Thursday, October 17, 2019

Telugu Murli 18/10/2019

18-10-2019 ఉదయము మురళి ఓంశాంతి బాప్‌దాదా మధువనము

'' మధురమైన పిల్లలారా - '' ఓ భూతములారా! మీరు మా వద్దకు రాకండి '' అని ఆజ్ఞాపించండి. మీరు వాటిని భయపెడ్తే అవి పారిపోతాయి ''

ప్రశ్న :- ఈశ్వరీయ నషా(తన్మయత్వము)లో ఉండే పిల్లల జీవితానికి శోభ ఏది ?
జవాబు :- సర్వీసే వారి జీవితానికి శోభ. మాకు ఈశ్వరీయ లాటరీ లభించిందని నషా ఉన్నట్లైతే సర్వీసు చేయాలనే ఉత్సాహము ఉండాలి. కానీ మీలో ఎలాంటి భూతాలు లేనప్పుడే బాణము తగులుతుంది.

ప్రశ్న :- శివబాబా పిల్లలమని చెప్పుకునేందుకు హక్కుదారులు ఎవరు ?
జవాబు :- భగవంతుడు మా తండ్రి. మేము అలాంటి సర్వ శ్రేష్ఠ తండ్రి సంతానము అనే నిశ్చయము ఎవరికి ఉంటుందో అలాంటి నషాలో ఉండే యోగ్య పిల్లలే శివబాబా సంతానమని చెప్పుకునేందుకు హక్కుదారులు. ఒకవేళ వ్యక్తిత్వము సరిగ్గా లేకుంటే నడవడికలు రాయల్‌గా లేకుంటే వారు స్వయాన్ని శివబాబా పిల్లలుగా చెప్పుకునేందుకు అర్హులు కారు.

ఓంశాంతి. శివబాబా గుర్తున్నారా? స్వర్గ రాజ్యము జ్ఞాపకముందా? ఇక్కడ కూర్చున్నప్పుడు మేము బేహద్‌ తండ్రి పిల్లలమని, నిత్యము తండ్రిని స్మృతి చేస్తామని బుద్ధిలో ఉండాలి. స్మృతి చేయకుండా మనము వారసత్వమును పొందలేము. ఏ వారసత్వాన్ని? పవిత్రతా వారసత్వమును. కనుక అందుకు ఇటువంటి పురుషార్థము చేయాలి. ఎప్పుడు కూడా ఏ వికారపు విషయాలూ మన ముందుకు రాలేవు. కేవలం వికారము మాటే కాదు. ఈ ఒక్క భూతమే కాదు, ఏ భూతమూ రాజాలదు. ఇలాంటి శుద్ధమైన అహంకారము ఉండాలి - సర్వ శ్రేష్ఠ భగవంతుని పిల్లలమైన మనము కూడా అత్యున్నతమైనవారమే కదా. మన మాటలు, నడవడికలు ఎంత రాయల్‌గా ఉండాలి! నడవడిక ద్వారా మీరు పైసకు కూడా కొరగారు. నా పిల్లలుగా చెప్పుకునేందుకు హక్కుదారులుగా అవ్వరని తండ్రి అర్థము చేసుకుంటారు. లౌకిక తండ్రి కూడా అయోగ్యులైన పిల్లలను చూచినప్పుడు ఇలా అనుకుంటారు కదా. వీరు కూడా తండ్రియే. తండ్రి శిక్షణనిస్తున్నారని పిల్లలైన మనకు తెలుసు. కానీ కొందరు అసలు అర్థము చేసుకోరు. బేహద్‌ తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారు అనే నిశ్చయముండదు. నషా కూడా ఉండదు. పిల్లలైన మీ బుద్ధి ఎంత శ్రేష్ఠంగా ఉండాలి! మనము ఎంత శ్రేష్ఠమైన తండ్రి పిల్లలము! తండ్రి ఎంతగా అర్థము చేయిస్తారు. ఆంతరికంగా ఆలోచించండి. మేము ఎంత అత్యున్నతమైన తండ్రి పిల్లలము! మా నడవడికలు ఎంత శ్రేష్ఠంగా ఉండాలి. ఈ దేవీ దేవతలకు ఏ మహిమ ఉందో, అది మనదిగా కావాలి. ప్రజలకు మహిమ ఉండదు. ఒక్క లక్ష్మీనారాయణులను మాత్రమే చూపిస్తారు. కనుక పిల్లలు ఎంత మంచి సర్వీసు చేయాలి. ఈ లక్ష్మీనారాయణులు ఇరువురూ ఈ సర్వీసు చేశారు కదా. బుద్ధి ఎంత శ్రేష్ఠంగా ఉండాలి. కొందరి పిల్లల బుద్ధిలో ఎలాంటి వ్యత్యాసము రాలేదు. మాయ చేతిలో ఓడిపోతే ఇంకా ఎక్కువగా పాడైపోతారు. ఆంతరికములో మేము బేహద్‌ తండ్రి పిల్లలము అని ఎంత నషా ఉండాలి! తండ్రి చెప్తున్నారు - అందరికీ నా పరిచయమునిస్తూ ఉండండి. సర్వీసు ద్వారానే శోభిస్తారు. అప్పుడే తండ్రి హృదయములో ఉంటారు. ఎవరు తండ్రి హృదయములో ఉంటారో, వారే పిల్లలు. తండ్రికి పిల్లల పై ఎంత ప్రేమ ఉంటుంది! పిల్లలను తల పై కూర్చోపెట్టుకుంటారు. అంతటి మోహముంటుంది. కానీ అది హద్దులోని మాయావీ మోహము. ఇది బేహద్దు ప్రేమ. పిల్లలను చూసి సంతోషపడని తండ్రి ఎవరైనా ఉంటారా? తల్లిదండ్రులకు అపారమైన ఖుషీ ఉంటుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బాబా మమ్ములను చదివిస్తున్నారని భావించాలి. బాబా విధేయులైన శిక్షకులు. బేహద్‌ తండ్రి తప్పకుండా ఏదో సర్వీసు చేసి ఉంటారు. అందుకే కదా గాయనముంది. ఎంత అద్భుతమైన విషయము. ఎంతగా వారి మహిమ చేయబడ్తుంది. ఇక్కడ కూర్చున్నప్పుడు బుద్ధిలో ఆ నషా ఉండాలి. సన్యాసులు నివృత్తిమార్గము వారు. వారి ధర్మమే వేరు. ఇది కూడా ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు. సన్యాస మార్గము గురించి మీకు తెలియదు. మీరు గృహస్థ మార్గములో ఉంటూ భక్తి మొదలైనవి చేసేవారు. తర్వాత జ్ఞానము లభించింది. వారికి జ్ఞానము లభించదు. మీరు ఎంత శ్రేష్ఠమైన చదువు చదువుతున్నారు! ఎంత సాధరణంగా క్రింద కూర్చుని ఉన్నారు. దిల్వాడా మందిరములో కూడా మీరు క్రింద తపస్సులో కూర్చుని ఉన్నారు. పైన వైకుంఠము నిలిచి ఉంది. పైన వైకుంఠాన్ని చూసి స్వర్గము పైనే ఉందని మనుష్యులు భావిస్తారు.
కనుక పిల్లలైన మీ బుద్ధిలో ఇది పాఠశాల అని, మేము చదువుకుంటున్నామని మొదలైన అన్ని విషయాలు బుద్ధిలోకి రావాలి. ఎక్కడైనా తిరిగేందుకు వెళ్లినప్పుడు బుద్ధిలో ఈ ఆలోచనలు నడుస్తూ ఉంటే చాలా ఆనందము కలుగుతుంది. బేహద్‌ తండ్రి గురించి ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. తండ్రి జీవన చరిత్ర తెలియని అవివే పిల్లలను ఎప్పుడైనా చూశారా! తెలియనందునే సర్వవ్యాపి అని అనేశారు. మీరే పూజ్యులు, మీరే పూజారులని భగవంతునికే చెప్తారు. పిల్లలైన మీకు ఆంతరికములో ఎంత ఖుషీ ఉండాలి. మనము ఎంత ఉన్నతులైన పూజ్యులుగా ఉండేవారము. మళ్లీ మనమే పూజారులుగా అయ్యాము. శివబాబా మిమ్ములను ఇంత శ్రేష్ఠంగా తయారు చేస్తారు. మళ్లీ డ్రామానుసారము మీరే వారి పూజలు ప్రారంభిస్తారు. భక్తి ఎప్పుడు ప్రారంభమౌతుందో ప్రపంచములోని వారికి తెలియదు. తండ్రి పిల్లలైన మీకు ప్రతిరోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. కనుక ఆంతరికములో ఖుషీ ఉండాలి కదా. మమ్ములను చదివించేవారు ఎవరు! భగవంతుడే వచ్చి చదివిస్తున్నారు. ఇది ఎవ్వరూ ఎప్పుడూ విని కూడా ఉండరు. గీతా భగవంతుడు కృష్ణుడు. కనుక కృష్ణుడే చదివించారని వారు అనుకుంటారు. మంచిది. కృష్ణుడు అనే అనుకోకండి. అయినా ఎంత శ్రేష్ఠమైన స్థితి కావాలి. మనుష్య మతము మరియు ఈశ్వరీయ మతము అను పుస్తకము కూడా ఉంది. దేవతలకు సలహా తీసుకునే అవసరమే లేదు. మనుష్యులు ఈశ్వరీయ మతాన్ని కోరుకుంటారు. దేవతలకు ఈ మతము క్రితము జన్మలో లభించింది. కనుకనే వారు ఉన్నత పదవిని పొందుకున్నారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రేష్ఠంగా అయ్యేందుకు శ్రీమతము లభిస్తుంది. ఈశ్వరీయ మతము మనుష్య మతములలో ఎంత వ్యతాసముంది. మనుష్యుల మతము ఏమి చెబుతుంది. ఈశ్వరీయ మతము ఏం చెప్తుంది? ఇప్పుడు తప్పకుండా ఈశ్వరీయ మతానుసారము నడవవలసి ఉంటుంది. ఎవరినైనా కలిసేందుకు వెళ్లినప్పుడు మీరు ఏం తీసుకొని వెళ్తారు? ఎవరికి ఏ బహమతి ఇవ్వాలో కూడా జ్ఞాపకముండదు. ఈ మనుష్య మతము ఈశ్వరీయ మతాల తారతమ్యము తెలుసుకోవడం చాలా అవసరము. మీరు మనుష్యులుగా ఉన్నప్పుడు ఆసురీ మతముండేది. ఇప్పుడు ఈశ్వరీయ మతము లభించింది. ఈ రెండింటిలో ఎంత వ్యత్యాసము ఉంది! ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ మనుష్యుల ద్వారానే తయారు చేయబడినవి. తండ్రి ఏదైనా శాస్త్రాలను చదువుకొని వస్తారా? తండ్రి చెప్తున్నారు - నేను ఏ తండ్రికైనా బిడ్డనా? నేను ఏ గురువుకైనా శిష్యుడనా? వారి నుండి నేర్చుకున్నానా? కనుక ఈ విషయాలన్నీ అర్థం చేయించవలసి ఉంటుంది. భలే ఇది కోతి బుద్ధి అని తెలుసు. కానీ మందిర యోగ్యులుగా తయారయ్యేవారు కూడా మీరే కదా. చాలా మంది మనుష్యులు మన్మతమును అనుసరిస్తారు. తర్వాత ఈశ్వరీయ మతముననుసరించి ఎలా తయారౌతున్నారో మీరు వారికి చెప్తారు. ఆ ఈశ్వరుడే మమ్ములను చదివిస్తున్నారు. మేము వారి వద్దకు చదువుకునేందుకు వెళ్తున్నాము. మేము ప్రతిరోజూ ఒక గంటా, ముక్కాలు గంట వెళ్తాము. క్లాసులో కూడా ఎక్కువ సమయము తీసుకోరాదు. స్మృతి యాత్ర నడుస్తూ, తిరుగుతూ కూడా జరుగుతుంది. జ్ఞాన యోగాలు రెండూ చాలా సహజము. అల్ఫ్‌(బాబా) అనునది ఒకే పదము. భక్తిమార్గములో అనేక శాస్త్రాలున్నాయి. వాటిని పోగు చేస్తే పూర్తి ఇల్లంతా శాస్త్రాలతో నిండిపోతుంది. వీటి పై ఎంత ఖర్చు అయ్యి ఉండవచ్చు. ఇప్పుడు బాబా చాలా సహజంగా అర్థం చేయిస్తున్నారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి. తండ్రి స్వర్గ సామ్రాజ్యమునే వారసత్వంగా ఇస్తారు. మీరు విశ్వానికి అధికారులుగా ఉండేవారు కదా. భారతదేశము స్వర్గముగా ఉండేది కదా. ఈ విషయాలు మీరు మర్చిపోయారా? ఇది కూడా డ్రామాలోని నిర్ణయము అని అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు. ప్రతి 5 వేల సంవత్సరముల తర్వాత చదివించుటకై వస్తారు. బేహద్‌ తండ్రి ఇచ్చు వారసత్వము తప్పక నూతన ప్రపంచమైన స్వర్గమే ఉంటుంది కదా. ఇవి చాలా సాధారణ విషయాలు. లక్షల సంవత్సరాలని చెప్పడం వలన బుద్ధికి తాళం పడిపోయింది. తాళము తెరవబడడమే లేదు. తాళము ఎలా పడిందని అంటే చాలా సహజమైన విషయము కూడా అర్థము చేసుకోవడం లేదు. తండ్రి చెప్తున్నారు - ఒక్క విషయము చాలు. చాలా చదివించే అవసరమే లేదు. ఇక్కడ మీరు ఒక్క సెకండులో ఎవరినైనా స్వర్గ వారసులుగా చెయ్యగలరు. కానీ ఇది పాఠశాల. కనుక మీ చదువు నడుస్తూ ఉంటుంది. జ్ఞానసాగరులైన తండ్రి మీకు ఎంత జ్ఞానమునిస్తున్నారంటే సాగరాన్ని ఇంకుగా చేసుకొని పూర్తి అడవిని కలముగా చేసుకొని వ్రాసినా అంతము కాదు. జ్ఞానాన్ని ధారణ చేస్తూ ఎంత సమయమయ్యింది. భక్తికి అర్ధకల్పమయ్యింది. జ్ఞానము మీకు ఒక్క జన్మలోనే లభిస్తుంది. తండ్రి మిమ్ములను నూతన ప్రపంచము కొరకు చదివిస్తున్నారు. ఆ దైహిక పాఠశాలలో ఎంత సమయము చదువుతారు. 5 సంవత్సరాల వయసు నుండి 20-22 సంవత్సరాల వరకు చదువుతూ ఉంటారు. సంపాదన తక్కువ, ఖర్చు ఎక్కువ చేసినట్లైతే నష్టము కలుగుతుంది కదా.
తండ్రి ఎంతో సంపన్నంగా తయారు చేస్తారు. మీరు మళ్లీ దివాలా తీస్తారు! ఇప్పుడు భారతదేశ పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడండి. నిశ్చయంతో అర్థం చేయించాలి. మాతలు నిలబడగలగాలి. వందేమాతరం అనునది మీ గాయనమే. భూమికి వందేమాతరమని చెప్పరు. వందేమాతరం అని మనుష్యలకే చెప్పబడ్తుంది. పిల్లలైన మీరు ఎవరైతే బంధనముక్తులుగా ఉంటారో వారే ఈ సర్వీసు చేస్తారు. వారు కూడా కల్పక్రితము బంధనముక్తులుగా ఎలా అయ్యారో ఇప్పుడు కూడా అలాగే అవుతూ ఉంటారు. అబలల పై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. మాకు తండ్రి లభించారని తెలుసుకుంటారు. కనుక ఇప్పుడు ఆ తండ్రి సర్వీసు చేయాలని భావిస్తారు. బంధనముంది అని చెప్పేవారు పిరికివారు (గొర్రెలు). మీరు ఈశ్వరీయ సర్వీసు చేయకండి అని ప్రభుత్వము చెప్పలేదు. మాట్లాడే ధైర్యము కావాలి. ఎవరిలో జ్ఞానముంటుందో వారు సహజంగా బంధనముక్తులుగా అవ్వగలరు. మేము ఆత్మిక సేవ చేయాలనుకుంటున్నామని జడ్జ్‌కు కూడా చెప్పగలరు. ఆత్మిక తండ్రి మమ్ములను చదివిస్తున్నారు. క్రైస్తవులు - లిబరేట్‌ కరో(ముక్తులను చేయండి), మార్గదర్శకులవ్వండి అని అంటూ ఉంటారు. భారతవాసుల కంటే విదేశీయుల వివేకము బాగుంది. పిల్లలైన మీలో ఎవరు మంచి వివేకవంతులుగా ఉంటారో వారికి సర్వీసు చేయాలనే ఆసక్తి చాలా ఉంటుంది. ఈశ్వరీయ సర్వీసు ద్వారా చాలా గొప్ప లాటరీ లభిస్తుందని వారికి తెలుసు. కొందరు లాటరీ మొదలైనవాటిని అర్థమే చేసుకోరు. అక్కడ కూడా దాస-దాసీలుగా అవుతారు. దాసి అయినా పరవాలేదు, ఛండాలురు అయినా పరవాలేదు, స్వర్గములోకి వస్తాము కదా అని అనుకుంటారు. వారి నడవడికలు కూడా అలాగే కనిపిస్తాయి. అనంతమైన తండ్రి మనకు అర్థం చేయిస్తున్నారని మీకు తెలుసు. ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు. తండ్రి ఇతని ద్వారా పిల్లలను చదివిస్తున్నారు. కొందరు అది కూడా అర్థము చేసుకోలేరు. ఇక్కడ నుండి బయటికి వెళ్లారంటే సమాప్తమైపోతుంది. ఇక్కడ కూర్చున్నా ఏమీ అర్థము చేసుకోలేరు. బుద్ధి బయట తిరుగుతూ ఎదరుదెబ్బలు తింటూ ఉంటుంది. ఒక్క భూతము కూడా దూరమైపోదు. చదివించేవారు ఎవరు? మీరు ఎలా తయారవుతున్నారు! శ్రీమంతుల దాసీలుగా కూడా అవుతారు కదా. ఇప్పుడు కూడా ధనవంతుల వద్ద చాలా మంది నౌకర్లు, చౌకర్లు ఉంటారు. సర్వీసు కొరకు ఒక్కసారిగా ఎగురవలసి ఉంటుంది. పిల్లలైన మీరు శాంతి స్థాపనార్థము నిమిత్తమై ఉన్నారు. విశ్వములో సుఖ-శాంతులు స్థాపన చేస్తున్నారు. మనము శ్రీమతానుసారము స్థాపన చేస్తున్నాము. ఇందులో ఎలాంటి అశాంతి ఉండరాదని మీరు ప్రాక్టికల్‌గా తెలుసుకున్నారు. ఇందులో ఎవ్వరూ అశాంతిగా అవ్వరాదు. బాబా ఇక్కడ కూడా ఇలాంటి మంచి-మంచి పరివారాలను చాలా చూశారు. ఒకే ఇంటిలో 6-7 మంది కోడళ్ళు ఉన్నా కలిసి మెలిసి ఎంతో ప్రేమగా ఉంటారు. పూర్తి శాంతి ఉంటుంది. మా వద్ద స్వర్గముందని అనేవారు. ఎలాంటి జగడాలు ఉండేవి కావు. అందరూ ఆజ్ఞాకారులుగా ఉండేవారు. ఆ సమయములో కూడా బాబాకు వైరాగ్య ఆలోచనలు ఉండేవి. ప్రపంచము పై వైరాగ్యము ఉండేది. ఇప్పుడిది బేహద్‌ వైరాగ్యము. ఇతరమేదీ గుర్తుండరాదు. బాబా అందరి పేర్లు మర్చిపోతారు. బాబా మీరు మమ్ములను స్మృతి చేస్తారా? అని పిల్లలు అడుగుతారు. బాబా చెప్తారు - నేను అందరినీ మరచిపోవాలి. స్మృతి లేదు - విస్మృతి లేదు. బేహద్‌ వైరాగ్యము కదా. అందరినీ మర్చిపోవాలి. మనము ఇక్కడ నివసించేవారము కాదు. స్వర్గ వారసత్వమును ఇచ్చేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. నన్ను స్మృతి చేయండి. మీరు విశ్వాధికారులుగా అవుతారు అని బేహద్‌ తండ్రి చెప్తున్నారు. ఇతరులకు అర్థం చేయించేందుకు ఈ బ్యాడ్జ్‌ చాలా బాగుంది. ఎవరైనా కావాలని అడిగితే మొదట అర్థము చేసుకొని తీసుకోండి అని చెప్పండి. ఈ బ్యాడ్జ్‌ గురించి తెలుసుకోవడం ద్వారా మీకు విశ్వసామ్రాజ్యము లభిస్తుందని చెప్పండి. నన్ను స్మృతి చేస్తే మీరిలా తయారౌతారని శివబాబా ఈ బ్రహ్మ ద్వారా ఆదేశమిస్తున్నారు. గీతా పాఠకులు ఎవరైతే ఉన్నారో వారు చాలా బాగా అర్థం చేసుకుంటారు. వారు దేవతా ధర్మము వారై ఉంటారు. దేవతలు ఎందుకు దిగజారుతారని కొందరు ప్రశ్నిస్తారు. అరే! ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ క్రిందకు దిగజారతారు కదా. చక్రము తిరిగే తీరాలి. ప్రతి ఒక్కరి మనస్సులో ఇలాంటి ఆలోచనలు తప్పకుండా వస్తాయి. మేము సర్వీసు ఎందుకు చేయలేక పోతున్నాము. తప్పకుండా నాలో ఏదో లోపముంది. మాయ భూతాలు ముక్కు పట్టుకొని పీడిస్తున్నాయని అర్థం చేసుకోండి.
ఇప్పుడు పిల్లలైన మీరు - మేము ఇంటికి వెళ్లాలి, మళ్లీ కొత్త ప్రపంచములోకి వచ్చి రాజ్యపాలన చేయాలని తెలుసుకున్నారు.'' మీరు ప్రయాణీకులు కదా. దూరదేశము నుండి ఇక్కడకు వచ్చి పాత్రాభినయము చేస్తారు. మేము అమరలోకానికి వెళ్లాలి. ఈ మృత్యులోకము సమాప్తమౌతుందని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. తండ్రి చాలా అర్థం చేయిస్తారు. బాగా ధారణ చేయాలి. దీనిని మళ్లీ నెమరు వేస్తూ ఉండాలి. కర్మభోగాల అనారోగ్యము ఉప్పొంగి గందరగోళము చేస్తుంది, మాయ సతాయిస్తుంది. కానీ తికమకపడరాదు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఏ కొద్దిగా తారుమారైనా కలవరపడిపోతారు. అనారోగ్యములో మనుష్యులు భగవంతుని ఎక్కువగా స్మృతి చేస్తారు. బెంగాల్‌లో ఎవరైనా చాలా అనారోగ్యంగా ఉన్నప్పుడు రామా, రామా అని చెప్పండి....... మళ్ళీ రామా అని చెప్పండి...... అని చెప్పిస్తారు. మరణించే విధంగా ఉన్నట్లైతే గంగా తీరానికి తీసుకెళ్లాలి. హరి, హరి అని చెప్పమని అంటారు. మళ్లీ వారిని తెచ్చి కాల్చే అవసరమేముంది గంగలో వేయవచ్చు కదా. చేపలు మొదలైన నీటి జంతువులకు ఆహారంగా అయిపోతారు. వాటికి ఉపయోగించబడ్తారు. పార్సీలు అలాగే ఉంచేస్తారు. కనుక వారి ఎముకలైనా ఉపయోగపడ్తాయి. తండ్రి చెప్తున్నారు - మీరు మిగిలిన అన్ని విషయాలను మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి మంచిది! (అచ్ఛా!)
మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత - పిత, బాప్‌దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్‌మార్నింగ్‌ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము :-
1. బంధన ముక్తులుగా అయ్యి భారతదేశానికి సత్యమైన సేవ చెయ్యాలి. మమ్ములను ఆత్మిక తండ్రి చదివిస్తున్నారు, మేము ఆత్మిక సేవ చేస్తున్నాము అని నిశ్చయముతో, నషాతో చెప్పండి. ఈశ్వరీయ సేవ చేయాలనే ఉమంగము పొంగి పొర్లుతూ ఉండాలి.
2. కర్మభోగపు అనారోగ్యములో మాయా తుఫానులలో తికమక పడరాదు, కలత చెందరాదు. తండ్రి ఏ జ్ఞానాన్నిచ్చారో దానిని నెమరు వేస్తూ బాబా స్మృతిలో హర్షితంగా ఉండాలి.

వరదానము :- '' సర్వ సంబంధాల అనుభూతితో పాటు ప్రాప్తుల సంతోషాన్ని అనుభవం చేసే తృప్త ఆత్మా భవ ''
ఎవరైతే సత్యమైన ప్రేయసులుగా ఉంటారో వారు ప్రతి పరిస్థితిలో, ప్రతి కర్మలో సదా ప్రాప్తి చేసుకున్న సంతోషంలో ఉంటారు. చాలామంది పిల్లలు అవును, వారు నా తండ్రి, ప్రియుడు, కొడుకు...... అని అనుభవం చేస్తారు కాని ఎంత ప్రాప్తి కోరుకుంటారో అంత ప్రాప్తి జరగదు. కనుక అనుభూతితో పాటు సర్వసంబంధాల ద్వారా ప్రాప్తి అనుభవమవ్వాలి. ఇటువంటి ప్రాప్తిని అనుభూతి చేసేవారు సదా తృప్తిగా ఉంటారు. వారికి ఏ వస్తువూ అప్రాప్తిగా అనిపించదు. ఎక్కడైతే ప్రాప్తి ఉంటుందో అక్కడ తప్పకుండా ప్రాప్తి ఉంటుంది.

స్లోగన్‌ :- '' నిమిత్తంగా అవుతే సేవలో సఫలతకు భాగము లభిస్తుంది ''

No comments:

Post a Comment