుపుతున్నారు. మాయ ఎవ్వరినీ వదిలిపెట్టదు. పహిల్వానులయ్యే కొలది ఇంకా ఎక్కువగా పోట్లాడ్తుంది. చాలామంది పిల్లలు చాలా దేహ అహంకారములో ఉంటారు. తండ్రి ఎంతో నిరహంకారులుగా ఉంటారు. నేను కూడా పిల్లలైన మీకు నమస్కరించే సేవకుడనని అంటారు. వారేమో స్వయాన్ని చాలా గొప్పవారిగా భావిస్తారు. ఈ దేహ అహంకారాన్ని పూర్తిగా(సమూలంగా) నశింపచేయాలి. చాలామందిలో అహంకార భూతము కూర్చొని ఉంది. బాబా చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఇక్కడ చాలా మంచి అవకాశముంది. విహారములో తిరుగుట కూడా మంచిదే. ఫుర్సత్తు కూడా ఉంది. భలే తిరగండి, తర్వాత ఒకరినొకరు ఎంత సమయము స్మృతిలో ఉన్నాము? బుద్ధి ఇతర వైపులకు వెళ్లలేదు కదా? అని పరస్పరము సెమినార్చేసుకుంటూ ప్రశ్నించుకోండి. భలే స్త్రీలు వేరుగా, పురుషులు వేరుగా ఉండండి. తిరిగేందుకు స్త్రీలు ముందు వెళ్లండి, పురుషులు వారి వెనుక ఉండండి. ఎందుకంటే మాతలను సంభాళించాలి. కనుక మాతలను ముందుంచండి. ఇక్కడ ఏకాంతము చాలా బాగుంటుంది. సన్యాసులు కూడా ఏకాంతంగా ఉంటారు. సతోప్రధాన సన్యాసులు చాలా నిర్భయులుగా ఉండేవారు. జంతువులు మొదలైన వాటితో భయపడేవారు కాదు. ఆ నషాలో ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానంగా అయ్యారు. ఏ ధర్మమైనా స్థాపన జరిగినప్పుడు మొదట సతోప్రధానంగా ఉండి తర్వాత రజో, తమోలోకి వస్తుంది. సతోప్రధానంగా ఉన్న సన్యాసులు బ్రహ్మతత్వపు మస్తీ(నషా)లో మస్త్గా ఉండేవారు. వారిలో చాలా ఆకర్షణ ఉండేది. అడవిలో భోజనము లభించేది కానీ క్రమ క్రమంగా తమోప్రధానంగా అయినందున శక్తి క్షీణిస్తూ ఉంటుంది.

ఇప్పుడు బాబా సలహానిస్తున్నారు - ఇక్కడ పిల్లల ఉన్నతికి చాలా మంచి అవకాశముంది. ఇక్కడకు మీరు వచ్చేదే సంపాదన కొరకు. బాబాతో కలిసినంత మాత్రాన సంపాదన జరగదు. తండ్రిని స్మృతి చేస్తే సంపాదన జమ అవుతుంది. బాబా ఆశీర్వాదిస్తారని భావించకండి. అదేమీ లేదు. సాధువులు మొదలైనవారు ఆశీర్వదిస్తారు. కానీ మీరు క్రిందకు దిగజారాల్సిందే. ఇప్పుడు తండి చెప్తున్నారు - జిన్నుగా తయారై మీ బుద్ధి యోగాన్ని సదా పైనున్న తండిత్రో జోడించండి. జిన్ను కథ తెలుసు కదా. నాకు పని చూపమని అడిగింది. తండి కూడా చెప్తున్నారు - స్మృతిలో ఉంటే మీ జీవిత నౌక తీరానికి చేరుతుందని సూచిస్తున్నాను, ఆదేశిస్తున్నాను. మీరు తప్పకుండా సతోపధ్రానంగా అవ్వాలి. మాయ ఎంతగా తల బాదుకున్నా మేము శేష్ఠ్రమైన తండిన్రి తప్పకుండా స్మృతి చేస్తామని లోలోపల మహిమ చేస్తూ తండిన్రి స్మృతి చేస్తూ ఉండాలి. ఏ మనిషినీ గుర్తు చేసుకోకండి. భక్తిమార్గములోని ఆచార పద్ధతులు జ్ఞాన మార్గములో ఉండవు. స్మృతియాత్రలో తీవ్రంగా వెళ్లాలని తండ్రి శిక్షణనిస్తున్నారు. ఇదే ముఖ్యమైన విషయము. సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి ఆదేశిస్తున్నారు - మీరు విహరించేందుకు(వాకింగ్కు) వెళ్లినా స్మృతియాత్రలో ఉండండి. అలా ఉంటే ఇల్లు కూడా గుర్తుకొస్తుంది, రాజ్యపదవి కూడా గుర్తుకొస్తుంది. కానీ స్మృతిలో అలాగే కూర్చుని కింద పడిపోరాదు(స్పృహ తప్పరాదు). అలా జరిగితే అది హఠయోగమవుతుంది. ఇది చిక్కులు లేని విషయము - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. చాలామంది పిల్లలు అలాగే కూర్చుని క్రింద పడిపోతారు. అందుకే బాబా అంటున్నారు - నడుసూ,్త తిరుగుతూ, తింటూ, తాగుతూ స్మృతిలో ఉండండి. అంతేకాని అలాగే కూర్చుని స్పృహ తప్పి పడిపోరాదు. దీని వలన మీ పాపాలు ఏవీ నశించవు. ఇందులో కూడా మాయ ద్వారా చాలా విఘ్నాలు ఏర్పడ్తాయి. ఈ భోగ్మొదలైనవి కూడా ఆచార పద్ధతులే. అంతేకాని ఇందులో ఏమీ లేదు. ఇందులో మాయ చాలా విఘ్నాలు కలుగజేస్తుంది. ఇది జ్ఞానమూ కాదు, యోగమూ కాదు. సాక్షాత్కారాల అవసరమే లేదు. చాలామందికి సాక్షాత్కారాలయ్యాయి. వారు ఈ రోజు లేనే లేరు. మాయ చాలా ప్రబలమైనది. సాక్షాత్కారము అవ్వాలనే ఆశ కూడా ఉంచుకోరాదు. ఇందులో సతోప్రధానమయ్యేందుకు తండ్రిని స్మృతి చేయాలి. ఇది అనాదిగా తయారైన డ్రామా అని కూడా మీకు తెలుసు. ఇది రిపీట్అవుతూ ఉంటుంది. ఈ డ్రామాను కూడా అర్థము చేసుకోవాలి. తండ్రి ఇచ్చిన ఆదేశము ప్రకారము కూడా నడుచుకోవాలి. మనమిప్పుడు మళ్లీ రాజయోగమును నేర్చుకునేందుకు వచ్చామని కూడా మీకు తెలుసు. ఇదంతా భారతదేశము విషయమే. భారతదేశమే తమోప్రధానంగా అయ్యింది. మళ్లీ ఇదే సతోప్రధానంగా అవ్వాలి. తండ్రి కూడా భారతదేశములోనే వచ్చి అందరికీ సద్గతిని కలుగజేస్తారు. ఇది చాలా అద్భుతమైన నాటకము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించండి. మీరు 84 జన్మల చక్రములో తిరుగుతూ 5 వేల సంవత్సరాలు పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్లీ వాపసు ఇంటికి వెళ్లాలి. ఈ విషయాలు మరెవ్వరూ వినిపించలేరు. పిల్లలైన మీలో కూడా నెంబరువారు పురుషార్థానుసారము నిశ్చయబుద్ధి గలవారిగా అవుతూ ఉంటారు. ఇది అనంతమైన పాఠశాల. అనంతమైన తండ్రి మనలను చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. ఆ ఉస్తాదు టీచరు. చాలా పెద్ద ఉస్తాదు(గురువు). చాలా ప్రేమగా అర్థం చేయిస్తారు. ఎంతో మంచి మంచి పిల్లలు కూడా చాలా సుఖంగా ఉదయం 6 గంటల వరకు నిదురపోతూ ఉంటారు. మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకుంటుంది. అధికారము చలాయిస్తూ ఉంటారు. ప్రారంభములో మీరు భట్టీలో ఉన్నప్పుడు మమ్మా-బాబాలు కూడా అన్ని సేవలు చేసేవారు. మనము ఎలాంటి కర్మలు చేస్తామో, మనలను చూచి అందరూ చేస్తారు. మహారథులు, అశ్వారూఢులు, కాలినడకన వెళ్లేవారు అందరూ నెంబరువారుగా ఉన్నారని బాబాకు తెలుసు. చాలామంది పిల్లలు చాలా విశ్రాంతిగా ఉంటారు. లోపల నిదురిస్తూ ఉంటారు. ఎవరైనా బయట నుండి ఫలానావారు ఎక్కడ? అని అడిగితే, 'లేరు' అని చెప్తారు. కానీ లోపల నిదురిస్తూ ఉంటారు. ఏమేమి జరుగుతూ ఉంటుందో, అదంతా బాబా తెలిపిస్తూ ఉంటారు. ఇంకా ఎవ్వరూ సంపూర్ణమవ్వలేదు. చాలా డిస్సర్వీస్చేస్తారు. లేకుంటే తండి కొరకు గాయనముంది - కొట్టండి లేక పేమ్రించండి, మేము మీ ద్వారమును వదలము. ఇక్కడ చూస్తే చిన్న మాటకే అలుగుతారు. యోగము చాలా తక్కువగా ఉంది. బాబా పిల్లలకెంతగానో అర్థం చేయిస్తూ ఉంటారు. కాని ఎవ్వరిలోనూ స్మృతి చార్టు వ్రాసేందుకు శక్తి లేదు. యోగముంటే వ్రాసేందుకు కూడా శక్తి నిండుతుంది. గీతా భగవానుడు శివుడు, కృష్ణుడు కాదని ఋజువు చేయండి.

తండ్రి వచ్చి పిల్లలైన మీకు అన్ని విషయాలు అర్థము చేయిస్తారు. పిల్లలకు ఇక్కడ నషా పెరిగి ఉంటుంది. వెలుపలకు వెళ్తూనే సమాప్తమైపోతుంది. సమయాన్ని చాలా వృథా చేస్తూ ఉంటారు. మేము సంపాదించి యజ్ఞములో ఇవ్వాలి మొదలైన ఆలోచనలతో సమయాన్ని వృథా చేయరాదు. తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, నేను మీ కళ్యాణము చేసేందుకు వచ్చాను. మీరేమో మీ అంతకు మీరు నష్టపోతున్నారు. యజ్ఞములో కల్పక్రితము సహాయము చేసినవారు ఇప్పుడూ చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. మీరెందుకు తలలు బాదుకుంటారు - ఇది చేయాలి, అది చేయాలని అనుకుంటారు. డ్రామాలో నిర్ణయించబడే ఉంది. ఎవరు విత్తనము నాటారో, వారు ఇప్పుడు కూడా నాటుతారు. యజ్ఞమును గురించి మీరే చింతా చేయకండి. మీ కళ్యాణము మీరు చేసుకోండి. స్వయం మీకు మీరే సహాయము చేసుకోండి. భగవంతునికి మీరు సహాయము చేస్తారా? భగవంతుని నుండి మీరు తీసుకుంటారా? లేక ఆయనకే ఇస్తారా? ఈ సంకల్పము కూడా మీకు రాకూడదు. బాబా చెప్తున్నారు - అల్లారుముద్దు పిల్లలారా, స్వయాన్ని ఆత్మగా భావించి తండిన్రి స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. ఇప్పుడు మీరు సంగమ యుగములో ఉన్నారు. సంగమ యుగములో మీరు ఇరువైపులా చూడగలరు. ఇక్కడ జనాభా ఎంత ఎక్కువగా ఉంది! సత్యయుగములో చాలా తక్కువ మంది మనుష్యులుంటారు. రోజంతా సంగమ యుగములోనే నిలిచి ఉండాలి. బాబా మనలను ఎలా ఉండేవారిని ఎలా చేస్తున్నారు! తండ్రి పాత్ర చాలా అద్భుతమైనది. ఎక్కడ తిరుగుతున్నా స్మృతియాత్రలో ఉండండి. చాలామంది పిల్లలు సమయాన్ని వృథా చేస్తారు. స్మృతియాత్ర ద్వారానే మీ జీవిత నౌక తీరానికి చేరుతుంది. కల్పక్రితము కూడా పిల్లలకు ఇలాగే అర్థం చేయించాను. డ్రామా రిపీట్(పునరావృతము) అవుతూ ఉంటుంది. లేస్తూ, కూర్చుంటూ పూర్తి కల్పవృక్షము బుద్ధిలో గుర్తుకు రావాలి. ఇది చదువు, వృత్తి వ్యాపారాదులు భలే చేసుకోండి. చదువు కొరకు సమయాన్ని కేటాయించండి. మధురమైన తండిన్రి, స్వర్గమును స్మృతి చేయండి. ఎంత బాగా స్మృతి చేస్తే అంత అంతమతి సో గతిగా అవుతుంది. ఇక చాలు, బాబా మేము మీ వద్దకు వచ్చేస్తున్నామని అంటారు. తండి స్మృతిలో శ్వాస కూడా సుఖమయమవుతుంది. బ్రహ్మ జ్ఞానుల శ్వాస కూడా సుఖదాయకంగా అవుతుంది. బ్రహ్మతత్వపు స్మృతిలోనే ఉంటారు. కానీ బ్రహ్మలోకములోకి ఎవ్వరూ వెళ్లలేరు. వారు తమకు తామే(స్వ-ఇచ్ఛానుసారము) శరీరాలను వదిలేయవచ్చు. కొంతమంది ఉపవాస వ్రతాలతో శరీరమును వదిలేస్తారు. వారు దు:ఖముతో మరిణిస్తారు. తండ్రి చెప్తున్నారు - తినండి, తిరగండి తండ్రిని స్మృతి చేస్తే అంతిమతి సో గతి(చివరి సమయములో ఏ స్మృతి ఉంటుందో అలాంటి జన్మే లభిస్తుంది) అవుతుంది. ఎలాగైనా మరణించాల్సిందే కదా. అచ్ఛా!

మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్మార్నింగ్ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మనము ఏ కర్మలాచరిస్తామో, మనలను చూచి ఇతరులు కూడా చేస్తారు......... అని సదా గుర్తుంచుకోవాలి. డిస్సర్వీసు చేసేటంత విశ్రాంతి ప్రియులుగా అవ్వకండి. చాలా చాలా నిరహంకారులుగా ఉండాలి. మీకు మీరే సహాయము చేసుకొని మీ కళ్యాణము చేసుకోవాలి.
2. స్మృతి యాత్ర చేసేందుకు, చదువుకునేందుకు సమయము లేనంతగా వ్యాపార వ్యవహారాలలో తలమునకలవ్వరాదు. దేహాభిమానము అత్యంత చెడ్డది, చెల్లనిది, పనికిరానిది. దీనిని వదిలి దేహీ-అభిమానము(ఆత్మాభిమానము)లో ఉండే శ్రమ చేయాలి.

వరదానము:- '' విల్పవర్ద్వారా సెకండులో వ్యర్థానికి ఫుల్స్టాప్పెట్టే అశరీరి భవ ''
సెకండులో అశరీరిగా అయ్యేందుకు పునాది - ఈ బేహద్వైరాగ్య వృత్తి. ఈ వైరాగ్యము ఎటువంటి యోగ్యమైన ధరణి అంటే అందులో ఏ బీజము వేసినా వెంటనే దాని ఫలము వెలువడ్తుంది. కనుక ఇప్పుడు ఎటువంటి విల్పవర్ఉండాలంటే వ్యర్థము ఒక సెకండులో సమాప్తమైపోవాలని సంకల్పము చేస్తూనే అది సెకండులో సమాప్తమైపోవాలి. ఎప్పుడు కావాలంటే, ఎక్కడ కావాలంటే, ఏ స్థితిలో కావాలంటే సెకండులో సెట్చేసుకోండి. సేవ తనవైపు లాగరాదు. సెకండులో ఫుల్స్టాప్ ఉంచబడ్తే సహజంగానే అశరీరిగా అవుతారు.

స్లోగన్:- '' తండ్రి సమానంగా అవ్వాలంటే, చెడిపోయిన వారిని బాగుచేసే వారిగా అవ్వండి ''

No comments:

Post a Comment